సంవత్సరం క్రితం ప్రకామ్య లో శ్రీనివాస్ అనే సభ్యుడు ఒక ప్రకటన చేశారు. అందులో తను తీయబోయే లఘు చిత్రానికి నేపధ్య సంగీతం అందించే వారు కావాలని ప్రకటించారు. ఆ ప్రకటనలో తన సినిమా కథ గురించి వివరించారు కూడా.
హైదరాబాద్ లోని ఒక లోకల్ రైల్వేస్టేషన్. పెళ్లయి, మూడునాలుగేళ్లయిన ఒక యువతి ఆఫీషు నుండి ఇంటికి వెళ్లడానికి స్టేషన్ కి వస్తుంది. ఆమెకు కాలేజి రోజులనాటి తన ప్రేమికుడు కనపడతాడు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి తన మనసు ప్రతిబింబం కనపడడంతో కలిగిన ఉద్విగ్నత..కలుద్దామంటే మధ్యలో అడ్డు పడుతున్న ఎమోషనల్ గాప్.. ఇలా భావోద్వేగాలు ముప్పెరుగొంటే ఏమి చెయ్యాలో తెలియక అతనికి దూరంగా ఓ పక్కన కూర్చుంటుంది. ఆమెను పాత జ్ఞాపకాలన్నీ చుట్టుముడతాయి. అప్పట్లో తాము చేసిన అల్లరి, చిలిపిదనం అన్నీ గుర్తుకువస్తాయి. అలా అన్నీ గుర్తొచ్చేసరికి అతన్ని కలుద్దామని ముందుకెళుతుంది. కానీ కొన్ని అడుగులు వేసాక, కలవకూడదని నిర్ణయించుకొని వెనుదిరుగుతుంది. ఇంటికి వచ్చేస్తుంది. ఇంటిలో భర్త ఉంటాడు. తన లవ్-లైఫ్ లో ఉండే tanginess ని ఇప్పటి తమ భార్యా, భర్తల బంధంలో తేవడానికి ప్రయత్నిస్తుంది. సఫలమవుతుంది.
ఇదీ టూకీగా నేను చేస్తున్న మొదటి షార్ట్ ఫిల్మ్. దీనికి ఆడియో ట్రాక్ అందించే వారు కావాలి. మీకు గానీ, మీ ఫ్రెండ్సుకి గానీ ఆసక్తి ఉన్నట్లయితే సంప్రదించగలరు. ఫిల్మ్ నిడివి 5 నిమిషాలుంటుంది. డైలాగ్స్ ఉండవు. ఈ 5 నిమిషాలు ఒక సింగిల్ థ్రెడ్ లా మ్యూజిక్ ఉండాలి.
మొదటి సినిమా కావడం చేతనూ, నాకున్న కాస్టింగ్ పరిమితుల చేతనూ చాలా మూమూలు కధని ఎంచుకోవడం జరిగింది. ఔత్సాహికులైన నా స్నేహితులనే పెట్టి తీశాను. వారికీ యాక్టింగ్ కొత్తే. డిజిటల్ కామ్ తో తీశాను. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ లో చాలా తప్పులు గమనించాను. వీడియో ఎడిటింగ్ పూర్తయింది (without the audio track). ఇంక ఆడియో ట్రాక్ వెయ్యడమే మిగిలింది. రెమ్యూనరేషన్ కొసం పెద్దగా పట్టించుకోకుండా మీరు బ్యాక్ గ్రౌండ్ స్కోరు చెయ్యాలని ఎక్సైట్ అయితే ఆ ఎక్సైట్మెంట్ ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలను.
– శ్రీనివాస్, 99515 95773, కూకట్ పల్లి, హైదరాబాద్.
ఈ మధ్యనే శ్రీనివాస్ తన లఘు చిత్రం పూర్తయిందనీ, దానిని నవతరంగంలో ప్రదర్శించాలనీ కోరారు. అలాగే ఈ సినిమా గురించి కొన్ని వివరాలు తెలియచేశారు.
The film is shot with a digicam (Canon Powershot S5IS). The people acted in the film are my friends and they dont have any prior experience in acting. I took a simple concept to fit the limited resources available, wrote the screenplay, handled the camera and edited it using Premier Pro software on my desktop. The film has no dialogues. It is made with a small budget of Rs. 1000.
