డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

DigitalCinemaRioSilverTitle2mock

గత పదేళ్ళుగా “డిజిటల్ సినిమా వచ్చేసింది ! వచ్చేసింది!!” అని వినడమేగానీ నిజంగా ప్రధానస్రవంతి చిత్రాలను అది ఎంతగా ప్రభావితం చేసింది అనేది ప్రశ్నార్థకమే.

ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీరికార్డింగ్, కలరింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం విరివిగా పెరిగినా అది కేవలం సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితమే తప్ప  మన సినిమా కంటెన్ట్ (కథాకథనం)లో తెచ్చిన మార్పు పెద్దగా కనిపించదు.ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్ల సంఖ్య పెరిగినా సినిమాల డిస్ట్రిబ్యూషన్లో విప్లవాత్మక మార్పులు మాత్రం తెలుగు పరిశ్రమకు సంబంధించి మాత్రం కొంచెమే అని చెప్పుకోవాలి.

ఖర్చు తగ్గించుకోవడానికి డిజిటల్లో షూటింగ్ జరుపుకొవచ్చు అని వినడమేగానీ చూడగలిగిందల్లా ఇప్పటివరకూ (రెడ్ వన్ కెమరాతో షూటింగ్ జరుపుకున్న) “ఈనాడు” అనే ఒకే ఒక మామూలు చిత్రం. నిజానికి డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడం వలన కలిసొచ్చే ఖర్చు ఫిల్మ్ స్టాకు, ఎడిటింగ్, పోస్టుప్రొడక్షన్ పనుల్లో మరింత సౌలభ్యం. కానీ….అంతా చేసి ఈ డిజిటల్ సినిమాని “ఫిల్మ్” మీద ప్రింట్ వెయ్యకపోతే బయ్యర్లు కొనరు, డిస్ట్రిబ్యూటర్లు పట్టించుకోరు. ఎగ్జిబిటర్లు ఇదేం సినిమా అనేస్తారు. దీనికంతా ముఖ్యకారణం mind set అనుకున్నా. అది త్వరలో మారుతుందేమో అని ఆశించినా అంతకన్నా పెద్దప్రమాదం పరిశ్రమ మూలాల్లోనే ఉంది. అదే సినిమాకు మనమిచ్చే నిర్వచనం, తీసేవిధానం, కథాకథనం వెరసి సినిమా తీసే విధానం.

హోంవీడియో ప్రారంభమైన తరువాత పెళ్ళిళ్ళు జరిగే తీరులో మార్పొచ్చింది. పంతులుకాక వీడియోగ్రాఫర్ పెళ్ళిని డైరెక్ట్ చేసే తంతు మొదలయ్యింది. మొబైల్ ఫోనొచ్చిన తరువాత ఒక కొత్త ఇంగ్లీష్ పుట్టుకొచ్చింది. ఎస్.ఎమ్.ఎస్ ఇంగ్లీష్. అలాగే  టెక్నాలజీ మారినా సినిమా తీసేవిధానం (గ్రామర్) మారకపోతే ఫిల్మ్ కూ డిజిటల్ మీడియంకూ మధ్యనున్న తేడా కేవలం ఒక మాధ్యమంలో తేడాగా మిగిపోతుందేతప్ప “సినిమా”లో ఎటువంటి మార్పూరాదు. ఆ మార్పు కంటెంట్ ద్వారా రావాలి. ఆ కంటెంట్ సినిమా గ్రామర్ ను మార్చే విధంగా రావాలి. అలాంటి మార్పుకు శ్రీకారం చుడుతున్నాడు “లవ్ సెక్స్ ఔర్ ధోకా” చిత్రంతో దిబాకర్ బెనర్జీ.

సినిమా ఇన్స్పిరేషన్ గురించి దిబాకర్ బెనర్జీ

లవ్ సెక్స్ ఔర్ ధోకా ట్రెయిలర్

The digital eye surrounds us, on TV, on the net, on the CCTV camera that snoops into every step we take, the spy cam sex scandal we enjoy on prime time TV, the home movies we make, the guilty kiss we share with someone, holding out the mobile camera at an arm’s length and the MMSs that fly around the nation. The digitized, fuzzy faces, the strobing, jerky movements, the furtive glances, the nervous camera, the clumsy, choppy edit, the scratchy sound, the repetitive slo mo rewind and forward – to me all this is a new grammar of cinema. A language that is evolving as we speak, a toolset that is all our generation’s own – no one had this before. We ignore it, look down upon it, go and see films about uplifting themes featuring good looking people in well shot backlight fighting incredible odds to sing the climax song in GLORIOUS backlight. And yet millions of downloads tell another story about what people want to see. But that’s not cinema, right? It’s just amateur videos of real people doing kooky things right? Geeks and pervs with unzipped flies are into that right?

