విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్

workshop-1

ఈ నెల 19,20,21 వ తేదీలలో కరీంనగర్ లోని ఫిలిం సొసైటీ లో నిర్వహించిన మూడు రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. నవతరంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం వి రఘు గారు, ప్రముఖ నటులు కాకరాల, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ తో బాటు నేను కూడా పాల్గొన్నాను.

మొదటి రెండు రోజులు దాదాపు పది గంటల పాటు చలనచిత్ర నిర్మాణం లోని వివిధ అంశాల  గురించి సభ్యులకు వివరైంచడం జరిగింది. మొదటి రోజు సినిమా నిర్మాణం లోని వివిధ విషయాల గురించి చర్చిస్తూ, చలన చిత్ర చరిత్ర తో పాటు డిజిటల్ టెక్నాలజీతో చలనచిత్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో లాంటి అంశాల గురించి పరిచయం చేసాక, స్క్రిప్ట్-స్క్రీన్ ప్లే లాంటి అంశాల గురించి సభ్యులకు వివరించడం జరిగింది.

రెండో రోజు చలనచిత్ర నిర్మాణంలోని వివిధ అంశాల (development, pre-production, production, post-production, distribution) గురించి వివరించడం జరిగింది.

మూడవ రోజు ఎం.వి.రఘు గారు సినిమాటోగ్రఫీ గురించి, కాకరాల గారు నటన గురించీ, ప్రవీణ్ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం గురించీ వివరించారు.

హైదరాబాదులాంటి మహానగరంలోనే ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ నిర్వహణ, ఫిల్మ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ క్లబ్ లాంటివి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో కరీంనగర్ లాంటి చిన్న పట్టణంలో గత నాలుగు సంవత్సరాలుగా నేషనల్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్  ఫెస్టివల్ నిర్వహిస్తూ ఈ సంవత్సరం మెదటిసారిగా  ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ కూడా నిర్వహించడం స్ఫూర్తిదాయకమైన విషయం.

చలనచిత్ర పరిశ్రమలో ఇంకా ఏ మాత్రం అనుభవం లేకపోయినా నన్నీ వర్క్ షాప్ నిర్వహించమని ఆనంద్ గారు అడిగినప్పుడు వారి ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయినా అక్కడకు చేరే వరకూ కూడా మనసులో చాలా టెన్షన్ పడ్డా కూడా అక్కడకు వెళ్ళాక నాకు ఎంతో ఉత్సాహం కలిగింది. యువతీయువకులు ఎంతో ఆసక్తి గా పాల్గొన్న ఈ వర్క్ షాప్ లో నేను నాలుగు sessions లో పది గంటల పటు ఏకధాటిగా వివిధ విషయాల గురించి మాట్లడే అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఫిలిం సొసైటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

రాబోయే కాలంలో నవతరంగం అధ్వర్యంలో ఇలాంటివే మరిన్ని కార్యక్రమాలు తలపెట్టేలా ఈ వర్క్ షాప్ కొత్త ఉత్సాహాన్ని అందచేసింది. నవతరంగం ద్వారా కేవలం రాతలు మాత్రమే కాదు చేతలు కూడా ఉండాలని ఎప్పటినుంచో అనుకుంటున్నప్పటికీ క.ఫి.సో ద్వారా నాకు తెలిసిన విషయాలను మరి కొంత మందికి తెలియచేసే అవకాశం కల్పించి నవతరంగాన్ని మరొకడుగు ముందుకు వేయించిన ఆనంద గారికి, క.ఫి.సో వారికి మరో సారి ధన్యవాదాలు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

4 Comments to “విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్”

  • అభినందనలు వెంకట్ గారూ, కరీంనగర్ వంటి చిన్నపట్టణంలో ఇలాంటి విజ్ఞానవంతమైన కార్యక్రమం జరగటం చాలా స్పూర్తిదాయకంగా ఉంది. ఇలాంటి విషయాల గురించి (సినిమా నిర్మాణ విషయాల గురించి) విద్యార్థులకు ఒక short duration సమ్మర్ వర్క్ షాప్ వంటిది కూడా నిర్వహించే ఆలోచన చేస్తే మంచిదేమో.

    • @మేడేపల్లి శేషు: హైదరాబాద్ లో ఒక వర్క్ షాప్ చెయ్యాలనే ఆలోచన ఇప్పటికే ఉంది. త్వరలో దానికి సంబంధించిన ప్రకటన నవతరంగంలో వెలువడుతుంది.

  • hai venkat garu..nenu karimnagar film festvel ki vachanu..fast day screeng aina (think for a second)and (dreadful fate) chala bagunni e short film ki award vasthundi anukunnam raledu..k..award vachinavi chalavaraku maku evvariki nachledu aina ela awrd icharo ardam kaledu idi chala manidi bahirangaga anukunna maata..oka N R I(karimnagar) short film ki award ichru assalu emundi andulo ..aina e chinna film festvels lone labing jarigithe nadi awrdullo entha labing jarguthundo ardamavthundi…

  • Thanks anna for providing me such a useful info. Recently FTII announced 2010 results. I got selected for cinematography course. Now, i hav orientation programme & interview on 15th november. Can u plz give me ur valuable and precious guidence in this.

    i was the only candidate selected from hyderabad, ap. this was possible by ur previous guidence.

    plz send any info to srinivas.paramkusham@gmail.com

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories