Blender సినిమాలు
![]()
అవతార్ సినిమా సృష్టించిన సంచలనం తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ అనే ప్రక్రియమీద సినీ ఔత్సాహికులకు ఆశక్తి పెరిగే ఉంటుందనుకుంటున్నాను. సినిమా నిర్మించడానికి ఓ కొత్త కథ మాత్రమే చాలనుకునే నాలాంటి అమాయకులందరికీ పాతచింతకాయ పచ్చడిని 3D జాడీలో పెట్టిమరీ అమ్మేసాడు కేమెరాన్. విజువల్ ఎఫెక్ట్స్ అంటే చిన్నపిల్లల సినిమాలకు సంబంధించిన అంశం అనే భ్రమని తొలగించి యానిమేషన్ పాత్రలతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో మరోసారి రుజువు చేసాడు. రాబోయే కాలంలో పూర్తి యానిమేషన్ పాత్రలతోనే డ్రామాలు, కామెడీలు కూడా రావొచ్చు (ఇప్పటికే వచ్చి ఉంటాయేమో, waltz with Bashir, Metropolis మొ.వి ఏ జనర్‍లోకి వస్తాయో నాకు తెలియదు). ఈ విధానంలో ఒక సౌలభ్యం ఉంది. నటీనటులు(వీళ్ళు ఇచ్చే ఆ నాలుగు ఎమోషన్స్ ని ఏ యానిమేటెడ్ పాత్రకైనా చాలా సుళవుగా ఆపాదించొచ్చు), కేమెరాలు, లైటింగ్ లాంటి తతంగం లేకుండా ఒక కంప్యూటర్ ఉండి, చెప్పడానికి ఒక కధ ఉంటే ఎవరైనా ఒక సినిమా తీయొచ్చు. ఆదేంటి వేలకోట్లు ఖర్చు పెడితేనేకానీ ఒక అవతారుడు రాలేదు కదా, మరి ఒక్క కంప్యూటర్‍తో సినిమా ఎలా తీయొచ్చనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే Blender Foundation వాళ్ళు తీసిన ఈ రెండు సినిమాలను చూడాల్సిందే ( అవి వ్యాసం చివర్లో ఉన్నాయి, మీకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు చదవడం ఆపేసి వాటిని చూసేయ్యండి). ఆ రెండు సినిమాలను నిర్మించడానికి వాళ్ళు వాడిన సాఫ్ట్ వేర్ Blenderను నవతరంగం మిత్రులకు పరిచయం చెయ్యడం కోసమే ఈ వ్యాసం.
ఇంతకు ముందే ఓపెన్ సోర్స్ ప్రోగ్రాం celtx ఉపయోగించి pre-production మొత్తం పూర్తిచేయొచ్చని తెలుసుకున్నాం. ఇప్పుడు Blenderతో ( ఇది కాడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేరే , నమ్మలేని నిజం) production మరియు post production కూడా అయిపోతాయి. ఇక కథా, కంప్యూటర్ , ఓపికా( ఇది చాలా అవసరం) ఉంటే మీరూ ఒక యానిమేషన్ సినిమాను తీయొచ్చు. Blender చాలా చిన్న సాఫ్ట్ వేర్ ( మామూలు PC configurationతో run అవుతుంది) కాబట్టి 512 MB ఆపై RAM ఉన్న ఏ కంప్యూటర్ మీదైనా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మిగతా 3D లేక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లలోలా సిస్టం మెమరీ అంతా తినేసే అలవాటు కూడా ఈ Blenderకి లేదు. ఉన్న కష్టమల్లా దీనిని ఉపయోగించడమే. మీకు ఇంతకుముందు 3D సాఫ్ట్ వేర్‍తో కానీ photoshopతో కానీ పరిచయం ఉంటే కొంచెం ఉపయోగపడుతుంది. లేకపోయినా ఇంటర్‍నెట్‍లో ట్యుటోరియల్స్ విరివిగా దొరుకుతున్నాయి. వాటి ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్ వేర్‍ని నేర్చుకోవడానికి నాకు ఉపయోగపడిన మెటీరియల్ని ఒక క్రమ పద్దతిలో మరో వ్యాసంలో ఇస్తాను. అంతవరకూ ( ఆంటే మరో 24 గంటలు) ఆగలేమంటే ఇక blender.org మీద వెంటనే దాడిచేసెయ్యండి.
Elephant Dreams: (నిడివి 9:57)
ఇది మొట్టమొదటి ఓపెన్ మువీ ( అంటే పూర్తిగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్‍తో నిర్మితమైనది). దీనికి సంబంధించిన ప్రొడక్షన్ పైల్స్ అన్నీ ఆన్‍లైన్‍లో ఉచితంగా లభ్యమౌతున్నాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందులో కనిపించే పాత్రలను, కానీ జంతువులను కానీ ఉపయోగించి ఏదైనా చిన్న సినిమా తీయొచ్చనే ఆలోచన మీకొస్తే నిర్మొహమాటంగా ప్రోడక్షన్ పైల్స్ ని వాడేసుకోవచ్చు. ఏ కాపీ రైట్ ఇబ్బందులు కూడా ఉండవు. ఏమైనా అనుమానాలుంటే నన్నడగండి
…
Big Buck Bunny: (నిడివి 10:54)
ఇది మొదటి సినిమా అంతటి కాంప్లెక్స్ స్టోరీ అవ్వకపోయినా యానిమేషన్ క్వాలిటీ మాత్రం చాలా బావుంటుంది.
కొసమెరుపు: స్పైడర్ మేన్-2 కి పోస్ట్ ప్రొడక్షన్‍లో విజువల్ ఎఫెక్ట్స్ crew మెంబర్స్కి అర్ధమయ్యేందుకు Blenderని ఉపయేగించుకొని చాలా సీన్లు క్రియేట్ చేసారంట, కాబట్టి భవిష్యత్తులో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా కూడా ఒపెన్ మూవీలే అవ్వొచ్చు.
Filed Under: featured • lead • లఘు చిత్రాలు • వీడియో
yes you are right, the only problem with this software is “The learning Curve” and it is not so easy to understand…
you know, this software is developed as the inhouse software for a big VFX company…but after that company went into losses they released this software as open source software…I still dont understand how it renders the output with such Small RAM requrement…
The weardest part is this software demands u to use..some of the most unused symbols in the keyboard for Ex: ~ and | like that etc for important operations…and the Middle button of the mouse…
“he weardest part is this software demands u to use..some of the most unused symbols in the keyboard for Ex: ~ and | like that etc for important operations…and the Middle button of the mouse…”
ఇదే మరోలా చెప్పాలంటే కీబోర్డును పూర్తిగా ఉపయోగించుకోగల్గిన సత్తా ఉన్న సాఫ్ట్ వేర్
అయితే కీబోర్డు షార్ట్ కట్స్ కష్టం అనుకునేవాళ్ళకు మౌస్‍తో కూడా టూల్స్ వాడే సౌకర్యం లేటెస్ట్ వెర్షన్‍లో ఉంది. | లాంటివి వాడడం కష్టమనుకుంటే ముఖ్యమైన అప్లికేషన్స్ కి వేరే కీ షార్ట్ కట్స్ ని customize చేసుకోవచ్చు.
ఒక్క విషయం మాత్రం నిజం, ఈ సాఫ్ట్ వేర్ నేర్చుకోవడం అంత వీజీ ఏం కాదు. ఇంటర్‍ఫేస్‍ని అర్ధం చేసుకోవడమే చాలా ఇబ్బంది.
ఈ లింక్‍లో ఉన్న వీడియోలు బేసిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా getting started sectionలో ఉన్న interface concept ని కనీసం నాలుగు సార్లైనా చూస్తేగానీ navigation procedure అర్ధం కాదు.
http://www.blender.org/education-help/video-tutorials/
ఇవి అయిపోయాక, కొంచెం అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ కోసం ఈ క్రింది లింక్ చూడండి.
http://www.blendercookie.com/
చాలా మంచి వివరాలు చెప్పారు .
ఇలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగించి ఏదయినా ఇత్రం రూపొందించదలిచితే , కథ కథనాలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా కావాలి కదా మరి ! లేక అన్నీ మనమే నేర్చుకుని ఆల్ ఇన్ వొన్ కావాల్సినదేనా ??
మంచి ప్రశ్న వేసారు. నాకు తెలిసిన కొన్ని సలహాలు. blender communityలో material (అంటే ఇంతకు ముందే వేరే బ్లెండర్ యూజర్ ఎవరో క్రియేట్ చేసిన ఒక యానిమేటెడ్ ఆబ్జెక్ట్) దొరుకుతాయి. మీ కధకు అవి సరిపోతాయనుకుంటే ఆ యూజర్‍ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఓక వారం పాటు నేను పైనిచ్చిన రెండు లింక్స్ లోని ట్యుటోరియల్స్ ని ఫాలో అవుతూ బ్లెండెర్‍తో ప్రయోగాలు చేసారంటే మీకే అర్ధమౌతుంది ఇది అంత కష్టమైన టాస్క్ కాదని. ఒకసారి మొదలుపెడితే అదే వస్తుంది.
… కనీసం getting startedలో ఉన్న నాలుగు వీడియోలు చూడండి చాలు మీలోనే ఆ సాంకేతిక నిపుణుడు ఉన్న విషయం తెలుస్తుంది. రెండు నిమిషాలలోపు నిడివిగల చిత్రం అయితే ఇరవై రోజుల్లో పూర్తి చేసెయ్యొచ్చు ఒంటి చేత్తో. మీ ప్రాజెక్ట్ మరీ పెద్దది అనుకుంటే blender కమ్యూనిటీలో మీతో చేతులు కలపడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. just start bleniding
సాంకేతిక నిపుణులు కావాలి కానీ పరికరాలు అవసరం లేదు
శంకర్ గారు
) ఎదురుచూస్తున్నాను.
Blender పరిచయానికి ధన్యవాదాలు. మీ రెండో వ్యాసం కోసం (24 గంటలు దాటింది
లింక్స్ కామెంట్లో ఇచ్చేసానండీ.. ఇంక మరో వ్యాసం రాయాల్సిన అవసరం ఏం కనిపించడంలేదు ప్రస్తుతానికి
Guys do you have any idea of Open Source Compositing Softwares like blender…I know we can use Blender also for compositing for some extent…but I want to know is there any complete Compositing package for this purpose…
this is the list of SW that can do composting… I think jahaska is another open source sw
http://en.wikipedia.org/wiki/Digital_compositing#Digital_compositing_systems
@sankar
Is blender having “Simulation” ? like may where we can create gravity…etc..
yes id does have simulation.
check the second link, there are some examples how to model and animate.
hi sankar garu
chala manchi information echaru thanks .
It a very nice article Shankar gaaru.. telugu lo raayatam konchem kashtanga undi..
Dhanyavadaalu