పైరసీ ని పైరసీ చెయ్యొద్దు

Piracy_is_a_crime_-_Unskippable_Anti-Piracy_track

నవతరంగం, న్యూస్ టుడే (మార్చి 18,2010): హఠాత్తుగా  యలమంచి రవిచంద్ అనే (అనామక) నిర్మాత పైరసీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష మొదలెడితే పరిశ్రమ పెద్దలందరూ ఘాఠ్ఠిమద్ధత్తునిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం 45 రోజల్లో తమిళనాడు తరహా టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. యలమంచిలి నిరాహారదీక్ష విరమించాడు. “చిన్న నిర్మాత చిత్రసీమకుపట్టిన ఝాఢ్యాన్ని వదిలించాడు.” అని పరిశ్రమ పెద్దలు పొగిడారు.

పైరసీ. మన తెలుగు సినిమా ఇండస్త్రీ లోనే కాక యావత్ ప్రపంచం మొత్తం దీని గురించి నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు.ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన సినిమాని ఇలా సింపుల్ గా ఇంట్లో కూర్చుని 20 రూపాయలకే చూస్తున్నారు అని ప్రొడ్యూసర్ల, హీరోల వాదన.నిజమే ఈ పైరసీ మహా వృక్షం ఒక్క సారి పాకితే అంతమవడం కష్టం ఎందుకంటే ఇంటెర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలో అందరూ చాలా ఈజీ గా ఫ్రీ గా సినిమా విడుదలైన వారం రోజులకే చూసేస్తున్నారు. ఇక చిన్న సినిమాలైతే రెండో రోజు,మూడో రోజుకే నెట్ లో దొరుకుతున్నాయి.

ఏంట్రా వీడు అసలు విషయం మాట్లాడకుండా మనకు తెలిసిన విషయాలే చెప్తున్నాడు అని తిట్టుకోకండి.సినిమాకైనా,వ్యాసానికైనా ఒక చిన్న ఇంట్రడక్షన్ అవసరమని చిన్నప్పుడు ఎస్సే రైటింగ్ క్లాస్ లొ టీచర్ చెప్పింది.ఇంక చుక్కకి ఒస్తే… మన శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చాలా ప్యాషన్ తో ఎంతో ఇష్టపడి సినిమాలు నిర్మిస్తారని అందరికీ తెలిసిందే.మరి అలా కని,పెంచి,పోషించిన తన సినిమా ని ఎవడో ఒకడు పైరసీ చెస్తే ఎలా సహించ గలడు అలానే హేరోల్లో కుడా చాలా మంది పైరసీ మీద యుద్ధం చేయమన్నారు.

అసలు పైరసీ మీద యుద్ధం చేసే ముందు సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. పైరసీ అంటే కాపీ కొట్టడమా కాదా? ఒక వేళ దాన్ని కాపీ కొడితే ఆ కాపీని ధ్వంసం చేసే హక్కు దాని ఓనర్ కి ఉందా? ఈ పైన ప్రశ్నలకి అందరూ అవుననే అంటారు. అసలు విషయానికి వస్తే, మన శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన అద్భుత కళాఖండం “అరుంధతి”.మన టాలీవుడ్ చరిత్రలో నిలిచే ఒక మైలు రాయి.పెద్ద హేరోలకు ధీటుగా నిలిచిన సినిమా.ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టిన గొప్ప సినిమా.కాని పాపం మన డైరెక్టర్ కోడి రామక్రిష్ణ గారు,శ్యాం ప్రసాద్ రెడ్డి గారు “ది హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగర్స్” అనె చైనీస్ సినిమా చూసారో లేదో తెలియదు.ఎందుకంటే అరుంధతి సినిమా లో పెట్టిన డ్రం డాన్స్ కేక,రచ్చ,అరుపులు అని పబ్లిసిటి ఇచ్చుకుంటున్న వీరు ఆజ్ ఇట్ ఈజ్ గా ఆ డ్రం డాన్స్ ని మక్కీ కి మక్కీ అరుంధతి లో దింపేసారు.నేను ఏదో ఇన్స్పిరేషన్ అనే అనుకున్నాను కానీ మరీ ఇంతలా కాపీ కొట్టేస్తారని అనుకోలేదు.ఏమన్నా అంటే వీళ్ళందరికీ తెలిసిన ఎకైక మంత్రం.మేము ఆ సీన్ ఇన్స్పైర్ అయ్యి తీసాము అని.ఇన్స్పిరేషన్ కి కాపీ కి చాలా తేడా ఉందని వీళ్ళు గమనించడానికి మనకు ఒక 100 ఏళ్ళు అయినా సరిపోదేమో. ఇలానే నేను ఇంతకు ముందు కూడా మోసపోయాను.

“సూపర్” అని నాగార్జున గారు నాకు ఆ గొప్ప అవకాశం కల్పించారు.కానీ ఈ సినిమా లో నేను డైరెక్టర్ని అనాలో లేక అంతగా పబ్లిసిటి ఇచ్చుకున్న హేరో ని అనాలో అర్ధం కాక మీకే ఒదిలేస్తున్నాను.ఆంగ్ల చిత్రం “ఇటాలియన్ జాబ్” చాలా మందే చూసుంటారు దాంట్లో ఇంట్రొడక్షన్ సీన్ ని మార్చి సూపర్ క్లైమాక్స్ లో వాడుకున్నారు.ఇంక ఆ చిత్రం లో ధూం ఛాయలు అస్సలు లేవని ఇది కొత్త రకమైన చిత్రమని తెగ హైప్ ఇచ్చే సరికి చూసి తరించక తప్పలేదు.

ఇది చిత్ర సీమలో ఒక కోణం మాత్రమే. రెండో రకమైన మహమ్మారి ఉంది అది ఆడియో పైరసీ.ఎవడి దగ్గరో దొంగ తనంగా ఎత్తుకొచ్చిన ట్యూన్స్ ని వీళ్ళ సినిమాల్లో పెట్టుకుని పైగా మళ్ళీ దాన్ని పైరసీ చేయొద్దంటూ పబ్లిసిటి.ఇండియా లో ఉన్న వాళ్ళ పరిస్థితి తెలియదు కానీ అమెరికాలో,యూరోప్లో ఉన్న తెలుగు కుర్రాళ్ళని అడగండి చెప్తారు ఆ బాధని.మేము భారత చలన చిత్రాల గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటాం ఇక్కడ కాని అంతలోనే ఎదవలు గా మిగిలిపోతున్నాం.ఇక్కడ ఉన్న అమెరికన్స్ కి కొంత కాలం క్రితం ఛత్రపతి థీం మ్యూసిక్ గురించి చాలా గొప్పగా చెప్పాము.అది స్వయాన మేమే అతనికి గర్వంగా వినిపించాము.అతను కొంత సేపు సైలెంట్ గా ఉండి వెంటనే యూట్యూబ్ లో దాని అసలు పాట వినిపించే సరికి మా తలకాయ తీసి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అలాగే మంత్ర సినిమాలో పాట వాళ్ళ ముందు వినాలంటేనే మాకు భయం.ఇలా కీరవాణి,మణిశర్మ,చక్రి,హర్రిస్ జయరాజ్ ఒక్కరేమిటి అందరూ దొంగలే.వీళ్ళ పాటలు అమెరికా లో ఎదో ఒక పబ్ లో వినబడతూనే ఉంటాయి.వీళ్ళలో మణిశర్మ స్టైల్ కొంచెం డిఫరెంట్ అంతా కాపీ కొట్టి చివర్లో కొంచెం మారుస్తాడు.వీళ్ళందరినీ నేను చేతగాని వాళ్ళ లాగా వర్ణించట్లేదు.కనీసం కాపీ కొట్టినా ఇన్లే కార్ద్ మీద కానీ సినిమాలో కానీ కనీసం ఒరిజినల్ వాటికి క్రెడిట్స్ ఇవ్వండి.అలా ఇస్తే వీళ్ళకు భయం ఎందుకంటె అసలు రైట్స్ తీసుకోవాలి మళ్ళీ మన జనాల్లో లొకువ అవుతారు కదా.

మన వాళ్ళు కాపీ కొట్టడం లో ఇంగ్లిష్ మాత్రమే కాకుందా ప్రపంచం లోని అన్ని భాషలు అనువదిస్తున్నారు… క్షమించాలి పైరసీ చేస్తున్నారు.ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉన్నాయి.ఇది అందరికీ వర్తించినా ప్రత్యేకించి శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి రాస్తున్న విషయం.మీరు తీసే సినిమాల్లో పైరసీ సీన్ లు పెట్టుకునే మీకు పైరసీ చెయొద్దనే హక్కు లేదు.ఇది మీ ఒక్కరికే కాకుండా అందరికీ చెప్పే విషయం. ఇలాంటి డైరెక్టర్స్ వల్ల పెద్ద హీరో ల ఫ్యాన్స్ అవమాన భారంతో తలెత్తుకోలేక పోతున్నారు.

అంజి సినిమాలో క్లైమాక్స్ ఇండియానా జోన్స్ -ఒక చిరు ఫ్యాన్ ఆవేదన!
బాలక్రిష్ణ చిత్రాల్లో ఆంగ్ల చిత్రాల గ్రాఫిక్స్ కాపీ సీన్లు -ఒక బాలక్రిష్ణ ఫ్యాన్ బాధ!
వంశీ చిత్రంలో మిషన్ ఇంపాసిబుల్ 2 -ఒక మహేష్ ఫ్యాన్!…..ఇలా ఎన్నో చిత్రాలని కేవలం ఇన్స్పిరేషన్ అనే పదం తో తెలుగు జనాలని ప్రపంచం ముందు వెధవలుగా నిలబెడుతుంది. ముందు మీరు పైరసీ చేయడం మానండి.మీ చిత్రాలను వీడియో పైరసీ , ఆడియో పైరసీ ల నుంచి ఆపడానికి చట్టాలున్నాయి.కానీ మాకు సినిమాల నుంచి మీరు కొట్టే కాపీని అరికట్టడానికి ఏ చట్టం కావాలో చెప్పండి. ముందు మీరు పైరసీని ఆపండి.తరువాత మాకు చెప్పండి.

–హీరో
ఒక ప్రపంచ సినీ ప్రేమికుడు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

96 Comments to “పైరసీ ని పైరసీ చెయ్యొద్దు”

  • బాగా చెప్పారు. ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు.

  • ఆలోచింపచేసే మంచి వ్యాసం. మహేష్ గారు అన్నట్టు ఎటూ తేల్చుకోలేము. కాపీ కొట్టి కోట్లు సంపాదించి కాపీ కొడుతున్నారు అని ఏడవడం మనవాళ్ళకే చెల్లింది.

    ఆ మధ్య జరిగిన ఒక సంఘట తలుచుకుంటే నాకు Usual Suspects చూసిన తర్వాతలా మైండ్ బ్లాక్ అయింది: తమిళ “గజినీ”
    Memento కు మక్కీకి మక్కీ. దాన్ని హిందీలో తీయడానికి “రీమేక్ హక్కులు” అల్లు అరవింద్ కొన్నాడు అని ఎక్కడో చదివాను! ఇంకొకరి సినిమాను దొంగిలించి తీసిన సినిమా హక్కులు కొనడం ఏంటి? తమిళ్‌లో తీసినపుడు వాళ్ళు హాలీవుడ్‌కు వెళ్ళి హక్కులు కొన్నారా!! అంతా అయోమయం :)

  • ఇదంతా ఒక ఎత్తయితే….అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన ఒక సినిమాని మన తెలుగులో ప్రాణ స్నేహితులుగా వచ్చింది. అదే సినిమా ని తమిళంలో రజనీ కాంత్ అన్నామలై అని సినిమా తీస్తే దాని రైట్స్ కొనుక్కొని తెలుగులో వెంకటేశ్ కొండపల్లి రాజా గా తీశారు. ఇది అంతటితో ఆగితే ఒక రకం. ఆ రజనీకాంత్ సినిమాని మళ్ళి తెలుగులో డబ్బింగ్ కూడా చెయ్యడం జరిగింది. ఇంతకీ అసలా హిందీ సినిమా ఏమో ఏదో ఆంగ్ల నవల అనుకరణ అట :-)

    ఇలాంటిదే మరొకటి.
    తెలుగులో వచ్చిన నరసింహ నాయుడు సినిమా ని తమిళంలో అర్జున్ తో రీమేక్ చేస్తే అదే సినిమాని (సిమ్రాన్ తడిసిన అందాల పోస్టర్స్ తో) మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

    ఆడియన్స్ ని టేక్ దెమ్ ఫర్ గ్రాంటడ్ అంటే ఇదేనేమో…
    ఇదంతా పైరసీ అనాలో ఇంకేమనాలో తెలియదు.

    • ఇలాంటిదే ఇంకో కథ. భాగ్యరాజ్ తమిళ సినిమాని దేన్నో(తమిళ్‌లో పేరు తెలీదు) తెలుగులో చిన్నరాజా అని అనుకుంట డబ్ చేసి రిలీజు చేసారు. తర్వాత అదే తమిళ్ సినిమాని హిందీలో బేటా అని అనిల్‌కపూర్, మాధురీధీక్షిత్‌లతో రిమేక్ చేసారు. ఆ హిందీ సినిమాని మళ్ళీ మనవాళ్ళు రిమేక్ చేసి వెంకటేశ్, మీనాలతో అబ్బాయిగారు అని రిలీజు చేసారు.

      అలాగే రజనీకాంత్ తమిళ్ సినిమాని ఘరానామొగుడు అని రిమేక్ చేసాక, తమిళ్ సినిమాని డబ్ చేసి కూడా రిలీజు చేసారు.

      hum సినిమా remakes, freemakes, inspired versions ఇంకా నడుస్తూనే ఉన్నాయి.

      • ఆ అబ్బాయిగారు మళ్ళీ తమిళంలోకి వెళ్ళింది మరలా దాన్నెక్కడ దబ్బింగ్ చేసి మనమొహానకొడతారేమోనని ఆరోజుల్లో భయపడిచచ్చాం :)
        ఆరజనీకాంట్ సినిమా తెలుగులోకి దబ్బింగ్ లొ వచ్చినప్ప్పుడు దానిపేరు మహారాణి ,పబ్లిసిటీ అంతా విజయశాంతి ఉంటుంది
        పాపం రజనీకాంత్ ఓపక్కనుంటాడు.
        రమ్ములో థమ్స్ అప్ లా హమ్ సినిమాకి అగ్నిపథ్ కలిపికొట్టిన సినిమాల జాబితా వ్రాయునది ???

    • ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. ఒక సినిమాకి రైట్స్ కొన్నవాడు అసలు రైట్స్ ఓనర్ అనుమతి లేకుండా రైట్స్ రీసేల్ చేసే అధికారం చట్ట ప్రకారం ఉందా?

  • అంటే, మన వాళ్ళు తీసే ప్రతీ సినిమా, చేసే ప్రతీ ట్యూన్ pirated అంటారా? 100 కి కనీసం 20 అటువంటివి ఉంటాయి అని నేను కూడా ఒప్పుకుంటాను. కాని, ఆ “piracy” చేసేవాళ్ళు చాలాసార్లు ఒరిజినల్ కంటెంట్ కి కూడా సృష్టిస్తున్నారు కదా? వాళ్ళు ఏదో ఒక పాటనో, సినిమా లో సీన్ నో కాపీ చేసారని ఆరోపించడం ద్వారా, మొత్తం ఇండస్ట్రీ ఉత్పత్తి చేసే ప్రతీ వస్తువునీ మనం pirate చేసెయ్యడానికి లైసెన్సు దొరికిందని అనుకోవడం సరికాదు. నా ఉద్దేశ్యం లో piracy కి అర్ధం, ఒకళ్ళు డబ్బులు పెట్టి కొని, వాళ్ళ నుంచి ఇతరులు డబ్బు చెల్లించి పొందడానికి ఏర్పాటు చేసిన వస్తువుని, వేరొకళ్ళు అక్రమ రీతిలో డబ్బు చెల్లించకుండా పొందడం/పొందడానికి ప్రయత్నించడం. ఒక సినిమా మ్యూజిక్ ని ఆదిత్యా వాళ్ళు ఎన్ని లక్షలో పెట్టి హక్కులు కొని విడుదల చేస్తారు. మరి దానిని తీసుకొని ప్రతీ ఒక్కరూ mp3 ల రూపంలోనో, వేరే రూపం లో నో ఫ్రీ గా తీసుకోవడం మొదలు పెడితే ఆ కొనుక్కున్న వాడు ఏమవుతాడు? ఎవడో ఒకడు కాపీ కొట్టాడు కదా, మనం కూడా అలా చేస్తే తప్పు లేదు అనుకోవడం వితండవాదం తప్ప మరోటి కాదు.. ఎవరికీ ఉండాల్సిన morals వాళ్ళకి ఉండాలి. వాడు “తప్పు” చేసాడు, నేను కూడా అదే చేస్తాను అంటే – మనం “తప్పు” అని గుర్తించిన పనిని మనం చేస్తున్నట్టే కదా? అది తెలిసీ తప్పు చెయ్యడం అవుతుంది.

    • వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మనం తప్పు చేద్ధాని కాదు ఉద్దేశం. తప్పు చేసిన తరువాత ఆ తప్పును తప్పని చెప్పకండి, మా సిన్సియారిటీని గుర్తించండి అని దేబరించుకుంటున్న కొందరి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతోంది.

      పైరసీ అనేది ఒక parallel industry. పరిశ్రమ తమ జాగ్రతల్లో ఉండనంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇక్కడ ప్రేక్షకులమీద పడి ఏడిస్తే లాభం ఉండకపోవచ్చు. నాకు మాత్రం హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే పైరసీనే ఇప్పటికీ గతి.

  • good….

  • ‘తీగె లాగితే డొంక కదులుతుంది’. ‘కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది’. ‘గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయనుకోవటం’ – ఇలాంటి తెలుగు సామెతలన్నీ పై విషయానికి వర్తిస్తాయి. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదనుకోవడం లాంటిదే ఈ వ్యాపారం. ‘కాపీ’ చెయ్యకూడదు అని దర్శకులు, నిర్మాతలు ఎవరికి వారు స్వతహాగా అనుకుని సినిమాలు చేసే దాకా ఇలా బాధ పడటం తప్పదు. అయితే, గంజాయి వనంలో తులసిమొక్కల్లా కొంతమంది దర్శకులున్నారనే నా నమ్మకం – ఉదాహరణకు బాపు, విశ్వనాథ్ వంటి దర్శకులు. బాపుకి సాధారణంగా ముళ్ళపూడి వెంకటరమణ కథలు రాసినా, కె. విశ్వనాథ్ సినిమాలు చాలావరకూ ఆయన స్వంత కథలే. మాటవరసకు – ‘సిరిసిరి మువ్వ’ దగ్గరనుంచీ ‘స్వరాభిషేకం’ వరకూ ఆయన సొంతంగా తయారుచేసుకున్న కథలే (నాకు గుర్తున్నంతవరకూ). అన్నీ స్వచ్చమైన దేశీయమైన కథలే. ఆ సినిమాలు బహుశా ఒక్కసారో, రెండుసార్లో చూసి ఒక నిర్ణయానికి రావటంకంటే, ఇంకొన్ని సార్లు చూస్తే, వాటి గొప్పదనం, ఆయన సినిమా తీసే విధానం మనలను అబ్బురపరచక మానదు. కాని ఒక సత్యజిత్ రాయ్ లా ఆయన్ని మనం తెలుగు ప్రేక్షకులం ఎందుకో ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాం (సత్యజిత్ రాయ్ స్థాయిలో అని మాత్రమే చదువుకోండి. కథల ఎంపిక విషయానికి వస్తే, ఇద్దరి దృక్పథాలు పూర్తిగా వేరు). విమర్శకులు కూడా విశ్వనాథ్ లో లోపాలే ఎక్కువగా వెతికారేమో గాని (నేను ఆయన సినిమాల గురించి విన్న విమర్శలే కాని, ఎక్కువగా చదవలేదు) లోతుగా అర్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది. ఇన్ని ఏళ్ల తర్వాత ఆయన సినిమాలు నాకు, మొదట చూసినప్పటికంటే, ఇప్పుడే బాగా అర్థమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి సన్నివేశం వెనుక ఆయన హృదయం, తపన సరిగ్గా తెలుస్తోంది. ముందు తరాల్లో తెలుగు సినిమాలను గురించి కొద్దో, గొప్పో చెప్పుకోవాలనుకుంటే విశ్వనాథ్ వంటి వారి గురించే అని నా అభిప్రాయం. విశ్వనాథ్ గురించి చెప్పి, బాపును తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. మన తెలుగు సినిమా ప్రతిభకు ఇద్దరూ రెండు కళ్ళ వంటి వారే. కాని, ‘సినిమా’ అనబడే ‘కళ’కూ, ‘సినిమా’ అనబడే ‘వ్యాపారానికి’ ఒక సమతూకం సాధించిన దర్శకుడిగా విశ్వనాథ్ నే చెప్పుకోవాలి. విదేశాల వారికి చెప్పాల్సింది ఇలాంటి దర్శకులు, సినిమాల గురించే. ‘పైరసీ’ గురించిన చర్చలో పానకంలో పుడకలా ఇదేంటీ అనుకోకండి. అలాంటి కాపీ సినిమాల గురించిన బాధ ఎలాగూ ఉంది. కనుక నిఖార్సైన దర్శకులు, సినిమాల గురించే మాట్లాడుకుంటే, కొంత సంతృప్తి కలుగుతుందేమోనని నా ఉద్దేశం.

    • సో ఫార్ – విశ్వనాధ్ సినిమాలు కాపీలు అని ఎవరూ అన్లేదు; నాకు తేలీదు; ఇలా అన్నాం కదా అని ఎవరన్నా
      ఏదన్న వెతికి తెస్తే, ఇక మనం చేయగలిగేది ఏదీ లేదు;
      బాపు-రమణ అలా కాదు; రమణవారు వారి రాతల్లో దాన్ని దాచే ప్రయత్నం చేయరు; ప్రపంచ సినిమాను వాళ్ళు చూశారు; అర్ధం చేసుకున్నారు; నచ్చినవి తెచ్చారు. కానీ, చాలా మటుకు దీన్ని మనం ప్రేరణ పొందటం గానే భావించాలి. ఎందుకంటే వీళ్ళు ముందు అసలు “ఓ తెలుగు సాంప్రదాయం” అనే ఒక బ్రాండు సృష్టించి – అన్నీ ఆ ఫ్రేమ్ వర్క్ లో చెప్పుకొచ్చారు. ఇప్పటికి తెలుగుతనం అంటే – వీళ్ళని కాపీ చేయటమే ఔతోంది. వీళ్ళ ఫ్రేమ్ వర్క్ లో లేని “తెలుగుతనం” చాలా బయట ప్రపంచంలో ఉన్నా కూడా!
      అబ్బో చాలా రాయాలేమో! నాకు బ్లాగే శరణ్యం; :)

  • ‘విమర్శ’ అన్న పదాన్ని ‘బాగాలేదని చెప్పటం’ అనే అర్థంలో వాడాను – ఆ పదం అసలు అర్థం అది కాకపోయినా. మీరు కూడా ‘బాగాలేదని చెప్పటం’ అనే అర్థంలోనే చదువుకోండి – సందర్భం అలానే ఉంది కాబట్టి. ఆ అర్థం వచ్చే తెలుగు మాట ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తెలియనంత వరకూ, ‘తిట్టటం’ అంటే ‘విమర్శ’ అనే పదమే దిక్కు.

  • Same articles published in GreatAndhra.com http://telugu.greatandhra.com/sangathulu/2-03-2009/chin_5_1.php

    • పైరసీని పైసరసీ చేయవద్దు (sic.) అనే వ్యాసాన్నే ఈ గ్రేట్ (కాపీ గొట్టడంలో గ్రేటా) ఆంధ్రావాడు పైరసీ చేసాడా(sic.).
      లేదా మన హీరోగారు అక్కడ కూడా వ్రాస్తూంటారా ?

  • శేషు గారు, బాపు గారంటే గుర్తొచ్చింది.. మిస్టర్ పెళ్ళాం సినిమాకు Mr. Mom అనే సినిమ మూలం. కొన్ని సీన్లు మక్కీకి మక్కీ దించేసారు బాపుగారు కూడా!!! నాకయితే బాపుగారు కేవలం తెలుగుదనం అద్దడం తప్ప “సినిమా తీయడం” కనిపించలేదు Mr.Mom చూసిన తర్వాత మీకు బాపు గారి పైన అభిమానం తగ్గకూడదు అనుకుంటే ఆ సినిమా పొరపాటున కూడా చూడకండి :) http://en.wikipedia.org/wiki/Mr._Mom

  • సపోజ్.పర్ సపోజ్(రావు గోపాలరావు స్టైల్లో)ఈ వ్యాసం పైరసీకి గురైతే,ఎక్కడి నుంచి ఎత్తామో ఎవరికీ చెప్పక ఈ ప్రపంచసినీప్రేమికుడికీ తెలీనీకుండా మరొక వెబ్ సైట్ వారు యధాతధంగా అచ్చోసి ఊరుమీద వదిలితే ఎలా ఉంటుంది??
    ఇలా ఉంటుందన్నమాట….
    http://telugu.greatandhra.com/sangathulu/2-03-2009/chin_5.php

    • క్షమించాలి. ముందు నవతరంగం లో అచ్చు వేయించిన తరువాత నేను GREATANDHRA కు పంపడం జరిగినది.

  • ఇదే ఆర్టికల్ ఇంకో వెబ్సైటు లో ఉంది. ఒకే రచయిత రెండు చోట్లా రాశారా? లేక ఇది కూడా పైరసీయేనా ;)
    http://telugu.greatandhra.com/sangathulu/2-03-2009/chin_5.php

    • క్షమించాలి. ముందు నవతరంగం లో అచ్చు వేయించిన తరువాత నేను GREATANDHRA కు పంపడం జరిగినది.

  • మనకి పంపించినతనే అక్కడికీ పంపించుంటారనుకుంటున్నా.

  • ఒకే వ్యాసం రెండు సైట్లలో రావడం ఏమో కానీ, నవతరంగం చదివే వాళ్ళు చాలామంది గ్రేట్ ఆంధ్రా సైట్ కూడా చూస్తున్నారన్నమాట. ఇంతకీ ఆ సైటంత లేకి సైటు ప్రపంచంలోనే లేదు కదా….ఎందుకా సైటు మనమందరం విజిట్ చేస్తున్నామంటారు?

    • హర్షగారూ, నాకు ఆ చెత్త కూడా భలే ఇష్టం :)
      ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఈ మధ్య నేను ఎక్కువ ఆ సైట్ చూస్తున్నది ఎంబీయస్ గారి వ్యాసాలకోసం. నేను ఆయన వీరాభిమానిని అయ్యాను. http://telugu.greatandhra.com/mbs/samgathalu_home.php

      • నిజమే.. ఎమ్బీఎస్ గారి వ్యాసాలకోసమే మేము కూడా అక్కడకి వెడుతూ వుంటాము.

  • చందు గారూ,
    ‘మిస్టర్ పెళ్ళాం’ చిత్రానికి Mr. Mom అనే ఆంగ్ల చిత్రం మాతృక అని మీరు చెప్తేనే తెలిసింది. పట్టుబడే వరకూ అందరూ దొరలే. బాపు గారి ‘రాధా గోపాళం’ ఇటీవల టివిలో వస్తే చూసాను. అందరూ అంటే ఏమో అనుకున్నాను కాని, సినిమా చాలా బలహీనంగా అనిపించింది. మన దౌర్భాగ్యమేమోగాని, తెలుగు చిత్రసీమలో చాలా మంది దర్శకులు, నటులు ఏదో ఒక ముద్రాంకితులైన వారే. ఆ ముద్రనుంచి విడివడి వాళ్ళను చూసే అవకాశం మన జీవితకాలంలో రాదుగాక రాదు. వైవిధ్యం అనేది మనవాళ్ళకు అందని మానిపండులాంటిదే. తెలుగు దర్శకులు, నటీనటులు ఎవరిని తీసుకున్నా, వాళ్ళ ప్రతిభను బాగా చూడాలంటే, వాళ్ళ ప్రారంభ చిత్రాలే చూడాలి. తర్వాతి సంవత్సరాల్లో వచ్చినవన్నీ చాలావరకూ చెత్తే. కొమ్ములు తిరిగిన నటులు చాలా చీప్ పాత్రల్లో నటిస్తుంటే, చాలా బాధగా ఉంటుంది. నా దృష్టిలో, తెలుగు సినిమాలకు అతి పెద్ద శాపం, మంచి కథలు లేకపోవటం, ఎక్కువగా ఫార్ములాలమీద ఆధారపడటం మొదలైనవి. ఒకసారి, ఒక నిర్మాత టి.వి. ఇంటర్వ్యూలో, తన నిర్మాణ సంస్థను ఒక ఫ్యాక్తరీగా పేర్కొన్నాడు. ఫ్యాక్తరీలోనుంచి తయారైన సినిమాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. మన సినిమా విమర్శకులు కూడా ఈ రంగానికి ఎక్కువ మేలు చేయలేదనే అనిపిస్తుంది. ఎంతసేపూ, నటీనటులను పొగడటం తప్ప, మిగతా శాఖలను గురించి రాసింది చాలా తక్కువ. తెలుగు సినిమాలకు మంచి కథలు ఎందుకు దొరకటంలేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తన చిత్రాలు ప్రపంచ సినిమాల సరసన నిలబడి ఉండటానికి ముఖ్యకారణం తను ఎంచుకున్న కథలేనని సత్యజిత్ రాయ్ చెప్పారు. పోనీ, కథ లేకపోతే, ట్రీట్మెంట్ అయినా బాగుంటుందా అంటే, మన సినిమాల్లో అదీ లేదు. భావ దారిద్ర్యం మన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కత్తి మహేష్ కుమార్ గారి ద్వారా నాకు పరిచయమైన ‘కలగూరగంప’ అనే బ్లాగులో (www.tadepally.com) తెలుగు సినిమా విభాగంలో ‘మెగా కాకపోవడానికీ, కావటానికీ మధ్య’ అనే శీర్షిక కింద వచ్చిన వ్యాసాలూ కొంచెం ఆలోచనాత్మకంగా ఉన్నాయి. చదవండి.

    • @మేడేపల్లి శేషు: ఈ మధ్య కాలంలో నేను కొందరు ఔత్సాహిక సినీజనాలతో మసలుతున్నాను. భావదారిద్ర్యం సంగతేమోగానీ utter confusion లో మాత్రం అందరూ ఉన్నారు. సినిమాల నుంచీ సినిమాలు రూపొందించే కసరత్తులే తప్ప, జీవితం నుంచీ, సాహిత్యం నుంచీ కథల్ని “పుట్టించే” చేవున్నవాళ్ళు నామ మాత్రంగా కూడా కనిపించట్లేదు. ఒకరూ అరా ఉన్నా, వారు సినిమా పరిశ్రమకు తామిక పనికరామనే ధృఢనిశ్చయానికొచ్చేసి నిరాశలో కనిపించారు.

  • ఇప్పుడే డెక్కన్ క్రానికల్ లో పైరసీకి సంబంధించిన్ వార్త చదివి వస్తున్నాను. ఆ వార్త ప్రకారం దావూద్ ఇబ్రహీం వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో పెద్దస్థాయిలో డబ్బులు సంపాదించిపెడుతున్న వ్యాపారం “పైరసీ”. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పైరసీ చేసే తను సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడట. మొత్తానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారమనైతే తేలింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ డబ్బుతను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడని ఒక సంస్థ రిపోర్టు. ఇక్కడ గిల్టీ విషయం ఏమిటంటే, పైరసీ సీడీ కొన్న ప్రతి ప్రేక్షకుడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్టన్నమాట….ఇప్పుడేం చెయ్యాల్రో దేవుడా!

    • ఆర్టికల్ చదవలేదు గానీ, టివి లో తేజ ఈ మాట ఓ సారి చెప్పగా విన్నాను; కానీ, నిజంగా ఇంత డబ్బు ఉంది అని తెలిసిపోయాక – అదే rs30-40 లకీ, సినిమా వాళ్ళు , డివిడి కంపెనీలే అమ్మేస్తే తప్పేంటి? ఇది వ్యాపార నిర్ణయం కదా!
      ’ఆపరేషన్స్ కాస్ట్ – అంత తక్కువ ధరకి అమ్మలేము” అంటూ చెప్పడమూ తప్పే! ఆ మధ్య ముంబై డబ్బవాలా’లని ఉదహరిస్తూ – ఇంత పెద్ద మార్కెట్ కి ఎఫిషింట్ డిస్ట్రీబ్యూషన్ సిస్టమ్స్ అలాగే ఉండాలంటూ – వాల్యూమ్ బిజినస్ లు గురించి మ్యానేజ్మెంట్ పుస్తకాలొచ్చాయి. వాటిల్లో సమాధానం దొరకకు పోవచ్చు.కానీ వ్యాపారవేత్తలు దీన్ని వాళ్ళ మార్కెట్ సైజ్ గా భావించాలి; క్రియేటివ్ డెసిషన్స్ తీసుకోవాలి.అంతే! పైరసీ సీడీలున్నా ధీయేటర్లో సినిమాలు జనాలు చూస్తూనే ఉన్నారే! అలా హిట్ అయ్యే కొన్ని మంచి సినిమాలూ ఉన్నాయే! నా కెందుకో పైరసీ మీద విరగ బడటం సమంజసంగా లేదు.ఈ దేశంలో ప్రతి రూపాయి తేడా కి ఓ ప్రాడెక్ట్/మార్కెట్ సెగ్మంట్స్ ఉండగలవు(కొంచెం అతిశయోక్తి అలంకారం! కాని నిజం అంతే!).

  • సందర్భం ఎలాగు వచ్చింది కాబట్టి, ఏ కాపీ వాసనలూ అంటకుండా, అసలు సిసలు కథలతో తీసిన తెలుగు సినిమాలు ఏవో ‘నవతరంగం’ సభ్యులు కొందరైనా నిగ్గు తేలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే, పాత చిత్రాల్లో కూడా ఏ ఆణిముత్యం లాంటి సినిమాను ముట్టుకున్నా ‘మసి’ అంటుతూనే ఉంది – అంటే అది ఏ ప్రెంచ్ నవల కాపీ అనో, ఇటాలియన్ కథ కాపీ అనో – ఇలా. ‘ఇది అసలు సిసలైన తెలుగు సినిమా’ అని చెప్పాలంటే పది సార్లు సందేహించాల్సి వస్తోంది. దాదాపు ఎనభై ఏళ్ల చరిత్రగల మన తెలుగు సినిమాను గురించి గొప్పగా చెప్పుకోలేమనే నిజం గుర్తు వచ్చినప్పుడల్లా, చాలా బాధగా ఉంటుంది. డబ్బు సంపాదన, త్వరగా పేరు తెచ్చుకోవాలనే తహ తహ, పిప్పంతా పిండేసిన తర్వాత కూడా, ఇంకా ‘ఇదో కొత్త కథ’ అని బుకాయించే దర్శకులు, నిర్మాతలు, వాటిల్లో నటించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్టుగా వాటిని పట్టుకుని వేలాడే అగ్ర నటులు, నటీమణులు వీళ్ళంతా కలిసి కొన్నేళ్లుగా తెలుగు సినిమాను భ్రష్టు పట్టించడంలో అగ్ర భాగాన నిలిచారు. కర్ణుడి శాపాలకంటే, ఎక్కువ శాపాలే ఉన్నాయి తెలుగు సినిమాకు ఈ విధంగా. కాబట్టి, కొంత శల్య పరీక్ష చేసి, అసలు సిసలు తెలుగు కథలేవో తెలుసుకుంటే మన చరిత్ర ఏంటో మనకు కాస్త తెలుస్తుంది. రేపు మన పిల్లలకు మనమూ పాలు ఏవో, నీళ్ళు ఏవో విడమర్చి చెప్పొచ్చు. కొన్ని కొన్ని వాస్తవాలూ బయటపడి, మన భ్రమలు తొలగటానికి అవకాశం ఉంటుంది. సూచనగా – ‘మల్లీశ్వరి’ మన అచ్చమైన తెలుగు కథే అని నేను అనుకుంటున్నాను. అలాగే కె. విశ్వనాథ్ గారి సినిమాలు కూడా. ఎందుకంటే అవి కాపీ కథలు అని ఇంతవరకూ ఎక్కడా ఆరోపణలు రాకపోవటం వల్ల (వస్తే, ఆయన్నీ eliminate చెయ్యొచ్చు). ప్రేక్షకుల్లో utter flap అయ్యి, మంచి సినిమాలు అని అనిపించుకున్న సినిమాలను కూడా పేర్కొనవచ్చు. ఉదాహరణకు – ‘స్వాతి కిరణం’ ‘మాతృ దేవోభవ’. ఇక తెలుగు నవలల ఆధారంగా తీసిన అన్ని సినిమాలనూ, స్వతంత్ర రచనలే అనవచ్చు – ఏవో ఒకటి, రెండు కేసుల్లో తప్ప (మన వాళ్ళ కథలు మన సినిమా వాళ్ళే తెలియకుండా కాపీ కొట్టేసిన వైనం ఇంకొకటి – మొన్న ‘బొమ్మరిల్లు’ వివాదం అందరికీ తెలిసిందే). సరే, ఇంతకీ, ‘ఇది అచ్చమైన తెలుగు సినిమా’ అని మనం రొమ్ము విరుచుకుని చెప్పగలిగే కథలను ఏరండి. ఎంతవరకూ ‘విజయం’ సాదిస్తామో చూద్దాం. ‘కాపీ కొడితే ఏమైందండీ. ఆ వాసనలు ఏమి కనిపించకుండా అచ్చమైన తెలుగు సినిమాలా తీశారు’ అని కొన్ని సినిమాలను గురించి చెప్పే వాళ్లకు, ఈ విషయంలో చెప్పేదేమీ లేదు. మన సత్తా ఏంటో మనం తెలుసుకునేందుకే ఈ పరీక్ష. ఆసక్తి ఉన్నవాళ్ళు పాల్గొంటే బాగుంటుంది.

    • మాతృ దేవోభవ…..:-)
      ఇది ఒక మలయాళం సినిమా రీమేక్ అండీ.
      ఆ మలయాళం సినిమానేమో ఒక ఫ్రెంచ్(అనుకుంటా) సినిమాకి మక్కీకి మక్కీ కాపీ

    • This is funny….but i can tell

      1.Avakaya Biryaani (flop).
      2.Mental Krishna(can you see this movie).
      3.Aanand.
      4.Happy Days.
      5.Godavari.
      6.Bommarillu.
      7.Parugu.
      8.Kotta Bangaaru Lokam.
      9.Aa Naluguru.
      10.143 I love you and I miss you.

      If you say No Please Tell me Why….I Do believe no one on this planet cant make movies with such concepts…they are simply native…

  • Yes. ఇలాంటి అన్వేషణే నాకు కావలసింది. నాకు, నాలాంటి ఇంకా ఎంతోమందికి కనువిప్పు చేయండి. please.

    • కానీ కాపీ కొట్టినా మాతృదేవోభవ నాకు చాలా నచ్చింది. నావరకూ అసలు కాపీ కొట్టకుండా అంతా ఒరిజినల్ గానే ఉండాలి అనేది అంత సాధ్యపడే విషయం కాదనే అనిపిస్తుంది. కాకపోతే ఈ కాపీకొట్టడం అనే విషయంలో కాస్త విలువలు పాటిస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు పైన చెప్పిన మాతృదేవోభవ కాపీ అయితే అయ్యుండోచ్చు కానీ అందరికీ ఆ ఒరిజినల్ సినిమా చూసే అవకాశం ఉండదు కాబట్టి ఆ కథను ఇలా తెలుగులోకి తేవడం మంచి ప్రయత్నమే కానీ అందుకు తగ్గ క్రెడిట్ ఆయా రచయితలు, దర్శకులకు ఇవ్వాలి. వీలయితే వారి అనుమతి సంపాదించాలి కూడా. ఎలాగూ ప్రపంచంలోని ఏ మారుమూలదేశాన్నీ ఒదలకుండా వెళ్ళి పాటల షూటింగ్ చేసుకొస్తున్న మనవాళ్ళకి ఈ అనుమతి సంపాదించడాలు అంత కష్టమూ కాదు, అంత ఖర్చూ కాదూ…అనురాగ్ కశ్యప్ అనుకుంటా ఒకసారి ఈ విషయం గురించి చెబుతూ…”ఒక ఐటం సాంగ్ కి పెట్టే ఖర్చులో సగం పెడితే ఆయా ఫారిన్ సినిమాలు దర్జాగా కాపీ కొట్టుకునే హక్కులు సంపాదించవచ్చ’ని అన్నారు.ఇది నిజం. ఎందుకంటే ఒక స్పానిష్ సినిమా కి రైట్స్ కోసం ఇంకా ఏమీ కాని నేనే ప్రయత్నించి ఆ నిర్మాతలతో మాట్లాడే వరకూ వెళ్ళగలిగాను. ఇక పెద్ద పెద్ద దర్శక నిర్మాతలకు అదెంత పని? కాకపోతే మనం కాపీకొట్టామని ఎవడికి తెలుస్తుందిలే అనే నమ్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇక ఆ సౌలభ్యం మన వాళ్లకి ఉండకపోవచ్చు. అయినా కూడా కాపీ కొట్టే వాళ్ళు కొట్టకుండా ఉండరు. అసలు కాపీ కొట్టినా కొట్టలేదని బుకాయించేవాళ్ళ దగ్గర అసలది కాపీ అని ఎలా అనగలం. కుచ్ కుచ్ హోతా హై అనే సినిమాని సంతోషంగా, ఆదేదో అమీర్ ఖాన్ సినిమా ని తమ్ముడు సినిమాగా కాపీ కొట్టిన దర్శకుల ఇంటర్వ్యూల్లో ఇవసలు కాపీ కొట్టిన ఐడియాస్ కావు ఇవి ఒరిజినల్ అని చాలా ఘట్టిగా చెప్పుకొచ్చారు. సమస్య ఇలాంటి వాళ్ళతోనే….సినిమా తీయడానికి వేరే సోర్సెస్ నుంచి ఇన్స్పైర్ కావడం తప్పేమీ కాదు. కానీ ఎవరికివ్వాల్సిన క్రెడిట్ వారికివ్వాలి.

  • వెంకట్ గారూ, మీరు కూడా శ్రమ అనుకోకుండా, అచ్చమైన తెలుగు సినిమాల లిస్టు ఒకటి తయారుచేయండి. సాధ్యం కాదని మాత్రం అనొద్దు. ‘అరువు తెచ్చుకున్నా అద్భుతం’ వంటి వాటి గురించి విడిగా మాట్లాడుకుందాం. ముందసలు ఎన్ని ఒరిజినల్ తెలుగు కథలు బైట పడతాయో చూద్దాం. ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. కొంచెం ఓపిక చేసుకుని మీకు గుర్తు వచ్చిన వాటి లిస్టు రాయండి. ఈ విషయంలో నాకంటే మీకు ఎక్కువ పరిజ్ఞానమే ఉంది. మిగతా మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో సహకరిస్తే, ఇది ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన అన్వేషణ అవుతుంది. కొత్త సంవత్సరంలో ‘నవతరంగం’ చేస్తున్న ఒక సర్వే అనుకుందాం ఇది. ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. కాపీ/ప్రేరణ పాటల లాగే ఇందులో కూడా ఎన్నో కొత్త విషయాలు బైట పడతాయి. చూద్దాం – మన తెలుగు వాడి ‘వాడి’ ఎంతో. అందుకే ‘నేను సైతం’ అనండి. please.

    • Idedo kasta original idea laa unde….

  • ఇంతకి “లా” ఎమి చెబుతుంది Copy, Inspiration గురించి…? Do any one of you know please tell us…
    ఎప్పుడు ఒక సినెమా మీద కాపి కొట్టారని చట్ట బద్దంగా చర్య తీసుకోబడుతుంది..?
    ఒకవేల ఒక అమెరికన్ వచ్చి ఇండియా లో కేసు పెడితే అది చెల్లుతుందా…?

    అసలు copy కి inspiration కి తేడా ఎంటి…?

    న్యాయ బద్దంగా కాక చట్ట బద్దంగా దీనికి ఎమైనా solution వుందా…??
    PLEASE REMEMBER I AM NOT TALKING ABOUT PIRACY….!!! Do you think BIG COPY CATS dont know answer to abouve questions..???

    • @shree

      recently warner brothers gave a statement based on remake rights of DEPARTED starrin dicaprio. As a fact departed movie was also a remake of a japanese movie with all the rights reserved by warner bros. And that movie was a hit as Homam in telugu and it was being remade sorry freemade in hindi too without prior permission of warner bros. So, this was noticed by that company and gave a notice to bollywood and world media anouncing that departed was not sold to anybody and all the rights reserved by them…

      • మీరన్నది జపనీస్ సినిమా కాదు. హాంగ్ కాంగ్ సినిమా. ఇన్ఫర్నల్ అఫైర్స్ ఆ సినిమా పేరు. ఈ సినిమా మొదటి భాగాన్నే మనవాళ్ళూ కాపీకొట్టారు. సెకండ్ పార్ట్ ఇంకా బావుంటుంది. దాన్ని ఎందుకు వదిలారో?
        చూద్దాం ఎవరో ఒకరు దాన్ని కూడా ఫ్రీమేక్ చేస్తారేమో.

  • abbo hero garu chala baga danchesaru piracy gurinchi…inthaku thamaru america lo enni cinema original CD’s/DVD’s koni patalu vinnaro,cinemalu chusaro chepithe baguntundi…avunu aa directors/producers dongalu aithe mee MEGA hero gariki buddi undakkarleda copy chesina scenes valla cinema lo pettukovadaniki..aayana gariki prapancham antha telusu kani aayana natistunna scene ee cinema lo teliyada..

  • పైరసీ గురించి కాస్త సమాచారం భారతదేశ చట్టాలు వగైరా…
    http://www.filmpiracy.com/artic.html

  • బాగుంది పాయింటు. దొంగలు “మేము కష్టపడి దొంగతనం చేసాం మా దగ్గర నుండి దొంగతనం చేయవద్దు” అంటున్నట్టుంది.
    అన్నట్టు పైరేట్ చేయడం అనాలి. పైరసీ చేయడం అనేది అంత మంచి వాడుక కాదు.

  • @ శ్రీ. కనీసం కొన్ని సినిమాలనైనా పేర్కొన్నందుకు కృతజ్ఞతలు. అయితే, మీరు పేర్కొన్న చిత్రాలేవీ నేను చూడలేదు. ‘ఆ నలుగురు’ మంచి కాన్సెప్టుతో నిర్మించిన సినిమా అని విన్నాను. ఇంకా చూడలేదు. త్వరలో చూడబోతున్నాను. అలాంటి మంచి కథలు గల చిత్రాలను మరి కొన్నిటిని కూడా పేర్కొంటారా? నేనూ ఒక లిస్టు తయారుచేయటానికి ప్రయత్నిస్తున్నాను. పాత చిత్రాల్లో కూడా మన అచ్చమైన తెలుగు కథలు గల చిత్రాలు పేర్కొనండి. ఉదాహరణకు…’గుండమ్మ కథ’ చాలా హిట్ చిత్రమైనా దాని మాతృక కన్నడం అనుకుంటాను. అలాగే, బెంగాలీ కథల ఆధారంగా నిర్మించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. బాటసారి, దేవదాసు, ఆరాధన….ఇలా. ఆ సినిమాలను year-wise గా ఒక లిస్టు తయారు చేసి, ఒక్కొక్కటీ టిక్ కొట్టుకుంటూ వెళ్తే, మన స్వంత కథలు గల చిత్రాలు ఏవో తేలిగ్గానే తెలుసుకోవచ్చు. అలా, year-wise గా తెలుగు చిత్రాల జాబితా అంతర్జాలంలో ఎక్కడైనా దొరికితే, దాన్ని ‘నవతరంగం’లో పొందుపరచండి. ఆ తర్వాత మన పని సులువవుతుంది. ఒక దురదృష్టం ఏమంటే, దర్శకులకు, నటీనటులకు, పాటల రచయితలకు వచ్చిన పేరులో సగమైనా, ఆయా చిత్రాల కథారచయితలకు రాకపోవటం. వాళ్ళంతా అజ్ఞాతంగానే ఉండిపోయారు ఎందుచేతనో. అంత మంచి కథలు అందించిన రచయితలను కనీసం ఈ సందర్భంగానైనా స్మరించుకుందాం.

  • కృష్ణ తీసిన ‘మోసగాళ్ళకి మోసగాడు’ అసలు ఎ సినిమాకీ కాపీకాదు. అతడు సినిమా మీద ఒట్టు.

    మిస్టర్ మాం మాత్రం చాలా తమాషా ఐన సినిమా.

    అసలు కథలు ఏడే. వాటినే లాగి, లాగి, చావ గొట్టి చితగ్గొట్టి… అలా మళ్ళీ మళ్ళీ చెప్తుంతారని మా అమ్మ నా చిన్నప్పుడు (ఎప్పుడో ఏభైల్లో) చెపితే నేను మా పిల్లలకి, చెప్పను. అంటే ఈ చిన్న కథలూ పైరసీనేనా?

    • It is not original. The original is a hollywood cowboy, ‘The Good, the bad and the Ugly’.

      • Actually its Mackennas Gold. If lakshmi garu sounded satirically I second!

  • stealing is piracy sharing is not so mitrulara donot steal but always share

  • sir, nenu me tho konthavaraku ekeebhavisthunnanu, kaani………….. the main this is if you copy also the audience to accept it. there are many movies which copies stories and scenes from others. but if it is a flop, we hardly remember and talk about it.

    thanks for giving me opportunity to express
    sagar

  • http://abhimatam.blogspot.com/2009/08/why-should-i-go-to-xvrxnnovativemultipl.html

    పైరసీ కి ఇది కూడా ఒక కారణం [పై లింక్ చదవండి ]

    • Akka, evadi gola vadidi ante erkena??

  • all krishnaVamsi movies are original……….

    • @వరప్రసాద్: మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యాలని కాదుగానీ కృష్ణవంశీ అంత:పురం సినిమా Not without my daughter అనే సినిమా స్ఫూర్తి/కాపీ తో రూపొందించబడింది.
      http://en.wikipedia.org/wiki/Not_Without_My_Daughter

      • Krishna Vamsi….

        Ninne pelladatha—–Hum Aapke Hain Kaun”nunchi inspiration.

    • Thanks for both Mahesh and Jonanthan….

      Krishna Vamsi…movies lo copies vunnai ani telisindhi….

  • ఔను నిజం..ఔను నిజం..మీరన్నది నిజం.నిజం

  • naku thelisi original telugu movies

    gamyam
    aanand
    godavari
    naa voopiri(hero vadde naveen)
    k.viswanatha(all movies)
    black and white(hero rajiv kanakaala)
    missamma(bhoomika)
    megha sandesam
    kotta bangaru lokam
    malleeswari(ntr)
    paathala bhairavi
    maaya bazar
    sri pothuloori veera bramhendra swami charithra
    lava kusa
    pournami
    mutyala muggu
    parugu
    daana veera soora karna
    aa naluguru
    mee sreyobhilaashi
    aha naa pellanta
    annamayya
    mayuri
    jyothi
    kanyasulkam
    thenali ramakrishna
    bhatti vikramaarka
    amara silpi jakkanna
    simhaasanam
    suvarna sundri
    Mahamantri Timmarusu
    Nartanasala
    bala mitrula katha
    sitara
    ladies tailor
    maharshi
    majnu
    shiva
    thikka sankaraiah
    athadu
    Pelli Pustakam
    bhairava dweepam
    ninne pelladutha
    anthahpuram
    mayuri
    murari
    chandamama
    ithe
    aanandam
    aame
    sindhooram
    143 (and I Miss You)
    Arya
    Grahanam
    Varsham
    naaku ivi guthunnayi.. veetilo copy kottina movies levu.
    unte thelapandi.

    • Megha Sandesham is a copy of Bharathiraja’s ‘Modal Mariyadai’

    • You can remove movies based on epics like ‘Narthanashaala’ as they are not original stories. You can also remove historicals and biographies like ‘Potluri…’. You can also delete movies like ‘Kanyashulkam’ from the list as they are already popular in the form of print media, not an original creation by itself.

      • You can remove movies based on epics like ‘Narthanashaala’ as they are not original stories. You can also remove historicals and biographies like ‘Potluri…’. You can also delete movies like ‘Kanyashulkam’ from the list as they are already popular in the form of print media, not an original creation by itself.

        ala anukunte sare………

    • @sanjeev

      good effort.

      behind the sun అనే brazil సినిమాకి మన so called తెలుగు
      nativity ని కలిపి బాగా రంగరిస్తే పుట్టింది పౌర్ణమి.

