Menu

Paranormal activity

Paranormal activity

ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు,

” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి.

ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య శక్తి తనని వెంబడిస్తున్నదని, అది తన పాత ఇంటి నుంచి ఇక్కడికి కూడా వచ్చేసిందని అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయం ఆమె భర్తకి చెబితే నమ్మడు. పైగా ఆ శక్తి ఏంటో నేను కనుక్కుంటాను అని అస్తమానం ఆమె వెనకాలే హేండికామ్ పట్టుకుని తిరుగుతుంటాడు. కాని దానిలో ఏం కనపడదు. అయినా తన భార్య భయం పోవటంలేదని ఓ సైకియాట్రిస్టుని ఇంటికి పిలుస్తాడు. అతనికి తన చిన్నప్పటినుండి జరిగిన సంఘటనలను వివరిస్తుంది ఆ అమ్మాయి. అవి విన్న సైకియాట్రిస్టు ఖచ్చితంగా ఆమెను ఓ దెయ్యం వెంబడిస్తున్నదని చెప్తాడు. దీని నుంచి మిమ్మల్ని కాపాడటం తన వల్ల కాదని మరో వ్యక్తిని పిలవాలని ఆ వ్యక్తి చిరునామా ఇస్తాడు. కాని వీటిని అంతగా నమ్మని ఆమె భర్త ఆ వ్యక్తిని పిలవడు. దాంతో ఆమెకు ఆమె భర్తకు చిన్న గొడవ వస్తుంది. పైగా ఆ దెయ్యాన్ని పట్టుకోవడానికి వీళ్ళు పడుకునే గదిలో రోజూ ఓ వీడియో కెమెరా పెట్టి, వీళ్ళు పడుకున్న తరువాత జరిగే సంఘటనలను రికార్డు చేస్తుంటాడు. అతని భార్య చెప్పినట్టుగానే వీళ్ళు పడుకున్న తరువాత చాలా చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఇవి చూసాక ఆమె భర్తకు కూడా కొంచెం భయం వేసి సైకియాట్రిస్టు చెప్పిన వ్యక్తికి ఫోన్ చేస్తాడు కాని అతను టూర్ లో ఉంటాడు, రావడానికి మూడురోజులు పడుతుందని చెప్తాడు. సైకియాట్రిస్టు వీళ్ళని ముందే హెచ్చరిస్తాడు, ఆ దెయ్యాన్ని చూద్దామని గాని లేదా దాంతో మాట్లాడదామని గాని ప్రయత్నించొద్దని. కాని ఆమె భర్త దీనిని పెడచెవిన పెడతాడు. చివరికి ఆ వీడియో రికార్డింగ్ మొదలుపెట్టిన 22 వ రోజు రాత్రి, ఆమెను ఆ దెయ్యం ఆవహిస్తుంది, ఆమె ద్వారానే ఆమె భర్తను చంపేస్తుంది. చివరిగా end credits పడతాయి ” భర్త మృతదేహం పోలీసులకి దొరికింది, కాని అతని భార్య జాడ ఇప్పటికీ దొరకలేదు”.

ఈ సినిమా అంత గొప్ప చిత్రం ఎంత మాత్రం కాదు. మొదలుపెట్టిన దగ్గర నుండి చివరికి పూర్తయ్యేటప్పుడు కూడ పరమ బోర్ కొడుతుంది. మరెందుకు ఈ వ్యాసం రాసానంటే,
1. ఈ సినిమా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ కేవలం 15000 USD తో రూపొందించాడు.
2. ఈ చిత్రం పూర్తిగా ఓ ఇంట్లోనే చిత్రీకరించబడింది.
3. మొత్తం పాత్రలు ఐదు, అందులో ప్రధానపాత్రలు రెండు మాత్రమే (భర్త, భార్య)
4. తొలుత ఈ చిత్రాన్ని చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు, ఆ తరువాత థియేటర్లలో విడుదల చేసారు.
5. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 140,000,000 USD లను వసూలు చేసింది, అంటే రమారమి 139,985,000 USD లాభమన్నమాట.
6. ఈ చిత్రం rawness కోసం పూర్తిగా హేండ్ హెల్డ్ కెమెరాతోనే (హ్యాండి కామ్ అంటే సబబేమో) చిత్రీకరించారు.
7. ఒక విధంగా చెప్పాలంటే ఆ సంఘటన జరిగిన తరువాత పోలీసులకు దొరికిన వీడియో టేపే ఈ చిత్రం.

ఇంత సులభంగా, మరీ ఇంత తక్కువలో సినిమా నిర్మించి కళాత్మకంగా తృప్తి పొందటమే కాకుండా డబ్బులు కూడా సంపాదించవచ్చని మరోసారి ఈ చిత్రం నిరూపించింది.
కాబట్టి మనం కూడా ఇలాంటి సింపుల్ మేకింగ్ ఐడియాలతో సినిమా తీద్దాం, కనీసం ప్రయత్నిద్దాం, అందరం కలిస్తే ఆలోచనలకు కొదవలేదు. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఆలోచనకి స్క్రిప్టు తయారుచేద్దాం. సినిమా తీద్దాం. కష్టమే కాని అసాధ్యం కాదు. వాళ్ళను కాపీ కొట్టడం అంత అవసరమా అని మీరడగొచ్చు. ఏదైనా ఒక ప్రొడక్టుని జనాల్లోకి వదిలే ముందు దానిని ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఆంగ్లచిత్ర పరిశ్రమ అటువంటిదే. మనకు అలాంటి నాణ్యమైన ప్రయోగశాలలు లేవు అన్నది వంద శాతం నిజం. అక్కడ విజయవంతమైన ప్రయోగాన్ని ఇక్కడ చేపట్టడం కాపీ ఏమాత్రం కాదు అన్నది నా అభిప్రాయం.

కథ, కథనం, ఎడిటింగ్, దర్శకత్వం : Oren Peli

I hope we will soon start a paranormal activity if not an intelligent activity to pursue our artistic dreams.

22 Comments
  • రాజశేఖర్ January 17, 2010 /
 1. Sarath 'Kaalam' January 17, 2010 /
  • రాజశేఖర్ January 17, 2010 /
 2. అభిమాని January 17, 2010 /
  • రాజశేఖర్ January 17, 2010 /
 3. budugoy January 17, 2010 /
  • రాజశేఖర్ January 17, 2010 /
   • budugoy January 17, 2010 /
   • teja January 18, 2010 /
   • రాజశేఖర్ January 18, 2010 /
   • teja January 18, 2010 /
   • venu January 20, 2010 /
 4. కంది శంకరయ్య January 18, 2010 /
  • రాజశేఖర్ January 18, 2010 /
 5. parimalam January 19, 2010 /
  • రాజశేఖర్ January 19, 2010 /
 6. sudhakar January 19, 2010 /
 7. Satyam January 28, 2010 /
 8. moviebuff February 10, 2010 /
 9. udaygurrala February 25, 2010 /