Menu

రన్నింగ్ కామెంట్రీ-Independent Cinema

ఇండిపెండెంట్ సినిమా
ఇండీ ఫిల్మ్ మేకరవుదామని కలలు కంటున్న ఒక ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ విషాద గీతం, “ఇండిపెండెంట్ ఇండియా లో ఇండిపెండెంట్ సినిమా కరువాయనే….”

అసలు ఇండిపెండెంట్ సినిమా గురించి మాట్లాడం మొదలుపెడతేనే మనం చలన చిత్ర చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి. అందరికంటే ముందు మనందరికీ తెలిసిన ఒకాయన గురించి మాట్లాడాలి. ఆయన పేరు థామస్ ఎడిసన్. ఔను మనందరం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో ఈయన గురించి చదివి ఆయన మీద చాలా గౌరవం పెంచేసుకున్నాం కూడా. కదా? అసలు ఇండిపెండెంట్ సినిమా ఆవిర్భావం ఈయన వల్లనే జరిగింది; అంటే ఈయన సపోర్ట్ చేయడం వల్ల కాదు ఈయన ఇండిపెండెంట్ సినిమాని oppose చెయ్యడం వల్ల.

ఇంతకీ కథేమిటంటే, motion picture camera ని రూపొందించిన Edison మరీ అంత మంచోడేమీ కాదు. అంటే చెడ్డోడని కాదు. ఒక బిజినెస్ మ్యాన్ అంతే. మొదట్లో ఎవరు సినిమా తీయాలన్నా ఈయన కు రాయల్టీ కట్టనిదే (Motion Picture Camera పేటెంట్స్ ఈయన దగ్గరున్నాయి కాబట్టి) కుదిరేది కాదు. ఎంత నిజమో తెలియదు గానీ అలా కట్టని వాళ్ళను రౌడీలతో కొట్టిచ్చి సొమ్ము వసూలు చేపించే వాడట. ఈయన బాధ భరించలేక సినిమా జనాలు ఈయనకి దూరంగా (అప్పట్లో ఎడిసన్ న్యూ జెర్సీ లో ఉండేవాడు) హాలీవుడ్ కి పారిపోయి ఆయనకి దొరక్కుండా సినిమాలు తీయడం మొదలు పెట్టారట. అయితే ఆ తర్వాత కోర్టు ఎడిసన్ కి చెందిన కంపెనీ సొమ్ము వసూలు చెయ్యరాదంటూ తీర్పునివ్వడంతో ఈ గొడవ తీరింది. కానీ ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది.

ఎడిసన్ ధాటికి హాలీవుడ్ పారిపోయిన ఫిల్మ్ మేకర్స్ అక్కడ స్టూడియో సిస్టం కు పునాదులు వేశారు. ఎడిసన్ ఆధిపత్యం నుంచి పారిపోయొచ్చిన వాళ్ళు స్థాపించిన స్టూడియోలు (MGM, Paramount Pictures, RKO, Warner Bros., and Twentieth Century Fox etc) కొన్నాళ్ళకు ఎటువంటి ఆధిపత్యం సాధించాయంటే ఒక టైంలో హాలీవుడ్ లో సినిమా తీయాలంటే వీళ్ళే తీయాలి లేదంటే సినిమా తీయడం అసాధ్యం అయ్యేది. అంటే కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఒకరి ఆధిపత్యం పోయి మరొకరి ఆధిపత్యం వచ్చింది.

ఇలాంటి తరుణంలో Mary Pickford, Charlie Chaplin, Walt Disney, Orson Welles, Samuel Goldwyn, David O. Selznick, Alexander Korda, మరియు Walter Wanger లతో కూడిన ఒక బృందం Society of Independent Motion Picture Producers అనే సంస్థను నెలకొల్పారు.ఈ సంస్థ ద్వారా Independent నిర్మాతల తరుపున పోరాడి చివరకు హాలీవుడ్ స్టూడియోస్ సినిమా థియేటర్లపై చేస్తున్న గుత్తాధిపత్యానికి తెరదించారు. ఇక్కడితో హాలివుడ్ స్టూడియోల స్వర్ణయుగం మగిసింది.

పూర్తిగా కాకపోయినా 1950 ల నుంచీ హాలీవుడ్ లో ఇండిపెండెంట్ సినిమా సాధ్యమైంది. అదే సమయంలో వచ్చిన ఫ్రెంచ్ న్యూ వేవ్ సినిమాలు, అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులు హాలీవుడ్ లో చిన్న బడ్జెట్, ఇండీ సినిమాలకు అవకాశం కల్పించాయి. 1950 ల నుంచీ వచ్చిన హాలీవుడ్ ఇండిపెండెంట్ సినిమా గురించి చెప్పుకోవాలంటే పుస్తకాలే రాయొచ్చు. అయితే independent సినిమా గురించి మాట్లాడేటప్పుడు సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి మాత్రం ప్రస్తావనకు వచ్చి తీరాల్సిందే. నేటికీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కి సర్గం లాంటిదీ చలనచిత్రోత్సవం. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే (అదీ paranormal activity తర్వాత) అమెరికా లో సినిమా తీస్తానంటే ఆపేవాళ్ళెవరు అనిపిస్తుంది.

అది అమెరికా కథ.

మరి మన కథ ఏంటి?

మనది హాలీవుడ్ కాదు టాలీవుడ్ కాబట్టి మన కథ వేరు. ఇక్కడ హాలీవుడ్ లో లాగా ఆధిపత్యం అంటూ చేసిన స్టూడియోలు మనకు లేవనే చెప్పాలి. కాకపోతే ఈ మధ్య చిన్న సినిమాలకు థియేటర్లు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఒక complaint ఉంది. అయితే మన దగ్గర చిన్న సినిమా అంటే independent సినిమా అని అర్థం కాదు. మన సిస్టం ని హాలీవుడ్ తో పోల్చలేము కానీ ఇక్కడ పెద్ద నిర్మాత తీసిన చిన్న నిర్మాత తీసినా అందరి విధానం ఒక్కటే. చిన్న బడ్జెట్ తో తీస్తున్నాం కదా అని హాలీవుడ్ లేదా మరేదైనా దేశానికి సంబంధించిన independent సినిమాలలాగా innovative గా సినిమాలు తీయడం మనం చేయటం లేదు.

ఉదాహరణకు మన సినిమాలో హీరో వాళ్ళ ఇంట్లో ఒక సీన్ ఉందనుకోండి. పెద్ద బడ్జెట్ సినిమా అయితే బాగా ఖర్చుపెట్టి హీరో ఇంటిని కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తే, చిన్న బడ్జెట్ సినిమా అయితే అంత భారీ కాకపోయినా అందులో సగం సైజులోనైనా ఉండే ఇంటిని అద్దెకు తీసుకుంటారు. ఈ విధంగా మన దగ్గర చిన్న బడ్జెట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కానీ ఇండిపెండెంట్ సినిమాలంటూ లేవనే చెప్పాలి.

అసలింతకీ ఇండిపెండెంట్ సినిమా అంటే ఏంటి? ఒక సినిమాని independent సినిమాగా ఎలా qualify చేస్తాము? చిన్న బడ్జెట్ సినిమాలకు independent films కి తేడా ఏంటి? Independent cinema ల వల్ల లాభాలేంటి? లాంటి విషయాలు ఆలోచిస్తే…

Independent సినిమా అంటే సాధారణంగా హాలీవుడ్ లోని స్టూడియోల సపోర్ట్ లేకుండా బయటవాళ్ళెవరో తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా. అంత మాత్రానా ప్రతి లోబడ్జెట్ సినిమా ఇండిపెండెంట్ సినిమా కానవసరం లేదు. ఎందుకంటే…

In order to be considered independent, less than half of a film’s financing should come from a major studio. Independent films are sometimes distinguishable by their content and style and the way in which the filmmakers’ personal artistic vision is realized. Usually, but not always, independent films are made with considerably lower budgets than major studio films. Generally, the marketing of independent films is characterized by limited release designed to build word-of-mouth or to reach small specialty audiences.

కాబట్టి ఇండిపెండెంట్ సినిమా అనడానికి ముఖ్యం బడ్జెట్ ఒక్కటే కాదు. దానికంటే ముఖ్యమైనది content, style మరియు దర్శకుని artistic vision. మన లో బడ్జెట్ సినిమాల్లో లోపించేవి ఇవే. ఒక విధంగా చెప్పాలంటే మన లో బడ్జెట్ సినిమాలు ’poor’ imitation of big budget films అని చెప్పొచ్చు.

సో అదన్న మాట ఇండిపెండెంట్ సినిమా కథ.

అంటే “”ఇండిపెండెంట్ ఇండియా లో ఇండిపెండెంట్ సినిమా కరువాయనే….” అని అనుకోనక్కర్లేదు. 70 ల్లో వచ్చిన ప్యారలల్ సినిమా లో చాలా వాటిల్లో ఇండిపెండెంట్ సినిమా ఛాయలు కనిపిస్తాయి. మరి తెలుగులో…?

తెలుగులో ప్రత్యేకంగా independent సినిమాలు అనగలిగే సినిమాలు గుర్తు రావటం లేదు కానీ వంశీ సినిమాల్లో ఆ ధోరణి (తక్కువ బడ్జెట్, personal artistic vision, style మరియు content లాంటి విషయాల ద్వారా) వెల్లడవుతుంది.

ఏమాయ చేశావె-Independent Cinema

అసలీ ఇండిపెండెంట్ సినిమా గురించి రాయడానికి కారణం ఈ మధ్యన చూసిన ఏమాయ చేశావె అనే సినిమా. ఈ సినిమా కృష్ణ గారి కూతురు మంజుల నిర్మించింది కాబట్టి independent సినిమా అనలేమంటే నేను చెప్పలేను కానీ ఈ సినిమా మన తెలుగులో వచ్చిన independent సినిమాకి ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తంలో దర్శకుని personal artistic vision తప్పక తెలుస్తుంది. దీన్ని ఇండిపెండెంట్ సినిమా అనడానికి అదొక్కటే కారణం కాదు.

ఈ సినిమాలో లొకేషన్లు చూడండి. దాదాపుగా అన్ని తెలుగు సినిమాలూ ఒకేలా ఉంటాయి. అవే పెద్ద పెద్ద ఇల్లు. అన్ని సినిమాల్లో రొటీన్ అన్నలు, వదినలు, అమ్మ, నాన్న, తాతయ్య. లైటింగ్, మేకప్, ఎడిటింగ్ అన్నీ కూడా అన్ని సినిమాల్లోనూ ఒకేలా ఉంటాయి. వీటన్నింటికీ దూరంగా మనం ఏదైనా కాలనీ లోనుంచి వెళ్తుండగా కనిపించే independent house దగ్గర సినిమాలో చాలా భాగం, జూబ్లీ హిల్స్ రోడ్స్ మీద ఇంకొంత భాగం, కెఫె లో కాస్తా భాగం ఇలా రియలిస్టిక్ లొకేషన్స్ లో సినిమా తీయడం ద్వారా ఈ సినిమాని చాలా లో బడ్జెట్ లో పూర్తి చెయ్యగలిగారని విన్నాను. లో బడ్జెట్ కాబట్టి ఎక్కడో దగ్గర తీయడం వేరు. సినిమాకి అవసరమైన లోకేషన్స్ ఎన్నుకుని బడ్జెట్ తగ్గించడం వేరు. మీరు ఈ సినిమా గమనించినట్టయితే సినిమాలో (ఎప్పుడో ఒక్కసారి తప్పితే) ఇంట్లో జరిగే సన్నివేశాలే తీయలేదు దర్శకుడు. అలాంటి independent house లో షూట్ చెయ్యాలంటే ఉండే ఇబ్బందులు తెలుసు కాబట్టే జనాలు భారీ బంగ్లాలో ఇల్లు సెట్టింగ్ వేస్తారు. దాంతో తడిసి మోపెడవుతుంది. గౌతం మీనన్ తెలివిగా అసలు ఇంటి లోపల షూట్ చెయ్యాల్సిన అవసరమే రాకుండా చేసుకున్నాడు. అలా ఈ సినిమాలో గమనిస్తే చాలా విషయాల్లో compromise కాకుండా రిచ్ గా కనిపిస్తూనే తెలివిగా చేసిన సీన్స్ చాలానే ఉన్నాయి. అందుకే independent సినిమాకి ఇది ఒక మంచి ఉదాహరణ అనుకుంటున్నాను.

ఆ మాటకొస్తే ఈ మధ్య వచ్చిన Rocket Singh అనే సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుందనుకుంటాను. ఈ సినిమాని ఇండీ ఫిల్మ్ అని ఎందుకంటున్నానో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.

6 Comments
  1. Srinivas March 7, 2010 /
  2. rayraj March 11, 2010 /
  3. గీతాచార్య March 25, 2010 /
  4. chakradhar November 4, 2010 /