Menu

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3

శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) అనుకుంటారు. మా ఇనిషియల్స్ చూసి నాకు ఆయన బంధువులు కారు..అంతకన్నా అధికులు..దైవ సమానులు.
ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఎన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఆస్తులు-అంతస్తులు చిత్రంలో సుశీలతో నేను  పాడిన ఒకటైపోదామా అన్న పాట. మానసికంగా ఒకటై పోయిన శ్రీ కోదండపాణిగారు నాకు సంగీతపరంగా మానసికంగా గురువు.
శ్రీ కె.వి.మహదేవన్
మూగ జీవులు చిత్రంలో నేను పాడిన దయలేని లోకాన అన్న పద్యాన్ని శ్రీ కే.వి.మహదేవన్ గారికి వినిపించారు. శ్రీ కోదండపాణి్గారు, ఆ
విధంగా  శ్రీ మహదేవన్ గారితో నా గాత్రానికే ముందుగా పరిచయం కల్గింది. ఆయనతో నాకు ముఖ పరిచయం లేదప్పుడు. అప్పుడు మిత్రుడు శ్రీ మోహన్ కుమార్ నన్ను డి. బి.ఎన్ వారి ఆఫీసుకు వెంట బెట్టుకు పోయారు. అక్కడ శ్రీ కే.వి.ఎమ్ గారు శ్రీ పుహళేంది గారి సాయింతో స్వరకల్పన చేస్తున్నారు.
శ్రీ డి.బి.ఎన్.గారు,దర్శకులు శ్రీ విశ్వనాధ్ గారు పర్యవేక్షస్తున్నారు. శ్రీ మోహన్ కుమార్ నన్ను అక్కడ వారికి పరిచయం చేసారు. శ్రీ.కే.వి.యమ్ గారు నీ పాట విన్నానోయ్..బాగుంది. సిగ్గు పడబోకు,ఒక పాట పాడు, మన వాళ్లు వింటారు అని భుజం తట్టి
ఉత్సాహపరిచారు. అలవాటు ప్రకారం దోస్తీ లో పాట పాడాను. శ్రీ కే.వి.ఎమ్ గారికి,శ్రీ పుహళేంది గారికి రఫీ పద్దతి చాలా ఇష్టం. ఆయనకు
నా పాట బాగా నచ్చింది. ఆయన కోరిక ననుసరించి ఒక తెలుగు పాట ముద్ద బంతి పూవులో (మూగమనసులు చిత్రంలో) పాట పాడాను. ఆ నాటికి ఆ అనుభవం పూర్తయింది.
నాలుగు రోజులు తర్వాత ప్రేవేట్ మాస్టార్  చిత్రంలోని పాడుకో పాడుకో (శ్రీ ఆరుద్ర రచన)పాట పాడుకోమని పిలుపు వచ్చింది. సైకిల్ పై
డి.బిఎన్ ఆఫీస్ కు వెళ్ళాను.సైకిల్ మీద నన్ను చూసి శ్రీ కె.వి.ఎం గాయకుడుకి సైకిల్ తొక్కటం మంచిది కాదని,మానేయమని సలహా ఇచ్చారు. అప్పటి కింకా ఏ.యం.ఐ.ఇ చదువుతున్న నాకు సరిపోయేటట్టు(పాడుతూ చదువుకో) పాట వ్రాయించామని చమత్కరించారు శ్రీ డి.బిఎన్.గారు.
నాకు ఏ విధంగా పాడితే వీలుగా ఉంటుందనిపిస్తే ,ఆ పద్దతిలో పాడమని,సన్నివేశానికి తగినట్లు పాడమని సంపూర్ణ  స్వాతంత్ర్యం ఇచ్చేసారు శ్రీ మహదేవన్ గారు, చిత్రం సహకార దర్శకులు శ్రీ పెండ్యాల నాగాంజనేయులు గారు సన్నివేశాన్ని తన సహజ ధోరణిలో హాస్య ధోరణిలో  వివరించారు. మరు దినం విజయోధ్యాన వాటికలో విజయవంతంగా ఆ పాట శబ్ద గ్రహణం జరిగింది.
నటనకు ప్రతి రూపాలైన మన కథా నాయకులు పద్మశ్రీ యుతులు శ్రీ ఎన్.టి.ఆర్, శ్రీ ఎ ఎన్నార్ గారలకు ఏకవీర,ఇద్దరమ్మాయిలు చిత్రాలలో తొలిసారిగా పాడే అవకాశాలు, తమిళ కథానాయకులు,ప్రజాభిమాన ధనాఢ్యులు శ్రీ ఎమ్.జి.ఆర్. గారికి అడిమై పెణ్ తమిళ చిత్రం(తెలుగులో కొండవీటి సింహం)లో పాడే అవకాశం నాకు శ్రీ కే.వి.ఎమ్ సంగీత దర్శకత్వంలో లభించింది.
ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం ఆనందకరం. పల్లవిని సులభంగా వినిపించి వినగానే పాడగలిగించేట్లు మలచటంలో శ్రీ కే.వి.ఎం నేర్పరులు. ఆయన నిర్ధేశకత్వంలో నేను పాడిన పాటలలో సంగీత సాహిత్య పరంగా ఏకవీర లోని పాటలు, ఉండమ్మా బొట్టు పెడతా లోని చుక్కలతో చెప్పాలని పాట నాకు ఎంతైనా ఇష్టం.
సంగీత మేదైన సాధించును
స్వరాల ప్రభావం అమోఘం సుమా
అన్న ఆరుద్ర ముద్ర నా మీద ప్రసరించి..నేను-నా గాత్రం పైకి రావటానికి శ్రీ కే.వి.ఎమ్ గారి పాత్ర ప్రముఖమైనది.
తరువాత…
శ్రీ రాజేశ్వరరావు గారితో, శ్రీ పెండ్యాల గారితో అనుభవాలు…
నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలినాటి ముచ్చట్లు పేరుతో జూలై 1970 సినిమా రంగం సంచికలో వచ్చింది. అది నడిపింది శ్రీ  జి.వి.జి గారు. ఈ ఆర్టికల్ ని ఎస్పీ గారు మిత్రులు గాయకులు తిరుపతి.పి.ఎస్.గోపాలకృష్ణ గారు సేకరించి సమర్పించినట్లుగా రాశారు.
సేకరణ: జోస్యుల సూర్యప్రకాష్

