Menu

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

aarochoo

ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే…
(1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు ,మా ఊరి వాడు డుంగ్రోతు నాగ రాజు తన మొదటి చిత్రం మాత్రం విభిన్నంగా..తన మాత్రు భాష అయిన లంబాడి భాషలో “ఆరోచూ.. ..” (వస్తున్నా…) (చార్వీ తోన లేజాయేన ..)(నిన్ను తీసుకెల్లెందుకు ) అంటూ… ప్రారంభిస్తున్నాడు. అనగా లంబాడి భాష లో పూర్తిగా ఒక చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నాడు .గత 15 సంవత్సరాలుగా ఘోస్ట్ రచయితగా లెక్కలేనన్ని సినిమాలకు అష్టకష్టాలు పడ్డాడు. ‘మాటలు’ అనే కార్డ్ మాత్రం కొన్ని సీనిమాలకు మాత్రమే పడింది .ఈ 15 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని అష్టకష్టాలు పడ్డాడో..అవన్ని ఇప్పుడు రాయను.

కధా, మాటల రచయిత గా,దాదాపు 60 పైనే సినిమాలకు పనిచేసిన నాగరాజు ఇప్పుడు దర్శకుడిగా మారి ఒక విభిన్నమైన సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నాడు. అదే కెమెరా , అదే డబ్బు, అదే శ్రమ తెలుగు సినిమాకు వెచ్చిస్తే లాభమని ఎంతోమంది ఇప్పటికి మొత్తుకుంటున్నా. ఆ లెక్కలన్ని ఆలోచించకుండా, పట్టించుకోకుండా తన మనసుకు నచ్చినట్లు ,తన మాతృ భాష అయిన లంబాడి భాషలోనే తన మొదటి సినిమా ను తియ్యాలని నిర్ణయించుకున్నాడు.

నాగరాజు వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే 3 ఇడియట్స్ సీనిమా సారంశం అతను.
చదువులో అతనికున్న కొద్దో గొప్పో మేధస్సుకు అతను కేవలం అటెంప్ట్ చేసినా చాలు, రాజ్యాంగం అతనికి ప్రసాదించిన సౌలభ్యాలతో ,ఏదో ఒక వైట్ కాలర్ ఉద్యోగం సంపాదించుకోని హాయిగా సెటిల్ అయ్యి సెక్యూర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు నచ్చని సినిమాల మీద ఏదో ఒక బ్లాగ్ రాస్తు గడిపేవాడివి కదరా అని ,బాగానే సెటిల్ అయ్యాము అని ఫీలయ్యే మా మిత్రులు కొంతమంది ఇప్పటికి జోకులు పేలుస్తుంటారు.( సినిమా కష్టాలను చూసి )
నా మిత్రుడు ,మా ఊరి వాడు అని పైన ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే …ఔత్సాహిక దర్శకుడి ఇంటర్యూగా ఇక్కడ అతని ఇంటర్యూ ని రాయాలని పించింది కాని,మేమిద్దరం పరిచయం ఉండి నవతరంగం చదివే వారు కొంతమంది … దోస్తు గురించి డబ్బా కోట్టు కున్నాడు,నవతరంగం మరీ ఇలా స్థాయి పడిపోతుందని గుండేలు బాదుకునే కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు ,అనుకుంటారు కాబట్టి .సరే నేను కూడ ఒక ప్రయోగం చేద్దామని ..నా వైపు నుంచి ముందుగా రాయకుండా..

ఇండస్ట్రి లో అతని సినియారిటి ఎన్ని సంవత్సరాలో, పైన పేర్కోన్నాను కాబట్టి , అతని గురించి ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నారో
ఇక్కడ మీరు అతనికి ,కామెంట్ల స్థానం లో మీరు ప్రశ్నలు రాయండి అవే ప్రశ్నలు నేను అతని కి అడిగి అతని ఇంటర్వ్యూని మరో వారం లో ఇక్కడ ప్రచురిస్తాను.

* * *

రంగులు పాత వే అయినా ప్రతీ సంవత్సరం కొత్తముగ్గులు చూసినట్లు
ఈ సంక్రాంతి కి పాత మొహాలతో నే అయినా ,కొత్త కధ లతో వచ్చే సినిమాలు కూడ మనసులను రంజింప చేసేవి చూస్తామని ఆశతో అందరికి సంక్రాంతి ఈద్ ముబారక్ ల తో .ఆమీన్.

aarochoo
29 Comments
 1. విజయవర్ధన్ January 12, 2010 /
 2. Sankar gongati January 12, 2010 /
 3. srinivas January 12, 2010 /
 4. zulu January 12, 2010 /
 5. MY DIARY January 12, 2010 /
 6. టి.యస్.కళాధర్ శర్మ January 12, 2010 /
 7. vara January 13, 2010 /
  • అభిమాని January 13, 2010 /
   • వర ప్రసాద్ January 13, 2010 /
 8. అభిమాని January 13, 2010 /
 9. vasu January 13, 2010 /
 10. శంకర్ January 13, 2010 /
 11. Hari Charana Prasad January 13, 2010 /
 12. వర ప్రసాద్ January 13, 2010 /
 13. వర ప్రసాద్ January 13, 2010 /
 14. నాగన్న January 13, 2010 /
 15. Sankar gongati January 13, 2010 /
 16. vara January 13, 2010 /
 17. vara January 13, 2010 /
 18. Sarath 'Kaalam' January 15, 2010 /
 19. ఈశ్వర్ reddy February 6, 2010 /
 20. Basavanath Reddy S February 6, 2010 /
 21. శశిపాల్ రెడ్ది రాచమల్ల 9030641459 February 19, 2010 /
 22. dalsing November 8, 2010 /
 23. Vijaya December 11, 2010 /
 24. Sowmya December 12, 2010 /
 25. surendra December 12, 2010 /
 26. Prasad July 3, 2012 /