Menu

శబ్ధగ్రహణం – అంతరార్థం, రెండవ భాగం

సినిమా చిత్రీకరణకు ఎలాగైతే post production, pre production, during production అని ఉంటాయో, శబ్ధగ్రహణానికి కూడా అలాగే ఉంటాయి (మన తెలుగులో ఇలా పాటిస్తున్నారో లేదో నాకు తెలీదు). మరయితే ఏ stage లో ఏం చేస్తారో తెలుసుకుందామా?!

Pre Production stage: ఈ దశలో సౌండ్ తో పనేముందబ్బా….? అని సందేహంగా ఉంది కదూ. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఓ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందే అసలు ఆయా చిత్రం ఏ genre లోకి వస్తుంది, దానికి సౌండ్ డిజైనింగ్ ఎలా ఉండాలి అన్నది స్పష్టంగా నిర్ధారించుకోవాలి. అలా నిర్ణయించుకున్నాక దానికి తగ్గ సౌండ్ డిజైనర్ ని లేదా ఇంజనీర్ ని ఎన్నుకోవాలి. మనం సరైన వ్యక్తిని నియమించినట్టైతే సగం పని ఇక్కడే అయిపోతుంది. పైగా బోల్డంత సమయం మిగులుతుంది.

During Production: ఈ దశలో సౌండ్ కి సంబంధించిన అసలు పని మొదలవుతుంది. సౌండ్ డిజైనర్ దగ్గర ఉండే ప్రొడక్షన్ సౌండ్ రికార్డర్స్ షూటింగ్ జరిగేటప్పుడు ఆయా ప్రదేశానికి సంబంధించిన థీమ్ ని రికార్డ్ చేస్తుంటారు. సాధారణంగా డిజిటల్ సౌండ్ రికార్డర్స్ ని ఉపయోగించి ఈ సౌండ్స్ ని రికార్డ్ చేస్తారు. ఉదాహరణకి ఒక రూములో షూటింగ్ జరుగుతున్నదనుకుందాం. అక్కడ పరిస్థితికి అనుగుణంగా నటీనటుల మాటలు ఉండాలంటే ఈ రూము టోన్ (room tone) రికార్డింగ్ చాలా అవసరం. దీనినే సాంకేతికంగా scene ambience create చేయడం అని అంటారు. ప్రొడక్షన్ సౌండ్ రికార్డర్ ఈ దశలో చాలా అవసరం అవుతాడు. అంతేకాకుండా సన్నివేశ చిత్రీకరణకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యతను సౌండ్స్ రికార్డ్ చేయడానికి కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనకు post production లో చాలా సౌలభ్యంగా ఉండడమే కాకుండా కొంత సమయం కూడా మిగులుతుంది.

Post production: షూటింగ్ చేసేటప్పుడు రికార్డు చేసిన సౌండ్స్ ని రోజువారిగా సన్నివేశపరంగా సౌండ్ డిజైనర్ పర్యవేక్షణలో దాచి ఉంచుతారు. చిత్రీకరణ పూర్తయిన తరువాత ఆయా సౌండ్స్ ని ఎడిటర్ పర్యవేక్షణలో ఏ సన్నివేశం దగ్గర ఎలా ఉపయోగించాలో ఆ విధంగా sync చేసి ఎడిటర్స్ కట్ ని తయారుచేస్తారు. ఈ దశలో చిత్ర దర్శకుడు కూడా పాలుపంచుకుంటాడు.

Locked cut: ఎడిటర్ మరియు దర్శకుని పర్యవేక్షణలో, షూట్ చేసిన సన్నివేశాలను కథనం ప్రకారం ఏర్చి కూర్ఛి తయారుచేసిన తుది సినిమా రూపమే ఈ locked cut.దీనిని locked cut అని అన్నా చాలా సార్లు ఆ తరువాత కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.

