Menu

Monthly Archive:: January 2010

ముగ్గురు మూర్ఖులు

మరి తెలుగు లో రీమేక్ చెయ్యబడుతున్న త్రీ ఇడియట్స్ కి ఇంత కన్న మంచి పేరు నాకు తోచటంలేదు. నవతరంగంలో ఈ సినిమా గురించి ఎవ్వరు రాయకపోవటం కూడా ఆశ్చర్యంగాను ఉంది. ఇది అవుట్ అండ్ అవుట్ అమీర్ ఖాన్ సినిమా. మాధవన్, షెర్మాన్ జోషి చక్కగా నటించినా అమీర్ నటనలో వాళ్ళిద్దరిని పక్కకి తోసేశాడు. గజని లో నటించిన అమీర్ ఇతనేనంటే నమ్మశక్యంగా లేదు.40+ అమీర్ 20- రాంచో గా చక్కగా సరిపోయాడు. 8 పాక్

ముచ్చటైన రంగులతో ‘మాయాబజార్’ కి మేకప్

విజయావారి ‘మాయాబజార్’ కలర్లో,స్కోప్, డీటీఎస్ వంటి ఆధునిక హంగులు జత చేర్చుకుని త్వరలో మన ముందుకు వాలనుంది. ఈ తరం వారిని కూడా ఆ చిత్రం తన మాయాజాలంతో మాయచేసి ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతోంది. 53 ఏళ్ల క్రితం విజయా సంస్థ సృష్టించిన ఈ సెల్యులాయిడ్‌ దృశ్య కావ్యాన్ని గోల్డ్‌ స్టోన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ మూడు సంవత్సరాల శ్రమకు ఓర్చి భారీ వ్యయంతో, కలర్‌లో తీర్చిదిద్దారు.కొత్త రూపుతో తయారైన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ

అవతార్-మరోవ్యూ

నవతరంగంలో ఇప్పటికే అవతార్ సినిమా గురించి ఎన్నో రివ్యూలు వచ్చాయి, ఇది మరోవ్యూ. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా కథ మౌళికంగా మనుషుల, ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాల మేధావుల పశ్చాత్తాపం అని అనుకోవచ్చు. తాను కూర్చున్న కొమ్మను నరుకుతూ, గడిచిన కాలంలో ఈ భూమిపైనున్న ప్రకృతిని రెండు చేతులతో నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తూ వచ్చిన మనిషి, రేపటి తరాలకు ఏమి మిగులుస్తున్నాడో తెలియక, గతాన్ని చూసి బాధపడుతూ, తాను నేర్చుకున్న పాఠాలను వల్లె వేయడమే ఈ

మూడు ముఖాల తమిళ సినిమా

సినిమా, సినిమా తియ్యడమనే ప్రక్రియతో మాత్రమే అంతమైపోదు. ప్రేక్షకుడి తరఫున్నుంచీ చూశామనిపించినంతమాత్రానా అయిపోదు. సినిమా ఒక సమిష్టి కళ. సినిమా ఒక సామాజిక దర్పణం. సినిమా ఒక వ్యాపార దృక్పధం. సమాజం దాని నేపధ్యం. మనుషుల కథలు,ఆలోచనలూ,ఆదర్శాలూ,అనుభవాలూ ‘చలన చిత్రాలుగా’ మలిచేదే దాని పని. అలాంటి సినిమా తియ్యడం- చూడటంతో సమాప్తమైపోతే సామాజిక (చలచిత్ర) చరిత్రగా ఎలా మిగులుతుంది? అందుకే సినిమాపుట్టిన దేశాలు. సినిమా పెరిగిన దేశాలు. సినిమాని ప్రేమించే దేశాలు. “సినిమా మాది” లేదా “మా

శబ్ధగ్రహణం – అంతరార్థం, రెండవ భాగం

సినిమా చిత్రీకరణకు ఎలాగైతే post production, pre production, during production అని ఉంటాయో, శబ్ధగ్రహణానికి కూడా అలాగే ఉంటాయి (మన తెలుగులో ఇలా పాటిస్తున్నారో లేదో నాకు తెలీదు). మరయితే ఏ stage లో ఏం చేస్తారో తెలుసుకుందామా?! Pre Production stage: ఈ దశలో సౌండ్ తో పనేముందబ్బా….? అని సందేహంగా ఉంది కదూ. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఓ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందే అసలు ఆయా చిత్రం