![]()
షార్ట్ ఫిల్మ్ మేకర్ గా జొనాథన్ నవతరంగం పాఠకులకు పరిచయమే. జొనాథన్ రూపొందించిన మూడు లఘు చిత్రాలు గతంలో నవతరంగంలో ప్రదర్శించాము. ఈ మధ్యనే ఈ యువదర్శకుడు రూపొందించిన మరో లఘు చిత్రం – Beautiful Hell. ఈ లఘుచిత్రం చూసి మీ అభిప్రాయాలు సూచనలు జొనాథన్ కి తెలియచేస్తారాని ఆశిస్తున్నాము.
గమనికః ప్రస్తుతం మన రాష్ట్రంలో లఘుచిత్రాల నిర్మాణం అక్కడా ఇక్కడా జరుగుతూనే ఉన్నా జొనాథన్ అంత ఉత్సాహంగా పని చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఔత్సాహిక దర్శకుడికి మీ అందరి ప్రోత్సాహం కావాలి. జొనాథన్ లఘ చిత్రాలు చూసి మీకు నచ్చినట్టయితే మీరు ఆయనకు నవతరంగం ద్వారా సాయపడవచ్చు. నవతరంగం ద్వారా మీరు జొనాథన్ కు మీకు తోచినంత డోనేట్ చేయవచ్చు. మీరిచ్చిన విరాళాలు ఈయన రూపొందించబోయే డిజిటల్ సినిమా కోసం ఉపయోగించబడతాయి.
డొనేట్
జొనాథన్ రూపొందించిన మిగిలిన లఘు చిత్రాల వివరాలుః
http://navatarangam.com/2009/06/k-short-film/
http://navatarangam.com/2008/11/2-short-films/
The Beautiful Hell – Short film by Jonathan Ed from Jonathan on Vimeo.
సాయి బ్రహ్మానందం says:
జోనథన్ గారూ,
మీ లఘు సినిమా బావుంది. మీరెన్నుకున్న కథని బాగా తీసారు.
దివ్య బాగా నటించింది. చైతన్య గొంతు బావుంది కానీ, అక్కడక్కడ ఎమోషన్లు సరిగా ఇవ్వలేదని పించింది. సరళంగా చెప్పాలంటే ( కొన్ని చోట్ల మాత్రమే ) స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంత గొప్పగా అనిపించలేదు. కెమెరా పనితనం బాగా నచ్చింది. మ్యూజిక్ మొదట్లో బాగుందనిపించినా, పోను పోనూ మరీ మోనోటనస్ గా వుందనిపించింది. చివరవరకూ చక్కగా నడిపించారు.
కథంతా బాగానే అల్లారు. కాకపోతే అక్కడక్కడ నా కంటికి కనిపించిన తేడాలు కొన్నున్నాయి. మొదటిది – మొత్తం కథని చైతన్య గొంతునుండే వినిపిస్తున్నారు. మొత్తం అతని యాంగిల్లోనే చూపించారు. కానీ దివ్య అతన్ని వదిలి ఆటోలో వెళుతూ ఏడ్చే సీను అక్కడ నప్పలేదు. ఆమె వెళిపోయింది. ముఖ్యంగా అతని కనుసన్నల్లోంచి. ఆమెని మరలా చూపించడంతో మీరు చెప్పే కథా కోణం ఒక్క సారి అటుతిరిగి మరలా వెనక్కొచ్చింది. ఇదేమంత తప్పు కాదు కానీ, నాలాంటి సినిమా పిచ్చోళ్ళకి తలకెక్కవు.
ఇహ రెండోది – మాటల్లో అతను ఆనందంగా ఉండాలని కోరుకుంటుందామె. అతను ప్రామిస్ చెయ్యకపోయినా ఆ మాటల్ని గౌరవించినట్లుగా చూపిస్తే అతని ప్రేమలో కాస్తయినా నిజాయితీ కనిపించేది. కానీ మోడ్రన్ దేవదాసులా ఉన్నాడనిపించింది.
మీ ప్రయత్నం చాలా బాగుంది. రెండుసార్లు చూసానిప్పటికి.
అందుకే కాస్త ఓపిక చేసుకొని అభినందించాలని రాస్తున్నాను.
మీకు మంచి భవిష్యత్తుంది. పెద్ద సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా నెగ్గుతారు.
ఆమె వెళిపోతే అతనికయిన గాయం గురించి చెబుతూ తీసిన సీన్లు బావున్నాయి.
గాయాలు మానుతాయి. కానీ గుర్తులు మిగులుతాయి.
మనుషులు దూరమవుతారు. జ్ఞాపకాలు మాత్రం నీడలా వెంబడిస్తూనే ఉంటాయి.
- సాయి బ్రహ్మానందం
Jonathan says:
Thank you sai garu.
K మహేశ్ కుమార్ says:
టేకింగ్ చాలా బాగుంది. కానీ రైటింగ్ అంతే స్థాయిలో అమెచ్యూరిష్గా ఉంది.
సినిమా అంటే నీతులు బోధించాలని చెప్పనుగానీ, ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పాలనే ప్రయత్నం మాత్రం చెయ్యాలి. ముఖ్యంగా లఘుచిత్రాలు గుర్తుండిపోయేది వాటి వైవిధ్యానికి, క్రిస్ప్ గా అనుకున్నది చెప్పగలిగే తీరుకు. ఆ రెండూ ఈ చిత్రంలో లోపించాయి. ప్రయత్నం అభినందనీయం.
I have a script for you. Call me.
Jonathan says:
Mahesh Garu,
Merokkare intha frank ga opinion cheppagalaru..wonderful.
If you clearly observe film, i’ve given clear ending, and thats what i wanted.
may i know where is the written went wrong?
thanks for your commetns, and i’ll call you today…
Jonathan says:
may i know where is the *written went wrong?”writting”
K మహేశ్ కుమార్ says:
@జానథన్: సినిమా మొత్తం వాయిస్ ఓవర్ తో నడిపించడం పెద్ద మైనస్. పాత్ర అంతర్మధనాన్ని విజువల్గానైనా లేక ఘటనాక్రమంలో చూపించలేకనే ఫిల్మ్ మేకర్ ఈ విధానాన్ని ఆశ్రయిస్తాడు.There are very few exceptions to that. ఆరంభంలో వాయిస్ ఓవర్ ఓకే అనిపించినా పోనుపోనూ తెరపై దృశ్యంకన్నా గొంతు ఏంచెబుతోందో అని ప్రేక్షకుడు ఎదురుచూశాడూ అంటే దర్శకుడు దెబ్బతిన్నట్లే. ఈ చిత్రంలో అదే జరిగింది. ముఖ్యంగా ఆఖర్న మీరు చెప్పలనుకున్నది చూపించలేక “చేప్పించారు” చూశారా, అది సినిమా స్థాయిని తగ్గించింది.
పాత్రపరంగా హీరో ఒక willful looser అనిపిస్తాడుగానీ నిబద్ధత,ఆదర్శం కోసం జీవితంలో అన్నీ కోల్పోవడానికి సిద్దమైనవాడుగా అనిపించడు. నిజానికి ప్రేక్షకుడు సిరిపాత్రతో empathize చెయ్యడం వలన, చేతగాక self pity లో పడే fallen hero అయిపోయాడు.అలాంటి పాత్ర భారీ వాయిస్ ఓవర్ మధ్య చివర్లో బైకుమీద వెళ్ళిపోతుంటే “వీడికిది కావలసిందే” అనిపించిందంటే రైటింగ్ లో లోపమే అనుకుంటాను.
ఈ సినిమాలో హీరో నటన ఆద్యంతం (బహుశా మహేష్ బాబుని అనుకరిస్తూ) disinterested గా కనిపించాడు. “నీఖర్మ” అన్నట్లు తన లుక్కుందేతప్ప నిర్మాతతో మాట్లాడుతున్నప్పుడుగానీ ప్రియురాలితో చర్చిస్తున్నప్పుడుగానీ కావల్సిన అసహనం,ఆర్ధ్రత రెండూ పలికించలేకపోయాడు. హీరోయిన్ నటన బాగుంది.
కెమెరా,లైటింగ్, ఎడిటింగ్,నేపధ్యసంగీతం (ఒకస్థాయి దాటాక రిపిటీషన్ అనిపించినా)బాగున్నాయి. దర్శకత్వం చాలాచాలా బాగుంది. కానీ,రైటింగ్…రైటింగ్…రైటింగ్…పాత్రలరూపకల్పన,కథాసారం,సంభాషణల రచన నిరాశపర్చాయి. కొన్ని ఇంగ్లీషు పదాల ప్రయోగం కృతకంగా ఉంది.
సాయి బ్రహ్మానందం says:
జోనథన్ గారూ,
మీ ఈ-మెయిల్ ఇవ్వగలరా?
Jonathan says:
Hi,
j.vesapogu@gmail.com
thanks
Jonathan says:
“పాత్ర అంతర్మధనాన్ని విజువల్గానైనా లేక ఘటనాక్రమంలో చూపించలేకనే ఫిల్మ్ మేకర్ ఈ విధానాన్ని ఆశ్రయిస్తాడు”
There are two kinds of voice over we can use 1. VO ni narrative toolga use cheyyatam , 2nd merannattu visual preset cheyaleka cheppatam..
nenu ekkada visualga chupinchaleka cheppaledu.
ex: forest scene- akkada abhi feelings chupinchane kani, nenu intha badapaduthunnanu ani VO lo cheppaledu.
2 “నిబద్ధత,ఆదర్శం కోసం జీవితంలో అన్నీ కోల్పోవడానికి సిద్దమైనవాడుగా అనిపించడు”
oka pakka, producer nenu cheppinattu katha maristhey cinema chance isthanu antadu, oka pakka cinema theesthey thanu preminchina ammayini pellichesukodani avuthundi…
mari illanti situation lo kuda “nenu e chetta ante a chetta cheyyadam navalla kadu annadante” athanu entha strong minded, conviction unnavado ardam chesukondi…
watch it again…
and merannattu…eppativaraku short films anni edo neethi cheppadanike thesthunnaru…avunu andukey….nenu short film lo oka 2hrs lenth story ni chupinchonchu ani chesina prayataname e film….meeru inka 1930′s laga cinema ante edo oka clear conclusion undali antunnaru….meeru malli chudandi…i’ve given clear ending but mana telugu cinemalo laga kakunda…
thanks,
K మహేశ్ కుమార్ says:
@జానథన్: క్లియర్ కంక్లూజన్ లేకపోయినా క్లియర్ కన్ఫ్యూజనైనా ఉండాలి అనేదే నా పాయింట్. ఫిల్మ్ మేకర్గా మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పారని మీకనిపించకపోతే ఫైనల్ కట్ చేసుండరు. I am sure you might have gone through lot of thinking before you said “this is it”. కానీ, ఒక informed ప్రేక్షకుడిగా నేను చూస్తున్నప్పుడు మీరు అనుకున్నవన్నీ నాకు అందాయా…అంటే “అన్నీ అందలేదు” అనే చెప్పాలి.
ఈ సినిమాలో వాయిస్ ఓవర్ గురించి మళ్ళీ…ఒక ఉదాహరణ చెబుతాను.
సిరి-అభి పార్కులో బెంచీ మీద కూర్చున్నప్పుడు వాళ్ళమధ్య ఇప్పుడు ఏర్పడిన మానసిక దూరాన్ని మీరు విజువల్గా చాలా బాగా చూపించారు. అయితే మళ్ళీ అదే భావాన్ని పదాల్లో వాయిస్ చేత చెప్పించారు. అలా చెప్పించడం ద్వారా అర్థంకాని ప్రేక్షకులకు మీరు తెలియజెప్పారు అన్న భావన వస్తుందేతప్ప నిజంగా అవసరమైకాదు. ఇలాంటి వాయిస్ ఓవర్ ప్రయోగాలు దర్శకుడి ప్రతిభను క్లౌడ్ చెయ్యడమే కాకుండా దర్శకుడు ప్రేక్షకుల మీద గౌరవం లేదు అనిపింపజేస్తాయి.
మీ స్క్రిప్టు లోని బలాన్ని హీరో నటన హరించిందని మీ explanation తరువాత అనిపిస్తోంది.
వనమాలి says:
ఒక తెలుగు Short film, అంతా కొత్తవాళ్ళతొ ఈ Standard లొ తీయడం చాలా great. మీలో మంచి Director (rather than a writer) ఉన్నాడు. Expecting a regular cinema.
i dint convinced with the climax and dialouge but still i like the film very much.
సిరి చాలా బాగా చేసింది. అభి పర్లేదు. Background Score లొ vocal అంత effective గా లేదు.
Short film కి పెద్ద అసెట్ photography…outstanding.
A VERY GOOD TRY. ALL THE BEST
రమణ says:
మీరుగానీ – పాటలు రాసే వనమాలి గారు కాదు గదా!
వనమాలి says:
కాదండీ…am a struggling story writer
Viplove K says:
Struggling story writer?? if you have and /are interested in providing unconventional , experimental stories for a “SHOE STRING BUDGET ” telugu film , please mail me at kiddybank@gmail.com
if , you feel that your stories are in anyway suiting socalled “stars” or “money spinner” or to be worked with established comedians/character artists only for huge budgets..please excuse .
