Menu

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

ARUDRA

“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు.
ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది కొసమెరుపు. చివర చీమ చెప్పే సమాధానం మనకు నవ్వు పుట్టిస్తుంది. కథ అయిపోయిందనిపిస్తుంది. ప్రతి కథలోనూ ఈ గుణముండాలి. ప్రఖ్యాత కథానికా రచయిత వొ.హెన్రీ చిట్ట చివర తాను తిప్పదలిచే మలుపు మొట్టమొదటనే ఆలోచించుకుని కథ రాసేవాడుట. మీరూ అలా ఆలోచించటం ఒక పద్దతే.
అంతాన్ని ఆదిలోనే ఊహించకపోయినా, మధ్యలో వూహించటం మంచిదే. కుంచాన్ని నిలువునా కొలవటానికి వీల్లేకపోతే అడ్డంగా కొలిచినా కొన్ని గింజలు నిలుస్తాయి. ఇందాక మీకు ఉదాహహణగా కింద కుక్క కథ చెప్పాను. అందులో కొంత అల్లగానే కొసమెరుపేమిటా అని అవ్యక్తంగానే ఆలోచించాను. తనికి ఉపకారం చేసిన కుక్క పిల్లకి గుమస్తా కృతజ్ఞత చెప్పడంతో కథ అంతం చేద్దామనుకున్నాను. ఇది మరీ రొటీన్ గా ఉందని,అది అతని చెయ్యి కరిచిందని చెప్పాను. ఇప్పుడు అనవరసంగా కుక్కపిల్ల విలన్ అయిపోయిందే అని నాకూ బాధ కలిగింది. కరిచిన కుక్కను ఎవడూ క్షమించడు. అందుకే గుమస్తా దాన్ని కొట్టాడన్నాను. అది కారుకింద చచ్చిపోయిందన్నాను. అప్పుడు గుమస్తా యేమనుకున్నాడో మీరే ఊహించుకోండన్నాను. ఇప్పుడు పాఠకులు కూడా కథలో పాల్గొంటారు.
ఇలా అంచెలువారీగా ఆలోచించి కథ రాయటానికి మీరూ సిద్దంగా ఉన్నారా, సరే మీతో కలిసి సహాయం చేస్తాను.  కథా వస్తువు నెంచుకున్నాక, క్రమాన్ని ఆలోచించుకున్నాక కాగితం మీద పెట్టడమే తరువాయి, కథ చెప్పడానికి బాషలోనే. ఎలా మాట్లాడుకుంటే అలా రాయవచ్చుననే వరం గిడుగు రామమూర్తిగారి ధర్మమా అని లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం.
నిజం చెప్పటానికి ఉన్న మాటలు చాలు. అబద్దమాడటానికి మాటల కోసం వెతకాలి. అని (బహుశా) చలంగారు (కాబోలు) అన్నారు. తెలియని మాటలు ఉపయోగించవద్దు. వాడిన మాట అక్కడ ఆ సందర్భంలో అవసరమా,కాదా అని కూడా ఆలోచించాలి. మాటల్లని తూచి వాడమన్నారు.
మాటల్ని తూచడమెలాగ..అవేం ఘన,ద్రవ,వాయు పదార్ధాలా తూచటానికి అనుకోవద్దు. మాటల్ని తూచి,వాడగలిగినవాడే సమర్దుడని చెప్పాలి. కీ లెరిగి వాత, వీ లెరిగి చేత అన్నట్లు వాడిన మాట అతికినట్లుండాలి. ఆ మాట వాక్యంలో ముందొచ్చినా,వెనకొచ్చినా పనికిరాదు. ఒక ఉదాహణ చెప్తాను.
సీతా,నిన్ను ప్రేమిస్తున్నాను,నీవు నిరాకరిస్తే చచ్చిపోతాను ఆమె నిరాకరించింది. అతను చనిపోయాడు. అరవై ఏళ్ళ తరువాత.
ఈ ఉదాహణలో అరవై ఏళ్ల తరువాత అన్నమాట ఆఖర్నొస్తే నాజూకు. ఆమె నిరాకరించింది. అరవై ఏళ్ళ తర్వాత అతను చచ్చి పోయాడు అన్నాడనుకోండి గమ్మత్తేముంది.
ఒక కథలోంచి మరో ఉదాహరణ చెప్తాను. ప్రేమ..ఈ రోజులలో మరీ కేవలం యువతీ యువకులకు అది పర్యాయపదమయింది…పర్యాయపదం కాదు. ఊతపదం అనాలి. రచయిత తాను వాడే మాట ఏమిటే ఆలోచించకుండా వాడేయకూడదు.
తిరస్కరించిన కథలలోంచి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. అయితే కథలు ఎలా రాయాలో మీకు చెప్పదలచుకున్నాను గానీ, ఎలా రాయకూడదో కాదు..అందుకే రాసే పధ్దతే చెప్తాను.
సరే..కథా వస్తువు దొరికింది. భాష నిర్ణయించుకున్నాం. ఎత్తుగడ ఎలా చేయడం ఇది గడ్డు సమస్యే. దీన్నే కృత్యాద్యవస్ధ అంటారు. నేను మీకు చెప్పిన కుక్క పిల్ల కథే తీసుకుందాం. దీన్ని ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు. గుమస్తా పేరేమిటి పెడదాం..గుర్నాధం అందాం. ఫైళ్ళలో కాగితాలు పెట్టడంతో మొదలు పెడదామా లేదా రోడ్డు మీద కుక్క పిల్ల తిరుగుతూ ఉండటంతో మొదలు పెడదామా
కథలో యూనిటీ ఆఫ్ టైమ్ అనీ యూనిటీ ఆఫ్ స్పేస్ అనీ రెండు ఉంటాయంటారు. వీటి గురించి ముందు తెలుసుకోవచ్చు. కథ ఆధ్యంతాలలో ఏకత్వం కావాలన్నది ఒక లక్షణం. కథ రోడ్డు మీద మొదలెట్టి రోడ్డు మీద అంతం చెయ్యడం బాగుంటుంది. అందుచేతే కుక్కపిల్లతోనే మొదలెడదాం.
రోడ్డుని వర్ణించుదామా..శుభం. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అనవసరపు వర్ణనలు మంచిది కాదు. చదివేవాళ్ళకు విసుగూ,మనికి శ్రమ, నా చిన్నప్పుడో శుభాషితం చదివాను. ఇప్పటికీ మరిచిపోను. అదీ కథలు రాసే వాళ్లకి సలహాయే.
గదిలో ఒక పిస్తోలు ఉందని కథలో చెప్తే,కథ అయ్యిపోయేలోపల అది పేలాలి. లేకపోతే అది ఉన్నట్లు చెప్పటం దండుగ అని చెకోవ్(కాబోలు) చెప్పినట్లు నార్లవారు(బహుశా)రాసారు. ఎవరు చెప్పారో..నేను మరిచిపోయినా చెప్పింది మరిచిపోలేదు.
రోడ్డును వర్ణిస్తూ కార్లూ, సైకిళ్ళూ చిత్తమొచ్చినట్లు పోతున్నాయి. అని చెప్ధా. ఏమంటే కొంత సేపు పోయాక మొదట సైకిల్ కిందా, తరువాత కారు కిందా కుక్క పిల్ల పడుతుంది. మన కథకి అవసరం కాబట్టి వర్ణిద్దాం.
అయితే ఉత్త వర్ణన ఏం బావుంటుంది. కొంచెం చమత్కారం కావాలి. మహానగరంలో మనుష్యులు కార్ల మీద పోతారు. కార్లూ మనుషుల మీద పోతాయి అందాం. ఎలా మొదలు పెట్టినా పాఠకుడులో ఉత్సాహం కలిగి కుతూహలం కలిగేటట్టు మొదలెట్టాలి.
జాన్ పెన్ అనే ఒక నవలా రచయిత టెమ్టేషన్ అనే ఒక నవల ఇలా మొదలెట్టాడు. నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి.
ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది.
ఇటువంటి సెంటిమెంటు కథని కథ ఎత్తుగడలో ఈ రచయిత వాడితే చచ్చి, సర్గాన్ని ఉన్న నారాయణ బాబు ఒక గేయం చివరలో చచ్చిపోయిన పురిటి కందు యొక్క గాజు కళ్లు..మా అమ్మే చంపింది. ..మా అమ్మే చంపింది అని నేరారోపణ చేస్తున్నట్లు వర్ణించాడు.
కథ మొదట్లో కుతూహలాన్ని,చివర ఆలోచన్లనీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.  ఈ మాత్రం కిటుకులు చెప్పాను. కనుక ఇక మీకు ఆలోచించండి. రాయండి.
ఈ ఆర్టికల్ ని ఆరుద్రగారు 1992 లో రాయటం జరిగింది. మరో రచయిత శార్వరి గారు “కథలు రాయటం ఎలా” అనే పుస్తకంలో ఈ తరహా ఆర్టికల్స్ ని ప్రముఖ రచయితలందరి చేతా రాయించి సంకలనం చేయటం జరిగింది.
మొన్నీ మధ్య డైరక్టర్స్ అసోషియేషన్ వారి సమావేశంలో ప్రముఖ దర్శకుడు ఒకాయిన ఈ పుస్తకం గురించి ప్రస్దావించి సినిమా రచయిత,దర్శకులు తప్పని సరిగా చదివితీరాలి అని గట్టిగా చెప్పటం జరిగింది. వెంటనే ఆయన్నే ఓ కాపీ అడిగి..చదవి..సరే మన నవతరంగం మిత్రులుకు కూడా పరిచయం చేద్దదామనిపించింది…అంతే..
ఇక్కడితో ఆరుద్ర గారి చిట్కాలు సమాప్తం.
ఈ పుస్తకంలో … శ్రీ మల్లాది రామకృష్ణ శాస్తి, కేతు విశ్వనాధ రెడ్డి, బొల్లిముంత శివరామకృష్ణ, శ్రీ బుచ్చిబాబు, బాలగంగాధర తిలక్, కె.రామలక్ష్మీ, నవీన్, పులికంటి కృష్ణా రెడ్డి, చలం వంటి మరెందరో ప్రముఖలు కథలు రాయటం ఎలా అని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. పుస్తకం దొరికితే మిస్సు కాకండి.దొరకకపోతే మెల్లిగా నేను వాటిని టైప్ చేస్తూంటాను..
సేకరణ: సూర్య ప్రకాష్ జోశ్యుల