శ్రీనివాస్ రూపొందించిన ఈ మొదటి లఘు చిత్రం చూసి మీ అభిప్రాయాలు, సలహాలు తెలియచేస్తారని ఆశిస్తూ…’సీజన్స్’ మీకోసం…
upma says:
emi cheppali ani anukunnaru director ikkada….naaku artham kaledu…I am still novice in movies, emi anukokunda koncham explain chestara brief ga….naaku artham ayindi emiti ante ammailu edi ayina easy ga hide cheyyagalaru. (not to offend anyone)
Srinivas says:
కధ గురించి టూకీగా పైన చెప్పబడింది.
శిద్దారెడ్డి వెంకట్ says:
సినిమాలోని టెక్నిక్ చాలా amateurish గా ఉంది. కానీ సినిమాలో డైలాగులు వాడకుండానే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం నాకు చాలా నచ్చింది. కథా పరంగా బ్రీఫ్ ఎన్కౌంటర్ లాంటి సినిమా. టెక్నిక్ అంత బాగోలేకపోయినా విజువల్ గా స్టోరీ చెప్పడంలో మీరు విజయం సాధించినట్టే…కంగ్రాట్స్
Srinivas says:
ఇప్పుడు చూస్తే నాకూ ఇమ్మెచ్యూరిష్ గానే అనిపిస్తోంది. దీనిని సంవత్సరం క్రితం తీసాను. తీసాక సినిమా కళ పై ఆసక్తి,గౌరవం మరింత పెరిగాయి.
ramesh babu alapati says:
మీరు చాల చక్కగా pictereistion చెసినారు. ఇది ఒక స్త్రీ కథ లా వున్నా ఈ india లొని చాలా వనితల అoతర0oగము.
Srinivas says:
తక్కువ నిడివిలో, ఉన్న వనరులతో ఒక కధని చెప్పాలని చేసిన ప్రయత్నమిది. మీకు నచ్చినందుకు సంతోషం.
rajendra kumar devarapalli says:
సినిమా/షార్ట్ ఫిలిమ్ కధాంశం అచ్చు గుద్దినట్టు 1974లో వచ్చిన రజనీగంధ(బసు చటర్జీ దర్శకత్వం)లా ఉండటం గమ్మత్తుగా ఉంది
Srinivas says:
రజనీగంధ బాగుంటుందని విన్నాను. నా కధలో నాయిక పాత ప్రియుడిని చూసి కలవాలనిపించినా చివరకు కలవకూడదని నిర్ణయించుకుంటుంది. ఆ మధురిమని ఇప్పటి అనుబంధంలోకి తేవాలని ప్రయత్నిస్తుంది.
Jonathan says:
Hi,
I like the story idea…all the best
Srinivas says:
థాంక్యూ!.
Surya says:
Good story & Good Attempt.
I like the way you have shown the Reason for DEPARTING.
Are you planning for the next short?
Srinivas says:
parents కారెక్టర్ల కోసం తెలిసినవారెవరూ లేకపోవడం, బడ్జెట్ లేకపోవడం తో ఈ ఐడియా వచ్చింది. కూకట్ పల్లి లోపల ఉండే గ్రౌండ్ లో దీనిని షూట్ చేసాం. చుట్టుపక్కల జనాలు తెగ కామెంట్ చేసారనుకోండి.
anupama says:
katha bavundi. dialogues lekunda cheppali anukovatam inka bavundi. natinatulu expressions inka baga pettunte marinta bavundedi ani naa abhiprayam!
Srinivas says:
హ్మ్.. అమ్మాయి నటన తో నేను కాస్త సంతృప్తి పడినా మగదోస్తులిద్దరూ నాతో ఆడేసుకున్నారు.
వెంకట్ ఉప్పలూరి says:
మీ ప్రధమ ప్రయత్నం చాలా బాగుంది. అతని భుజం మీద చెయ్యి వెయ్యబోతూ ఆగిపోయినప్పుడు ఆమె ఉంగరం మీద ఫొకస్ చెయ్యటం చాలా బాగుంది, ఆసీన్ లోనే మీ ప్రతిభ కనబడింది
Srinivas says:
పర్సనల్లీ, నాకూ ఆ సీనే నచ్చిందండీ.
shashipal reddy says:
కంగ్రాట్స్ శ్రీనివాస్ గారు. మీ సినిమా బాగుంది. అమ్మాయ్ బాగా నటించింది. నాకు అవకాశం ఇస్తారా? 9885550473, 9030641459. కథ,కథనం రాస్తాను.
Srinivas says:
సాధారణంగా కధ, కధనాలు నేనే రాసుకోవడానికి ఇష్టపడతాను. మీకు నటన మీద ఆసక్తి ఉందా?.. కేమెరా వర్క్ గానీ, మ్యూజిక్ కంపోజ్ చెయ్యడం గానీ వచ్చా?.. అలాంటివాళ్ల కోసం నేను చూస్తున్నాను. నా mail id: srinivaselectric@gmail.com
shashipal reddy says:
నమస్కారం సార్ నాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వగలరా? 9885550473,9030641459
K మహేశ్ కుమార్ says:
ప్రయత్నం బాగుంది. వెంకట్ అన్నట్లు అమెచ్యూరిష్ గా ఉన్నా ఫీల్ కమ్యూనికేట్ అయ్యింది. ఒక చిన్న సందేహం…మనకు “వెడ్డింగ్ రింగ్” కాన్సెప్టు ఉందా!
ఫ్లాష్ బ్యాక్ కొంచెం over the top అయ్యింది. నేపధ్యసంగీతం నప్పలేదు. షూటింగులో ఉన్న ఇబ్బందుల్ని షాట్ డివిజన్ ద్వారా అధిగమించే ప్రయత్నం చేసుండాల్సింది. ఎడిటింగ్ లో చాలా హెల్ప్ అయ్యేది. అయినా ఐదు నిమిషాల్లొ ఏ డయలాగూ లేకుండా ఒక కథ చెప్పడం చాలా బాగుంది.
Srinivas says:
మీ కామెంట్ కోసమే చూస్తున్నా!..
వెడ్డింగ్ రింగ్ కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా point జనాలకి convey అవుతుందని అలా తీసాను. ఆమె చేయి వెయ్యబోయి, అప్పుడు ఉంగరాన్ని చూసుకొని, వెనక్కి తిరగడం ఇది లాజికల్ గా చాలా అసహజం గా ఉన్నట్టు అనిపించినా.. i kept it for the drama. ఈ షార్ట్ మొత్తం లో బాగా dramatize అయిన సీన్ అదే అనుకుంటా.
నిజమే..ఫ్లాష్ బ్యాక్ ని ఇంకొంచం షార్ప్ చెయ్యొచ్చు.
అప్పటికి షాట్ డివిజన్ మీద అంత అవగాహన లేదండి. చాలా లోపాలు ఎడిటింగ్ కి కూర్చున్నప్పుడు తెలిసాయి.
మీ స్పందనకి ధన్యవాదాలు.
గిరీష్ కె. says:
చాలా మంచి ప్రయత్నమం. కంగ్రాట్స్! ఐదు నిమిషాల్లో, మాటల్లేకుండా మీరు చెప్పదలచుకున్నది, చాలా చక్కగా చెప్పారు.
Srinivas says:
థాంక్యూ గిరీష్.
V. Chowdary Jampala says:
మంచి మొదటి ప్రయత్నం.
శుభాకాంక్షలు.
Srinivas says:
థాంక్సండి.
sunita says:
baagundi.
Srinivas says:
థాంక్యూ.
JP says:
Srinivas,
nice try for first attempt. it could have been dogma style of making if music wasn’t included and the ext sounds were included.
keep doing. and all the best.
J.P
Srinivas says:
మీ ఐడియా బావుందండి. ఫ్యూచర్ ప్రాజెక్టులు చేసేటప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకుంటాను. కానీ ఈ పర్టిక్యులర్ షార్ట్ ని పూర్తిగా dogma style లో చెయ్యడం అంత బావుంటుందంటారా?..
sanjeev says:
chaalaa baavundi. KEEP IT UP.
BUT music antha baa ledu. music kooda baaga kudiri unte inka adiri poyedi. next film kosam eduru choosthunnanu nijangaaaaa……
Srinivas says:
మంచి మ్యూజిక్ ని అందించేవాళ్లకోసం చూస్తున్నానండి. next short కూడా రెడీగా ఉంది. వీలైనప్పుడు publish చేస్తాను.
అబ్రకదబ్ర says:
ఫిల్మింగ్ బాలేదు. కెమెరా షేక్ అవకుండా చూసుకోవాల్సింది. And, what gives away an amateur is zooming. మొదలు పెట్టటమే జూమ్‌తో ఐతే ఎలాగండీ?
మీ హీరోయిన్ స్నేహితురాలిగా వేసినమ్మాయి బాగా చేసింది. ఆమెని ప్రధాన పాత్రలో పెట్టుండాల్సింది.
లోపాలవి. అయినా మంచి ప్రయత్నం కాబట్టి అభినందనలు. మీరు ఎంచుకున్న కథాంశం బాగుంది. పట్టుదలగా ప్రయత్నించి, ఫిల్మింగ్/ఎడిటింగ్ మీద మరింత దృష్టి పెడితే రెండో షార్ట్ బాగా తియ్యగలరనిపిస్తుంది.
Srinivas says:
నవతరంగంలో పెట్టాక నేను తెలుసుకున్నది ఇదే.. జూములు ఫ్రేముని పాడు చేస్తాయని. Thanks for the inputs. మా హీరోయిన్ స్నేహితురాలికి కూడా సినిమాల్లో చెయ్యాలని ఆసక్తి ఉంది. మీకు ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి.
virinchi says:
what i like in this short film is the parents board , parting ways, that ring shot and climax…the climax is the hilight. keep it up…well said in very short span…editing much be more better, and camera operating is not good at all.its technically poor but the concept is good…
Srinivas says:
Thanks for the inputs. ఎడిటింగ్ లో ఎక్కడెక్కడ బెటర్ చెయ్యొచ్చో చెప్పగలరా?..
Sudheer Kumar says:
hai srinivas, movie was super bocz its your 1st attempt, as per my knowledge, while showing ring at the same time if you can show her husband’s photo that gives more clarity, parents borad seen is not good it’s showing parents are enemies between lovers, i think it’s a wrong message in that seen, actress expressions are not uptomark, music is ok. any way all the best, these all are my suggestions….
Srinivas says:
థాంక్యూ!…
రామ says:
వెయ్యి రూపాయల ఖర్చుతో కేవలం ఇద్దరు technicians తో చేసిన సినిమా కి ఇది బాగానే ఉంది. నాకు ఓపెనింగ్ షాట్ చూడగానే కొంచెం జెర్క్ వచ్చినట్టు అనిపించింది కాని, నెమ్మదిగా involve అయ్యాను. Very simple thread, చెప్పిన విధానం బాగుంది. మీరు చెప్పినట్టు మగ నటులు జీవించడానికి ప్రయత్నించి నటించడం మరిచిపోయారు
. “జుట్టు చెరపడం” లింకు బాగుంది.
Srinivas says:
జూమ్ చెయ్యడం, స్టాండ్ లేకుండా కేమెరాని ఆపరేట్ చెయ్యడం లాంటి పనుల వలన షార్ట్ కొంచం జర్కీగా వచ్చింది. మొదట్లో ‘జుట్టు చెరపడం’ అనే లింక్ అంత కన్విన్సింగ్ గా వస్తుందా అన్న అనుమానం ఉండేది. ఇప్పటికీ అంతకంటే మంచి లింక్ వాడుంటే బావున్నన్న ఫీలింగ్ ఉంది. మీ స్పందనకి థాంక్స్.
Reddy Ganta says:
Story telling with plain expressions was excellent..Music score was good. All the actors did fine.. Good job.
Srinivas says:
థాంక్యూ! రెడ్డి గంట గారు.
Vamshi says:
Hello Srinivas garu, good first-timer attempt. Why you did not add the voice, any specific reason? but it is nice though. I think to convey message with just background score is challenging for both the director n actors.
nice music. I have been in the same boat. 80% finished my first project, which is around 30-40 mins mini-movie..
thanks,
Vamshi
Srinivas says:
ఒక ఆలాపన తోనే, డైలాగులు లేకుండా షార్ట్ ఫిల్మ్ తియ్యాలనుకున్నాను. ఆలాపన చేయగలిగే మ్యూజిక్ డైరక్టర్లు నా బడ్జెట్ పరిమితుల్లో ఎవరూ దొరకలేదు.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీ షార్ట్ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తుంటాను.
Krishna Reddy says:
superb………keep it up
నాగన్న says:
నేను సంగీతం సమకూరుస్తాను అని చెప్పి వ్యక్తిగత కారణాల వల్ల చెయ్యలేకపోయాను…
నా దృష్టిలో కధా పరంగా, దర్శకత్వపు విలువల పరంగా ఇది ఒక అద్భుతమైన లఘు చిత్రం.
శ్రీనివాస్ గారికి ఆల్ ది బెస్ట్. మీ తదుపరి సినిమా కొరకు ఎదురుచూస్తున్నాను.
Srinivas says:
మీరు సంగీతం సమకూరుస్తానని చెప్పడం, US నుంచి కాల్ చేసి మరీ డిస్కస్ చేసుకోవడం, మీరు చేసిన కొంత మ్యూజిక్ ని వినిపించడం.. ఇవన్నీ మీకున్న ఇంట్రెస్ట్ ని చెబుతున్నాయి. నన్నెంతో ప్రోత్సహించారు కూడా. ఇక ఇబ్బందులు ఎదురైతే మనమేం చెయ్యగలం?.. మీరు కావాలని చెయ్యలేదు కదా!. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
venkat says:
srinivas garu good effort.keep it up and all the best
venkat says:
heroine ga act chesina ramya ki young journalist of the year national award ravadam maaku chala happy ga vundi.congrates ramya.ramya worked as journalist in TV9.WE LIKE HER PRESANTATION.
Srinivas says:
అవునండి.. తను చాలా ఎనర్జిటిక్. ఒక పనిని ఒప్పుకుంటే చాలా committed గా చేస్తుంది.
MOORTHY.ASLN says:
శ్రీనివాస్ గారూ,
మీ మొదటి ప్రయత్నం అభినందనీయం.మన దేశంలొ వివాహబంధం కు ఉన్న బలము ఎలాంటిదొ చాలా సున్నితంగా తక్కువ నిడివి చిత్రంలొ జయప్రదంగా వివరించగలిగారు.ఇదివరలొ దేవదాసు,వెలుగునీడలు,ఆరాధన వంటి చిత్రాలలొ కూడా ఇదెకదా కధాశం.ఇందులొ అర్ధం కాకపోవదానికి కస్టపడవలసినది ఏమీ లేదు.భార్యనొ,భర్తనో ఇంటిలొ ఉంచుకుని ఇతర స్త్రీలు, పురుషుల కొసం తాపత్రయం పదేవారికి,పాశ్చాత్య నాకరికత మోజులొ భార్య, భర్తలను SWAP చేసుకుని పైశాచికానందం అనుభవిచేవారికి ఇందులొ సున్నితంగా చెప్పిన వైవాహిక భంధం బలం అర్ధం కాక పొవచ్చునేమో గాని కధాంశం హిందు వివాహానికి ఉన్న గొప్పతనాన్ని బాగా చూపిచగలిగారు. ఇక wedding ring సాంప్రదాయము మన హిందూ పెళ్ళిళ్ళలొ లేకపొవచ్చునేమో గాని పెళ్ళిలొ అల్లుడికి,కోడలికి అత్తవారు పెళ్ళి ఉంగరం చేయించడం ఆనవాయితీ మనకీ ఉంది.ఆ ఉంగరాలనే బిందెలో వేసి వధూవరులను తియ్యమంటారు. కాకపోయినా భర్త తన భార్యకు ఉంగరం బహుమతిగా ఇవ్వకూడదన్న నియమం ఏమీలేదుగా! ఇక AUDIO TRACK గురించి నా ఉద్దేశ్యం మీరు TV CHANNELS వాల్లలాగ VIDEO CAMERA వాడి ఉంటే ఆడియో కూడా వచ్చేది కాదా ఆలోచింవండి.
మొదటి ప్రయత్నం అయినా బాగా present చేశారు.CONGRATS.
మూర్త్.ఆలమూరు,
రాజమండ్రి.
కెక్యూబ్ వర్మ says:
చాలా బాగుందండీ, మీ మొదటి ప్రయత్నం విజయవంతమయినది. స్త్రీ మనసును అందుకే సాగరంతో పోల్చారు. నటీ నటులు కూడా బాగానే చేసారు. రమ్యగారికి మంచి భవిష్యత్ వుంది.
అక్కిరాజు భట్టిప్రోలు says:
మీకు ఇంకా మనుషుల మీద, వాళ్ళ సంస్కారం మీద నమ్మకం ఉంది. అది గొప్ప ఊరట నిస్తుంది చూసేవాళ్ళకి.
kiran says:
Hi, mee attemptlo nijayiti antay feel ledu,feel chala important,ammai ni nuv anta trans lo ki teeskellav kadaa,malla enduko kalavakudadu ani anukuni intiki vachinappudu nuv ammai charector ni down chesaav,,adi neku kani marevarikaina kaani alaa jariginappudu manam oka concept loki aaa element ni inject chestunnam antay nuv chusina charectarization edi aitay unnado daaniki atleast triple impact create cheyyali,adi oka creator visualization cheyyaleka poyaado prekshakudu feel avvadu, prekshakudu ki feeel create cheyyanappudu creator antay Director fail ayinattay,its just my advice,koncham better entantay vaalla seperation ni chupettatam,ilaa cheptoovuntay chala untundi,anyhow aldbest…
Ramya says:
Asalu nee badha emiti ra director. emanukuntunnavu nuvvu? maa 5 mins waste chesavu ra . inka epudu movie tiyaku ra. teesavante nee murder chestanu..
jeevi says:
aa ammayi ring chusi enduku aagipoindi? Adi Kottestadana…Intiki velli intlo unna abbayi (i think husband) juttu enduku cheripindi. cheripesi enduku parugethindi…..earlier lover turned friend tho enduku matladaledu…ivi loop holes.i rate it little better than okka magadu