Spotting: నిజమైన సౌండ్ ఎడిటింగ్ ఇక్కడే మొదలవుతుంది. సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్స్ ఎక్కడెక్కడ ఏఏ సౌండ్స్ ఎంతెంత ఉండాలో spot చేస్తారు. అందుకే దీనిని spotting అన్నారు. ఈ వ్యాసం మొదటి భాగంలో చెప్పిన Foley efects ఇక్కడ చాలా విరివిగా ఉపయోగపడతాయి. అవసరమైన చోట ADR (automated dialogue replacement) ని వాడడం జరుగుతుంది. అలాగే నేపథ్య సంగీతాన్ని ఎక్కడ ఏ విధంగా ఎన్ని పాళ్ళలో పెట్టాలి అన్నది కూడా ఇక్కడ నిర్ణయించి చేయడం జరుగుతుంది. ఈ పని చేయడం కోసం music editor & music composer ఇద్దరూ చాలా సమన్వయంతో పని చేయాల్సి వస్తుంది. వీరు చేస్తున్న ప్రతి పని దర్శకునికి ఆమోదయోగ్యమై ఉండాలి. కొంతమంది దర్శకులైతే ఈ పనంతా వారి నెత్తినే వేసుకుంటూ ఉంటారు. ఇది జరిగిన తరువాత కూడా కొన్ని సౌండ్స్ అవసరమవుతాయి. వాటిని మళ్ళీ సౌండ్ రికార్డర్స్ సన్నివేశానికి తగినట్టు రికార్డు చేసుకుని వస్తారు. వీటిని మరలా ఆయా సన్నివేశాలతో sync చేస్తారు. ఎప్పుడైతే దర్శకుడు ఇక్కడ తయారైన కాపీని approve చేస్తాడో ఆ తరువాత Mixing మొదలుపెడతారు.

Mixing: ఒక సినిమాకి సౌండ్ ట్రాక్ అనేది ఇక్కడే తయారవుతుంది. Foley sounds, BGM, special sound effects, అన్నింటిని సన్నివేశానికి తగ్గట్టు సరిగ్గా sync చేసి ఆ తరువాత ఆయా సౌండ్స్ ని ఎంతవరకూ వినిపించాలి ఎంత వరకూ ఉంచాలి ఎక్కడ కట్ చేయాలి అనేదంతా ఇక్కడే జరుగుతుంది. పెద్ద సినిమాలకు ఒక్కొక్క సౌండ్ ఎఫెక్ట్స్ కు ఒక్కొక్క mixer ఉంటాడు. ఉదాహరణకు Foley effects, Special sound effects, BGM, ADR ఇలా ఒక్కోదానికి ఒక్కో mixer ఉంటాడు. వీరందరినీ సాధారణంగా సంగీత దర్శకుడు లేదా సౌండ్ ఇంజనీర్ కంట్రోల్ చేస్తుంటాడు.

Print mastering: Mixing అయిపోయాక దర్శకుడు దానిని పూర్తిగా ఆమోదించాక చివరిగా Print mastering చేయాలి. దీని వల్ల ఆ సినిమాకి Digital track ని add చేసుకోవచ్చు. అలాగే M&E track (Music and effects) ని కూడా run చేయాలి. దీనివల్ల ఆ సినిమాలో original music, sound effects ని disturb చేయకుండా వేరే భాషలోకి చాలా సులువుగా డబ్ చేసుకోవచ్చు. Print master run చేయకుండా surround sound, digital sound లేదా dolby digital ఇలా దేనిని ఉపయోగించడం కుదరదు.

చివరిగా వివిధ రకాల సౌండ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలనుకునేవారికోసం కొన్ని లింకులు:

DTS (Digital Theatre System):www.dtstech.com

Dolby Digital:www.dolby.com

THX Sound System:www.thx.com/thx/thxmain.html.

SDDS (Sony Dynamic Digital Sound):www.sony.com

4 Comments
  1. K.Mahesh Kumar January 10, 2010 /
  2. మేడేపల్లి శేషు January 14, 2010 /
  3. venky February 4, 2010 /
  4. Surya February 14, 2010 /