మొదటి భాగం ఇక్కడ…

“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు.

ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది కొసమెరుపు. చివర చీమ చెప్పే సమాధానం మనకు నవ్వు పుట్టిస్తుంది. కథ అయిపోయిందనిపిస్తుంది. ప్రతి కథలోనూ ఈ గుణముండాలి. ప్రఖ్యాత కథానికా రచయిత వొ.హెన్రీ చిట్ట చివర తాను తిప్పదలిచే మలుపు మొట్టమొదటనే ఆలోచించుకుని కథ రాసేవాడుట. మీరూ అలా ఆలోచించటం ఒక పద్దతే.

అంతాన్ని ఆదిలోనే ఊహించకపోయినా, మధ్యలో వూహించటం మంచిదే. కుంచాన్ని నిలువునా కొలవటానికి వీల్లేకపోతే అడ్డంగా కొలిచినా కొన్ని గింజలు నిలుస్తాయి. ఇందాక మీకు ఉదాహహణగా కింద కుక్క కథ చెప్పాను. అందులో కొంత అల్లగానే కొసమెరుపేమిటా అని అవ్యక్తంగానే ఆలోచించాను. తనికి ఉపకారం చేసిన కుక్క పిల్లకి గుమస్తా కృతజ్ఞత చెప్పడంతో కథ అంతం చేద్దామనుకున్నాను. ఇది మరీ రొటీన్ గా ఉందని,అది అతని చెయ్యి కరిచిందని చెప్పాను. ఇప్పుడు అనవరసంగా కుక్కపిల్ల విలన్ అయిపోయిందే అని నాకూ బాధ కలిగింది. కరిచిన కుక్కను ఎవడూ క్షమించడు. అందుకే గుమస్తా దాన్ని కొట్టాడన్నాను. అది కారుకింద చచ్చిపోయిందన్నాను. అప్పుడు గుమస్తా యేమనుకున్నాడో మీరే ఊహించుకోండన్నాను. ఇప్పుడు పాఠకులు కూడా కథలో పాల్గొంటారు.