Look up film history. In the 1890s, cinema as we know started with film clips a few seconds long about trains coming into station, people crossing roads, a juggler juggling and yes, a woman taking a bath. People would a pay a nickel and peep into a SMALL screen and watch the birth of a new way of life.

We could be at another similar threshold, a century and small change later. Better use the digital eye to etch it’s own brand of anti cinema rather than try and follow a bogus filmic look through film lenses, and other tricks of technology to become just a me-too version of the original. I’m not interested in delivering the last word in the digital or film war – I would shoot on paper if there were a technology to do so. The only thing I’m interested in is the medium bringing its own, inseparable aesthetic to the content – and see where it takes us.

Hence, Love Sex aur Dhokha. A film that isn’t one.

తెలుగులో ఇలాంటి మార్పు ఎప్పుడు ఎలా సాధ్యమో ఎదురుచూడాల్సిందే.

 

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

8 Comments to “డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !”

  • ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ .. hmmm .. పేరే దరిద్రంగా ఉంది. అయ్యగారి క్రియేటివిటీ పేరులోనే తెలిసిపోయింది. ఇక ఈ సినిమా గురించి ఎదురుచూడటమూ వేస్టే.

    ఇంతకీ ఆ దర్శకుడు కొత్తగా చెప్పిందేముందీ? ఆయన ఏ రకంగా డిజిటల్ టెక్నాలజీని వాడుకోబోతున్నాడో కూడా చెప్పలేదుగా. ఈ మధ్య హిందీ సినిమాల్లో ఇలాంటి హంగామాకేం తక్కువుండటం లేదు.

    • @అబ్రకదబ్ర: ఇదివరకూ ఒకసారి కూడా మీరు హిందీ సినిమాల గురించి ఇలాంటిదే ఒక వ్యాఖ్య చేశారు. చాలా prejudiced గా అనిపించింది.

      ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’సినిమా నేను ఇంతవరకూ చూడలేదు. కాబట్టి సినిమా గురించి చెప్పలేను. కానీ దర్శకుడు దిబాకర్ బెనర్జీ తీసిన ఖోస్లా కా ఘోస్లా, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ చూశాను. విషయం,శైలి వంటి వాటిల్లో ఈ దర్శకుడు చూపిన ఒరిజినాలిటీ ఉత్తమస్థాయి క్రియేటివిటీ అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరు కేవలం ఈ సినిమా టైటిల్ చూసి దర్శకుడి గురించి తేల్చెయ్యడం ఆశ్చర్యంగా ఉంది.

      ఇప్పటికే ఈ సినిమా సమీక్షలు కొన్ని సైట్లలో వచ్చేశాయి. వాటిని చూసి దిబాకర్ బెనర్జీ డిజిటల్లో (content and form) చేసిన ప్రయోగం ఎలాంటిదో కొంత అర్థం చేసుకోవచ్చు. నేను సినిమా చూసిన తరువాత ఎలా ఉందో ఒక సమీక్ష రాస్తాను.

      http://passionforcinema.com/love-sex-aur-dhokha-movie-review-hide-and-shriek/

      http://reviews.moviehattan.com/2010/03/love-sex-aur-dhokha-movie-review.html

      • ఖోస్లా కా గోస్లా చూడలేదు కానీ ఒయె లక్కీ ఓయె చూశాను. చప్పరించేసే సినిమా. వీరబోర్. సగంలో టీవీ కట్టేశాను. చెత్త నెత్తిన రుద్ది అదే కొత్తదనమనుకోమంటే సరా?

        ఇక, హిందీ సినిమాలంటే prejudice నాకెందుకుండాలి? అది నా అబ్సర్వేషన్.

  • మహేశ్ గారు,
    క్రొత్త అంశాన్ని లేవనెత్తారు. మీరు వ్రాసిన మాటలు “టెక్నాలజీ మారినా సినిమా తీసేవిధానం (గ్రామర్) మారకపోతే ఫిల్మ్ కూ డిజిటల్ మీడియంకూ మధ్యనున్న తేడా కేవలం ఒక మాధ్యమంలో తేడాగా మిగిపోతుందేతప్ప “సినిమా”లో ఎటువంటి మార్పూరాదు.” స్పష్టంగా లేవు. సినిమాలో మనకు కావలసిన మార్పు కోసం Technologyలో మార్పు రావాలని నా అభిప్రాయం. Technologyలో వస్తున్న మార్పులను మనకు కావలసిన సినిమాకు వాడుకోవటాన్ని స్వాగతించాల్సిందే కాని Technologyలో మార్పు వల్ల సినిమాలో బలవంతంగా మార్పు (అదీ మనం కోరుకునే మార్పు అవునో కాదో కూడా తెలియని స్థితిలో) రావాలని కోరుకోవటం తొందరపాటేమో.

