![]()
ఈ మధ్య గోవా వేదికగా జరిగిన IIFI లో ‘ఇండియన్ సినిమా T20′ అనే ఒక పోటీనిర్వహించింది. ఆశ్చర్యపోనవసరం లేకుండా ఆ లిస్టులో ఒక్క తెలుగు సినిమాకూడా లేదు.
1. Meghe Dhaka Tara (Bengali)
2. Charulata (Bengali)
3. Pather Panchali (Bengali)
4. Sholay (Hindi)
5. Do Beegha Zameen
6. Pyaasa (Hindi)
7. Bhuvan Shome (Hindi)
8. Garam Hawa (Hindi)
9. Mother India (Hindi)
10. Ghatashradha (Kannada)
11. Ellipathayam (Malayalam)
12. Mughal-E-Azam (Hindi)
13. Nayagan (Tamil)
14. Kagaz Ke Phool (Hindi)
15. Apu Triology (Bengali)
16. Sant Tukaram (Marathi)
17. Jane Bhi Do Yaaron (Hindi)
18. Guide (Hindi)
19. Madhumati (Hindi)
20. Anand (Hindi)
Anon says:
ఆనందం! మహానందం! పరమానందం! ఎవరైనా లేదని ఆశ్చర్యపోతే అదే ఆశ్చర్యం!
కలకాలం అలా పచ్చగా పోటిల్లో లేకుండా, సోదిలోకి రాకుండా, పాపీ చిరాయువుగా బతకాలి అని ఆ మహాదేవుడిని కోరుకుంటూ!
Viplove K says:
మహేశ్‍గారూ
ఈ లిస్టు ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నాదో అర్థం కావట్లేదు.
మీ ఉద్దేశ్యం ..నిజ్జంగా తెలుగు సినిమాలు ఈ ఇరవైల్లో వేటి మధ్యా ఉండేంత అర్హత లేనివనా ? లేక, తెలుగుసినిమాలని గుర్తించకుండా ఐఐఎఫ్‍ఐ వాళ్ళు మోసం చేస్తున్నారనా ?
రెండవ అభిప్రాయం అయితే నేను ఏకీభవిస్తాను. కానీ మొదటిదే అయితే ఇది మన ఆత్మగౌరవాన్ని మనమే కించపరుచుకోవడం.
నా ఉద్దేశ్యం ప్రకారం ఈ లిస్టు చూస్తుంటే , ఖచ్చితంగా దక్షిణ భారత చిత్రాలను చిన్నచూపు చూడటమే ఉద్దేశ్యం అన్నట్లు అనిపిస్తోంది . కంటితుడుపు చర్యగా కన్నడ తమిళ మళయాల చిత్రాలకు ఓక్కో అవకాశం ఇచ్చారు.. అదీ టాప్ టెన్‍లో కాదు. మన తెలుగుకు ఆ కంటితుడుపు చర్య కూడా ఎందుకు లేదు అంటే , మనవాళ్ళు ( ఫెస్టివల్ జ్యూరీల్లోనూ , డిప్లొమేటిక్ స్థానాల్లో ఉండే మంత్రులూ , మేధావి వర్గం వారూ ) ఎవరూ గుర్తింపు లభించనపుడు ఎదురు ప్రశ్నించరు.
మేఘె ఢాకె తారా , అప్పూ ట్రిలజీ . ఎలియపత్తెమ్ లాంటి చిత్రాలతో పోల్చలేం కానీ .. మొఘల్ ఎ అజామ్ తో పోల్చుకుంటో మన బ్లాక్ అండ్ వైట్ పౌరాణికాలూ , మాయాబజార్ లాంటివి ఏ విషయంలోనూ తక్కువ కాకపోగా , కాస్తం ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
తమిళంలో కూడా ఎన్నో ఉత్కృష్టమయిన చిత్రాలను వదిలి నాయకన్‍నే నామినేట్ చేస్తే మన శివ కూడా దానితో సమానమే.
మదర్ ఇండియాలాంటి మెలోడ్రామాలు అయితే ఇక చెప్పనవసరం లేదు. తమిళ ,తెలుగులో మొదట వచ్చి హిందీ ప్రేక్షకుల కర్చీఫులను తడిపేసినవి ఎన్నో మరి. పేరు గుర్తు లేదు కానీ , చిన్నప్పుడు చూసా, మదరిండియాలాంటి కథాంశంతోనే పాత శివాజీ గణేశన్ సినిమా ఉంది. (నిజానికి దాని ముగింపే భారతీయుడు చిత్రం ముగింపు )
ఇక మధుమతి లాంటీ పునర్జన్మ సినిమాలు అయితే…. మూగమనసులు… అన్ని విభాగాల్లోనే అద్భుతమయిన పనితనం ఉన్న చిత్రం.
జానె భీ దో యారో లాంటివి మళయాళంలో కోకొల్లలు.
సో…. మీ అభిప్రాయం ఈ లిస్టు వలన తెలుగు సినిమాలను అదేపనిగా గుర్తించకపోవడమే వాళ్ళ ఉద్దేశ్యం అని అయితే , కాస్త వివరంగా వ్రాయగలరు.
అలా కాక, మీ ప్రకారం కూడా మన ఇన్నేళ్ళ సినిమాల్లో ఏ ఒక్కటీ ఆ ఇరవయి చిత్రాల స్థానే ఉండజాలదు అనే అభిప్రాయం అయితే , ఎందుకో ఏమిటో వివరింపగలరు. మన తెలుగు సినిమాను మనమే తక్కువ చేసుకోవడంలో తప్పులేదు, కానీ అది నిజంగా నిజమయితేనే.
K మహేశ్ కుమార్ says:
@విప్లవ్: “గుర్తింపు” అనేది ఎవడో పక్కోడు ఇస్తేనే వస్తుంది. బహుశా తెలుగు సినిమాలకు అది ఇప్పటివరకూ రాలేదు.‘వచ్చే అవకాశం ఉందా’ అనేది సందేహాస్పదం.
మనం మనం చంకలు గుద్దుకోవడమేతప్ప, క్లాసిక్స్ అనుకునే మన పాత సినిమాలను cinematic art & craft,context of Indian film history పరంగా బేరీజుచేస్తే మనకు నిరాశే మిగలొచ్చు. దీన్ని ఆత్మగౌరవ సమస్యగా చూడటంకన్నా, మన సినిమాను మనం disinterested analysis చేసుకోవడం అవసరం అనే స్పృహను కలిగిస్తేచాలు.
మీరు చెప్పిన తెలుగు సినిమాల లిస్టుకన్నా మల్లీశ్వరి,మాభూమి చిత్రాలు ఆ లిస్టులో ఉండాలని పోరాడటానికి నేను రెడీ.
Heera says:
@Mahesh,
I second you on Malleshwari. But Mayabazar and Missama cannot be forgotten too. Apart from being classics.
Vara says:
vivek gaaru,
I am composing the same …but you have done it very well….
సినిమా ప్రేమికుడు says:
ఇది నిజ్జంగా నిజమా మరీ విడ్డూరంగా వుందే తమిళ్ నాయకన్, హింది గైడ్, ఆనంద్ కన్నా గొప్ప సినిమాలు తెలుగులొ లేవా ఈ జాబితా తయారు చేయడానికి ప్రామాణికం ఏంటొ నాకర్థం కావట్లెదు
ఏ ప్రామాణికంతొ ఈ జాబితా తయారుచెసి వున్నా నిర్ద్వందంగా ఖండిస్తున్నాను
నాకు తెలిసి నర్తనశాల మొదటి ఐదింటిలొ చేర్చవచ్చు ఇంకా చాలా సినిమాలు వున్నాయి ప్రస్తుతానికి ఇది గుర్తుకొచ్చింది
Vara says:
I remember, Once chiranjeevi told this on Vajrotsavam….they are like this….”when I go to Gova filim festival, I cant see NTR, ANR photos also. ”
Its true that there are certain sections (even some south directors) who wants to be recognized as great directors and lobbies at international film festivals…….It doesnt mean Mayabazar, paathala bhiravi, malleswari ….many more or bad movies……….I really dont know much about hindhi movies..but I wonder if they have a movie like Alluri seeta rama raju…….dont humuliate your self…….if possible raise your voice or forget about the crap going on…….
