Menu

Monthly Archive:: March 2010

సెవెన్‌ సమురాయ్ – ఒక సమాలోచనం – 2

మొదటి భాగం తరువాయి పాత్ర చిత్రణ నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన పల్లీయుల మనస్తత్వానికీ, ఇంకా తాము ఎదుర్కొని

సెవెన్‌ సమురాయ్ – ఒక సమాలోచనం – 1

సెవెన్‌ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి

సినిమాదోవకిన్: ఫిల్మ్ సినారియో గురించి

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం యొక్క స్వేచ్ఛానువాద ప్రయత్నమిది.  ఇంతకు మునుపు ఈ పుస్తకపు జర్మను అనువాదమునకు ఇచ్చిన ముందు మాటలో ఎడిటింగు గురించి చెప్పిన సమాచారాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిల్మ్ టెక్నిక్ విభాగం లో ఇచ్చిన పరిచయ వ్యాసంలో లో చెప్పిన మాటలను చూద్దాము. ***   ***   *** సాధారణంగా ప్రొడక్షన్ ఫర్ముల (లేదా నిర్మాతల) వద్దకు వచ్చే సినారియోలు ఒక

And the award goes to…

గత సంవత్సరం ఫిభ్రవరిలో కరీంనగర్ నందు జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ క్రింది గైడ్ లైన్స్ తయారు చేసాము.

విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్

ఈ నెల 19,20,21 వ తేదీలలో కరీంనగర్ లోని ఫిలిం సొసైటీ లో నిర్వహించిన మూడు రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. నవతరంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం వి రఘు గారు, ప్రముఖ నటులు కాకరాల, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ తో బాటు నేను కూడా పాల్గొన్నాను. మొదటి రెండు రోజులు దాదాపు పది గంటల పాటు చలనచిత్ర నిర్మాణం లోని వివిధ