      అంతఃపురం గురించి పైన మహేశ్ గారు చెప్పారు.

      • Shooter and some other (dont exactly remember the name) movie mixed with telugu nativity(what is that???) is ATHADU

        • THANX

        • Take it easy mister R. Shooter was released in 2007 where as Athadu in 2005. But the scene where Mahesh jumps on to a train was copied from Tommy Lee Jones’s U.S.Marshals Movie.

          • many shots in “Athadu” are from “Assassins(1995)”

      • thanx vanamali gaaru
        nenu inka pournami mana ms raju gaardi anukuni maa office lo arabbu friends andariki choopinchaa
        :D

    • some more movies to the list

      1. prayanam
      2. anukokunda oka roju
      3. allari
      4. arya-2
      5. money money
      6. Kshana kshanam (RGVs)
      7. Avakai biryani
      8. Vanaja

      Correct me if I am wrong

      • క్షణ క్షణం ‘రొమాన్సింగ్ ది స్టోన్’ అనే సినిమాకి ఫ్రీ మేక్ అని రామ్ గోపాల్ వర్మ చాలా చోట్ల శెలవిచ్చారు. అదే కాదు ట. ఆయన సినిమాలన్నీ ఎవొక సినిమా నించి రిప్ ఆఫ్ లని గర్వంగా ఒప్పుకున్నారు. ఆయనవి కూడా తీసేయచ్చు లిస్టు లోంచి

    • I remember reading Krish interview…saying Gamyam was inspired by some Novel

      • @vara గారు

        గమ్యం సినిమా రిలీజ్ అయినపుడు zen and the art of motorcycle maintenance, the motorcycle diaries అనే రెండు నవల్స్ పేర్లు చర్చకు వచ్చాయి కానీ ఇవేవీ కథకు మూలం కాదని క్రిష్ చెప్పాడు, అది నిజం కూడా.
        zen and the art of motorcycle maintenance లోని కొన్ని వాక్యాలని గమ్యం సినిమాలో ఒకటి రెండు డైలాగులుగా(కొంచెం మార్చి) వాడుకున్నారు.

        మొత్తమ్మీద గమ్యం original సినిమానే.

  • inka gurthothe malli post chesthaanu

  • antham puram copy ani naaku theliyadu. thelipinanduku thanx.

  • ‘Modal Mariyadai’ choosanu. kaani rendoo okkati kaademo gamanincha galaru…

  • I am not sure, if I am capable of commenting on the issues that we are all talking now.

    What I feel is “Copy” is as Natural as we are….. Prapamchamlo, manam choose, vine, anubhavinche, prathidee deniko nakale, so, copy cheyyadam, thappa? oppaa? ani charchinchadam anavasaram. Ika “Credit” ivvadam – okkasaari manam alochiddam, nijamga, manam chese panulaku (Acts), vaati venakunna “asalu” kaaraanaalaku (reasons of acts) “Credit” isthunnamaa, leka mana panula phalithaala (results) aadhaaramga, “Credits” isthunnamaa ? And, if we come to our people in the industry, it is obvious to say, that, they have their own issues like “buying Copy right” or “why to buy, when, nobody knows about this”, etc. etc. I am not trying to support these people by saying this.

    So, let’s not beat the bush around, Cinema is a media for Entertainment… be it a copied, inspired, Created or Invented, or whatever it is…. Are we getting ourselves out of our present state of mind through this media or not, is the question/guaging point.

    “Chittooru chavadi veedhi lo vunde, rikshaw puller ki, Vijayawada benzi circle lo vunde, Automechanic ki, Hyderabad Habsiguda lo vunde, Vyaapaariki, Manthra cinemalo paata copy na, originala, akkarledu. Happy ga feel ayyanaa leda, annade, mukhyam.”

    To my understanding, Oka Cinema choodadam valla, nenu, vunna present state of mind nundi, bayatakochaanaa, leka, naa present thoughts lone vunnanaa? annade, oka cinema ku parameter. Aa “sthaanabramsham” annadi, santosham, aanandam laanti bhaavaala vypu vunte, adi, manchidi, manaku nacchinadi avuthundi, alaa kaaka, kopam, kasi, dwesham, laanti bhaavaalanu kaligisthe, leka, asalelaanti bhaavaani kaliginchakunte, its known as a bad movie.

    Just to tell you, sometime back, “Saakshi” TV lo oka programme vachindi, about this “Copy” and that said that most of the movies of K.Vishwanath are copied/inspired from some other movies, apart from other movies which we already spoke here. Movies like “Sholay”, “Pathala Bhairavi” are also copies. I am sorry for not giving you the details of it, I do not remember the details of it. “Pathala Bhairavi” ni edo “Arabian Nights” ane Janapada katha nundi theesukunnatlu, a cinema nirmathe, chepparata. Alage, “Sholay” cinema nu, eppudo vachina oka Telugu Cinema (peru sariga gurthuledu “Oka ooru” or something like this, Hero, ANR and NTR, andulo, Gabbarsingh vesham, SV Ranga Rago garu vesaaru, Chivarlo ANR chanipothadu) nundi copy chesthe, aa telugu cinema oka English cinemaku copy aithe, aa English cinemaku moolam, maroka French cinema aithe, ee French cinemaku inspiration oka Italian Naataakam ata.

    Thank you for this opportunity to put my thoughts, as well. I am probably sure, many of us also have thoughts alike mine, so, Can I say, its my original thought bec, it came to me, without any influence of others, what if the same thought came to someone else, much earlier coming to me, should I call it “Thinkiing Alike” …??

    Raghu

  • Godavari. appears to be inspired by andala ramudu (anr @ bapu combination)

    mudalmariyadai is different from meghasandesam.

    bollojubaba

  • దర్శకుడూ సంగీత దర్శకుడూ కాపీ కొట్టినా కొట్టకపోయినా , మన పెద్ద హీరోల అభిమానులూ ఎలాగూ సిగ్గుపడవలసిందే। అసలు మన పెద్ద హీరోలు నటులుకాదు। మీరన్నట్టు వారు అచ్చంగా హీరోలు। న్యాయం సరిగా లేని దేశంలోఁ। ఒకరు ఒకరిని సరిగా గౌరవించుకోలేని దేశంలోఁ। సంఘం రెండుగా చీలివున్న దేశంలోఁ। అభిమానం దక్కని వారు, ఈ పెద్దహీరోల సినిమాలు చూసి తామేవారని కాసేపు అభిమానించి(ఫీలైకి తెలుఁగు) అభిమానులైనవారు। అందుకు వారు ఎలాగూ సిగ్గుపడవలసిందే।

    నాకు తెలిసినంతోనుత్త అల్లరి నరేశ్ ఒక్కడే తను ‘హీరో’ని అనుకోకుండా సినిమాల్లో నటించగలిగినది। అందుకతనికి శతకోటి దండాలు।

  • పైరసీ ఉండాలనే వాదనకు అనుకూలంగా..

    సినిమా పైత్యకారులకంటే సినిమా పైరసీకారులు చెడ్డవాళ్ళేం కాదు. వీళ్ళే తక్కువ నీచులు. అసలు నన్నడిగితే సమాజానికి పైరసీకారుడు చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. ముష్టి సినిమాలు కూడా ఓ.. థెగ ఆడేసి, అలా పోగడిన డబ్బుల్తో ఈ సన్నాసులు మరిన్ని మురికి సినిమాలు తీసి మనల్ని బాధించకుండా, బాదకుండా పైరసీకారుడు మనల్ని రక్షిస్తున్నాడు. అంచేత మనం బాగుండాలంటే, తెలుగు సినిమా బాగుపడాలంటే పైరసీ ఉండాలి. అంచేత జై పైరసీ!

    సినిమా వాళ్ళ ’ఇన్స్పిరేషను’ గురించి చదూతూంటే ఆలోచనొచ్చింది.. నిజానికి పైరసీ సీడీ తెచ్చుకోని మనం చూస్తున్నది కూడా ఇన్స్పిరేషను తెచ్చుకుందామనే! పైరసీ సీడీలో సినిమా చూసేసి, బావుందనుకోండి అప్పుడు ఇన్స్పిరేషను తెచ్చేసుకోని, థియేటరుకెళ్ళి సినిమా చూస్తాం. బాలేదనుకోండి, హాయిగా చూడమన్నమాట!! :) సినిమా చూట్టానికి పైరసీడీయే స్ఫూర్తి! ఈ కారణంగా మంచి సినిమాలు తీసేవాళ్ళు పైరసీకారులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. “మంచి సినిమాలు తీసే వాళ్ళు” ప్రస్తుతం అంతరించిపోతున్న (పోయిన?) జాతుల జాబితాలో ఉన్నారు కాబట్టి మనకిక పైరసీడీలే గతి. అంచేత జై పైరసీ!

    పాపం సినిమావాళ్ళు అనేది ఏంటంటే.. మీరు పైరసీ సీడీలో సినిమా చూసేస్తే ఖచ్చితంగా థియేటరుకు రారు. అంచేత సీడీలో చూడొద్దు, థియేటరుకొచ్చి, ఓ ఐదారొందలకు బుక్కైపోండి అని చెబుతున్నారు. “వాళ్ళను కూడా అర్థం చేసుకోవాల్లెండి.. వాళ్ళ ముష్టి బతుక్కు కాపీయే ఎక్కువ. అంతకంటే పైకి ఎదగలేరు. ఏంచేస్తారు చెప్పండి.” అని అనబాకండి.. వందలు వేలూ పోసి చేతకాని సన్నాసులను పోషించడానికి మనమేమైనా మహారాజులమా? హాయిగా ఇరవయ్యో పాతికో పారేసి ఇన్స్పిరేషన్ను కొనుక్కుంటాం. అంచేత జై పైరసీ!

    సినిమా విడుదలైన మొదటి కాసిని రోజులూ ఇష్టమొచ్చినంత రేట్లు పెట్టుకున్నవాళ్ళకు మనల్ని పైరసీ సినిమా చూడొద్దని అడిగే హక్కెలాగూ లేదు. పైరసీ సీడీ తయారుచేసేవాడి సంగతి.. మీరు చెబుతున్నట్టు ఓపక్కన తాము పైరసీ చేస్తూనే మరొకణ్ణి ఇదేంటని వాణ్ణి అడిగే హక్కు మాత్రం వీళ్ళకెక్కడిది?

    అంచేత జై పైరసీ!
    —————

    ఆ నిరాహార దీక్ష చేసినతని పేరు యలమంచి రవిచంద్ అని పేపర్లలో వేసారు. మీరు యలమంచిలి రవిచంద్ర అంటున్నారు. ఏది సరైనది?

  • hmm I know this site quite sometime and met a couple of members here…
    dear friends ,
    this site is supposed to be a platform for people who has passion for films and most of the times I see only hatred here.
    I wanted to say this for a long time , but did not , assuming it may hurt someoneelse’s feeling.
    I check this site once a week or so , and most of times I dont see anyone responding or discussing to the informative posts about movies here. Just now there are articles about movies like ITS A WONDERFUL LIFE but zero comments there
    But here, all the people accusing , abusing our films ( i mean our telugu films ) and the actors , makers…whoever are involved with it.
    I am a person , who loved the whole process of filmmaking , and took some extreme steps in career and life to get in to them. And in the process when I look at world cinema I understand that, our films don’t even deserve to have a place in those great pieces of art.
    But yet, whatever it is a film made in telugu is asmuch like a dish prepared at home by homemakers. It may not taste like a chef’s preperation but it got its own style and nativity.
    There is no point in blaming and cursing the state of films in our language or state or country.
    Criticism should be constructive not of hatred and destructive .
    There are some comments I see often , challenging the ones who criticise to make films and prove. I dont agree with that.
    Filmmaking involves lot of talent, many people and some good amount of money. not every individual can afford all them.
    But , those who keep posting hatred comments, why cant they post some good suggestion about what can be done to the sorry state of affairs ?
    suppose…one can discuss about which other stories or books or plays or movies can be adapted here . Or one can discuss how a pathetically made movie could be shaped well.
    there is no point in discussing about indecency or vulgarity in movies. it is there in every country. When a country like U.S. makes Avatar kind of spectacular movies aswellas heartwarming dramas like A BEAUTIFUL MIND, there will be thousands of films in soft porn,slasher, gothic, sexploitive movies too. One cannot blame hollywood taking in consideration of movies like american pie. its just part of game.
    Similarly , we have to encourage the better among the worst and see what can be done to improve those fraction.
    I also see the informative site like passionforcinema and i see lot of constructive and serious talk about movies there. navatarangam used to be like that, but now i think it is becoming more like hatredforcinema.com.
    Sorry mahesh and venkat if my views are harsh..its not for you guys who maintain this site , i know your passion.

    • Viplove K గారు,

      అలాంటి వ్యాఖ్య ఎప్పట్నొంచో పెట్టాలనుకుంటున్నాను. మీరు వ్రాసిన మాటలను మళ్ళీ repeat చేస్తున్నాను:
      1. most of the times I see only hatred here.
      2. post some good suggestion about what can be done to the sorry state of affairs

      అంతే కాకుండా నేర్చుకునే దృక్పథం కరువవుతోంది. Flop సినిమాల్లోంచి కూడా నేర్చుకోవచ్చు: ఎందుకు flop అయ్యిందో ఇలాంటి forum చర్చించి ఎన్నో లొసుగులు గురించి తెలుసుకోవచ్చు. ఇలాంటి చర్చలు ద్వేషంతో కాకుండా నేర్చుకునే దృక్పథంతో జరగాలి.

      చాలా సమీక్షలు సినిమా కథలుగా వస్తున్నాయి. కథ క్లుప్తంగా చెప్పి, ఏ విషయాలు ఎందుకు నచ్చాయో చర్చిస్తే చాలా బాగుంటుంది.

      Technical knowledge పెంచే వ్యాసాలు కూడా పెరగాలి. వీలైనంత వరకు అనువాదాలు, ఇతర site వ్యాసాలు (ఇవి repeat చేయకుండా links ఇస్తే చాలు) కాకుండా original వ్యాసాలు వస్తే బాగుంటుంది. అనుభజ్ఞులచేత మంచి వ్యాసాలు వ్రాయిస్తే ఇంకా బాగుంటుంది (లేదా video interviewఐనా పర్వాలేదు). ఇవన్నీ చేయాలంటే కష్టమే. దానికి చాలా మంది సహాయం కావాలి. అన్నీ కాకపోయినా కొన్నింటితో మొదలు పెట్టొచ్చు.

  • ఇప్పటివరకూ జరిగిన చర్చలో వచ్చిన వివిధ విషయాల గురించి:

    1) మక్కికి మక్కీ కాపీ కొట్టడానికీ inspirationకి (ప్రేరణ అందామా?) తేడా ఉంది. ఉదాహరణకి, Beckett సినిమాని ఆధారం చేసుకొని తెలుగులో ప్రాణమిత్రులు, హిందీలో నమక్‌హరాం చిత్రాలు వచ్చాయి. ఇద్దరు ప్రాణమిత్రుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చి ప్రత్యర్థులుగా మారడం, ఒకరి అనుయాయులు రెండోవారిని చంపడం అన్న అంతస్సూత్రం మూడు చిత్రాల్లోనూ ఉంటుంది. ఈ చిత్రాలను కాపీలు అనటం అతిశయోక్తి అవుతుంది. Beckett కథ ఆత్మని పట్టుకొని దాన్ని సమకాలీన, ప్రాంతీయ కాయంలో నిలబెట్టి తీసినవి తెలుగు, హిందీ చిత్రాలు. ఈ ప్రక్రియలో చాలా సృజనాత్మకత మేళవించుకొని ఉంది. ఇలాంటి ప్రేరణతో తీసిన చిత్రాలు భారతీయ భాషలన్నింట్లోనూ కొల్లలు. Koshish వంటి గొప్పచిత్రానికి కూడా పరాయి మూలం ఉంది. వీటితో నాకు పెద్ద పేచీ లేదు. ఒకటి: వీటి మాతృకలు సగటు తెలుగు ప్రేక్షకుడికి అందుబాటులో లేనివి. రెండు: మూలమేదైనా, దాన్ని మన సంస్కృతికి అన్వయించిన తీరు పరాయితనం లేకుండా చేస్తుంది. మూడు. ఇలా inspireఐన అనేక చిత్రాల్లో కూడా అద్భుత సృజనాత్మకత ఉంటుంది. పేచీ ఎప్పుడంటే ఈ మూలాల్ని దాచేసి అంతా మా ప్రతిభ అన్నప్పుడు, స్వంత బుర్ర లేకుండా, ప్రాంతీయతతో సంబంధం లేకుండా మక్కికి మక్కీ కాపీ కొట్టేసినప్పుడు, లేదా కాపీ కొట్టటంకూడా చేతకానప్పుడు.

    ఇలాంటి ప్రేరణలు హాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపిస్తాయి. The Untouchablesలొ యూనియన్ స్టేషన్ మెట్ల మీద తీసిన క్లైమాక్స్‌కు (దీన్ని, తెలుగులో హిందీలో చాలా సార్లు మక్కికి మక్కీ కాపీ కొట్టారు) Eisenstein తీసిన Battelship Potemkinలో Odessa Steps సీక్వెన్స్ మూలం.

    2) మల్లీశ్వరి చిత్రానికికూడా అంతకు ముందే ప్రచురించబడ్డ బుచ్చిబాబుగారి రాయలవారి కరుణ కృత్యం అన్న నాటిక ఆధారం అని వివాదం ఉంది. మాయాబజార్‌కు మరాఠీ రంగస్థల నాటకం మూలం. పాతాళ భైరవికీ అల్లాఉద్దీన్ అద్భుతదీపం కథకీ ఎన్ని పోలికలు?

    3) బాపు, రమణల చాలా చిత్రాలకు ఇతర చిత్రాల్లోనూ, కథల్లోనూ మాతృకలు ఉన్నాయి (ఆ విషయాన్ని వాళ్ళెప్పుడూ దాచలేదు). ఉదాహరణకి మొదటి చిత్రం సాక్షికి High Noon మూలం. కాని సాక్షి సినిమాని అచ్చతెలుగు సినిమా కాదనటం కష్టం. పెళ్ళి పుస్తకం మూలం మిస్సమ్మలో ఉంది (మిస్సమ్మకు మూలం బెంగాలీ కథలు). ముత్యాలముగ్గు మూలం ఉత్తరరామాయణంలో ఉంది. ఐనా, ముత్యాలముగ్గులో ఒరిజినల్ సినిమా కాదని ఎట్లా అంటాం?

    4) Sholay చిత్రం ముఖ్యంగా Kurosowa చిత్రం The Seven Samurai, దాని ఇంగ్లీష్ Adptation – The Magnificient Seven మీద ఆధారపడ్డా, ఇంకా చాలా వెస్టర్న్ సినిమాల పోలికలు కనిపిస్తాయి.

    5) ఆ నలుగురు చిత్రం చూస్తుంటే – ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో -నాకు It’s A Wonderful Life గుర్తుకు వచ్చింది. ‘ఐతే’ సినిమాకి ఆధారం The Suicide Kings. వర్షం సినిమాకి Tejaabకీ పోలికలు కనిపించవూ? Amadeus చూస్తే స్వాతికిరణం గుర్తుకు రాదా? ఇలా చెప్పుకొంటూ పోతే పెద్ద గ్రంథమే తయారౌతుంది. ఐనా ఈ చిత్రాలన్నీ అచ్చతెలుగు చిత్రాలే అని ఈ చర్చలో పాల్గొంటున్న కొందరు అభిప్రాయపడుతున్నారంటే కారణమేమిటి? మూలంలోని ముఖ్య సంఘర్షణనో, సంఘటననో మాత్రమే తీసుకొని ప్రాంతీయ జీవనంతో కలిపివేయగలగడమే.

  • FICCI-KPMG report ఇప్పుడు onlineలో లభ్యం:
    http://www.in.kpmg.com/TL_Files/Pictures/FICCI-KPMG_Media_Entertainment_Industry_Report.pdf

    సినిమా పరిశ్రమ తీసుకోవలసిన చర్యల గురించి 201 పేజీలో పేర్కొన్నారు.

  • థాంక్స్ సోదరా !

  • V. Chowdary Jampala garu
    excellent sir.

  • చాలా బాగా చెప్పారు పైరసీ మంచిదని బాగుంది కానీ అది మీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది . ఒకప్పుడు మా వూర్లో 12 సినిమా theaters వుండేవి 10 సంవత్సరాల క్రితం అన్నమాట ఇప్పుడు కూడా అన్నే , ఎందుకు ? పైరసీ భూతం అలాంటిది ఈ పైరసీ అనేదే లేకపోతే ఆ 12 ఇప్పుడు 50 పైనే వుండేవి ఎంత మందికి జీవనాధారం దొరికి వుండేది , చానా చోట్ల సినిమా theatre లు ఎత్తేసి దాని placeలో shopping complex లు వెలుస్తున్నాయి ఇదే జరిగితే ఎంతో పేరున్న తెలుగు cinima industry పూర్తిగా దెబ్బతింటుంది . దీనికి బయపడి చిన్న నిర్మాతలు సినిమాలు తీయలేరు సినిమానే జీవనోపాధి ఐన ఎంతో మంది కార్మికులు అన్యాయం జరుతున్నట్టే ., ఇదంతా ఒకవైపు
    5 రోజులు క్రితం మగధీర super print వచ్చింది కదా అని shop lo కెళ్ళి అడిగితే కేవలం 30 రూపాయలు మాత్రమే అడిగాడు తీరా చుస్తే అది copy dvd ఏం చేస్తాం అదే తీసుకున్నాను . ఏ shop లో ఐనా ఇదే పరిస్థితి ,
    ఇలా తక్కువ రేటుకు తీసుకుంటున్న ప్రజల తప్పు కూడా లేదు , అలా ఇచ్చిన shop వాడిది కూడా తప్పు కాదు , police వ్యవస్ధ ది నిజమైన తప్పు వాళ్ళ duty సరిగ్గా చేస్తే, ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోకపోతే ఈ దారుణం ఏ మాత్రం జరిగేది కాదు .

    • పొలీస్ వ్యవస్థ ను విమర్సిన్చదమ్ మన్చిది కాదు మాకు ఎన్నొ పనులు ఉన్టాని మొన్న కొతి మూక మూవి చూసి ఒక విశయమ్ అర్ధమ్ అయ్యిన్ది కొన్ని పైరసీ మూవి లు ఫ్రీగా కూడా చూడాలని అను కొరు

  • అన్నయ్య… మీరు చెప్పేది భాగానే ఉంది కాని… అసలు విషయం అర్థం కావటం లేదు… ముందు పైరసీ పైరసీ అని మన తెలుగు హీరోలు అనకుండా వారి రేమ్యునరేశాన్లు తగ్గించికుంటే మన సినిమా నిర్మాణానికి అయ్యే కర్చు తగ్గుతుంది… అది చాలు నిర్మాతలు, సదురు సినిమా పనివాళ్ళు బాగా బ్రతకడానికి….

  • [...] పైరసీ ని పైరసీ చెయ్యొద్దు : నవతరంగం [...]

  • Plagiarism is different from piracy. I think the piracy problem arises from illegal circulation of movies on CDs and DVDs. Its difficult to stop this as it is also an industry on which a lot of people depend for their livelihood.
    But one should note that pirated CDs of new films are not of good quality and they serve only a few desparate fans. These fans anyway will go to a theater after a few days if the film is good. Original CDs and DVDs that are available after a few months of the film’s release are worth buying for their quality. They wont affect any theater collections since a movie wont run beyond 100 days in most theaters.
    So, piracy is not a big problem as many producers are complaining. Its lack of good movies. There are very few movies nowadays that can be watched with whole family.

  • కాపి/స్పూర్తిని నిర్మాతలు పోరాడుతున్న పైరసీతో ముడి పెట్టలేము. పైరసీ అనేది పూర్తిగా వ్యాపారానికి సంబందించింది.

  • [...] చెప్పాలి. పైరసీ విషయం పై నవతరంగంలో అతనిచ్చిన, కెపియమ్‌జీ రిపోర్టుని చదివి, ఎవరైనా [...]

  • పైరసీ, కాపీ, ప్లేజియారిజం… ఇలా ఎన్నింటిని కలిపి ఒకే గాటకి కట్టినా మనది కానిది మనం సొంతం చేసుకోవటం ధర్మమూ కాదు, న్యాయమూ కాదు, చట్టసమ్మతమూ కాదు! వాడెవడో మఱొకరిది ఏదో కోట్లు పెట్టి దొంగతనం చేసాడు కనుక మనం వాడి శ్రమని 20-30 రూపాయలకో ఉచితంగానో దోచెయ్యటం ఉచితమని ఎలా అనుకోగలం? ఎవఱో అశుద్ధం మీద కాలు వేసి రోజూ జాఱిపడుతున్నాడు కనుక అదే దాఱిలో మనం కూడా కొంత అశుద్ధం వేసినా మన తప్పుండబోదనటం… సమంజసంగా కనిపించదు నాకు!

    నేనూ చూసాను పైరేట్ చేసి ఆన్‌లైన్ ఉంచిన సినిమాలు ఎన్నో. నా దగ్గరా ఉన్నాయి కొనకుండానే దాచుకున్న పాటలు యెన్నో. కానీ అన్నిటినీ తప్పు చేస్తున్నాను అన్న స్పృహతో చేస్తాను, so that ఆ guilty consciousness నన్ను ఏదో ఒక రోజు సన్మార్గుడిని చేస్తుందని. (కొన్ని సందర్భాలలో మీరు తీసిన ఫలానా సినిమా నేను ఆన్‌లైన్‌లో చూసాను అని సదరు దర్శకనిర్మాతలకే చెప్పాను. “అమెరికాలోని మా కుగ్రామానికి 250 మైళ్ళ దూరంలో కానీ తెలుగు చిత్రాలు విడుదల కావు. విద్యార్థులమైన మాకు తలకు భారమైనా తలకో 100 డాలర్లు ఖర్చు పెటి తీరా బళ్ళు కట్టుకుని – అంటే కార్లు రెంట్ చేసుకుని – అక్కడికి వెళితే అక్కడేమో ‘డబ్బాలు రాలేదు, కావాలంటే రేపొచ్చి చూడండి ఫ్రీగా!’ అన్న సందర్భాలున్నాయి. అందఱమూ మోటెల్లో ఉన్నా, మళ్ళీ వెళ్ళి వెనక్కి రావాలన్నా తడిసి మోపెడవుతుంది. థియేటర్ వాళ్ళు డబ్బులు వెనక్కీ ఇవ్వరు. ఈ పరిస్థితుల్లో మేమేం చెయ్యాలో మీరే చెప్పండి!” అని వాళ్ళకే ప్రశ్న సంధించి… “నిజమే!” అన్న సమాధానం తప్పించి “ఎక్కడ పెట్టారు ఆన్‌లైన్? అప్పుడే వచ్చేసిందా?” లాంటి ప్రశ్నలు కూడా రాకపోయేసరికి దిగులుపడ్డాను కూడా!)

    పూర్తిగా ఒక బుఱ్ఱలో పుట్టి అక్కడే విస్తరణ జఱిగి బైటికి వచ్చే సినిమాల్లో వేఱే కథలూ సినిమాల ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? (ఈ సందర్భంగా ఎస్.వి.కృష్ణారెడ్డి గారు నిజాయితీగా చెప్పిన ఒక మాట తలచుకోవాలి: “నేను స్వతహాగా సంగీతం నేర్చుకునే కన్నా ముందే చాలా సినిమా పాటలు వినేవాడిని. బాణీలు కట్టేటప్పుడు ‘అరె, ఇది ఫలానా పాటకి దగ్గరగా ఉందే!’ అనిపించినప్పుడు ఆ బాణీని శ్రోతలకీ గుర్తు చెయ్యటం కోసం ఆ ముద్ర/పోలిక అలాగే ఉంచేస్తాను” అని. …అందుకే “ఉగాది” చిత్రంలో “ప్రేయసి నవ్వే ఆశీస్సు…” అన్న పాటలో “ఆలీ అనటం ఏమో కానీ అమృతహస్తం ప్రేమకు తెలుసు” అన్న మాట వస్తుంది, ఆ బాణీ కట్టిన లక్కీ ఆలీని అడగకుండానే గుర్తు చేస్తూ.)

    ప్రతి కథకీ ఏదో ఒక ప్రేరణనో ప్రభావమో ఉంటుంది, ఉండి తీఱుతుంది! “మురారి” చిత్రానికి ప్రేరణ ఏమిటో తెలుసా? కృష్ణవంశీ గారే ఈనాడు/సితార ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు: “ఇందిరాగాంధీ కుటుంబంలో వఱుస మరణాలు” అని. “అలా ఎందుకు ఒకే కుటుంబంలోని అందఱూ (ఫిరోజ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ) అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతున్నారు?” అన్న ప్రశ్న నుంచి పుట్టిన కథ అది! ఆయనలోని సృజనాత్మక దృక్కోణం వల్ల అలాంటి ఒకే కుటుంబంలోని అంతు చిక్కని మరణాలను ఏకసూత్రంగా చేసి కథ వ్రాసుకున్నారు. ఇలాంటివి వాళ్ళకి వాళ్ళు చెబితే కానీ మనకు తెలియవు. ఆ మరణవార్తల మీద ఎవఱికీ హక్కు లేదు కనుక సరే, కానీ ఇలా ఎన్నో చిత్రాలకి ప్రభావమైనా ఉంటుందని చెప్పటమే నా ఉద్దేశం. నా మటుకు నాకే అదేదో సినిమా చూస్తూ పిచ్చివాడైన సల్మాన్‌ఖాన్ గోడ పిచ్చాసుపత్రి నుంచి బైటికి వెళ్ళొస్తున్న సన్నివేశాలు చూసి మఱో మంచి ఆలోచన వచ్చింది. నేను దాన్ని కథగా విస్తరిస్తే అసలు ఈ సల్మాన్‌ఖాన్ సినిమా గుర్తు రాకపోవచ్చు కూడా. కానీ నేను వ్రాయబోయే కథలో కొన్ని సన్నివేశాలు ఆ చిత్రంలోని సన్నివేశాలని పోలి ఉండవచ్చు, ప్రభావం వదలదు కనుక. (“బొమ్మరిల్లు” చిత్రానికీ “నువ్వే.. నువ్వే…” చిత్రానికి నాకు చాలా పోలికలు కనిపించాయి. కానీ ఎవఱికీ అలా అనిపించలేదు. “వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా?” అన్న గీతవాక్యానికి అనుగుణమైన దృశ్యంతో మొదలవుతుంది “బొమ్మరిల్లు” చిత్రం. అక్కడి నుంచి మొదలై యెన్నో పోలికలు ఉన్నాయి అలా. కానీ అవి భాస్కర్‌కి కలిగాయని చెప్పలేను. “బొమ్మరిల్లు”ని ఇక్కడ కూడా ఎవఱో pure originals జాబితాలో పెట్టారు. నా వఱకూ అలా అనిపించదు మఱి, ఆ చిత్రం దానికదే చాలా నచ్చినా కూడా.)

    ఇట్లు,
    ఎందఱో మహానుభావులు… కొందఱే కాపీస్వాములు… అందఱినీ కలిపి ఒకే గాటకి కట్టేసి వాళ్ళ కన్నా బేవార్సుగా తప్పు చేస్తున్న మనం “ఫ్రీ”గా ఉండటం భావ్యం కాదని భావించే బాధ్యుడు, బాధితుడు.

  • home theaters are very common these days with price ranging from several hundred to several thousand dollars*:*

  • home theathers with 5.1 system sounds really great specially if you add those 12 inch subwoofers ‘;;

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories