Menu

Monthly Archive:: March 2010

డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

గత పదేళ్ళుగా “డిజిటల్ సినిమా వచ్చేసింది ! వచ్చేసింది!!” అని వినడమేగానీ నిజంగా ప్రధానస్రవంతి చిత్రాలను అది ఎంతగా ప్రభావితం చేసింది అనేది ప్రశ్నార్థకమే. ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీరికార్డింగ్, కలరింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం విరివిగా పెరిగినా అది కేవలం సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితమే తప్ప  మన సినిమా కంటెన్ట్ (కథాకథనం)లో తెచ్చిన మార్పు పెద్దగా కనిపించదు.ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్ల సంఖ్య పెరిగినా సినిమాల డిస్ట్రిబ్యూషన్లో

It’s a wonderful life

మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది. కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము. అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ? ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life”

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand

రన్నింగ్ కామెంట్రీ-Digital Projection

విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఎలాగోలా రిలీజ్ చేసిపెట్టాలని ఒక తెలిసినాయన వస్తే నాకు తెలిసినంతలో సహాయం చేస్తున్నాను. ఆ process లో నేనూ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో ముఖ్యంగా నాకు బాగా తెలిసొచ్చిన, బహుశా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే డిజిటిల్ ప్రొజెక్షన్. మన రాష్ట్రంలో డిజిటిల్ ప్రొజెక్షన్ సదుపాయం కలిగిఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని తెలుసుకానీ ఆ థియేటర్లు ఎక్కడున్నాయి? అసలా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే procedure ఏంటి? అసలు

Withnail and I

ఈ మధ్య  సినిమా హాలులో చూసిన మరో మంచి సినిమా Withnail and I. 1987లో వచ్చిన ఈ సినిమాకి Bruce Robinson దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు ఈయన పేరు ఎప్పుడూ వినలేదు. అయినా బ్రిటీష్ సినిమాలోని ఆణిముత్యాల సీరీస్ లో చివరిగా ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఎలా అయినా చూడాలని అఫీసునుంచి హడావుడిగా పరిగెత్తుకొచ్చి చూస్తే సినిమా హాలులో ఎప్పుడూ లేనంత పెద్ద క్యూ కట్టబడివుండడం చూసి ఆశ్చర్యపోయాను. తీరా చూస్తే ఆ క్యూ