మూడు ముఖాల తమిళ సినిమా

Picture1

సినిమా, సినిమా తియ్యడమనే ప్రక్రియతో మాత్రమే అంతమైపోదు. ప్రేక్షకుడి తరఫున్నుంచీ చూశామనిపించినంతమాత్రానా అయిపోదు. సినిమా ఒక సమిష్టి కళ. సినిమా ఒక సామాజిక దర్పణం. సినిమా ఒక వ్యాపార దృక్పధం. సమాజం దాని నేపధ్యం. మనుషుల కథలు,ఆలోచనలూ,ఆదర్శాలూ,అనుభవాలూ ‘చలన చిత్రాలుగా’ మలిచేదే దాని పని. అలాంటి సినిమా తియ్యడం- చూడటంతో సమాప్తమైపోతే సామాజిక (చలచిత్ర) చరిత్రగా ఎలా మిగులుతుంది?

అందుకే సినిమాపుట్టిన దేశాలు. సినిమా పెరిగిన దేశాలు. సినిమాని ప్రేమించే దేశాలు. “సినిమా మాది” లేదా “మా సినిమా ఇది” అనుకునే అన్ని సమాజాలూ సినిమా తియ్యడటం చూడటం అనే ప్రక్రియలకు ముందూ వెనకా మరో అర్థవంతమైన ప్రక్రియల్ని జోడించారు. అవే ఫిల్మ్ థియరీ – ఫిల్మ్ క్రిటిసిజం.”పిల్మ్ థియరీ” అప్పటికే తీసిన సినిమాల ద్వారా ఏర్పడిన విజ్ఞానాన్నీ, జ్ఞానాన్ని తరువాతి తరాలకు అందిస్తే, ఫిల్మ్ క్రిటిసిజం సామాజికతను మేళవించి సినిమాకు దిశానిర్దేశన చేస్తుంది. అంటే ఒకటి దారి ఏర్పడే మార్గం చూపితే మరొకటి దారిని నిర్మిస్తుంది. అప్పుడుగానీ ఫిల్మ్ మేకింగ్ అనే బండి సజావుగా నడవటానికి వీలుకుదరదు.

దారిని డిజైన్ చేసిన ఇంజనీరుకు డ్రైవింగ్ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు. దూరాల్ని, గమ్యాల్నీ తెలియజెప్పే బోర్డు ప్రయాణించాల్సిన అవసరమూ లేదు. అందుకే సినిమాను ఒక పాఠ్యాంశంగా బోధించే టీచరు సినిమా తియ్యాలని లేదు, సినిమాను విమర్శించే విమర్శకుడికి సినిమా నిర్మాణం రావాల్సిన అవసరం లేదు. ఎవరిపని వాళ్ళే చెయ్యలనే సూత్రమేదీ లేకపోయినా, కనీసం ఎవరి పని వాళ్ళు బాధ్యతగాచేస్తేనే ఏ సినీపరిశ్రమైనా ఆరోగ్యవంతంగా వృద్ధి చెందుతుంది అనేది మాత్రం సత్యం. ఈ సున్నితమైన తేడా తెలియనంతవరకూ, ‘సినిమా’ అంటే కేవలం ఫిల్మ్ మేకింగ్ మాత్రమే కాదు అనే అవగాహన వచ్చేవరకూ,కొన్ని అపోహలు తప్పవు. మన తెలుగు సినిమాకు ఈ పాట్లు తప్పవు.

“ఫిల్మ్ మేకింగ్” తో పాటూ ,”ఫిల్మ్ థియరీ” -”ఫిల్మ్ క్రిటిసిజం” అనే మూడు ముఖాలు కలిగిన చలనచిత్ర పరిశ్రమలు భారతదేశంలో కొన్నే ఉన్నాయి. వాటిల్లో తమిళ సినిమా ఒకటి. ఆ మూడు ముఖాల్ని అచ్చంగా పరిచయంచేసే ఒక ఉదాహరణ ఈ పుస్తకం. చదవండి. చదివించండి.

Tamil.cinema.may

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories