Menu

Monthly Archive:: December 2009

శబ్ధగ్రహణం – అంతరార్థం

ఓ థ్రిల్లర్ సినిమా…….అంతా ప్రశాంతంగా ఉంది, సినిమాలో ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది, అంతా నిశ్శబ్ధం కాని ఎవరో అటుగా వస్తున్న అలికిడి. ఎవరా అని చూద్దామని ఆ అమ్మాయి భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ అటుగా వెళ్తున్నది. ఆమె వేస్తున్న అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నది, మరే శబ్ధము లేదు. అంతలోనే ఓ పిల్లి కాలు తగిలి అటకమీద నుంచి స్టీలు సామన్లు గలగలమని కింద పడతాయి. ఒక్కసారిగా నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ వచ్చిన

తెలుగు చిత్రం లేని ఇండియన్ సినిమా టాప్ ట్వెంటీ

ఈ మధ్య గోవా వేదికగా జరిగిన IIFI లో ‘ఇండియన్ సినిమా T20′ అనే ఒక పోటీనిర్వహించింది.  ఆశ్చర్యపోనవసరం లేకుండా ఆ లిస్టులో ఒక్క తెలుగు సినిమాకూడా లేదు. 1. Meghe Dhaka Tara (Bengali) 2. Charulata (Bengali) 3. Pather Panchali (Bengali) 4. Sholay (Hindi) 5. Do Beegha Zameen 6. Pyaasa (Hindi) 7. Bhuvan Shome (Hindi) 8. Garam Hawa (Hindi) 9. Mother India (Hindi)

అనగనగా ఓ చిన్న సందేహం!

చిన్నప్పటి నుండి నేను సినిమాలు తెగ చూసేవాడిని. ఎన్.టి.ఆర్ దగ్గరనుండీ చిరంజీవి వరకూ ఆ తరవాత నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల సినిమాలు ఇలా అందరి సినిమాలు చూసేవాడిని. అవి నా మెదడులో ఒక  సందేహాన్ని రేకెత్తించాయి. అది, అసలు సినిమా అంటే ఏంటి? ఇదేం ప్రశ్నరా బాబు, మా ఊళ్ళో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు అని అనుకుంటున్నారా! నిజమే సినిమా అంటే తెలీనిదెవరికి! ప్రతి రోజు కొన్ని కోట్ల మంది వీటిని తెర మీదో,

అమరావతి – సమీక్ష

“అమరావతి”, ఎప్పటిలాగే రవిబాబు పోస్టర్ల ద్వారా ఈ సినిమాకి కావలిసినంత క్రేజ్ కల్పించాడు. రవిబాబు మీద ఉన్న నమ్మకంతో చూసిన ఈ సినిమా ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టిందో చూద్దాం. కథ: ఎవరో ఓ వ్యక్తి తొమ్మిది నెలల గర్భిణీలకు మత్తుమందు ఇచ్చి వాళ్ళ కడుపు కోసి పసిబిడ్డల్ని ఎత్తుకెల్లిపోతుంటాడు. ఆ పని చేయడానికి కొన్ని నిమిషాల ముందే 108 కి ఫోన్ చేసి అదే గర్భిణీ స్త్రీ ప్రమాదంలో ఉందని చెప్తుంటాడు. 108 వాహనం వచ్చే

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3

శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక)