Menu

శబ్ధగ్రహణం – అంతరార్థం

soundఓ థ్రిల్లర్ సినిమా…….అంతా ప్రశాంతంగా ఉంది, సినిమాలో ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది, అంతా నిశ్శబ్ధం కాని ఎవరో అటుగా వస్తున్న అలికిడి. ఎవరా అని చూద్దామని ఆ అమ్మాయి భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ అటుగా వెళ్తున్నది. ఆమె వేస్తున్న అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నది, మరే శబ్ధము లేదు. అంతలోనే ఓ పిల్లి కాలు తగిలి అటకమీద నుంచి స్టీలు సామన్లు గలగలమని కింద పడతాయి. ఒక్కసారిగా నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ వచ్చిన ఆ సౌండ్ వినగానే థియేటర్లో ఉన్న జనమంతా ఉలిక్కి పడ్డారు. అంతటితో ఆ సౌండ్ ఆగలేదు. అన్నిటి కన్నా చివరగా పడ్డ స్టీలు గ్లాసు ఒకటి గిరా గిరా తిరుగుతూ మెల్లగా తన శబ్ధాన్ని తగ్గిస్తూ ఆగుతుంది. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తుంటారు.

పై సన్నివేశంలో ప్రేక్షకులని అంతలా కట్టి పడేయంలో 40% పాత్ర దృశ్యానిదైతే, 60% పాత్ర శబ్ధానిది. అంతేనా కొన్ని సన్నివేశాల్లో దృశ్యం అవసరం లేకుండా శబ్ధంతోనే మనం చెప్పాలనుకున్నది ప్రేక్షకుడికి చేరవేయవచ్చు. ఉదాహరణకి ఓ ఇంట్లో కొంతమంది కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటికి దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉందని తెలియచెప్పాలి. ఇక్కడ దానికోసం మనం ఓ టేక్ ని ఉపయోగించాల్సిని అవసరం లేనేలేదు. ఎంచక్కా ఇంటి పక్కనుంచో వెనక నుంచో ఓ రైలు వెళ్తున్నట్టు శబ్ధాన్ని కలిపితే చాలు. మరి ఇంత ముఖ్యమైన ఆ శబ్ధాన్ని సినిమాల్లో ఏ విధంగా చొప్పిస్తారో తెలుసుకుందామా?!

sound designing గురించి తెలుసుకునే ముందు Audio post-production అనేదాని గురించి తెలుసుకోవాలి.

Audio post-production:
చిత్రీకరణ ముగించుకున్న ఓ దృశ్యమాద్యమానికి సౌండ్ ట్రాక్ ను సమకూర్చడాన్నే Audio post-production అంటారు. పూర్వం అంటే సినిమా అనే మాద్యమాన్ని కనిపెట్టిన మొదట్లో మూకీ చిత్రాలే ఉండేవి, అందువల్ల ప్రత్యేకమైన శబ్ధాలకు ఆవశ్యకత లేకుండా పోయింది. కాని కాలక్రమేణ సాంకేతికాభివృద్ధి జరిగి టాకీ చిత్రాలు రావడం మొదలయ్యింది. అప్పుడు దృశ్యంతో పాటు వచ్చే శబ్ధంలో నాణ్యత ఉండేది కాదు. ఇలా కాదని దీనికి ప్రత్నామ్యాయ మార్గాన్ని ఆలోంచించినప్పుడు పుట్టిందే ఈ “Audio post-production”.అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది సినిమా రంగంలో కొత్త వరవడులు సృష్టిస్తూనే ఉంది. దీనిలో ఈ క్రింది విభాగాలు అంతర్లీనమై ఉంటాయి.

1.Production Dialogue Editing
2.ADR (Automated Dialogue Replacement – if needed)
3.Sound Effects Editing and Design
4.Foley Recording (human sound effects recorded in sync with picture)
5.Music Composition and Music Editing
6.Mixing (also called re-recording)

1.Production Dialogue Editing:
కొన్ని మాటలు సెట్స్ లో లేదా బయట చిత్రీకరణ జరిగే సమయంలోనే రికార్డు చేస్తారు. sound technicians ఆయా టేక్స్ ని తీసుకుని (టేక్స్ అంటే ఇక్కడ film reels కాదు, ఈ dialogues ని వేరే డిజిటల్ సౌండ్ రికార్డర్లతో రికార్డు చేస్తారు) వాటి నుంచి కావలిసిన శబ్ధాలను, మాటలను సంగ్రహించి దృశ్యాలతో sync చేస్తారు. అవసరంలేని శబ్ధాలను తొలగిస్తారు.

2.ADR (Automated Dialogue Replacement – if needed):
ఒకవేళ పైన చెప్పిన dialogues లో noise ఎక్కువయ్యి clarity లేకపోయినా, లేదా కొన్ని మాటలు మిస్ అయినా, వాటిని సరి చేయడం కోసం ADR ని ఉపయోగిస్తారు. దీని కోసం ఒక ప్రత్యేకమైన్ రికార్డింగ్ గది (స్టూడియో) ఉంటుంది. ఆ గదిలో ఆయా పాత్రదారుడు లేదా డబ్బింగ్ ఆర్టిస్టు sync కి అనుగుణంగా తమ మాటలను రికార్డు చేస్తారు. ఈ క్రమంలోనే ADR Editor చాలా జాగ్రత్తగా sync సరిపోతుందో లేదో చెక్ చేస్తాడు. ఒకవేళ ఏదైనా దిద్దుబాటులు చేయాలన్నా ఇక్కడే చేస్తారు. దీనినే looping అంటారు.

3.Sound Effects Editing and Design:
సినిమాల్లో కారు వెళ్తున్న సౌండ్, పక్షుల కిలకిలరావాలు, గాలి వీచే సౌండ్, వర్షం పడుతున్నప్పుడు వచ్చే శబ్ధం, వాహన ప్రమాదం జరిగినప్పుడు వచ్చే శబ్ధం, తుపాకీ పేలిన శబ్ధం, తలుపులు వేసినప్పుడు వచ్చే శబ్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసేది ఈ విభాగమే. దీనికోసం ప్రత్యేకంగా సౌండ్ డిజైనర్స్ ఉంటారు. వాళ్ళే ఆయా శబ్ధాలను రికార్డు చేస్తారు. మొదట్లో వీటిని రికార్డు చేయడానికి 35mm magnetic tape ని ఉపయోగించేవారు, కాని ఇప్పుడు చౌకగా దొరుకుతున్న మరియు డిజిటల్ ప్రమాణాలతో కూడిన డిజిటల్ ఎక్విప్ మెంటుని వాడుతున్నారు. ఒక్కోసారి సినిమా అవసరాన్ని బట్టి మనం ఎప్పుడూ వినని వింత సౌండ్స్ ని కూడా వీళ్ళు సృష్టిస్తుంటారు.

4.Foley Recording (human sound effects recorded in sync with picture) :
ఈ విధానాన్ని మొట్టమొదట కనిపెట్టి ఉపయోగించింది Jack Foley అనే sound engineer. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఈ విధానంలో నటీనటులకి సంబంధించిన శబ్ధాలను sync కి సరిపొయేట్టుగా రికార్డు చేస్తారు. ఉదాహరణకి అడుగుల శబ్ధం, బట్టలు వేసుకునేటప్పుడు, నలిగినప్పుడు వచ్చే శబ్ధం, ఇలాంటివన్నమాట.

5.Music Composition and Music Editing:
Music composition సాధారణంగా మూడు రకాలు, Source, score and songs. Songs గురించి అందరికీ తెలిసిందే. Source music అంటే సినిమాలో మనకు కనిపించే వివిధ పరికరాల నుంచి వచ్చే సంగీతం. ఉదాహరణకు రేడియోలో పాటలు, టివి కార్యక్రమాలు లేదా సినిమాలో సినిమా సంగీతం ఇలాంటివన్నమాట. Score అంటే సంగీత దర్శకుడు ఆయా సినిమాకి ఇచ్చే నేపథ్య సంగీతం.
Music editing అంటే ఎక్కడ ఏ మ్యూజిక్ ఎంత ఉండాలి. దేన్ని ఎక్కువ శబ్ధంలో వినిపించాలి దేన్ని తక్కువ శబ్ధంలో వినిపించాలి. ఎక్కడ నిశ్శబ్ధాన్ని ఉంచాలి ఎక్కడ హోరున BGM పెట్టాలి అన్నదాన్ని నిర్ణయించడం. దీనికోసం ప్రత్యేకంగా ఒక Music supervisor లేదా Music Editor ఉంటాడు. సంగీత దర్శకుడి అభిరుచికనుగుణంగా ఇతను పని చేస్తాడు.

6.Mixing (also called re-recording):
పైన చెప్పిన వాటినంటిని balance చేసుకుంటూ, ప్రతి సన్నివేశంతో sync కుదిరేటట్టు చేసి final output కి తీసుకురావడమే Mixing.పెద్ద సినిమాలకు ఒక్కోసారి ఒక్కో విభాగానికి ఒక్కో mixer పనిచేస్తాడు. మొత్తం అందరినీ సాధారణంగా సంగీత దర్శకుడు నియంత్రిస్తుంటాడు.

ఇంకా ఉంది………..

5 Comments
  1. శర్మ December 11, 2009 /
  2. hero December 12, 2009 /
  3. గీతాచార్య December 13, 2009 /
  4. jo December 17, 2009 /
  5. PK December 22, 2009 /