ఇలా అంచెలువారీగా ఆలోచించి కథ రాయటానికి మీరూ సిద్దంగా ఉన్నారా, సరే మీతో కలిసి సహాయం చేస్తాను.  కథా వస్తువు నెంచుకున్నాక, క్రమాన్ని ఆలోచించుకున్నాక కాగితం మీద పెట్టడమే తరువాయి, కథ చెప్పడానికి బాషలోనే. ఎలా మాట్లాడుకుంటే అలా రాయవచ్చుననే వరం గిడుగు రామమూర్తిగారి ధర్మమా అని లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం.

నిజం చెప్పటానికి ఉన్న మాటలు చాలు. అబద్దమాడటానికి మాటల కోసం వెతకాలి. అని (బహుశా) చలంగారు (కాబోలు) అన్నారు. తెలియని మాటలు ఉపయోగించవద్దు. వాడిన మాట అక్కడ ఆ సందర్భంలో అవసరమా,కాదా అని కూడా ఆలోచించాలి. మాటల్లని తూచి వాడమన్నారు.

మాటల్ని తూచడమెలాగ..అవేం ఘన,ద్రవ,వాయు పదార్ధాలా తూచటానికి అనుకోవద్దు. మాటల్ని తూచి,వాడగలిగినవాడే సమర్దుడని చెప్పాలి. కీ లెరిగి వాత, వీ లెరిగి చేత అన్నట్లు వాడిన మాట అతికినట్లుండాలి. ఆ మాట వాక్యంలో ముందొచ్చినా,వెనకొచ్చినా పనికిరాదు. ఒక ఉదాహణ చెప్తాను.

సీతా,నిన్ను ప్రేమిస్తున్నాను,నీవు నిరాకరిస్తే చచ్చిపోతాను ఆమె నిరాకరించింది. అతను చనిపోయాడు. అరవై ఏళ్ళ తరువాత. ఈ ఉదాహణలో అరవై ఏళ్ల తరువాత అన్నమాట ఆఖర్నొస్తే నాజూకు. ఆమె నిరాకరించింది. అరవై ఏళ్ళ తర్వాత అతను చచ్చి పోయాడు అన్నాడనుకోండి గమ్మత్తేముంది.

ఒక కథలోంచి మరో ఉదాహరణ చెప్తాను. ప్రేమ..ఈ రోజులలో మరీ కేవలం యువతీ యువకులకు అది పర్యాయపదమయింది…పర్యాయపదం కాదు. ఊతపదం అనాలి. రచయిత తాను వాడే మాట ఏమిటే ఆలోచించకుండా వాడేయకూడదు.

తిరస్కరించిన కథలలోంచి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. అయితే కథలు ఎలా రాయాలో మీకు చెప్పదలచుకున్నాను గానీ, ఎలా రాయకూడదో కాదు..అందుకే రాసే పధ్దతే చెప్తాను.

సరే..కథా వస్తువు దొరికింది. భాష నిర్ణయించుకున్నాం. ఎత్తుగడ ఎలా చేయడం ఇది గడ్డు సమస్యే. దీన్నే కృత్యాద్యవస్ధ అంటారు. నేను మీకు చెప్పిన కుక్క పిల్ల కథే తీసుకుందాం. దీన్ని ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు. గుమస్తా పేరేమిటి పెడదాం..గుర్నాధం అందాం. ఫైళ్ళలో కాగితాలు పెట్టడంతో మొదలు పెడదామా లేదా రోడ్డు మీద కుక్క పిల్ల తిరుగుతూ ఉండటంతో మొదలు పెడదామా

కథలో యూనిటీ ఆఫ్ టైమ్ అనీ యూనిటీ ఆఫ్ స్పేస్ అనీ రెండు ఉంటాయంటారు. వీటి గురించి ముందు తెలుసుకోవచ్చు. కథ ఆధ్యంతాలలో ఏకత్వం కావాలన్నది ఒక లక్షణం. కథ రోడ్డు మీద మొదలెట్టి రోడ్డు మీద అంతం చెయ్యడం బాగుంటుంది. అందుచేతే కుక్కపిల్లతోనే మొదలెడదాం.

రోడ్డుని వర్ణించుదామా..శుభం. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అనవసరపు వర్ణనలు మంచిది కాదు. చదివేవాళ్ళకు విసుగూ,మనికి శ్రమ, నా చిన్నప్పుడో శుభాషితం చదివాను. ఇప్పటికీ మరిచిపోను. అదీ కథలు రాసే వాళ్లకి సలహాయే.

గదిలో ఒక పిస్తోలు ఉందని కథలో చెప్తే,కథ అయ్యిపోయేలోపల అది పేలాలి. లేకపోతే అది ఉన్నట్లు చెప్పటం దండుగ అని చెకోవ్(కాబోలు) చెప్పినట్లు నార్లవారు(బహుశా)రాసారు. ఎవరు చెప్పారో..నేను మరిచిపోయినా చెప్పింది మరిచిపోలేదు.

రోడ్డును వర్ణిస్తూ కార్లూ, సైకిళ్ళూ చిత్తమొచ్చినట్లు పోతున్నాయి. అని చెప్ధా. ఏమంటే కొంత సేపు పోయాక మొదట సైకిల్ కిందా, తరువాత కారు కిందా కుక్క పిల్ల పడుతుంది. మన కథకి అవసరం కాబట్టి వర్ణిద్దాం.అయితే ఉత్త వర్ణన ఏం బావుంటుంది. కొంచెం చమత్కారం కావాలి. మహానగరంలో మనుష్యులు కార్ల మీద పోతారు. కార్లూ మనుషుల మీద పోతాయి అందాం. ఎలా మొదలు పెట్టినా పాఠకుడులో ఉత్సాహం కలిగి కుతూహలం కలిగేటట్టు మొదలెట్టాలి.

జాన్ పెన్ అనే ఒక నవలా రచయిత టెమ్టేషన్ అనే ఒక నవల ఇలా మొదలెట్టాడు. నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి.ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది.

ఇటువంటి సెంటిమెంటు కథని కథ ఎత్తుగడలో ఈ రచయిత వాడితే చచ్చి, సర్గాన్ని ఉన్న నారాయణ బాబు ఒక గేయం చివరలో చచ్చిపోయిన పురిటి కందు యొక్క గాజు కళ్లు..మా అమ్మే చంపింది. ..మా అమ్మే చంపింది అని నేరారోపణ చేస్తున్నట్లు వర్ణించాడు.కథ మొదట్లో కుతూహలాన్ని,చివర ఆలోచన్లనీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.  ఈ మాత్రం కిటుకులు చెప్పాను. కనుక ఇక మీకు ఆలోచించండి. రాయండి.

ఈ ఆర్టికల్ ని ఆరుద్రగారు 1992 లో రాయటం జరిగింది. మరో రచయిత శార్వరి గారు “కథలు రాయటం ఎలా” అనే పుస్తకంలో ఈ తరహా ఆర్టికల్స్ ని ప్రముఖ రచయితలందరి చేతా రాయించి సంకలనం చేయటం జరిగింది.

మొన్నీ మధ్య డైరక్టర్స్ అసోషియేషన్ వారి సమావేశంలో ప్రముఖ దర్శకుడు ఒకాయిన ఈ పుస్తకం గురించి ప్రస్దావించి సినిమా రచయిత,దర్శకులు తప్పని సరిగా చదివితీరాలి అని గట్టిగా చెప్పటం జరిగింది. వెంటనే ఆయన్నే ఓ కాపీ అడిగి..చదవి..సరే మన నవతరంగం మిత్రులుకు కూడా పరిచయం చేద్దదామనిపించింది…అంతే..

ఇక్కడితో ఆరుద్ర గారి చిట్కాలు సమాప్తం.

ఈ పుస్తకంలో … శ్రీ మల్లాది రామకృష్ణ శాస్తి, కేతు విశ్వనాధ రెడ్డి, బొల్లిముంత శివరామకృష్ణ, శ్రీ బుచ్చిబాబు, బాలగంగాధర తిలక్, కె.రామలక్ష్మీ, నవీన్, పులికంటి కృష్ణా రెడ్డి, చలం వంటి మరెందరో ప్రముఖలు కథలు రాయటం ఎలా అని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. పుస్తకం దొరికితే మిస్సు కాకండి.దొరకకపోతే మెల్లిగా నేను వాటిని టైప్ చేస్తూంటాను..

సేకరణ: సూర్య ప్రకాష్ జోశ్యుల

5 Comments
  1. సాయి బ్రహ్మానందం December 16, 2009 /
    • j.surya prakash December 16, 2009 /
  2. jo December 16, 2009 /
  3. achallasrinivasarao August 29, 2010 /