Menu

ముగ్గురు మూర్ఖులు

మరి తెలుగు లో రీమేక్ చెయ్యబడుతున్న త్రీ ఇడియట్స్ కి ఇంత కన్న మంచి పేరు నాకు తోచటంలేదు. నవతరంగంలో ఈ సినిమా గురించి ఎవ్వరు రాయకపోవటం కూడా ఆశ్చర్యంగాను ఉంది.

ఇది అవుట్ అండ్ అవుట్ అమీర్ ఖాన్ సినిమా. మాధవన్, షెర్మాన్ జోషి చక్కగా నటించినా అమీర్ నటనలో వాళ్ళిద్దరిని పక్కకి తోసేశాడు. గజని లో నటించిన అమీర్ ఇతనేనంటే నమ్మశక్యంగా లేదు.40+ అమీర్ 20- రాంచో గా చక్కగా సరిపోయాడు. 8 పాక్ బాడీ ఎక్కడి పోయిందో అర్దంగాలేదు.నడక, నటన, వేషధారణ – ప్రతి ఒక్క విషయంలోనూ అదరగొట్టాడు. మాధవన్ కి మరీ సపోర్టింగ్ రోల్ మాత్రమే దొరికింది. హీరో ని అవుట్ షైన్ చెయ్యలేని పాత్ర. షెర్మాన్ జోషి కూడా సపోర్టింగ్ రోల్ అయినా కాస్త బెటర్. నటన లో ఈజ్ చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో నటన తో బాగా నవ్వించాడు. – ఉదా: వాటర్ టాంక్ మీద కూర్చొనే సీన్. మాధవన్ కూడా కొన్ని సీన్లలో బాగానే నటించాడు – తండ్రి ని జాబ్ విషయం లో కన్విన్స్ చేసేటప్పుడు.

మొత్తానికి విధువినోద్ ఛోప్రా వక్కని అభిరుచి ఉన్న నిర్మాత గ చరిత్రలో మిగిలి పోతాడు. ఈ సినిమా తర్వాత అతనికి సినిమాలు తియ్యాల్సిన అవసరం ఉంటుందనకోను. ఈ ఒక్క సినిమా భారత సినీ చరిత్ర ని తిరగరాసి 500 కోట్లు పైగా సంపాదించే అవకాశం ఉంది. 1942 లవ్ స్టోరి, మున్నాభాయ్ సిరీస్, పరిణీత, ఏకలవ్య సినిమా లు తీసిందీయనే.

రాజ్ కుమార్ హీరాని మూడు చక్కని సినిమాలు తీసి హ్యాట్రిక్ సాధించాడు – మున్నభాయ్ సిరీస్ ప్లస్ ఈ సినిమా. విభిన్న కధాంశాలతో, పాత్రలను చక్కగా తీర్చి దిద్దటం, స్క్రీన్ ప్లే ని అతి తక్కువ లోపాలతో తయారు చెయ్యటంలో సిద్ధహస్తుడని నిరూపించుకున్నాడు.

బోమన్ ఇరానీ మరో అద్భుత నటుడు ప్రొఫెసర్ గా నటించాడు. మేకప్ లో కాస్త విలనిజమ్ ఎక్కువయ్యి కృతకంగా ఉన్నా చక్కగా నటించాడు. ఓంపురి, అనుపమ్ ఖేర్ ల సరసన నిలవగలిన నటుడు.

సరే ఇక మన కరినా కపూర్. జీరో సైజ్ లో చక్కగానే కనపడింది. జస్ట్ అనదర్ సపోర్టింగ్ రోల్. ఇక మరో నటుడు నాలుగో ఇడియట్. ఓమి అనుకుంటాను నటన లో మరీ సాంబార్ ఒలకపోశాడు అంటే తమిళ వాడిలా నటన మరి డైలాగ్ డెలివరి.

షంతను మొయిత్రో సంగీతం వినటానికి అంత గొప్పగా లేకపోయినా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా హాయిగా ఉంది.

ఇక కధ..ఏమీ లేదు. ఓ ముగ్గురు స్నేహితులు. కాలేజీ అయిన మరుక్షణం ఓ ఇడియట్ మాయమయిపోతాడు. పదేళ్ళ తర్వాత అతని ఊసు దొరికి అతని దగ్గరకు బయలుదేరి వెళతారు. వాళ్ళ కాలేజీ హాస్టల్ జీవితం లోనుంచి కొన్ని మరపురాని సంఘటనలు. హీరో కోసం ఓ హీరోయిన్. ఓ నాలుగు పాటలు.. చక్కని లొకేషన్స్.. కొన్ని ధ్రిల్స్.. కొన్ని చక్కని సన్నివేశాలు వెరశి ఓ సూపర్ డూపర్ హిట్. Aal izz well

మురళీధరన్ సిమ్లా, లడాఖ్ ల అందాలని కెమారాలొ చాలా చక్కగా చూపించగలిగాడు.

ఫై పాయింట్ సంధింగ్.. చేతన్ భగత్ రాసిన నవల. దీన్లో ని కొంత మాత్రమే సినిమా గా రూపాంతరం చెందిందట.అభిజత్ జోషి, హీరానీ చేతుల్లో. షరా మామూలే.. రచయిత తో గొడవలు..

సినిమా చూసెయ్యండి. రిగ్రెట్స్ ఉండవు. పైసా వసూల్.

కాని.. ఓ గాడ్.. బ్లెస్ మై ఫెలో ఆంధ్రా వాలాస్.. జెమిని వారు ఈ సారయినా ఓ చక్కని రీమేక్ అందించగలగాలని.. ప్రజలని మరోసారి ఇడియట్స్ అనుకోకుండా..

37 Comments
 1. శివరామప్రసాదు కప్పగంతు January 10, 2010 /
  • శివరామప్రసాదు కప్పగంతు January 10, 2010 /
 2. vasu January 10, 2010 /
  • వెంకట్ ఉప్పలూరి January 10, 2010 /
 3. అబ్రకదబ్ర January 10, 2010 /
  • వెంకట్ ఉప్పలూరి January 10, 2010 /
  • గోపి గాడు January 11, 2010 /
 4. రాజశేఖర్ January 10, 2010 /
  • వెంకట్ ఉప్పలూరి January 10, 2010 /
   • రాజశేఖర్ January 10, 2010 /
   • SEN January 10, 2010 /
   • రాజశేఖర్ January 10, 2010 /
 5. రాజశేఖర్ January 10, 2010 /
  • Ajay January 10, 2010 /
 6. krishh January 10, 2010 /
  • Manjula January 10, 2010 /
   • Kiran January 10, 2010 /
   • teja January 11, 2010 /
 7. మణి January 10, 2010 /
 8. Chandra January 10, 2010 /
  • hero January 12, 2010 /
 9. కమల్..... January 10, 2010 /
  • Yogi January 11, 2010 /
 10. అభిమాని January 11, 2010 /
  • krishh January 11, 2010 /
  • రామ January 12, 2010 /
   • MADHU March 7, 2011 /
  • venkataramana January 12, 2010 /
  • Chandritha January 14, 2010 /
 11. indain January 11, 2010 /
  • Ashok January 12, 2010 /
 12. zulu January 11, 2010 /
  • hero January 12, 2010 /
 13. Yogi January 11, 2010 /
 14. టి.యస్.కళాధర్ శర్మ January 20, 2010 /
 15. mahesh April 24, 2010 /
 16. Krishna chaitanya allam July 4, 2011 /