Menu

రన్నింగ్ కామెంట్రీ-Movie Endings

Movie Endings

ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా క్లైమాక్స్ సీన్ అనేది కీలకం. ఆయా సినిమా ఎలా end అయిందన్న దాన్ని బట్టే ఏదైనా సినిమాను ఆదరించడం/తిరస్కరించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఎంతో పేలవంగా నడిచే ’లీడర్’ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే ఆరేడు నిమషాల ఎమోషనల్ సీన్ తో బ్యాలెన్స్ అయిపోయినట్టనిపిస్తుంది (ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ కలక్షన్ల బట్టి చూస్తే). అంటే ఏదైనా సినిమాకి ఎండింగ్ అనేది చాలా ముఖ్యం అనడానికి ’లీడర్’ ఒక మంచి ఉదాహరణ.

అయితే ఈ మధ్యన వచ్చిన ’యుగానికొక్కడు’ అనే సినిమాలో కూడా ప్రదమార్థం కంటే రెండో సగం చాలా గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ విజువల్ గా కొద్దిపాటి ఇంట్రస్ట్ ని sustain చెయ్యగలిగాడు దర్శకుడు. కానీ ఈ సినిమా అంతటినీ ఎలాగో క్షమించేసినా ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా పేలవంగా ఉంటుంది. సినిమాలో అక్కడక్కడా breathtaking విజుయల్స్ తో మాయచేసిన దర్శకుడు సినిమా అంతా చూసిన ప్రేక్షకుడికి “ఏదో ట్రై చేశాడు. కానీ అర్థం కాలేదు” అనిపించేలా చేశాడు. ఈ సినిమా ఎండింగ్ బావుండుంటే ఇంకా పెద్ద విజయం సాధించి ఉండేదని నా అభిప్రాయం.

‘Movie Endings’ and Socio-Historical context

పై రెండు ఉదాహరణల ద్వారా సినిమాకి ముగింపు ఎంత ముఖ్యమైన అంశమో ఒప్పుకుంటారనే అనుకుంటాను. అయితే ప్రపంచంలోని సినిమాలు తీసే ఆయా దేశాల socio-historic context ఆధారంగానే ఆయా సినిమాల ముగింపు ఉంటుందని ఒక థియరీ.

ఉదాహరణకు యూరోపియన్ సినిమాలను, హాలీవుడ్ సినిమాలనూ సినిమాల ముగింపు ఆధారంగా లెక్కలేస్తే హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా “They lived happily ever after” లాంటి పాజిటివ్ నోట్ తో ముగిస్తే యూరోపియన్ సినిమాలు “జగమే మాయ. బతుకే మాయ. ఇంతేనయా తెలుసుకోవయా. ఈ లోకం ఇంతేనయా” అనేటువంటి ముగింపులు కనిపిస్తాయి.

ఈ విషయం మనకి కూడా చాలా  సార్లు రుజువయిన సత్యం. అందుకు ప్రస్తుతం మన రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న ‘ఏ మాయ చేశావే’ ఒక గొప్ప ఉదాహరణ. ఇదే సినిమా తమిళంలో తీశారు. కానీ రెండింటి లోనూ సినిమా మొత్తం కథ ఒకటే అయినా క్లైమాక్స్ లో అమ్మాయి-అబ్బాయి కలవకుండానే తమిళంలో కథ ముగుస్తుంది. తెలుగులో ఇద్దరూ కలవడంతో కథ ముగుస్తుంది.

అలా వెతుక్కుంటే మహష్ బాబు నటించిన ’బాబీ’ సినిమా నెగటివ్ ఎండింగ్ మూలంగానే ఫ్లాపయ్యిందని ఒక టక్.

అలాగే “మరో చరిత్ర” ను రీమేక్ చేస్తూ మన వాళ్ళు దాన్ని ముగింపు మాత్రం “అంతా హ్యాపీస్” గా మారుస్తున్నారని ఇండస్ట్రీ లో ఒక టాక్. అదెంతవరకూ నిజమో సినిమా రిలీజయ్యాక చూడాలి మరి.

అంటే మన తెలుగు వాళ్ళకు negative గా ముగిసే సినిమాలు ఎందుకో నచ్చవని ఎక్కడో ఎవరో డిసైడ్ అయిపోయారు. దీని వెనుక socio-historic context ఏమిటో మరి?

తెలుగు సినిమా మరియు వనవాసం

తెలుగు సినిమాల happy endings వెనుక socio-historic context ఏమిటో తెలియదు కానీ మన సినిమాల మధ్య భాగాల (second act)  వెనుక మాత్రం రామాయణ భారతాల influence చాలానే ఉందనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే రామాయణ, భారతాల్లో హీరోలు వనవాసాల కెళ్ళినట్టు మన తెలుగు సినిమాలోనూ హీరోలు వనవాసం వెళ్ళడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాదంటారా?

సమరసింహా రెడ్డి, ఇంద్ర తరహా చిత్రాల్లో హీరోలది వనవాసం టైపే కదా!

తేజ సినిమాల్లో హీరో హీరోయిన్ల వనవాసం గురించి చెప్పాలా?

వెతుక్కుంటే ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయనుకుంటా! మీరేమంటారు?

చివరిగా

Movie endings అధారంగా సినిమాలను వర్గీకరించారు Richard Neupert అనే film critic. The End – Narration and Closure in the Cinema అనే పుస్తకంలో ఆయన సినిమాలను ఈ విధంగా విభజించారు.

  • The closed text film (closed story and closed discourse)
  • Open story film (open story and closed discourse)
  • Open discourse film(closed story and open discourse)
  • Open text film (open story and open discourse)

ఆయన మాటల్లో story అంటే

…the story is a complex system of characters, actions and events organised temporally and causally, which are all reconstructed by the viewer’s activity. Each character and action has a varying effect on the resolution of individual scenes and on the eventual ending

discourse అంటే

The discourse as opposed to the story is the narrative voice, which includes a group of techniques, such as editing principles and musical interventions. The discourse also functions as an inscribed narrator where the techniques may even collectively create a definite personality or presence.

2 Comments
  1. vamshi March 12, 2010 /
  2. viswanath goud March 16, 2010 /