spbశ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) అనుకుంటారు. మా ఇనిషియల్స్ చూసి నాకు ఆయన బంధువులు కారు..అంతకన్నా అధికులు..దైవ సమానులు.

ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఎన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఆస్తులు-అంతస్తులు చిత్రంలో సుశీలతో నేను  పాడిన ఒకటైపోదామా అన్న పాట. మానసికంగా ఒకటై పోయిన శ్రీ కోదండపాణిగారు నాకు సంగీతపరంగా మానసికంగా గురువు.

శ్రీ కె.వి.మహదేవన్

మూగ జీవులు చిత్రంలో నేను పాడిన దయలేని లోకాన అన్న పద్యాన్ని శ్రీ కే.వి.మహదేవన్ గారికి వినిపించారు. శ్రీ కోదండపాణి్గారు, ఆ

విధంగా  శ్రీ మహదేవన్ గారితో నా గాత్రానికే ముందుగా పరిచయం కల్గింది. ఆయనతో నాకు ముఖ పరిచయం లేదప్పుడు. అప్పుడు మిత్రుడు శ్రీ మోహన్ కుమార్ నన్ను డి. బి.ఎన్ వారి ఆఫీసుకు వెంట బెట్టుకు పోయారు. అక్కడ శ్రీ కే.వి.ఎమ్ గారు శ్రీ పుహళేంది గారి సాయింతో స్వరకల్పన చేస్తున్నారు.

శ్రీ డి.బి.ఎన్.గారు,దర్శకులు శ్రీ విశ్వనాధ్ గారు పర్యవేక్షస్తున్నారు. శ్రీ మోహన్ కుమార్ నన్ను అక్కడ వారికి పరిచయం చేసారు. శ్రీ.కే.వి.యమ్ గారు నీ పాట విన్నానోయ్..బాగుంది. సిగ్గు పడబోకు,ఒక పాట పాడు, మన వాళ్లు వింటారు అని భుజం తట్టి

ఉత్సాహపరిచారు. అలవాటు ప్రకారం దోస్తీ లో పాట పాడాను. శ్రీ కే.వి.ఎమ్ గారికి,శ్రీ పుహళేంది గారికి రఫీ పద్దతి చాలా ఇష్టం. ఆయనకు

నా పాట బాగా నచ్చింది. ఆయన కోరిక ననుసరించి ఒక తెలుగు పాట ముద్ద బంతి పూవులో (మూగమనసులు చిత్రంలో) పాట పాడాను. ఆ నాటికి ఆ అనుభవం పూర్తయింది.

నాలుగు రోజులు తర్వాత ప్రేవేట్ మాస్టార్  చిత్రంలోని పాడుకో పాడుకో (శ్రీ ఆరుద్ర రచన)పాట పాడుకోమని పిలుపు వచ్చింది. సైకిల్ పై

డి.బిఎన్ ఆఫీస్ కు వెళ్ళాను.సైకిల్ మీద నన్ను చూసి శ్రీ కె.వి.ఎం గాయకుడుకి సైకిల్ తొక్కటం మంచిది కాదని,మానేయమని సలహా ఇచ్చారు. అప్పటి కింకా ఏ.యం.ఐ.ఇ చదువుతున్న నాకు సరిపోయేటట్టు(పాడుతూ చదువుకో) పాట వ్రాయించామని చమత్కరించారు శ్రీ డి.బిఎన్.గారు.

నాకు ఏ విధంగా పాడితే వీలుగా ఉంటుందనిపిస్తే ,ఆ పద్దతిలో పాడమని,సన్నివేశానికి తగినట్లు పాడమని సంపూర్ణ  స్వాతంత్ర్యం ఇచ్చేసారు శ్రీ మహదేవన్ గారు, చిత్రం సహకార దర్శకులు శ్రీ పెండ్యాల నాగాంజనేయులు గారు సన్నివేశాన్ని తన సహజ ధోరణిలో హాస్య ధోరణిలో  వివరించారు. మరు దినం విజయోధ్యాన వాటికలో విజయవంతంగా ఆ పాట శబ్ద గ్రహణం జరిగింది.

నటనకు ప్రతి రూపాలైన మన కథా నాయకులు పద్మశ్రీ యుతులు శ్రీ ఎన్.టి.ఆర్, శ్రీ ఎ ఎన్నార్ గారలకు ఏకవీర,ఇద్దరమ్మాయిలు చిత్రాలలో తొలిసారిగా పాడే అవకాశాలు, తమిళ కథానాయకులు,ప్రజాభిమాన ధనాఢ్యులు శ్రీ ఎమ్.జి.ఆర్. గారికి అడిమై పెణ్ తమిళ చిత్రం(తెలుగులో కొండవీటి సింహం)లో పాడే అవకాశం నాకు శ్రీ కే.వి.ఎమ్ సంగీత దర్శకత్వంలో లభించింది.

ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం ఆనందకరం. పల్లవిని సులభంగా వినిపించి వినగానే పాడగలిగించేట్లు మలచటంలో శ్రీ కే.వి.ఎం నేర్పరులు. ఆయన నిర్ధేశకత్వంలో నేను పాడిన పాటలలో సంగీత సాహిత్య పరంగా ఏకవీర లోని పాటలు, ఉండమ్మా బొట్టు పెడతా లోని చుక్కలతో చెప్పాలని పాట నాకు ఎంతైనా ఇష్టం.

సంగీత మేదైన సాధించును

స్వరాల ప్రభావం అమోఘం సుమా

అన్న ఆరుద్ర ముద్ర నా మీద ప్రసరించి..నేను-నా గాత్రం పైకి రావటానికి శ్రీ కే.వి.ఎమ్ గారి పాత్ర ప్రముఖమైనది.

తరువాత…

శ్రీ రాజేశ్వరరావు గారితో, శ్రీ పెండ్యాల గారితో అనుభవాలు…

నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలినాటి ముచ్చట్లు పేరుతో జూలై 1970 సినిమా రంగం సంచికలో వచ్చింది. అది నడిపింది శ్రీ  జి.వి.జి గారు. ఈ ఆర్టికల్ ని ఎస్పీ గారు మిత్రులు గాయకులు తిరుపతి.పి.ఎస్.గోపాలకృష్ణ గారు సేకరించి సమర్పించినట్లుగా రాశారు.

సేకరణ: జోస్యుల సూర్యప్రకాష్

One Response
  1. రామ December 9, 2009 /