Menu

The real last ditch effort

అవును ఇది నిజంగానే The real ‘last ditch effort’.

Last ditch effort అంటే తెలియని వాళ్ళ కోసం;

Last-ditch effort: A desperate final attempt, as in We’re making a last-ditch effort to finish on time. This expression alludes to the military sense of last ditch, “the last line of defense.” Its figurative use dates from the early 1800s.

నవతరంగం మొదలైన రెండు నెలల నాలుగు నెలల్లో చాలా సార్లు ఈ సైటు నడపడం నా వల్ల కాదని చేతులెత్తేద్దామనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు ఒక్కో సారి ఒక్కో కారణం. నవతరంగం లో వ్యాసాలు రాసే టైం లేకపోవడం, సభ్యులు రాయకపోవడం, పాఠకుల ఆదరణ లేకపోవడం, ఒక్కోసారి ఇదంతా చేసి ఏం సాధిద్దామనే నిరాశ నిస్పృహ…ఇలా ఒక్కో సారి ఒక్కో కారణం. అయినా ప్రతి సారీ ఎలాగో సముదాయించుకుని ఒక తరంగంలా ఉవ్వెత్తున ఎగరకపోయినా నిలకడగా నడుపుతూ వచ్చాము. ఈ మధ్య నవతరంగం సైట్ చూస్తేనే జాలేస్తోంది. వ్యాసాలు లేవు, పాఠకులు లేరు, సభ్యుల participation లేదు, కామెంట్లు లేవు, చర్చలు లేవు. సరే ఈ స్థితికి వచ్చాక ఇక ఆపడం మేలేమో అనిపించిన తరుణంలో సరే చివారాఖరుగా ఒక ప్రయత్నం చేద్దామనిపించింది. అదే ఈ last ditch effort.

అసలీ ప్రయత్నమేమిటో చెప్పేముందు ఒక చిన్నమాట. నవతరంగం స్థాపించడం వెనుక నాకు ఒకే ఒక లక్ష్యం ఉండేది. నవతరంగం స్థాపించే సమయానికి నేను ఇండియా లో లేను. మన దేశంలో లేకుండా మన చిత్ర పరిశ్రమలోని వారితో పరిచయం ఏర్పరుచుకోవడం ఎలా? ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసుకోవడం ఎలా? లాంటి ప్రశ్నలకు సమాధానం నవతరంగం అనే ఐడియా ఉదయించింది. ఆ తర్వాత రెండేళ్ళు నవతరంగం వెబ్ సైట్ ని విజయవంతంగా నడిపాము. నవతరంగం కారణంగానే ఎన్నో ఏళ్ళుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలో పనిచేయాలనే కల నిజమయింది. గత ఆరేడు నెలలుగా నన్ను తెలుగు సినిమా పరిశ్రమ పోషిస్తోంది. నవతరంగమే లేకుంటే నేను ఉద్యోగం వదిలి వచ్చేంత ధైర్యం వచ్చుండేది కాదు. అంతకంటే ముఖ్యంగా నాకు సినీ పరిశ్రమలోని ఎంతో మంది వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఉండేది కాదు. వాళ్ళ పరిచయమే లేకుంటే నేనీ రోజు సినీ పరిశ్రమలో ఉండే వాడినే కాదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నవతరంగం ద్వారా నాకంటూ ఒక ఎజెండా అంటూ ఉండేది. నవతరంగం ద్వారానే ఆ ఎజెండా ని చాలా మంది సహాయంతో విజయవంతంగా execute చెయ్యగలిగాననే చెప్పాలి.

ఇప్పుడు మీరు నన్నొక honest confession చేసుకోనివ్వాలి. సిగ్గు విడిచి నిజం చెప్పాలంటే నవతరంగంతో నాకిప్పిడు అవసరం లేదనే చెప్పాలి. కానీ నేనలా చెప్పలేకపోతున్నాను. నవతరంగం ని వదలలేకపోతున్నాను. రెండేళ్ళు ఎన్నో కష్టనష్టాలకోర్చి అపురూపంగా తీర్చిదిద్దుకున్న ఒక ఐడియా నవతరంగం. అందుకే ఇంకోసారి ’ఇక నా వల్ల కాదు’ అనుకునే ముందు చేసే చివరి ప్రయత్నం ఇది. ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తూ….

ఇక అసలు విషయం లోకి వస్తే….నవతరంగంలో ఇక నుంచి కొన్ని కొత్త శీర్షికలు ప్రవేశపెడ్తున్నాను. ఇందులో ఒకటి రన్నింగ్ కామెంట్రీ. ఈ శీర్షికలో ప్రతి రోజు సినిమా పరిశ్రమలోని విశేషాల గురించి వ్రాయడం జరుగుతుంది. రెండోది ప్రపంచ సినిమా-1116.  ఈ శీర్షికలో వీలైనప్పుడల్లా ప్రపంచంలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో (నా దృష్టిలో) తప్పక చూడవలసిన సినిమాల గురించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మూడోది నవతరంగం స్క్రీన్ ప్లే కాంపిటిషన్. ప్రస్తుతం ఈ పోటీ గురించి ఒక టివి ఛానెల్ తో సంప్రదింపులు చేస్తున్నాము. అవి ఒక కొలిక్కి రాగానే ఈ పోటీ గురించి మరిన్ని వివరాలు అందచేస్తాను.

రేపటినుంచే మొదటి రెండు శీర్షికలు మొదలుపెడ్తాను.ఇప్పటికింతే.

PS:మీకూ నవతరంగాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఉంటే మీరూ మీ efforts పెట్టొచ్చు.

5 Comments
  1. Sowmya V.B. March 7, 2010 /
  2. Purnima March 7, 2010 /
  3. మేడేపల్లి శేషు March 11, 2010 /