Menu

రోడ్ టు సంగం

ఈ సినిమా పేరు నేనింతకు ముందు వినలేదు. డివిడి కవర్ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను. యాక్టర్స్ ఎవ్వరన్నది పట్టించుకోకుండానే కొనేశాను. రాత్రి వంటి గంటకు మొదలు పెట్టాను. ఇక ఆపటం నా తరం గాలేదు పూర్తయ్యేవరకు.

పరేష్ రావెల్, ఓంపురి ప్రధాన పాత్రధారులు. కొన్ని సీన్లలో గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ ని చూడచ్చు. తప్ప మిగతా నటులెవ్వర్ని చూడలేదు. కాని ప్రతీ పాత్ర తీర్చి దిద్దినట్లున్నాయి ఓ ఇంగ్లీష్ సినిమా లోలాగా.

పరేష్ హష్మత్ భాయ్ పాత్రకు ప్రాణం పోశాడు. పాలిటిక్స్ లేకపోతే బెష్ట్ యాక్టర్ అవార్డ్ ఇవ్వచ్చు; మిగతా ఏ పాత్ర అతని దరిదాపులకి కూడా రాలేదు. అన్ని విభాగాలు చక్కగా రాణించాయి.

మెకానిక్ హష్మత్ కి ఓ రోజున మ్యూజియం నించి ఓ అరవై ఏళ్ళ పాత ఫోర్డ్ ట్రక్ ఇంజన్ రిపేర్ కి పంపిస్తారు. అతనో ముస్లిమ్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీ. ఈ లోగా కొన్ని ముస్లిమ్ గొడవలు వచ్చి ప్రెసిడెంట్ ఓంపురి మేనల్లుడు యాక్సిడెంటల్ గా చనిపోతాడు. దానికి ప్రభుత్వమే కారణమంటూ ముస్లిమ్ లంతా తమ షాప్ లన్నీ కొన్ని రోజుల పాటు బంద్ చేస్తారు హష్మత్ తో సహా. అప్పుడు హష్మత్ ని టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చెయ్యటానికి వస్తారు. ఆశ్చర్య పోయిన అతనికి అప్పుడు అసలు విషయం తెలుస్తుంది, మన ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కొన్ని గాంధీ గారి అస్తికలు అలాగే ఓ బాంక్ లాకర్ లో మిగిలిపోతాయి. అవి అందుకున్న తుషార్ వాటిని సకల మర్యాదలతో అలహబాద్ లో నిమజ్జనం చెయ్యాలనుకుంటాడు. దానికి అరవై ఏళ్ళ క్రితం వాడిన ఫోర్డ్ ట్రక్ నే వాడాలని కోరుతాడు, దాని ఇంజనే మన హష్మత్ భాయ్ దగ్గర్ ఉంది. ఆరోజు అతి దగ్గరలోనే ఉంది.

మౌలా మరి ఇతర ముస్లీమ్ లు అతని షాప్ తెరిచి ఇంజన్ రిపేర్ చెయ్యటానికి ఒప్పుకోరు. బహిష్కరిస్తామని బెదరిస్తారు. కాని ఆ ఇంజన్ ని హష్మత్ తప్ప ఇంకెవ్వరు రిపేర్ చెయ్యలేరు. మరి హష్మత్ దీన్ని ఎలా పరిష్కరించాడన్నదే మిగిలిన కధ.

అమిత్ రాయ్ డైరక్షన్ అమిత్ ఛడ్దా ప్రొడ్యూసర్. హాట్స్ ఆఫ్ గయ్స్. ఫిక్షన్ అండ్ హిష్టరీ ని చక్కగా మిక్స్ చెయ్యగలిగినందుకు, ఈ సినిమా తీసే సాహసం చేసినందుకు.. నితిన్ గుప్తా, ప్రేమ్ హరియా ల మ్యూజిక్.. పాటలు కొన్ని సూఫీ స్టయిల్. వైష్ణవ జనతో రీమిక్స్ చేశారు. ఓవరాల్గా అన్నీ వినబుల్ సాంగ్సే..

ఇండియా లో తప్ప మిగతా అన్ని చోట్లా ప్రశంసలు పొందిన సినిమా నే. కాన్స్ లో స్టాండింగ్ ఒవేషన ట.

ప్లీజ్ సీ దిస్ మూవీ.. లెటజ్ బీ సపోర్టివ్ టు బాలీవుడ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ గుడ్ అన్డ్ బోల్డ్ మూవీ….

6 Comments
  1. sandeep March 8, 2010 /
  2. సౌమ్య March 8, 2010 /
    • వెంకట్ ఉప్పలూరి March 8, 2010 /
  3. Jonathan March 8, 2010 /
  4. Vasu March 20, 2010 /
  5. praveen June 1, 2011 /