ముచ్చటైన రంగులతో ‘మాయాబజార్’ కి మేకప్

విజయావారి ‘మాయాబజార్’ కలర్లో,స్కోప్, డీటీఎస్ వంటి ఆధునిక హంగులు జత చేర్చుకుని త్వరలో మన ముందుకు వాలనుంది. ఈ తరం వారిని కూడా ఆ చిత్రం తన మాయాజాలంతో మాయచేసి ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతోంది. 53 ఏళ్ల క్రితం విజయా సంస్థ సృష్టించిన ఈ సెల్యులాయిడ్‌ దృశ్య కావ్యాన్ని గోల్డ్‌ స్టోన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ మూడు సంవత్సరాల శ్రమకు ఓర్చి భారీ వ్యయంతో, కలర్‌లో తీర్చిదిద్దారు.కొత్త రూపుతో తయారైన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ త్వరలో విడుదల చేస్తోంది.

ఎన్టీ రామారకావు,ఎస్వీఆర్,ఎ ఎన్ ఆర్ ,సావిత్రి వంటి హేమాహేమీలు కలిసి చేసిన అధ్బుతం ‘మాయాబజార్‌’ . దీనిని కలర్ లో చూడటం ఓ చక్కటి అనుభూతి అంటున్నారు ఆ తరంవాళ్ళు ఎదురుచూపులతో.ఇక ఈ తరహా ప్రయోగం దక్షిణాదిన ఇదే ప్రధమం.ఇక ‘మొఘల్‌ ఎ ఆజమ్‌’ని రంగుల్లోకి మార్చడానికి ఉపయోగించిన పరిజ్ఞానం కంటే అధునాతమైన దాన్నిఈ చిత్రానికి ఉపయోగించారు.దాదాపు 165 మంది సాంకేతిక నిపుణులతో ‘మాయాబజార్‌’ని రంగుల్లోకి మార్చే ప్రాజెక్ట్‌ని చేపట్టారు. అలాగే ఈనాడు మనం చూసే థియేటర్లన్నీ స్కోప్‌ తెరలతో ఉన్నవే.. కాబట్టి అందుకు తగ్గట్టు మార్చి, డీటీఎస్‌ చేశారు.

1957 మార్చి 27న విడుదలైన ఈ ‘మాయాబజార్‌’ చిత్రాన్ని కె.వి.రెడ్డి డైరక్షన్ చేసారు. విజయవారు నిర్మించిన ఈ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌. తొలిసారిగా కృష్ణుడి పాత్రను పూర్తి స్థాయిలో పోషించారు. అలాగే అభిమన్యుడి పాత్రలో అక్కినేని, ఘటోత్కచుని పాత్రలో ఎస్‌.వి.ఆర్‌, శశిరేఖ గా సావిత్రి నభూతో నభవిష్యతి అన్నట్లు నటించింది. ఇంకా మరెన్ని క్లాసిక్స్ (పాతాలభైరవి,గుండమ్మ కథ వంటివి)కు కలర్స్ అద్ది మరోసారు మన ముందుకు తెస్తే ఆదరిస్తారని నవతరంగం ఆశిస్తోంది..కోరుకుంటోంది.

Filed Under: featuredleadవార్తలు-ప్రకటనలు

Tags:

Comments (25)

Trackback URL | Comments RSS Feed

  1. SIVARAMAPRASAD KAPPGANTU says:

    చాలా అద్భుతమైన వార్త ఇది. ఈ చక్కటి పని మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎక్కడా బయటకు వార్త రాలేదు అదే ఆశ్చర్యంగా ఉన్నది. ఏది ఏమైనా ఒక చక్కటి చిత్రాన్ని రంగులలోకి మార్చి మనముందుంచిన వారికి ధన్యవాదాలు. ఈ సినిమాని డి వి డి లో సరసమైన ధర పెట్టి, అప్పటి నటులు (గుమ్మడి వంటివారు) జ్ఞాపకాలు, అలనాటి విషయాలు కూడ ఆ డి.వి.డిలో పొందుపరచి అమ్మితే ఎంతయినా బాగుంటుంది. మరీ ఆశకుపోయి, ఆ సి.డి/ డి.వి.డి మరీ ఎక్కువ వెల పెడితే, పైరసీ పాలవుతుంది.

  2. మొఘలే ఆజం రంగులు నాకెందుకో అంతగా నచ్చలేదు. బహుశా కథా కాలం నాటి వస్త్రాలు, మేకప్పూ మొదలైనవి రంగుల్లో అతిగా కనిపించడమేమో! మాయా బజార్ కి రంగులద్దే విషయం మీద నిన్న ఒక ఛానెల్లో ప్రోగ్రామ్ చూశాను. సహజంగానే కనిపించాయి రంగులు.

    ఒక పక్క బ్లాక్ అండ్ వైట్ లోనే మాయాబజార్ కళా ఖండం అనిపిస్తున్నా మరో పక్క రంగుల్లో చూడాలన్న ఉత్సాహమూ పెరిగిపోతోంది.

    శివరామ ప్రసాద్ గారి సూఛన పట్టించుకోదగింది.

  3. ఎప్పుడా..! ఎప్పుడెప్పుడా..!!

  4. ఇప్పుడే అందిన దుర్వార్త… తేజ టీ.వీ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాయాబజార్‌కి రంగులద్దిన గోల్డ్ స్టోన్ సంస్థ ప్రతినిధి జగన్‌మోహన్‌గారు చెప్పిన కబురు – ఇందులో (పునరుద్ధరణకి అవకాశం లేకుండా పాడైపోవటం వల్ల..!!) మాధవపెద్ది “భళి భళి..” పాటతో సహా రెండు పాటలు తొలగించినట్లు చెప్పారు. అయితే రెండో పాట ఏదో చెప్పలేదు..

  5. Padmaja says:

    ఆంగ్ల వ్యాఖ్యానం ఉంటే బావుంటుంది. ఇప్పటి పిల్లలు కూడ అర్ధం చేసుకుంటారు. నేను ప్రయత్నించాను కానీ వాళ్లు ఏమాత్రం తెలీటం లేదని గోల. అక్కడికీ అర్ధం చెప్పడానికి చూసా. పని చేయలా. ఇలా అన్నా చూస్తారని ఆశ.

  6. indian says:

    స్టిల్స్ బాగోలేదు

  7. Sowmya V.B. says:

    Interesting news!
    ఓ పక్క నాకు బ్లాక్ అండ్ వైట్ చార్మ్ కలర్ కి రాదు అన్న అనుమానం ఉంది కానీ, సినమా చూడాలన్న కుతూహలం తగ్గడం లేదు. రెండుపాటలు తొలగించడం… :( ఏం చేస్తాం…. ఇదన్నా దొరికిందని సంతోషించాలి…

  8. టి.యస్.కళాధర్ శర్మ says:

    కలర్ లో రూపొందడం వరకూ బాగానే వుంది. ఒక్క ఫ్రేం కత్తిరించినా మనసు వప్పని చిత్రంలో
    రెండు పాటలు లేవంటే చాలా బాధగా వుంది.

  9. krishh says:

    Mayabazaar Color Trailer !!

    http://www.nandamurifans.com/video/pic.php?id=793

    poyineaadade raavalsindi , delay avutoo vastondi !!

  10. zulu says:

    Hmmm. Waiting for release in Bangalore.. :)

  11. pappu says:

    పాత సినిమానే 100+ సార్లు చూసిఉంటాను.ఇదెన్ని సార్లో లో లో లో…
    చక్కటి కబురు అంతలోనే దుర్వార్త “ప్చ్” హేవి చేస్తాము సర్దుకుపోతాము తప్పదు కదా…
    భళి భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయా,బహు బాగున్నదయా నీ మాయా….

  12. రవి says:

    రంగులద్దటం అన్న ఆలోచన బానే ఉన్నా, జీవకళ కాస్త తగ్గుతుందేమో అన్న అనుమానం వస్తుంది. రంగులు “అద్దిన” సంగతి సినిమా చూసేప్పుడు తెలిస్తే, పంటి కింద రాయిలా ఉంటుంది. తెలుపు నలుపులే మేలు.

  13. vasu says:

    నేను ఏంటో అనుకున్నాను కానీ బాగా అద్దారు రంగులు . కళ్ళకింపుగా ఉంది ట్రైలర్ లో మాత్రం. లాహిరి లాహిరి లో మాత్రం పాతదే అందం గా ఉంటుందేమో అని అనుమానం. మార్కస్ బార్ట్లీ వెండి తెర మీద కురిపించిన పండు వెన్నెల రంగులలో
    చూపెట్టడం కష్టం. ఎప్పుడొస్తుందా ఇక్కడికి. రాగానే చూసేయ్యాలి.

  14. hanimireddy says:

    nenu film industries loo undatam valla mayabazar pre-view chusaanu.naaku b&w baaga nachindi. 500 times chusaanu. kaani colours loo naaku anthagaa nachaleedu.chala varaku cuts unnai.TRUE mayabazar movie lovers ki nachadu.

  15. Virinchipriya says:

    Chaala saMtOshamu. paina perkonna suuchanalanni baagunnayi. viTitO paaTu aa DVD beginning lo ‘Quiz’ peDitE baaguMTuMdani Naa abhipraayamu.For example on the screen play, how each scene is connected to other with a fore shadowing.

  16. Keshavcharan says:

    నిన్ననే కుక్కట్పల్లిలో ఈ చిత్రాన్ని చూసాను. ఏ మటకి ఆ మాటే గానీ రంగులు చూదముచ్చటగా ఉన్నాయి. కొన్ని చిత్రాలు అయితే మంత్రముగ్ధుల్ని చేసాయి. ఉదాహరణకి అభిమన్యుడు శుభద్రా వెళ్ళే రథం సన్నివేశంలో బ్యాక్ గ్రౌన్డ్.

    ‘భళీ భళీ భళీ భళీ దేవా’, ‘చూపులు కలసిన శుభవేళా’ పాటలు సాంకేతిక లోపాల వల్లననుకుంట..తీసివెయ్యబడ్డాయి. డిజిటల్ సౌండ్ లో ఆ పాత పాటలు కొన్ని సందర్భాలలో కల్లల్లో నీళ్ళు తెప్పించాయి.

    ఎక్కడా జరగనిది ఒకటి జరిగింది. ప్రతీ పాటకీ, ముఖ్యపాత్రలు చెప్పే చలోక్తులకీ, వాల్లు చూపించే హావభావలకీ బాల్కనీ లో జనాలు ఈలలు వెసారు.

    ఇంత చక్కటి నటనకి నేటి తారగణం కాలిగోటికి కూడా సరిరారు. దానిని వెండి తెరపైన చూసి ఆనందించండి. ఎందుకంటే ఒక మానసిక ఉపసమనానికీ, మనసుని పులకరిమ్పజేయడానికీ ఇంతకంటే మంచి చాన్సు మళ్ళీ రాదు.

  17. RAVI.Y says:

    I had seen so many times not able to count in black & white.i am waitting for to see in colour.But iam so sorry to hear that two songs lost.Can it be added in back & white in that colour one.Awaiiting for reply.

    VijayaRavi & family

  18. Aditya says:

    మాయాబజార్ ఒక గొప్ప కళాఖ౦డ౦. అద్బుత ద్రుశ్యకావ్య౦. ఈ సారి ర౦గులలొ..
    చూసి తీరాల్సి౦దె.
    awaiting for that..any idea about the release date..

    – ఆదిత్య.

  19. టి.యస్.కళాధర్ శర్మ says:

    దాదాపు సినిమా అంతా చూశాను. రంగులలో మాయాబజార్ బాగున్నది. డి.టి.యస్.లో రికార్డింగ్ బాగానే వుంది. భళి,భళి,భళి దేవా,చూపులు కలిసిన శుభవేళా,మోహినీ భస్మాసుర,మాయాబజార్ లో నాట్యాలు,అక్కడక్కడ సన్నివేశాలు తీసివేయడం బాధాకరమయిన విషయం. సినిమాలో అన్నీ కొత్తకొత్తగా వున్నా హ్రుదయం లేక పోవడం బాధాకరమయిన సంగతి. నాకయితే నలుపు తెలుపు చిత్రమే బాగుందనిపించింది.

  20. sreenath says:

    చాలా అద్భుతమైన వార్త ఇది. ఈ చక్కటి పని మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎక్కడా బయటకు వార్త రాలేదు అదే ఆశ్చర్యంగా ఉన్నది. ఏది ఏమైనా ఒక చక్కటి చిత్రాన్ని రంగులలోకి మార్చి మనముందుంచిన వారికి ధన్యవాదాలు.
    see this move all Andra people.

  21. ramaiah yedupati says:

    chala bagunddi pata cinima NTR lanni marchji te Wonder….

  22. sankar gongati says:

    మనమందరం చందాలు వేసి తెలుగు సినిమా దర్శకులందరికి ఈ సినిమా చుపిద్దాం.

  23. naresh Nunna says:

    I request one and all, who are showering such love on Maya Bazaar, to browse through our magazine (The Sunday Indian, for which I am the resident editor)….

    the link is:
    http://www.thesundayindian.com/telugu/20100221/telugu.html

    regards,
    Naresh Nunna
    nareshnunna@gmail.com

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.