    2007 లో Adam Rifkin “Look” (http://www.imdb.com/title/tt0810951/) అను ఒక చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రం కూడా ఇలాంటి technologyతో తీసిందే. మొత్తం security cameraల point of viewలో తీసింది. “లవ్ సెక్స్ ఔర్ ధోకా” లో మూడు కథలు వుంటే, “Look”లో ఐదు కథలు వున్నాయి (Spoilers: 1. A high school English teacher tries his best to be a decent husband; 2. a department store floor manager uses the warehouse for more than just storage; 3. a Mini-Mart clerk has big dreams (2, 3 లాంటి కథలు “లవ్ సెక్స్ ఔర్ ధోకా” లో కూడా వున్నట్టుంది); 4. a lawyer struggles with a sexual dilemma; and 5. two sociopaths thrive on ruining the lives of random strangers. ). Three act structureలో కాకుండా ఇలా episodic పద్దతిలో చాలా చిత్రాలు వస్తున్నాయి (The Hurtlocker కూడా అలాంటిదే కదా). “లవ్ సెక్స్ ఔర్ ధోకా” నాకేమి కొత్తగా అనిపించటం లేదు ఐతే ఇలాంటి సినిమా చేయటానికి చాలా guts కావాలి. ఏమైనా ఈ చిత్రం ఒక కొత్త perspectiveని మనకు చూపిస్తుందని ఆశిద్దాం.

    • @విజయవర్థన్: కొత్త సాంకేతికపరిజ్ఞానంతో కొత్త విజువల్ కల్చర్ వస్తుంది. రావాలి. అది రాకపోతే ఎట్లా? కేవలం ఖర్చుతగ్గించుకోవడానికి మాత్రమే డిజిటల్ మీడియమా లేక కొన్ని సబ్జెక్టులు డిజిటల్ మీడియంలోనే సాధ్యమౌతాయి/అనుకున్నట్లు తియ్యబడతాయి (subjects will lend itself to digital technology)అనుకున్నప్పుడు డిజిటల్లోకి మారడమా అనేవి కొన్ని సంవత్సరాలలో ఎన్నో ప్రయోగాల తరువాత తేలాల్సిన విషయం. దానికి ప్రారంభంగానే ఈ ప్రశ్నను సంధించాను.

      Is cinema going digital just a medium change or form and content change too?

      • కొత్త విజువల్ కల్చర్ రావొద్దని నా అభిప్రాయం కాదు. డిజిటల్ మీడియమ్ ఖర్చుతగ్గించి తద్వారా మార్పుకు (either directly or indirectly) తోడ్పడుతుందని నా అభిప్రాయం. ఐతే Technology మారింది కదాని బలవంతంగా సినిమాలో మార్పు కోరుకోవటం తొందరపాటు అని నా అభిప్రాయం. గుర్రపు నాడా దొరికింది కదాని గుర్రపు బండి కోరుకునే పద్దతి కాకుండా మనకు కావలసింది గుర్రపు బండి కాబట్టి గుర్రపు నాడా దొరికినందుకు సంతోషపడాలని లేదా గుర్రపు నాడా తయారు చేసుకోవాలని నేను అనుకుంటాను. కొన్ని సబ్జెక్టులు డిజిటల్ మీడియంలోనే సాధ్యమౌతాయి అనుకుంటే ఆ సబ్జెక్టులకు Digital medium దోహదపడితే అంతకన్నా కావలసింది ఏముంది. ఏమైనా మీ ప్రశ్న పలువురిని ఆలోచింపచేస్తుంది.

  • మహేష్,

    ‘Content’ అని మీరు దేన్నంటున్నారు నాకు స్పష్టంగా అర్థంకాలేదు. కథనం, గ్రామర్ అయితే అవి ‘Form’కి సంబంధించినవే కాదు? యింతకుముందు సినిమా తీయడానికి అవసరమైన పెట్టుబడి లేని కొత్త ప్రయోక్తలు Cost effectiveness వల్ల ఈ medium ఉపయోగించుకోగలిగి తద్వార మెయిన్ స్ట్రీమ్ సినిమా subject materలోనే మార్పులు రావడం – చాలా కాలం తరువాత – జరగచ్చు. రాజకీయ (సామాజిక ?) ప్రయోజనాలకోసం తీసే సినిమాలు – ఉదా. మైఖల్ మోర్, డాక్యుమెంటరీలలో డిజిటల్ formలో తెచ్చిన చాలా మార్పులు యిప్పటికే commercial సినిమాల్లోను చూస్తున్నాం. మీరన్నట్టు యివి తెలుగులో తక్కువే అయుండచ్చు. ఈనాడుని కూడా పూర్తి తెలుగు సినిమాగా ఎలా పరిగణిచగలం.

  • hello sir how are you.
    i think digital technology can establish new film creators.

  • hello sir how are you.
    i think digital technology can establish new film creators.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories