![]()
చరిత్రలో సలీం(అనార్కలితో)ప్రేమ కథ విషాదాంతం. సేమ్ టు షేమ్ తెలుగు సినీ చరిత్రలోనూ సలీం ది విషాదమే మిగిల్చింది. తనపైనో,తన హీరోపైనో మరిదేనిమీదో నమ్మకం లేక దర్శకుడు వైవియస్ కేవలం తన టాలెంట్ ను మొత్తం ఇలియానా స్కిన్ షో కే ఖర్చుపెట్టాడు. దాంతో దాదాపు ఇరవై మూడు కోట్ల భారీ ఖర్చు,కావాలని సన్నబడి మరీ నటించిన హీరో ఈ కలిసిరాని కథలో కొట్టుకుపోయారు. వరస ఫ్లాపుల సునామీలో ఈ చిత్రమూ కలిసిపోయింది. చివరకు క్లైమాక్స్ దాకా కూర్చునే వారికి బహుమతులు ప్రకటిస్తారేమో అనే డౌట్ వచ్చే స్ధితికి వచ్చేసింది.
యూరప్ నుంచి లాంగ్ గ్యాప్ లో స్వదేశానికి వస్తున్న సత్య(ఇలియానా)ని ఫ్యామలీ రైవల్స్ నుంచి మున్నా(విష్ణు) కాపాడతాడు(హీరోనే కాపాడాలా..రైవల్స్ ఉన్నారని తెలిసిన ఆమె తండ్రి ప్రత్యేక ఏర్పాట్లు చేయడా అని అడగొద్దు) ఈ ఫైట్ తో ఇంప్రెస్ అయిన ఆమె కుటుంబం మున్నాని తమ ఇంటిలో పెట్టుకుంటుంది. నిన్నే పెళ్లాడతా తరహాలో మందలు మందలుగా ఉన్న ఆ ఫ్యామిలీని మన హీరో మరోసారి ఇంప్రెస్ చేసి..పనిలో పనిగా సత్యతో లవ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా మొహమాటానికి మొదటి ఒప్పుకోకున్నా ఆ తర్వాత ఆమె ప్రేమలో పడి రివర్స్ లో అతని వెంటబడి నాకు అక్కడ ముద్దెట్టు..కౌగిలించుకో…అంటూ తిరుగుతూంటుంది. అలా కొన్ని రీళ్ళు పాటలు,ఫైట్స్ అయ్యాక మున్నాతో ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్ళి నిర్ణయిస్తారు. ఆ సమయంలోనే ఓ అద్బుతమైన ట్విస్టు. ఆమె తన బోయ్ ప్రెండ్ క్రిష్ (వెంకట్)ని ఇండియా రప్పించుకుని జంప్ అయిపోతుంది. ఇంతకీ హఠాత్తుగా ఊడిపడ్డ క్రిష్ ఎవరూ అంటే అతను యూరప్ లో ఉన్న ఓజో(మోహన్ బాబు)అనే పెద్ద డాన్ తమ్ముడు. ఇలాంటి క్రిటికల్ సిట్యువేషన్ లో మున్నా ఏం చేసాడు..సత్యను తిరిగి తన వైపుకు తిప్పుకుని ఇండియా ఎలా తెచ్చాడనేది మిగతా కథ.
పోస్టర్స్ పై మోహన్ బాబుని చూడటంతో ఆయన పాత్ర డాన్ గా హీరోకు ఎదురు నిలబడి అదరకొడతుంది అని ఆశించి వెళతాం. అయితే సెకెండాఫ్ లో వచ్చే మోహన్ బాబు క్యారెక్టర్ కు అంత సీనుండదు. హిందీ చిత్రం తషాన్ నుంచి లిప్ట్ చేసిన అనిల్ కపూర్ ట్రాక్ దర్శనమిస్తుంది. కావేరీ ఝా అనే కుర్ర టీచర్ ని ఇంగ్లీష్ నేర్పటానికి పెట్టుకుని ఆమె ప్రేమలో మునిగితేలే పాత్ర ఇది. కథకూ,ఈ పాత్రకూ ఎక్కడా లింక్ ఉండదు.అలాగని కామిడీకీ పనికిరాదు. చివరలో అంత పెద్ద డాన్ కి ప్రేమ గొప్పతనం చెప్పటానికి అతన్నీ ప్రేమలో దించే స్కీమ్ ఇది అని తేల్చేసారు. అలాగే విష్ణు లావు తగ్గిన తర్వాత కన్నా ముందే బాగున్నాడని ఈ చిత్రంలో చూసిన వారంతా ఏకగ్రీవంగా అంటున్నమాట. మరి వైవియస్ చౌదరి దర్శకత్వ పనితనం లేదా అంటే సినిమా మొత్తం ఇలియానా బొడ్డుని ఎక్సపోజ్ చేయటం మీదే కాన్సర్టేషన్ ఉంది. వీటికి తోడు మోహన్ బాబు,కావేరీ ఝా ల మధ్య ఓ రీమిక్స్ సాంగ్ వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క అలీ ..గఫర్ ఖాన్ ..కొరియోగ్రాఫర్ అంటూ నవ్వించే ప్రయత్నం చేస్తూంటాడు.అన్నటితో పాటు పంచ్ లు పేలని డైలాగులు,ఆకట్టుకోని పాటలు వెంబడిస్తూంటాయి. అయితే కెమెరా పనితనం బావుంది.
కథ విషయానికి వస్తే హిందీ నమస్తే లండన్ నుంచి ఎత్తారా అన్నట్లున్నా ఇలాంటి కథలు మనకి కొత్తేం కాదు. మొన్నా మధ్య అల్లరి రవిబాబు సోగ్గాడు నుంచి నిన్నటి వాడే కావాలి దాకా ఇదే కాన్సెప్టు. అయితే సలీం దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ మెయింటైన్ చేసే ప్రాసెస్ లో హీరో ఐడెంటటీ దొరకకుండా చేసారు.దాంతో హీరోయిన్ ని చూసీ చూడగానే ఐలవ్ యూ అని చెప్పటం వంటివి చాలా విచిత్రంగా అనిపించాయి. అలాగే ఇంటర్వెల్ వరకూ ట్విస్ట్(ఇలియానాకు బోయ్ ప్రెండ్ ఉన్నాడని) రివిల్ చేయలేదు. దాంతో ఇంటర్వెల్ వరకూ ఏ కాంప్లిక్టూ లేకుండా సాఫీగా జరిగి బోర్ గా తయారైంది. పోనీ ఇంటర్వెల్ తర్వాత ఆమె ..హీరో వైపు తలొగ్గటానికి అనుకున్న సీన్స్ అయినా ఫెరఫెక్టుగా అనుకోలేదు. అదే నమస్తే లండన్ లో అయితే హీరో పాత్ర..అమాయికత్వం కలగలపి ఉండటంతో అతనిపై జాలి కలిగి అతని ప్రేమ సక్సెస్ కావాలనిపిస్తుంది. అదే సలీం దగ్గరకు వచ్చేసరికి హీరో పాత్ర యూరప్ లో ఓ మాఫియా వ్యక్తి అని రివల్ అవగానే ఆశ్చర్యం వేస్తుంది. మాఫియా వాళ్ళు ఇలా ప్రేమకోసం ఇండియా వచ్చేసి పనులన్నీ మానుకుని డ్రామాలు అడతారా అనే డౌట్ వచ్చేస్తుంది. అయినా అంత మాఫియా..నెట్ వర్క్ ఉన్న హీరోకి..తను ప్రేమించే అమ్మాయికి బోయ్ ప్రెండ్ ఉన్నాడనే విషయం ఎంక్వైరీలో తెలియదా..
ఫైనల్ గా ఈ సినిమా కేవలం ఇలియానా అభిమానులు ఆమె కోసం చూడాలంతే. అయితే ఆమె కోసం అనవసర సన్నివేశాలన్నీ భరించాలంటే కష్టమనిపిస్తుందనేది వేరే సంగతి.ఇక శ్రీవారు మావారు(1973) చిత్రంలోని పూలు గుసగుస లాడేనని..సాంగ్ రీమిక్స్ చేసి మోహన్ బాబు,కావేరీ ఝా మీద చిత్రీకరించారు. అయితే ఆ పాట పేలలేదు. అదే ఏ పాత మోహన్ బాబు సూపర్ హిట్ సాంగో రీమిక్స్ చేసుంటే ఆయన అభిమానలుకు ఆనందం అనిపించేది. ఏదైమైనా సలీం దుమ్ము రేపలేదు..దుమ్ము కొట్టి పోయాడు.
సంస్థ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ – రిలయన్స్ బిగ్ పిక్చర్స్
నటీనటులు: విష్ణువర్ధన్‌బాబు, ఇలియానా, మోహన్‌బాబు, కావేరీ ఝా, వెంకట్, నెపోలియన్, గిరిబాబు, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ప్రగతి, హేమ తదితరులు.
డైలాగులు: చింతపల్లి రమణ
స్టోరీ డవలప్ మెంట్ : గోపీ మోహన్, బివియస్ రవి
ఆర్ట్ : ఆనంద సాయి
కెమెరా: సి.రామ్ ప్రసాద్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: సందీప్ చౌతా
నిర్మాత: మోహన్‌బాబు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వైవీఎస్ చౌదరి
రిలీజ్ డేట్: డిసెంబర్ 12,2009
hero says:
ధూ ఎదవ సినిమా…అసలు ఆ వై.వి.యస్ కి అదేం పోయేగాలం…భయ్యా! ఈ సినిమా నువ్వెఎలా చూసావొ నాకిప్పటికీ అర్థంగాలేదు.
Don says:
మోహన్ బాబు స్మగ్లింగ్ చేస్తే తప్ప ఇక బ్రతికేటట్టు లేడు
K మహేశ్ కుమార్ says:
హతవిధీ! తెలుగు సినిమాని ఇలాంటి ఉన్మాదులనుంచీ రక్షించు తండ్రీ!!
Vara says:
The one and only okka magaadu……..YVS…no one can reach him…….records srushtinchedi athane …vaati ni padakotti kothavi srushtinchedi athane…….The great okka magaadu……..Telugu industry ni koluko leni debba kottatam lo …vijayavanthamayaadu………..emo le manollu mohanbabu romance choodataani ki q lu kadite em cheyalem…………
avatar says:
samaaptam
గీతాచార్య says:
So, what is the financial status of MohanBabu?
K మహేశ్ కుమార్ says:
మోహన్ బాబు is safe. డబ్బంతా రిలయన్స్ బిగ్ తో పెట్టించార్లెండి. ఈ దెబ్బకి కార్పొరేట్ కంపెనీలు తెలుగు సినిమల్లో డబ్బుపెట్టడానికి భయపడేలా చేశారు.
srikanth says:
hope they produce more sensible movies like UTV spotboy doing in Hindi cinema.
vara says:
Mohan Babu……Financial status?
Innellu industry ni choosi koodaa ee question adigithe elaa sir…..
1.Mohan babu munche vaade kaani munige vaadu kaadu
Life lo athanu use chesukona vaallu N number…athanu evarikinaa use ayaadaa ante….may be Vishnu and Manoj ki koodaa use avvaledemo(Avaalanukonaa…)
1.NTR
2.Rajani
3.Lakshmi Parvathi
4.Chandara Babu
5.Paritala ravi
ee list inkaa chaalaa vundhi…….evarikinaa vupayoga padaada ante…….Nill
Athani gurinchi no worries……e kshanam lo evadi kaallinaa pattukogaladu…munigipoye prati saari evaro okalla — lu pattukoni….10 times strong ayaadu…..
Sweet chuttu cheema lelaa cherataayo……mosam chese chance vunna daggara…Mr.Mohan babu never loose it….
చిత్రాంగుడు says:
మోహన్ బాబు ఆర్థికస్థాయికి వచ్చిన లోటు ఏ మాత్రం లేదు. ఎందుకంటారా సేవ పేరుతో ఆయన నిర్వహిస్తున్న విద్యానికేతన్ సంస్థల్లో లెక్కకు మించిన ఫీజులు, తుమ్మితే ఫైన్, దగ్గితే ఫైన్ అని నాలాంటి కొద్ది ఆంతరింగికులకు మాత్రమే తెలుసు.
vara says:
sir vidyaniketan ni ..seva ani koodaa antaaraa……akkada chadivina maa frnds chepaaru……akkada em jarigiddo…….daanni chuttupakkala places anni aakraminchi…paritala andatho annni settle chesaadu……..TV lo maatram nityam mruthyu ho sangraha…….antoo edo natistaadu……school pillalu naa sontha pilla la thpo samaanam……asalu pillani akakda cherche parents ni anukovaali le andi…..
venu says:
parents ni em anakandi sir.. cherche mundhu vallaku theleedu anni vishayaalu.. cherina tarvata naa laanti vallaki thelustai..
ID card marchipothe 100 rupees.. attendance thaggithe 5000 rupees.. he sucks blood..
srikanth says:
another stupid movie! nice review josyula garu
G says:
యూరప్ లోనూ, మలేషియాలోనూ తెలుగు మాఫియా డాన్లున్నట్టు సినిమాల్లో చూపిస్తున్నారు, అంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా డాన్లు కావటానికే వెళ్ళారా? లేకపోతే అక్కడ మాఫియా డాన్లు కావలెను అని బోర్డులేవైనా పెట్టుకుని కూచున్నారా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలెటూ అక్కడ దొరకవు క, తెలుగు వాళ్ళంతా అక్కడ సెటిల్మెంట్లు చేసుకుని బ్రతకాలనే సందేశం ఇస్తున్నారా?
shiva kuamr says:
సలీం నిజంగా ఒక్కమగాడ్ని మించిపోయింది…ఫ్లాపులో…
చిత్రాంగుడు says:
కరెక్ట్ గా చెప్పారు. ఆయన కెరీర్ లో కేవలం పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ మాత్రమే చెప్పుకోదగ్గ హిట్లు. మిగతావన్నే “ముంచే” సినిమాలే.
rohith chowdary says:
emi ledhandhi saleem mohan babuki money chaala avasaram. andhuke Y.V.S Chowdary peru tho cinima start chesadhu. dheeniki big cinima vallu thondhara padharu 23 kottlu anavasaram. dhantlo ooh 13 kottlu nokesadhu mana M.M. Babu. adhi sangathi.
vara says:
Bala Krishna Fans must be happy…..From now onwards they need not feel Bala Krishna has given industries biggest flop……Saleem crossed Okka Magaadu…or atleaset Okkamagaadu got some buddy to be on top place……
chandramouli says:
తెలుగు సినిమా అభిమానిగా…. తెలుగు సినిమాలను ఆడిపోసుకునే వాళ్ళను చూసి, ఔరా ! ఇంగ్లీష్ సినిమాలు చూసిన ఎఫెక్టులో ఇలా తెలుగు సినిమాలను తిడుతారని ఎప్పుడూ ఫీల్ అయ్యే వాణ్ణీ, కానీ ఈ సినిమా చూసాక ….. నా అభిప్రాయాలే మారిపోయాయి…… అస్సలు తెలుగు సినిమా పిల్లర్స్ లాంటి ఫాక్షన్, మాఫియా,లవ్ కాన్సెప్ట్ పెట్టికుని…ఇలాంటి సినిమా తీసింది చౌదరి గారంటే నాకు నమ్మకం రావటం లేదు………… కలి ప్రభావం……..
ప్రకాశ్ గారు నాకు కొద్దిగ శ్రమ తగ్గించారు….. అస్సలు ఈ సినిమా ఎందుకు పోయిందో విశ్లేషిస్తూ రాద్దాం అని మెదలెట్టాను… ఈ సినిమా చూసి సినిమల్లోకి రావలనుకునే యువ దర్శకులు ఎంతయినా నేర్చుకోవచ్చు………… ” కారెక్టరైజేషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరి లేకపోతే సినిమా ఏమవుతుంది అనేది ఈ సినిమా చేవిలో శరభలు కొట్టి మరీ చెబుతుంది”
నవీన్ గార్ల says:
ఈ సినిమా చూసి, నా స్నేహితులు పంచుకున్న కొన్ని విశేషాలు
౧) ఈ సినిమాను పట్టుమని పది నిముషాలు భరించడం కూడా చాలా కష్టం
౨) బ్లూ ఫిలింలా ఉంది
౩) తల పగిపోతాంది
౪) థూ…
గట్రా గట్రా…
Indian Minerva says:
అబ్బాయిలూ… ఒక మాటచెప్పండి. వీటన్నిటివల్ల సినిమాలో కామెడీఏమన్నాపండిందా? ఓ నలుగురు దోస్తులని తీసుకువెళ్ళి కామెడీని ఎంజాయ్ చెయ్యొచ్చా? (బక్కవీరోయిన్లు వాళ్ళ ఎక్స్పోజింగులూ నాకునచ్చవు
). అలాంటిదేదైనా వుంటేచెప్పండి నేనీరోజే సూసేత్తా..
సినిమా పిచ్చోడు.. says:
పొరపాటున కూడ థియేటర్ వైపు వెళ్ళకండి.. ఒక వేళ.. ఇలియానా పోస్టర్ చూసి వెళ్ళే చాన్సెస్ ఉంటాయ్..! పెద్ద రాడ్డు సినిమా… ఈ సంవత్సరం లొ నేనింకా ఒక దౌర్భాగ్యాపు సినిమా కూడా నా ఖాతా లొ పడలేదని సంకలు గుద్దుకునేలొపే.. మా రూం మేట్ వల్ల సలీం కెల్లి…. మంచు షాక్స్ కి.. ఇంకా తేరుకోలేదు… Biggest Disaster
@ Josyula..
మీ రివ్యూ కొన్ని ప్రాణులను కాపాడుతుంది.. Nice one!
Raz says:
If the makers think that people are fools to watch everything we make. then this will be a correct lesson to them better they realize to think before what to show us.
Heera says:
Who brought YVS into the industry?
I am shocked at the movie he is delivering day by day..
@Surya good review.
రామ says:
వెన్కత్ గారు – ఇక్కద తెలుగు లొ ఎలా త్య్పె చెయ్యలొ ఒక తుతొరిఅల్ లన్తిది ఉన్తె కొన్చెమ్ చూపిన్చన్ది.. నాలాన్తి వాల్లకు సులువు గా ఉన్తున్ది.
(Venkat gaaru, ikkada Telugu lo elaa type cheyyaalo oka tutorial lantidi unte konchem choopinchandi.. naalaanti vallaku suluvugaa untundi).
telugu jeevi says:
asalu veedini telugu cinema ela bharisttundoooo choodali ……
telugu says:
నెను వెల్లను బాబొయ్……ఇన్ని కామె౦ట్స్ చూశాక కూడా ……థన్క్ యౌ ……..
LATHA says:
F12 NENU IDE FIRST TIME BLOGS LOJI ENTER CHESI CHADAVADAMU NAKAITE INTINTA FRANK COMMENTS CHOOSTUNTE MAAVULLO CENTRE LO KOORCHUNI MATLADUTUNNATTU UNDI SALEEM CHOODALEDU KAANI SAME COMMENTS NAA FRIENDS CHALAMANDI NUNDI VINNANU ENTA EKABHIPRAYAM OHO ALAKKUDA CHETAVVALI YVS CHOWDARY ADI SAADHINCHADAMLI SUCCEED AYYADU