మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి – The Man Beyond The Bridge

manbeyondthebrid_03

manbeyondthebrid_03“The Man Beyond The Bridge” (పల్తదచో మునిస్) అనే కొంకణి భాషా చిత్రం 2009 టొరంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినీవిమర్శకులిచ్చే discovery award గెలుచుకుంది. ఈ 96 నిమిషాల నిడివిగల చిత్రం NFDC సహకారంతో లక్ష్మీకాంత్ షటగోంకర్ నిర్మించి దర్శకత్వం వహించారు. భారతీయ మీడియా, సినీపరిశ్రమ ఇదే చలనచిత్రోత్సవాల్లో ప్రిమియర్ జరుపుకున్న ఆశుతోష్ గొవరికర్ “Whats your Rashee”, యష్ రాజ్ సంస్థ నిర్మించిన “Dil bole Hadippa” లకు ఇచ్చిన కవరేజ్ ఈ చిత్రానికి ఇవ్వలేదు. అదే విదేశీ చలనచిత్రోత్సవంలో అత్యంత ప్రతిష్టాత్మక గౌరవం దక్కినతరువాతగానీ ఈ చిత్రాన్ని మన భారతీయులు గుర్తించలేదు.

The-Man-Beyond-The-Bridge-Premప్రస్తుతం గోవా జరుగుతున్న భారతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రారంభచిత్రంగా ప్రదర్శించారు. సినిమాల వ్యాపారానికి కేంద్రంగా మాత్రమే తయారవుతున్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించిన నిర్వాహకులు, సహజంగానే ఈ దర్శకుడ్ని ఆహ్వానించడం మర్చిపోయారు. మీడియా గుర్తుచేసిన నాలుగు రోజులకుగానీ నిర్వాహకులు చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ షటగోంకర్ ఆహ్వానించలేదు. ఈ ఘటనకు ప్రతిస్పందిస్తూ దర్శకుడు “For me and my crew members it was a privileged opportunity to walk the red carpet. However, I along with my crew decided not to attend the red carpet offered after five days of the opening of the film in interest of prestige and dignity of the IFFI,” అంటూ చురక అంటించి తప్పుకున్నాడు.

గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని అడవిలో నివసించే ఒంటరి ఫారెస్ట్ గార్డ్ జ్ఞపకాలు, మానసిక వికలాంగురాలైన యువతికీ అతనికీ మధ్యసాగే అనుబంధం విషయవస్తువుగా ఈ కొంకణి సినిమా రూపొందింది. హాలీవుడ్ సినిమా మూసల్ని కాపీకొట్టి, ప్రపంచ సినిమా స్థాయిని అందుకుంటున్నామని చంకలుగుద్దుకుంటున్న మన సినీపరిశ్రమ పోకడలు, ఈ మూససినిమాల అవతలివైపున నిలుచున్న అసలుసిసలైన భారతీయ సినిమాల్ని గుర్తించకపోవడం పెద్దగా ఆశ్చర్యకరం కాకపోయినా, ఖచ్చితంగా బాధాకరం.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

3 Comments to “మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి – The Man Beyond The Bridge”

  • అవునూ..హెడ్డింగ్ ను చూసి ఈ చిత్రాన్ని మరో మూస సినిమా వచ్చిందని చెప్తున్నారనుకున్నా..చూస్తే కంటెంట్ ఆపోజిట్ గా ఉంది..నా డౌట్ కరెక్టేనా

    సూర్య ప్రకాష్ జోశ్యుల

    • @సూర్యప్రకాష్: నిజమేనండోయ్, అపార్థం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఉప్పుడు శీర్షిక కొంచెం మార్చాను చూడండి.

  • Welcome to Best Blog 2009 Contest

    The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.

    Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.

    Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

    Good Luck! Spread the word and enjoy the contest.

    plz contact andhralekha@gmail.com

    http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories