|
సినిమాటోగ్రఫీ – 8
కాంతి (LIGHT) తప్త చామీ కరాభాయ వహ్నయే విశ్వకర్మణే ! నమస్తమో భినిఘ్నాయా రుచయే లోక సాక్షిణే !! (బంగారు కాంతి ని పోలిన కాంతి కలవానికి , అగ్ని రూపునకు, జగత్కారునికి విశ్వ కర్మకు, ప్రకాశ స్వరుపునకు, లోక సాక్షికి వందనం.) ఈ భూగోళం మీద ప్రాణి కోటి కి ఆధారం సూర్యుడు. ప్రత్యంక్షంగా పరోక్షంగా జీవి జీవక్రియలకు సూర్య శక్తి ఆధారం. ఈ భూగోళం, సూర్యున్ని కేంద్రకంగా చేసుకొని, తన చుట్టూ తాను తిరుగుతూ [...] |
|
సహజమైన ప్రేమకథ- విన్నైతాండి వరువాయా -will you cross the skies for me? (తమిళ్)
సింబు (సిలబరసన్) కథానాయకుడిగా గౌతమ్ మీనన్ చిత్రమనగానే అదొక స్టైలిష్ యాక్షన్ సినిమా ఏమో అనుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరూ ఒక ప్రేమకథ కోసం ఒకటయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గౌతమ్ మీనన్ సినిమాల్లో (కాకా-కాకా, వెట్టయాడు విలయాడు, వరణం ఆయిరం)ని ప్రేమకథలు ఎప్పుడూ హృద్యంగానే ఉంటాయి. కాబట్టి తను పూర్తిస్థాయి ప్రేమకథ చెయ్యడం వింతకాదు. కానీ సింబుకు తమిళ్ సినిమాలో ఉన్న ఇమేజ్ లవర్ బాయ్ కన్నా ఒక మాస్ హీరోగానే ఎక్కువ. తనూ సొంతంగా [...] |
|
ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)
“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే [...] |
|
మారుతున్న సినిమా కథనం
సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ [...] |
|
నేనూ నా వింతలమారి ప్రపంచమూ…
పోయిన డిశెంబరు చివరి వారంలో మిత్రుడు శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తి గురించి ఆయన తీసిన ఒక లఘు చిత్రాన్నీ పరిచయం చేశారు. పరిచయం చేయడమే కాకుండా ఆ లఘు చిత్రం మరియు దానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని నాకు అందచేశారు. ఆ రోజు నా పుట్టినరోజు కూడా. అప్పుడు చూడలేదు కానీ చూశాక మాత్రం ఆ వీడియో నా పుట్టినరోజున నాకు అందిన గొప్ప బహుమతిగా అనిపించింది. ఆ రోజు శ్రీనిఆస్ గారు నాకు పరిచయం [...] |
|
నాకు నచ్చిన “గ్రహణం”
మొన్నీ మధ్యనే సూర్యగ్రహణం అయ్యినప్పుడు, అందరూ ఆ అబ్బురాన్ని సంబరంలా ఆనందిస్తుంటే, “అయ్యో పాపం, సూర్యునికి గ్రహణం, మనకు వినోదం” అని అనుకుంటూ ఉన్నాను. ఈ రోజు “గ్రహణం” సినిమా చూశాక ఏదో తెలీని ఆనందం నన్ను కమ్మేస్తుంది. I’m in awe of the film.. it’s a beauty! ఈ మధ్యకాలంలో సవాలక్ష కారణాల వల్ల తెలుగు సినిమాలు చూడ్డం ఎక్కువైపోయింది. సినిమా చూసి బయటకొచ్చే ప్రతీ సారీ ఓ గమ్మత్తైన సన్నివేశాన్ని ఊహించుకుంటుంటాను [...] |
|
నేనే హీరో-మీరు కూడా కావొచ్చు.
సినిమా హీరో అవ్వాలనుకుంటున్నారా? ఛాన్స్ దొరకటం లేదా? ఎవడో ఛాన్స్ ఇవ్వటం ఎందుకండీ… లీడర్ సినిమా క్లైమాక్స్ కంటే ఇంకా భారీ లెవల్లో మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీస్తే ఏమైనా అభ్యంతరమా? ఖర్చంటారా? ఓ పెద్దగా ఏమీ కాదండీ…ఒక పది నిమిషాల పాటు ఇంటర్నెట్ మీద కూర్చుంటే ఎంతవుతుందో అంతే! నమ్మరా? అయితే ఈ కింద వీడియో చూడండి. మీరు కూడా ఇలాంటి వీడియోలో భాగం కావాలనుకుంటే http://en.tackfilm.se/ దర్శించండి. |
|
నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?
కదిలే బొమ్మలు క్రమంగా చలన చిత్రంగా రూపుదిద్దుకున్న కొద్దికాలానికే సినిమా గురించిన వార్తలు, వాణిజ్య ప్రకటనలు, క్రమంగా ప్రివ్యూలు, సమీక్షలూ మొదలయ్యాయి. కొంచెంఅటూ ఇటూగా ప్రపంచ దేశాలన్నిటిలో ఇదే క్రమం కనిపిస్తుంది. సినిమాలకు సమీక్షలు అవసరమా అంటే నూటికి తొంభై భారతీయ సినిమాలకు అవసరం లేదు. ఆమాటకొస్తే హాలీవుడ్ లో కూడా పెద్దగా అవసరం లేక పోయినా అక్కడ సినిమా సమీక్ష అనేది పెద్ద పరిశ్రమగా, వందలాది మందికి, జీవనోపాధిగా మారటంతో దాని అస్థిత్వానికి తిరుగులేకుండా పోయింది. [...] |
|
“యాంగ్రీ మిడిల్ క్లాస్” సినిమాలు
70 వదశకాన్ని మన భారతీయ సినీ చరిత్రలో ‘యాంగ్రీయంగ్ మెన్’ దశకంగా సినీచరిత్రకారులు అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాల అనంతరంకూడా కొనసాగుతున్న, సామాజిక అసమానతలు. వ్యవస్థీకృత అణచివేత. ధనికులుచేసే చట్టాల ఉల్లంఘన. పేదలకు జరిగే అన్యాయాలు మొదలైన సామాజిక రుగ్మతల నేపధ్యంలో, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకుని న్యాయంచేసే ఒక సూపర్ హీరో భారతీయ సినిమా(ముఖ్యంగా బాలీవుడ్)లో ఉదయించాడు. హిందీనటుడు అమితాబ్ బచ్చన్ ఈ సూపర్ హీరో పాత్రకి రూపమిచ్చాడు. ఇదే మూసలో వివిధభారతీయ భాషల్లో [...] |
|
“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం
వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే టింగ్యా [...] |
|
లక్-లఘు చిత్రం
ఔత్సాహిక దర్శకులను ప్రోత్సాహించడంలో నవతరంగం ఎప్పుడూ ముందుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నవతరంగంలో మన రాష్ట్రానికి చెందిన ఔత్సాహిక దర్శకులు నిర్మించిన కొన్ని లఘు చిత్రాలను నవతరంగంలో ప్రదర్శించాము. ఈ ప్రయత్నంలో భాగంగానే నవతరంగం పాఠకుడు గిరి రూపొందించిన లక్ అనే ఒక చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. ఈ లఘు చిత్రాన్ని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు గిరి గారికి తెలియచేస్తారని ఆశిస్తున్నాము. |
|
డాక్యుమెంటరీ సినిమా-2
రష్యా విప్లవంలో ప్రజల సినిమా రష్యా దీర్ఘకాలిక విప్లవంలోకి నానా రకాల ప్రజలు కలిసి వచ్చారు. లెనిన్ నాయకత్వంలో అలాంటి కృషి విజయవంతంగా నెరవేరింది. ప్రజలలోని ఎన్నో రకాల కళారూపాలు , వాటిని సృష్టించిన కళాకారులూ విప్లవంలోకి కలిసి వచ్చారు. నాటకం, చిత్రకళ, సాహిత్యం, సంగీతం మొదలైన ఎన్నో కళలు కొత్త రూపమెత్తాయి. అందుకు ఒక పరిణామ క్రమం వుంది. విప్లవం కొత్త శక్తులకు పురుడు పోసింది. కొత్త చైతన్యాన్ని, సామాజిక అవసరాలనూ ముందుంచింది. ఒక కళారూపం [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |