నిన్నరాత్రి సెకండ్షో చూసొచ్చాను.
సినిమా పేరు ‘లవ్ సెక్స్ అన్డ్ ధోకా’.
సినిమా ప్రారంభమగానే కాసేపు నవ్వుకున్నాను.
తరువాత అబ్బురపడ్దాను…
ఫిల్మ్ మేకర్ ఆలోచనను అభినందించాను.
సినిమాను ఆనందించాను.
సినిమా అయిపోయిందేమో అనిపించినప్పుడు ‘పక్కవాళ్ళు ఏమనుకుంటారో’ అని చూడకుండా చప్పట్లు కొట్టాను.
కానీ నాతోపాటూ థియేటర్లో చాలా మంది చప్పట్లు కొట్టడంతో ఈ సినిమా పవరేమిటో అర్థమయ్యింది.
రాత్రి నిద్రపట్టింది.
ఇప్పుడే నిద్ర లేచి ఇదొక మాస్టర్ పీస్ అని డిసైడ్ అయ్యాను.
మాస్టర్ పీస్ అనగానే సత్యజిత్ రే లా ఉంటుందా లేక గురుదత్ లా ఉంటుందా? కనీసం ఆదిత్య చోప్రా లా ఉంటుందా? అని అడక్కడి. ఎందుకంటే మాస్టర్స్ ఎవరూ మరొకర్ని ఇమిటేట్ చెయ్యరు. దిబాకర్ బెనర్జీ అలాంటోడే. ఇప్పటి వరకూ తను తీసి చిత్రాలు “కల్ట్” చిత్రాలుగా నిలబడితే LSD ఖచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అనే విషయంలో నాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి ఇక్కడ సమీక్ష రాయడం లేదు. సినిమా చూడమని మాత్రమే చెబుతున్నాను. Just go watch it.
G says:
Is it?
sujata says:
Ok. kani, post title marchagalara ? May be – with some sensible one ?
K మహేశ్ కుమార్ says:
@సుజాత: మీరు సినిమా చూస్తే ఈ టైటిల్లో ఉన్న ఉద్దేశం అవగతమౌతుంది. How sensible it is అనేది అర్థమవుతుంది.
వనమాలి says:
LSD: Life, Satire aur Dibakar
ప్రేమ, ప్రేమకు పర్యాయపదంగా మారిన సెక్స్, మనిషి సహజ గుణంగా మారిన మోసం…వీటి చుట్టే తిరుగుతుంది దిబాకర్ బెనెర్జీ కొత్త సినిమా LOVE, SEX aur DHOKA (LSD) . దిబాకర్ బెనెర్జీ ని పరిచయం చేయడం కన్నా అతను తీసిన Khosla Ka Ghosla , Oye Lucky Lucky Oye సినిమాలను ఒక్కసారి గుర్తు చేస్తే సరిపోతుందని అనుకుంటాను. ఇతను ఇంతకుముందు తీసిన సినిమాలకి LSD కి అస్సలు సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న హింది సినిమాలకి ఈ సినిమాకి కూడా అస్సలు సంబంధం లేదు. ఒక్క ముక్కలో ఇలాంటి సినిమా మనం హిందిలో చూడలేదని చెప్పొచ్చు.
ముందుగా ఈ సినిమాకున్న ప్రత్యేకతల గురించి చెప్పాలి. ఇది డిజిటల్ సినిమా. మొత్తం డిజిటల్ కెమెరా తోనే తీశారు. ఇందులో మనకు తెలిసిన ఒక్క నటుడుకాని, ఒక్క నటి కానీ కనిపించరు కానీ అందరూ కొత్త నటులే అంటే నమ్మలేము. ఈ సినిమా ఒక ప్రయోగం ప్రెసెంటేషన్ పరంగాను, స్క్రీన్ ప్లే పరంగానూ. సినిమాలో కెమెరాది ముఖ్య పాత్ర ( ఐ మీన్ పాత్ర చేతిలో కెమెరా). అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా నడుస్తున్న చరిత్రకు సాక్షి..టెక్నాలజీ మనిషి జీవితం లోకి చొచ్చుకు వచ్చిన తర్వాత అతడు ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సార్లు జరిగిందేమిటో తెలుసుకునేలోపే జీవితాలు తలకిందులైపోతున్నాయి. ఈ సూక్ష్మమైన అంశాలని అత్యంత సహజంగా తెరకెక్కించాడు దిబాకర్.
ఇది ఒక కథ మీద తీసిన సినిమా కాదు. ఇందులో మూడు కథలు మూడూ సమాంతరంగా నడిచేవే అయినా విడివిడిగా చెప్పుకుంటూ వచ్చాడు దర్శకుడు. మూడూ కూడా ఒక దానితో ఒకటి ఎక్కడో ఒకచోట క్రాస్ అవుతాయి. ఒక కథలోని characters ప్రభావం వేరొక కథలోని వారిపై ఉంటుంది. కానీ ఎవరి జీవితాలు వారివే.
ఆదిత్య చోప్రా ని అమితంగా ఆరాధించే ఒక స్టూడెంట్ ఫిల్మ్ మేకర్, తన ప్రాజెక్టులో భాగంగా “మెహెన్ది లగాకే రఖ్నా” అనే సినిమాని తీసే క్రమం లో అతడు హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పర్యవసనాలు ఏమిటి అనేదే మొదటి కథ. ఈ కథ కొత్తది కాకపోయినా కథని నడిపించిన విధానం చాలా బాగుంది. ఫార్ములా సినిమాల మీద ఇదో మంచి సెటైర్. ఫిల్మ్ మేకర్ చేతిలోని కెమెరా మనకు కథ మొత్తం చూపుతుంది.
ఇక రెండో కథ. ఈ కథని ఎంతోమంది ఎన్నో సార్లు చూసి ఉంటారు. కథ మొత్తం కాక పోయినా ఈ కథలో ముఖ్యమైన “Store Scandal” లాంటి స్కాండల్స్ ని చూసి ఉంటారు. ఒక స్కాండల్ కి ముందు, తర్వాత జరిగిన విషయాలు మనకు తెలియవు. ఇందులో అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోయిందో లేక అబ్బాయి అమ్మాయి చేతిలో మోసపోయాడో (99.9% మొదటిదే జరుగుతుందనుకోండి..) తెలుసుకునే ప్రయత్నం చేయరు. కనీసం ఆలోచించరు కూడా.. అవి కేవలం పర్సనల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కొంతమంది స్వార్థపరుల చేతుల్లో ప్రేమలు స్కాండల్స్ గా ఎలా మారుతున్నాయో చూపుతుంది ఈ కథ. ఈ కథ మొత్తం ఒక 24 X 7 స్టోర్ లో నడుస్తుంది. కథ మొత్తం స్టోర్లో ఉన్న కెమెరాల ద్వారానే చూస్తాము.
చివరి కథ. ఒక టివి కెమెరామెన్, అతని బాస్, వీడియో సాంగ్స్ లో నటించాలనుకునే ఒక డాన్సర్, ఒక పాప్ స్టార్ల మధ్య నడుస్తుంది. కెమెరామెన్ సర్వైవల్ , డాన్సర్ సక్సెస్ , మీడియా పాపులరిటీ ల కోసం పడే తాపత్రయం, పాప్ స్టార్ మీద వీరు ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడానికి కారణమౌతాయి. ఇందులో ప్రేమని, సర్వైవల్ ఫైట్ ఎలా డామినేట్ చేస్తుందో చూడొచ్చు. కథని కెమెరామెన్ చేతిలోని కెమెరా, స్టింగ్ ఆపరేషన్ కి వాడే కెమెరాలు చూపుతాయి.
సినిమా మొత్తం డైలాగ్స్, యాక్టింగ్, డైరక్షన్ ఔట్ స్టాండింగ్. సినిమా ఎక్కడా ఒక సినిమా లాగా అనిపించదు. ఎవరి జీవితాలకో ఎక్కుపెట్టిన హిడ్డెన్ కెమెరాలను స్క్రీన్ మీద ప్రాజెక్టు చేస్తే ఏలా ఉంటుందో అలాగే ఉంటుంది. డిఫరెంట్ సినిమాలని ఎంజాయ్ చేసేవాళ్లకి ఈ సినిమా ఒక పండగే.
ఈ సినిమా ఒక surprising, shocking & path breaking సినిమా. మన చుట్టూ ఉన్న జీవితాల మీద చేసిన ఒక Sting Operation.
GO FOR IT … AT LEAST ONCE….
అబ్రకదబ్ర says:
మాస్టర్‌పీస్? Masters show originality. హాలీవుడ్‌లోనో మరెక్కడో ఇతరులు ఏళ్ల క్రితం ప్రయత్నించిన పద్ధతుల్ని (Look (2007), Cloverfield (2008)) తాజాగా బాలీవుడ్‌కి దిగుమతి చేస్తే అది మాస్టర్‌పీస్ అవుతుందా, తీసినాయనో మాస్టర్ అవుతాడా?
K మహేశ్ కుమార్ says:
@అబ్రకదబ్ర: హాలీవుడ్లో కనిపెట్టిన కెమెరాలతో మనోళ్ళు సినిమాలు తీశారుకాబట్టి మనోళ్ళు తీసినవి మాస్టర్ పీసులు కావు అన్నట్లుంది మీ వాదన. మొత్తానికి మీరు LSD చూడలేదు. ఇక మీ వ్యాఖ్యలో అంగీకరించడనికీ విభేధించడానికీ ఏముంటుందీ!
అబ్రకదబ్ర says:
I am talking about the idea .. of using surveillance cameras and camcorders to tell the story. That’s not new. You can’t call somebody a ‘master’ merely for reinventing an old idea.
Now, coming to LCD director .. not only the idea, but he also copied his ‘observations’ shamelessly from those of Adam Rifkin who directed ‘Look’. Check this out: http://www.msnbc.msn.com/id/22135489/#storyContinued. Compare it with LCD director’s interviews and you’ll know what I’m talking about.
SANJEEV says:
khachitanga choosthaanu…..thondara ga evening eppdosthunda ani wait anthe………
SANJEEV says:
nijangane hindi cinema pedda manishi ayndi…..
chaala manchi movie
గీతాచార్య says:
సినిమా చూస్తుంటే నాకైతే బాగనే అనిపించింది కానీ, ఒరిజినలు కాందే ఆ దేవుడే రక్షించాలి. అయినా ఒరిజినల్ అనేది ఇంగ్లీషు మాట. మనవాళ్ళకు వర్తించదు
Seenu says:
ఇందులో “లవ్వు” లేదు, “సెక్సు” లేదు, ఉన్నదంతా ” ధోకా ” మాత్రమే. చూడకురా బాబు అని ప్రెండ్సు సజేషనూ.
chakri says:
సినిమాని ఆస్వాదించండి…. అనుభవించండి..అనుభూతి చెందండి .
సినిమా కాపినా…. ఇడియా కాపి నా.. ఇదంతా పక్కన పెట్టండి.