Menu

రన్నింగ్ కామెంట్రీ-3D Movies


Avatar VS Dances with Wolves VS Emerald Forest

పది సంవత్సరాల క్రితం, అంటే ఇప్పట్లాగా ప్రపంచ సినిమాలు ఎక్కడంటే అక్కడ దొరక్క ముందు హైదరాబాదులో కేవలం సంగీత్, సాయికిశోర్ లాంటి థియేటర్స్ లో మాత్రమే విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలను మిస్సవకుండా చూసే వాళ్ళకు ఎమరాల్డ్ ఫారెస్ట్ అనే సినిమా గురించి తప్పక తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో చూసిన అన్ని సినిమాల్లో ఇప్పటికీ ఎంతో vivid గా గుర్తుండిపోయే సన్నివేశాలు, పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే కాబోలు అవతార్ సినిమా మొదటి సారి చూసినప్పుడు వెంటనే నాకీ సినిమా గుర్తొచ్చింది. కానీ ఆ సినిమా పేరు మాత్రం నాకు సరిగ్గా గుర్తు రాలేదు. కాకపోతే ఆ సినిమా పేరులో Forest ఉందని మాత్రం బాగా గుర్తుంది. ఇంటికొచ్చి IMDB లో గూగుల్ లో వెతికాక ఆ సినిమా పేరు Emerald forest అని తెలిసొచ్చింది.

ఇంతకీ అవతార్ సినిమాకి ఎమరాల్డ్ ఫారెస్ట్ కీ సంబంధం ఏమిటంటే చాలానే ఉంది. కథా పరంగా రెండింటికీ కొట్టొచ్చినట్టు పోలికలు ఉన్నాయి. Environment protection అనే థీం మాత్రమే కాకుండా పాత్రల్లో కూడా పోలికలు కనిపిస్తాయి. నాకొచ్చిన ఈ అనుమానం ఇంకెవరికీ రాలేదేమిటబ్బా అని గూగుల్ వెతికితే అక్కడక్కడా నా లాంటి వాళ్ళున్నారని తెలిసింది.

ఉదాహరణకు గార్డియన్ పత్రికలో Andrew Pulver వ్రాసిన ఒక వ్యాసంలో “Why has so little attention been paid to the debt Avatar owes to John Boorman’s The Emerald Forest?” అని ప్రశ్నించారు. అలాగే నాలా అనుమానమొచ్చిన మరొకతను ఇక్కడ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

Are they both the same story told differently? Sigourney Weaver vs. Powers Booth? Correct me if I’m wrong, the love interest in Avatar is Nachiri and the love interest in Emerald Forest is Kachiri.

In my eyes, the difference is that Emerald Forest is based on a true story. Avatar is fantasy (albeit very good) and shows off animation technology.

అలాగే అవతార్ సినిమాను Dances with the wolves అనే సినిమాతో కూడా పోల్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి James Cameroon కూడా ఒక ఇంటర్యూలో “Yes, ‘Avatar’ is ‘Dances with Wolves’ in space. . .sorta” అన్నారు. అదే ఇంటర్వ్యూలో ఆయన Emerald Forest గురించి కూడా mention చేశారు.

Yes, exactly, it is very much like that. You see the same theme in “At Play in the Fields of the Lord” and also “The Emerald Forest,” which maybe thematically isn’t that connected but it did have that clash of civilizations or of cultures. That was another reference point for me. There was some beautiful stuff in that film. I just gathered all this stuff in and then you look at it through the lens of science fiction and it comes out looking very different but is still recognizable in a universal story way. It’s almost comfortable for the audience – “I know what kind of tale this is.” They’re not just sitting there scratching their heads, they’re enjoying it and being taken along. And we still have turns and surprises in it, too, things you don’t see coming. But the idea that you feel like you are in a classic story, a story that could have been shaped by Rudyard Kipling or Edgar Rice Burroughs.

అయితే ఇక్కడ చెప్పాలనుకున్న విషయం కేమరూన్ పైన పేర్కొన్న సినిమాలనుంచి అవతార్ సినిమా కథను కాపీ కొట్టాడని కాదు. అవతార్ సినిమా ముఖ్య లక్ష్యం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని effective గా ఉపయోగించుకుని ప్రేక్షకులకు సరి కొత్త అనుభూతిని అందచేయడం కాబట్టి కేమరూన్ అందరికీ అర్థమయ్యే universal గా acceptance ఉన్న కథను తెరకెక్కించారు. ఉదాహరణకు చలనచిత్ర ప్రక్రియలో సరి కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని పరిచయం చేసిన Matrix సినిమా తీసుకుంటే అందులో కథేంటో ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉంటారనుకుంటాను.

Avatar and Indian 3D films

అవతార్ సినిమాతో అందరి కళ్ళు 3D సినిమా మీదున్నాయి. తెలుగు లో మొదటి డిజిటల్ సినిమా తీసిన దర్శకుడు శివ, ’ఛూ మంతర్’ పేరుతో ఒక 3D సినిమా నిర్మించబోతున్నారట. అలాగే ఆలీబాబా-నలభై దొంగలు పేరుతో ఒక 3D animation సినిమా నిర్మాణం లో ఉందట. అలాగే రాం గోపాల వర్మ ఒక 3D హారర్ చిత్రం నిర్మించబోతున్నారని సమాచారం. ఇవన్నీ కాకుండా ముంబాయి లోని Crest animation studio నిర్మిస్తున్న Alpha & Omega అనే యానిమేషన్ చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

’పాతాభైరవి’ (3D-కలర్)

మొన్నీ మధ్యన వచ్చిన మాయాబజార్ (కలర్) గుర్తుంది గా. ’మాయాబజార్’ సినిమా రంగులద్దుకుని నిర్మాతలకు మంచి డబ్బులే చేసిపెట్టినట్టుంది. ఈ మధ్య పరిశ్రమలో చాలామంది ఏ బ్లాక్-వైట్ సినిమాకి రంగులద్ది మళ్ళీ వదులుదామా అని ఆలోచనలో పడ్డారు. ఏం చేస్తాం, కొత్తొక వింత అన్నారుగా. కొన్నాళ్ళకు దీని మీద కూడా మనసు పోతుంది. అప్పుడు నాలాంటోడెవరో వచ్చి ’మాయాబజార్ కి ఉత్తి రంగులే అద్దారు. నేనైతే పాతాళ భైరవి కి రంగులద్ది 3D లోకి మారుస్తాను’ అంటే ఏమంటారు? గ్యారంటీగా workout అయ్యే idea కదా? కానీ ‘రంగులద్దడమే పెద్ద పనంటే 2D సినిమాని 3D కి మార్చడం ఎలా? Impossible’ అనుకుంటున్నారా?

టెక్నాలజీ మారిపోతుంది. ఇంకో సంవత్సరంలో 2001, Space odyssey నో లేక మరేదైనా పాత హాలీవుడ్ సినిమా 3D లో మన ముందు ప్రత్యక్షం కాబోతుంది. అదీ కూడా ఈ 2D నుంచి 3D కి convert చేసే పనంతా మన దేశంలోనే జరగనుంది.

వివరాల్లోకెళ్తే….

Indian conglomerate Reliance ADA Group is partnering with a Los Angeles company to produce 3-D movies out of a new 1,000-person facility in Mumbai that will be the largest of its kind in the world.

Reliance and In-Three Inc. will convert 15 to 25 feature films per year from regular two-dimensional format to 3-D, the companies say. Reliance’s planned $40 million facility, which is scheduled to open in January, will house the 3-D operations along with other film services it already provides, such as post-production, visual effects and restoration of classics.

ఇప్పుడేమంటారు? ’పాతాభైరవి’ (3D-కలర్) అసాధ్యమంటారా?

ఇవీ ఈ రోజు రన్నింగ్ కామెంటరీ లో విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం.

3 Comments
  1. kannagadu March 7, 2010 /
  2. rayraj March 11, 2010 /
  3. keshavcharan March 14, 2010 /