G says:
అల్లూరి సీతారామరాజు is the best of the biographical movies ever made. Ar least one of the best. Indian cinema means Hindi cinema, and South cinema means Tamil. ఇది మన వాళ్ళకున్న అభిప్రాయం.
తెలుగులో ఉన్నవాటిల్లో మంచి సినిమాలు లేవనే వారు, రావని నమ్మకం లేని వారు, తెలుగులో ఐతే ఎంత ప్రయత్నించినా మంచి సినిమాని తీయలేరు. వాళ్ళంతా హిందీలోనో, అరవంలోనో తీసుకుంటారేమో మరి?
Vara says:
correction on the above post
*…….It doesnt mean Mayabazar, paathala bhiravi, malleswari ….many more are bad movies……
Vara says:
deenni andaroo kandinchaalisinde…..deenni support chesina vaallu….Vijaya movies vaari ni, pushpaka vimaanam teesina singeetam srinivas ni….vitala charya ni..avamaaninchinatle…, Anand, Guide ….super devanand….every one openly knows about his lobbying….
అభిమాని says:
ఇది అంతగా ప్రాదాన్యతనివ్వవలసిన విషయం కాదని నా అభిప్రాయం.
ఎవరో ఒక పది మంది జర్నలిస్టులు, ఒక పది మంది దర్శకులు సీల్డ్ కవర్లలో లిస్టులు తయారు చేసి ఇస్తే కొందరు(?)న్యూట్రల్ జడ్జీలు వాటిని కలిపి కూడి ఫైనల్ లిస్టు ఇచ్చారట. అంటే ఈ ఇరవై మంది ప్లస్ ఆ ‘కొందరు’ చెప్పిన లిస్టు ఒక గొప్ప ప్రామాణికమైన జాబితా అవుతుందా?
ఇదివరలో కొన్ని సినిమా పత్రికలు (పత్రికల అమ్మకాలు పెంచుకోవటానికి) సూపర్ స్టార్, సూపర్ మూవీ లాంటి అవార్డుల కోసం ఏటా పోటీ పెట్టి చదువరులు పత్రికల్లో కూపన్లు కట్ చేసి పంపితే వాటిని బేస్ చేసుకుని ఫలితాలు ఇచ్చేవి. ఆ కూపన్ల కోసం అభిమానులు పత్రికలను టోకున కొనేసి తమ అభిమాన హీరోకి ఓట్లు వేయటం కూడా మనం ఎరిగినదే. ఇక్కడ జరిగింది మరీ అలాంటిది కాకున్నా, ఇంచుమించు అలాంటి ఫార్సే.
లిస్టులో పేరు ఉండాలంటే కావాల్సింది తెలుగుతనం మీద మమకారం కాదు. సిగ్గు విడిచి లాబీయింగ్ చెయ్యగల తెగువతనం.
డోంట్ వర్రీ మిత్రులారా. మనం ఎవడికంటేనూ తక్కువ కాదు.
K మహేశ్ కుమార్ says:
@అభిమాని: ఆ లిస్టులోని ప్రామాణికత గురించి నాకు తెలీదు. కానీ ఆ లిస్టులో ఉన్న సినిమాలన్నీ “భారతీయ” సినీఅభిమానుల నాలుకల చివరనుండే పేర్లు. అందులో తెలుగు సినిమా లేదంటే అది మనసమస్యగానీ వాళ్ళది కాదు. కేవలం లాబీయింగ్ తో ఇంత విస్త్రుత అభిమానాన్ని చూరగొనడం ఏసినిమాకూ వీలవదు.
అభిమాని says:
మాయాబజార్, శంకరాభరణం సినీఅభిమానుల నాలుకల చివరనుండే పేర్లు కావా? వాటికైనా చోటు దొరకలేదంటే అది వాళ్ళ సమస్యే కాని మనది కాదు.
అభిమాని says:
ఈ లిస్టు తయారు చేసిన ‘మేధావులు’ గత 75 ఏళ్ళుగా దేశంలో వచ్చిన అన్ని భాషలలోని అన్ని సినిమాలు చూసి ఉన్నారా ????
రాజశేఖర్ says:
ఇలాంటి లిస్టుని చూసి తెలుగు సినిమాకు అన్వయించుకోవడం అనవసరం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవార్డులకి, పైన చెప్పిన ఫిల్మ్ ఫెస్టివల్స్ కి లాబీయంగ్ అన్నది చాలా అవసరం, ఇది అందరికీ తెలిసిన నిజం!బెంగాలీ సినీ రంగం 60%, మళయాల సినీ రంగం 40% ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసమే సినిమాలు తీస్తాయి, కన్నడ సినీ రంగంలో గిరీష్ కర్నాడ్ లాంటివాళ్ళు ఉండనే ఉన్నారు.తమిళుల సంగతి మీకు తెలిసిందే.జ్యూరీలో ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది హిందీ సినీ రంగానికి చెందినవాళ్ళే. మన తెలుగు సినీ రంగంలో 99% సినిమాలు వ్యాపార దృక్పథంతోనే తీస్తారు, మిగిలిన 1% ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం అందులోనూ వాటిని పట్టించుకునే నాధుడే ఉండడు. ఇక లాబీయింగ్ సంగతి సరేసరి!
P.S: పై జాబితాలో ఉన్న చాలా సినిమాలను తలదన్నే సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి, నిజానికి ఆ జాబితా చూస్తే నాకు చాలా ఆనందమేసింది, “అర్థ్ సత్య” లాంటి సినిమానే వదిలేసారు. బహుశా ఓం పురి తన బయోగ్రఫీ పుస్తకం ప్రమోషన్ లో బిజీగా ఉండి లాబీయింగ్ చేయలేదేమో?!
Sowmya says:
Apu Trilogy – ఒకే సినిమా గా లెక్కేస్తున్నారా?
రాజశేఖర్ says:
@Sowmya
భలేవారండి! అలా కాబట్టే, మరో రెండు సినిమాలకి జాబితాలో చోటు దొరికింది!
Saumyae says:
apu Trilogy lO pathEr pAnchAli kUda okaTi kadaa..
mari aa movie ni verega inkosari mention chesaare!!!
శిద్దారెడ్డి వెంకట్ says:
ఈ మాట ప్లగిన్ పెట్టినా కూడా తెలుగులో టైప్ చెయ్యలేకుండా ఉన్నాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియచేయగలరు.
రాజశేఖర్ says:
నిజానికి Pather panchali, Aparajito and Apur sansar ఈ మూడింటిని కలిపి Apu Triology అంటారు. మరి తప్పిదం ఎక్కడ జరిగిందో?!
Heera says:
How come Anand has made it to the list???
రాజశేఖర్ says:
@Heera
తప్పు! తప్పు!! జ్యూరీ వాళ్ళు సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడక్కూడదు.
Heera says:
పులిరాజా says:
http://beta.thehindu.com/arts/movies/article58559.ece?homepage=true
దక్షిణ భారత సినిమాలకి ఒక్కో భాష తరపున కంటి తుడుపుగా ఒక్కో సినిమా
somayajulu says:
అసలందరూ శంకరాభరణం సినిమాని ఎలా మర్చిపోయారోనాకు అర్ధం కావట్లేదు?
సినిమా తీసేవాళ్ళకి టెక్స్టు పుస్తకం లంటిదా సినిమా…
rr says:
ఇక అవార్డుల సంగతంటారా…అవి ఉన్న చెత్తలో ఉత్తమమైన చెత్తకు ఈ మధ్యకాలంలో పరిమితమయ్యాయవి. కాబట్టి వచ్చుంటే వచ్చుండచ్చు….
ఈ చెత్తలో మన తెలుగు సినిమా లేనందుకు చాలా సంతోషం.
K మహేశ్ కుమార్ says:
@rr: ఇది అవార్డుకాదు. సాధారణ ప్రేక్షకులు చేసిన వోటింగ్ ఆధారంగా తయారు చేసిన ఒక లిస్టు మాత్రమే.
Vanamali says:
Apu Triology at 15th place…??????
And Sholay at 4th place???(it is not even original film…)
i wonder what are the parameters????
rr says:
12.నాయగన్ (తమిళ్)కూడా original కాదు. Hollywood movie Godfather copy