Jonathan says:
vanamali,
can u post your contact number,will meet once.
Jonathan says:
i need a story writter for my next feature film project.
peepudeepu says:
Editing could have been smoother ,its amateurish.
when you are using a vo, you can make a cut just when the voice begins(you dint, so its distracting) and the dissolve transitions were toomuch…..
the background score was slow, the pace of the editing was not so slow, the frame keeps on changing…. what feeling did you want to convey?
(the lift shot,the park scene …)
photography is cool
good cinematography complemented with good editing makes a lot of difference
and f#@ the story, its nice absurd ending
pradeep says:
first of all cinematography is cool..
but the editing seems amateurish. The pace of editing at some places doesn’t fit the pace of the slow background score. During voice over when you change the camera angle, you dint seem to care about when to make a cut(cutting at the utterance of some word). And the dissolve transitions are kind of irritating,boring…
editing could have been much much better.
As for the ending, its nice to have an absurd ending
I have a question for you ..
why did u make this film ? what exactly did you want to show??
Jonathan says:
Hi Pradeep,
i agree with editing part, we can’t afford professional editore so we edited , it turned to be amaturish.
why did u make this film ?
ans : Just passion
what exactly did you want to show??
ans: what did u get out of this film is what i wanted to show.
sen says:
Dude- Excellent stuff. I liked it. Camera work is very good, divya is excellent, music is good.
few suggestions- once you shown the conflict point(divya and hero separated)- you should have increased the pace of narration- I didn’t had patience to watch what happenes next and felt bit disappointed by seeing few unnecessary editing cuts.. i didn’t understand why you took hero to fields and then into a room- I felt it was not coherent. you should have work on hero character bit more- we couldn’t sympathise with hero character.
But, But, excellent effort, you have a good eye through camera…i liked all the camera work in park.
I wish you have the same passion to do what you like most. all the best.
pradeep says:
hey jonathan, can you post here the technical details ? please..
the camera you used ,how you recorded your sound?(studio sound ??) etc..
Jonathan says:
We used
Panasonic DVX100
final cut pro, adobe premeir
recorded the sound in room (its not a studio)
Krishna says:
Hello Jonathan…Excellent work!!!
Can I have your contact number.
Krishna says:
How many days it took to complete the shoot, editing work and total budget to this film…wht kind of lighting sourse you used…plz let me details
Thanks
vamsi
Jonathan says:
Hi krishna,
I’ve not used any lights, 3days shoot, total budget is 15k
9849206290 is my contact number.
Harsha says:
bane vundi kaani chivarlo vidipovadam kate chacchipovadame better annttu vundi…
Viplove K says:
Hi jonathan
Nicely done short.
reminding “ploy” and “invisible waves” kind of taking, which is too good.
Well, read other comments too ,and for them : doing a movie out of passion and believing in what one believes is itself an achievement and you accomplished it quite fine.
I dont find anything odd with V.O narrative. The story is well told too…
And coming to any “suggestions” (note: not comments )
1.I think the opening lines have a syntax mistake (its nt part of direction or scripting too,as yours is a telugu script…but in a professional film even subtitles must in grammar i suppose)
2.Editing grammar : the jump cuts ,if they are intentional, they are not looking so , they are rather looking unintentional and hence may give impressions of amateurity.
3. The lighting set up , in the producer’s office , seems a bit odd in this dramatic story (it rather looked like a thriller/horror setup ).if you have a particular reason to have overexposed backlight and low key on face,I did not get it.
4.the visual representation of separation : widening gap when they sat or leaves blown away, looked forced , because they were not established prior. I meant, if you have shown them sitting close in preceding scene or a comment about leaves in earlier dialogue..may be they would have made a connection.
And there are a couple minute things, anyway, inspite of all , it is rather tough to narrate an “emotion” without plot and you did is successfully with your cinematic capabilities and my rating in 4 out of 5 for that ( the missing 1 is due to the above points i mentioned )
Congrats and Keep it up, hoping to see more from you
Jonathan says:
thanks viplove, will discuss more about film when we meet. Good day
nareshnaidu says:
hai sir chalabhaga thisaru nenu mechukunedhi mi pani thananni anthekadhu miruu thisina shot filmni kuda amdhukante thiyalanukovatam veru,thiyatam veru aenokastalupadi thisinatharuvatha 30min,chusi bagundho ledho chepatam veruu kani miprayathnam sapalam kavalani aa dhevuni korukuntnnanu…………………
NARESHNBAIDU
8099341212 my cell no
miru aepudaina call cheyachu
nareshnaidu says:
NARESHNAIDU
8099341212
nareshnaidu_chinny@yahoo.co.in
http://www.chinninaidi.co.cc
అరిపిరాల says:
There are only two things i liked the most.. Divya and camera. Over all good effort.
Though repetition from comments above I would still say – could have been crispier.
Keshavcharan says:
@ Jonathan
సినిమాలో బాగున్న అంశం ఎమిటంటే సినిమా యొక్క మూడ్. ప్రేక్షకులకి ఆ బాధ ఎలాంటిదో చూపించడంలో సఫలమయ్యారు. మా లాంటి చిన్న short films తీసేవాళ్ళకి inspiration. సినిమాలో అసలు zoom ని camera movements ని ఎక్కడా వాడకుండానే చాలా మంచి effect తెప్పించారు. ఈ సినిమాని ఒక పెద్ద కథలో ఒక భాగంగా అనుకోవడం మంచిది, ఎందుకంటే charecters details full fledged గా లేవు, అలాగే climax కూడా conclusionలా లేదు.
Ramesh Babu CVD says:
జో గారు! మీ అభిప్రాయాలతో ఏకీభవిన్చలేక పోయినా మీ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా మాత్రం ఉండలేకపోతున్నాను సుమీ! ప్రేమ ఓ(వి)డిపోవటం అంత సాదా సీదాగా మాత్రం ఉండదు, sorry, ఒప్పుకోలేను. కాని మీ budget మరి ఇతర లభ్యతలను బట్టి చూస్తే మాత్రం outstanding. చెప్పేంత నాకు లేకపోయినా చిన్న మాటః కధనం మరింత గాఢంగా ఉంటే భలే ఉండేది
Jonathan says:
“ప్రేమ ఓ(వి)డిపోవటం అంత సాదా సీదాగా మాత్రం ఉండదు”…..endukundadu? inkentha bhariga untundi? explain me….
andari jeevithallo okela jaragavu andi….
Hari Charana Prasad says:
Jonathan,
(true in filmi world)
Good work. I enjoyed. Camera work is impressive. I wish a success. I know how difficult each and every decision in making a film and you did great within your limitations. I always believe that creativity and perfection are proportionate to resources available
Good luck.
Hari Charana Prasad
Jonathan says:
థాన్క్స్ హరిచరన్ గారు…
Raz says:
Hi jonathan,
Mate i really appreciate your work beautiful hell was beutifully carved. Mate you got the best locations.As everyone said that the male lead lacks potential in looks, i agree with that but he did vvery well in two frames where he sits in chair and and thinks of the day and the bike riding looks.In these two scenes he really expresses the silent hell. I think if u have concentrated more on the male u would have succeded. Another thing the pace in the last 3 minutes should have started from the 13 minute. Sorry but is he facing beutiful hell or hell.
Anyway jonathan with limited resources that was really fantastic work.Regards to ur entire team.
Can i have links of ur other projects as well:
Raz
Jonathan says:
హయ్,
ఇవి నెను డైరెక్ట్ చెసినా సినిమాలు
http://cinemagang.ning.com/video/theaccident-1
http://navatarangam.com/2009/02/jasmine-short-film/
http://navatarangam.com/2009/06/k-short-film/
అభిమాని says:
చాలా బాగుంది. (చిన్న చిన్న లోపాల్ని వదిలేస్తే. సిరి ఆటోలో వెళ్ళే సీన్, ఎడిటింగ్ లోని చిన్న జెర్క్స్ etc)
దివ్య చాలా బాగా చేసింది. కృష్ణ చైతన్య గొంతు(బేస్ వాయిస్)బాగుంది.
పార్క్ లో తీసిన సీన్ ఆద్యంతమూ అన్ని విధాలుగా బాగుంది (కెమెరా, సంభాషణలు, నటన అన్నీ). ఈ లఘుచిత్రానికి ఈ సన్నివేశం ప్రాణంలాంటిది అనుకోవచ్చు. సంభాషణలు సహజంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘తిన్నావా’తో సంభాషణ మొదలవటం ఒక్కసారిగా హృదయాన్ని ఝల్లుమనిపిస్తుంది. అవును. పైకి అతి సాధారణంగా కనిపించే ఈ చిన్న ప్రశ్నలో ఎంత ఆర్ద్రత నిండి ఉందో అర్థం చేసుకోవాల్సిందే తప్ప వివరించటం కష్టం. దానికి జవాబుగా వచ్చిన ‘ఆకలిగా లేదు’ అనే మాట కూడా అంతే సహజంగా ఉంది.
విడిపోయే ముందు ఎంత మానసిక ఘర్షణ పొందారు, ఎలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయానికి వచ్చారు అన్నది బలంగా ఎస్టాబ్లిష్ అవలేదు. బహుశా అందుకు ఈ కాన్వాస్ చాలకపోయి ఉండొచ్చు. లేదా మీరు కావాలని దానిని చూపాల్సిన అవసరం లేదనుకున్నారేమో మరి తెలీదు.
దృశ్యపరంగానో, నటీనటుల హావభావపరంగానో ఒక విషయాన్ని చూపలేకపోయినప్పుడే voice over ని ఆశ్రయిస్తారనే దాన్ని నేను ఒప్పుకోలేను. ఇటీవలే విడుదలైన “మై నేమ్ ఈజ్ ఖాన్” సినిమా మొత్తం VO తోనే నడుస్తుంది. అంతమాత్రాన కరణ్ జోహార్ లాంటి మాస్టర్ స్టొరీటెల్లర్ విజువల్ గా చూపలేకనో, షారుఖ్ ఖాన్ నటించలేకపోవటం వల్లనో అలా చేసాడనుకోలేము కదా.
Congratulations. Its a great effort.
K మహేశ్ కుమార్ says:
@అభిమాని: Voice over per se తప్పని ఎవరూ చెప్పడం లేదు. కానీ 95% తప్పుడు కారణాలవల్ల ఉపయోగించడం వలన its a NO..NO in a big way. ఈ ఫిల్మ్ లో కూడా VO is used for wrong reason in lot of places.
Jonathan says:
ఆభిమాని గారు,
యూ గాట్ దా సొల్ అఫ్ డైలొగ్స్ , థాన్క్స్ ఫర్ దాట్..
rahul says:
really liked the movie.
I actually liked the pace of the movie. you took your time to establish the helplessness of the lead character which I liked. good shot selection, really good dubbing, decent score. and I liked the way the lead character underplayed his emotions. I liked his acting better than the girl’s.
In the end, what were you going for with the inter splicing between the wedding card scene and the rain scene? I found that a bit confusing.
and can you please tell what you spent the 15K on?
Jonathan says:
rahul,
thanks for watching, actually regarding final scene,i had to go for intercut due to bad perfomance.
well, we have spent on camera 6,000/- (2,000 X 3days)
Dubbing, music, editing 9,0000
rahul says:
ah! that was clever.:)
thanks for giving the expenses. It sure is expensive to make shorts on your own.
I feel lucky I am in a club. I get to use the club equipment.
Sandeep says:
Hi Jonathan,
Good piece of work.
శశిపాల్ రెడ్ది రాచమల్ల says:
సార్ అమోఘం. అదిరింది. నేను కూడా మీతో జయిన్ కావోచ్చా. ప్లీస్ ఒక్క చాన్స్. 9885550473, 9030641459
Pavan says:
good voice by Chaitu…..
very simply shown by Jonathan
I dono i can suggest or not Chaitu you can try in movies
as your body lang is good & voice is superb
good selction characters Jonathan garu….
kep rocking..
Trivikram Gajulapalli says:
Jonathan garu.I loved this movie to the fullest and I would recommend this to all my frens. I donno much technically and Im not really sure if we hv to worry much abt technicalities when movie is able to engage mind and heart.B/n I always thot of a similar start for one of my scripts
. All the very very best.
Krish says:
Hi Trivikram gaaru,
Are you into film making, Jonathan is making a full length movie and is looking for crew. So if you are interested you might contact him on j.vesapogu@gmail.com.
Thanks,
Krish.
Trivikram Gajulapalli says:
Hi Krish, sorry for late response.. I would love to work bt I hv 0 experience and Im currently working in chn with a s/w firm.Im trying to make some short films..thanks
Trivikram Gajulapalli says:
Onething I din get is why is this “Beautiful” hell? It was just hell.
Balaji Sanala says:
I like this short film. especially the femal character performentce is very good. voice over is nice.
Sudeep says:
Jonathan,
Really nice short film. But euff of tragic stories. Life is showing it anyway. We wud stiil luv 2 c happy endings
or different endings.