Menu

Monthly Archive:: February 2010

నేనే హీరో-మీరు కూడా కావొచ్చు.

సినిమా హీరో అవ్వాలనుకుంటున్నారా? ఛాన్స్ దొరకటం లేదా? ఎవడో ఛాన్స్ ఇవ్వటం ఎందుకండీ… లీడర్ సినిమా క్లైమాక్స్ కంటే ఇంకా భారీ లెవల్లో మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీస్తే ఏమైనా అభ్యంతరమా? ఖర్చంటారా? ఓ పెద్దగా ఏమీ కాదండీ…ఒక పది నిమిషాల పాటు ఇంటర్నెట్ మీద కూర్చుంటే ఎంతవుతుందో అంతే! నమ్మరా? అయితే ఈ కింద వీడియో చూడండి. మీరు కూడా ఇలాంటి వీడియోలో భాగం కావాలనుకుంటే http://en.tackfilm.se/ దర్శించండి.

నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?

కదిలే బొమ్మలు క్రమంగా చలన చిత్రంగా రూపుదిద్దుకున్న కొద్దికాలానికే సినిమా గురించిన వార్తలు, వాణిజ్య ప్రకటనలు, క్రమంగా ప్రివ్యూలు, సమీక్షలూ మొదలయ్యాయి. కొంచెంఅటూ ఇటూగా ప్రపంచ దేశాలన్నిటిలో ఇదే క్రమం కనిపిస్తుంది. సినిమాలకు సమీక్షలు అవసరమా అంటే నూటికి తొంభై భారతీయ సినిమాలకు అవసరం లేదు. ఆమాటకొస్తే హాలీవుడ్ లో కూడా పెద్దగా అవసరం లేక పోయినా అక్కడ సినిమా సమీక్ష అనేది పెద్ద పరిశ్రమగా, వందలాది మందికి, జీవనోపాధిగా మారటంతో దాని అస్థిత్వానికి తిరుగులేకుండా పోయింది.

“యాంగ్రీ మిడిల్ క్లాస్” సినిమాలు

70 వదశకాన్ని మన భారతీయ సినీ చరిత్రలో ‘యాంగ్రీయంగ్ మెన్’ దశకంగా సినీచరిత్రకారులు అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాల అనంతరంకూడా కొనసాగుతున్న, సామాజిక అసమానతలు. వ్యవస్థీకృత అణచివేత. ధనికులుచేసే చట్టాల ఉల్లంఘన. పేదలకు జరిగే అన్యాయాలు మొదలైన సామాజిక రుగ్మతల నేపధ్యంలో, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకుని న్యాయంచేసే ఒక సూపర్ హీరో భారతీయ సినిమా(ముఖ్యంగా బాలీవుడ్)లో ఉదయించాడు. హిందీనటుడు అమితాబ్ బచ్చన్ ఈ సూపర్ హీరో పాత్రకి రూపమిచ్చాడు. ఇదే మూసలో వివిధభారతీయ భాషల్లో

“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం

వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే టింగ్యా

డాక్యుమెంటరీ సినిమా-2

రష్యా విప్లవంలో ప్రజల సినిమా రష్యా దీర్ఘకాలిక విప్లవంలోకి నానా రకాల ప్రజలు కలిసి వచ్చారు. లెనిన్ నాయకత్వంలో అలాంటి కృషి విజయవంతంగా నెరవేరింది. ప్రజలలోని ఎన్నో రకాల కళారూపాలు , వాటిని సృష్టించిన కళాకారులూ విప్లవంలోకి కలిసి వచ్చారు. నాటకం, చిత్రకళ, సాహిత్యం, సంగీతం మొదలైన ఎన్నో కళలు కొత్త రూపమెత్తాయి. అందుకు ఒక పరిణామ క్రమం వుంది. విప్లవం కొత్త శక్తులకు పురుడు పోసింది. కొత్త చైతన్యాన్ని, సామాజిక అవసరాలనూ ముందుంచింది. ఒక కళారూపం