Menu

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

సినిమా తీయాలన్న వుత్సాహం మీలో వుందా?

సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఒక్క చాన్స్ ఎప్పుడు వస్తుందా అని వేచి వున్నారా?

నిజం చెప్పమంటారా? అవకాశం మీ ఎదురుగానే వుంది. మీరు ఇంతవరకూ దీన్ని పట్టించుకోకపోవటమే ఆశ్చర్యం. అవునండీ, నేను చెప్పేది నిజం. సినిమా అంటే రెండున్నర గంటల నిడివి, ఎంతోమంది టెక్నీషియన్లు, షెడ్యూల్స్, అన్నింటినీ మించి అంతంత  డబ్బు పెట్టగలిగిన నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు.. ఇవన్నీ కావాలనుకుంటున్నారా? అవేమీ అవసరంలేకుండానే మీరు సినిమా తీయొచ్చు. కొన్ని వేల మందికి చూపించచ్చు. చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించవచ్చు, ఐ.ఎం.డీ.బీ. (IMDB) లాంటి ప్రతిష్టాత్మకమైన వెబ్సైట్‌లో మీ చిత్రం వివరాలు పొందుపరుచుకోవచ్చు – అన్నింటికంటే విశేషంగా మీ సినిమా ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. – నేను చెప్పేది అక్షరాల నిజం. ఇదంతా అంతర్జాల చిత్రాల (Internet filiming)  మహిమ.

ఇంటర్నెట్ మొదలైన తరువాత ప్రపంచం చాలా చిన్నదైపోయిందని అందరికీ తెలుసు. ఇలా చిన్నదైన ప్రపంచం ఎన్నో అవకాశాలనూ తిసుకొచ్చింది. బ్లాగులు, వెబ్‌సైట్ల ద్వారా తమ తమ కథలు, కవిత్వాలు, అనుభవలు వ్రాస్తున్నవారు మనకందరికీ తెలుసు. అలాగే ఫొటోలను పంచుకోడానికి ఫ్లికర్ లాంటి సైట్లు పుట్టుకొచ్చాయి. యూటూబ్‌తో వీడియోలను పంచుకునేందుకూ మార్గం ఏర్పడింది. అక్కడినించి మరో అడుగు ముందుకేస్తూ ఆన్లైన్ చిత్రాలు మొదలైయ్యాయి. ఇలాంటి చిత్రాలని తిసే ఔత్సాహిక దర్శకులని ప్రోత్సహించే విధంగా అనేక వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్ ట్రైనింగ్ నించి, స్క్రీనింగ్, డిస్ట్రిబ్యూషన్, పోటీలు, ఫిలిం ఫెస్టివల్స్ దాకా ఎన్నో సదుపాయాలు ఒక్క క్లిక్ దూరంలో వున్నాయి. ప్రత్యేకించి ఇండిపెండెంట్ సినిమా, షార్ట్ ఫిలిం పధ్ధతులు అంతర్జాలం పుణ్యమా అని కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒక్క నిముషం నుంచి ముప్పై నిముషాలలోపు నిడివితో సినిమా తిసే విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వూపందుకుంటోంది. ఇలాంటి చిత్రాలని ప్రదర్శించే చిత్రోత్సవాలు నలభైకి పైనే వున్నాయంటే ఆశ్చర్యం కలగకపోదు.

ఇలాంటి చిన్న సినిమా నిజంగా సినిమానేనా? అనే ప్రశ్నతో మొదలుపెట్టి, ఇలాంటి సినిమాలో వున్న లోటు పాట్లు లేదా గొప్పదనాలు వివరిస్తూ ఒక రెండు మూడైనా వ్యాసాలు వ్రాయచ్చు. అలాంటి చర్చలు లేకుండా, కేవలం ఇలాంటి చిత్రాలకు సంబంధించి పరిచయం, ఇలాంటి చిత్రాలకు సంబంధించిన సైట్లను పరిచయం ఇస్తూ ఈ వ్యాసం ముగిస్తున్నాను.

ఇలాంటి చిత్రాలను ప్రదర్శించేందుకు వుపయోగపడే సైట్లు:

స్టూడెంట్ ఫిలిమ్స్
కొంతమంది ఔత్సాహిక దర్శకులు కలిసి మొదలుపెట్టిన ఈ వెబ్‌సైట్ ఎన్నొ చిన్న చిత్రాలకు వేదికగా రూపుదిద్దుకుంది. ఇందులో చిన్న సినిమాలు తీసి అప్లోడ్ చేసే అవకాశమేకాక ఇతర దర్శకుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు అవకాశం వుంది. ఇందులో వున్న ఫోరమ్స్ ద్వారా చిత్ర నిర్మాణానికి సంబంధించిన చర్చలు కూడా జరపవచ్చు. స్టూడెంట్ ఫిలిమ్స్

బాక్సులేని చిత్రాలు
వితౌట్‌బాక్స్ అనే ఈ సైట్ అమెజాన్/ఐ.ఎం.డీ.బీ. నిర్వాహకుల ద్వారా స్థాపించబడింది. ఇందులో రిజిస్టర్ అవ్వడం ద్వారా తీసిన చిత్రాలను ప్రసారానికి, ప్రచారానికి వుపయోగించుకోవచ్చు. ప్రపంచ దేశాలలో జరిఏ 3000కి పైగా చలన చిత్రోత్సవాలకి ఈ చిన్న చిత్రాలను పంపించవచ్చు. చూడండి: వితౌట్‌బాక్స్

ఆన్లైన్ చిత్రాలను ప్రదర్శించే భారతీయ సైట్‌లు – నౌటంకీ, రాజశ్రీ, దృశ్యం.టీవీ

చిన్న సినిమా పోటీలు

సెల్‌ఫోన్ సినిమా
కేవలం సెల్ ఫోన్ వుపయోగించి తీసే సినిమా పోటీ ఇది. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ “సెల్ ఫోన్ ఫిలిం ఫెస్టివల్” ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పోటికి రంగం సిద్ధమైంది. విడియో తీయగలిగిన సెల్‌ఫోన్ చేతిలో వుండటం, కేవలం మూడు నిముషాలలో చెప్పాలనుకున్నది చెప్పగలగడం మాత్రమే ఈ పోటీకి అర్హతలు. ఫిక్షన్/మ్యూజిక్ వీడియో, రియాలిటీ/న్యూస్, స్టిల్ ఇమేజ్ అనే మూడు విభాగాలలో పోటీ వుంటుంది. 15 జనవరి 2010లోగా ఎంట్రీలు పంపించవచ్చు. మరిన్ని వివరాలు ఈ లింక్‌లో: సెల్‌ఫోన్ సినిమా.

ఫిల్మక

ఫిల్మక అనే ఈ వెబ్‌సైట్ చూడండి. ఒకటి నుంచి మూడు నిముషాల సినిమాతొ మొదలుపెట్టి అంచెలంచెలుగా పూర్తి నిడివి సినిమా తియ్యటానికి కావల్సిన బడ్జట్ సమకూర్చే సైట్ ఇది. ప్రతి నెలా ఒక థీం వుంటుంది. ఆ థీం ఆధారంగా తీసిన మూడు నిముషాల చిత్రం అప్లోడ్ చెయ్యాలి. ప్రతినెలా జరిగే ఈ ఎంట్రీ లెవల్ పోటీలో గెలిచినవారికి $500 ఇవ్వటమేకాక, జ్యురి లెవల్ పోటీకి సినిమా తిసే అవకాశం వస్తుంది. జ్యూరీ లెవల్‌లో గెలిచి, ఆ సంవత్సరం మొత్తం మీద గెలిచిన చిత్ర దర్శకులకు పూర్తి చిత్రం తీసేందుకు అవకాశాం కల్పిస్తుంది ఈ సంస్థ. ఇంకా ఈ సంస్థ డాకుమెంటరీ చిత్రాల పోటీలు, టివీ గేం షోలకి పోటీలు వంటివికూడా నిర్వహిస్తుంటుంది. వివరాలు ఈ లింక్‌లో: ఫిల్మక

ఏక్షన్/కట్
ఈ మధ్యే ముగిసిన 2009 సంవత్సరం పోటీ విజేతల చిత్రాలతో పాటు, గత అయిదు సంవత్సరాల విజేతల చిత్రాలు ఒకసారి చూసి రండి. పది నుంచి ముప్పై నిమిషాలలోపు వున్న చిత్రాలను ఈ పోటీకి పంపవచ్చు. జనవరి పదిహేను ప్రాంతంలో వీరి 2010 సంవత్సరానికి ప్రకటన వెలువడచ్చు. ఎంట్రీ పంపడానికి జూన్ వరకూ సమయం వున్నా త్వరగా పంపినవారికి ఫీజులో రాయితీ వుంటుంది. ఈ వెబ్ సైట్ కూడా నెల నెలా ఎంట్రీలను స్వీకరిస్తుంది. ఏక్షన్/కట్

48 గంటల్లో సినిమా తీయగలరా?
పేనసోనిక్ వారు స్పాన్సర్ చేసే ఈ చిత్రమైన సినిమా పోటీ, 2009 కి గాను ఈ మధ్యనే పూర్తైంది. శుక్రవారం సాయంత్రం ఏడుగంటలకి ఒక పాత్ర, ఒక ప్రాప్, ఒక డైలాగ్, ఒక జెనరా ఇస్తారు. వాటి ఆధారంగా నాలుగు నించి 8 నిమిషాలలోపు నిడివిగల చిత్రాన్ని నిర్మించాలి – అదీ నలభై ఎనిమిది గంటల లోపు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో ఇప్పటికి మన దేశంలో ముంబై మాత్రమే వుంది. ఇందులో గెలిచిన చిత్రాలకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ షార్ట్ ఫిలిం కార్నర్‌కు ఎంపికయ్యే అవకాశం వుంటుంది. 48 గంటలు.

మరికొన్ని:
1టేక్‌మీడియా: వీరు నిర్వహించి పోటీ విజేతలు, వారి చిత్రాలు చూడటానికి ఇక్కడ నొక్కండి.

ఎబిలిటీ ఫౌండేషన్ వారు నిర్వహించిన “60 seconds to fame ” వివరాలు
ఇండీ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ – జనవరి 15, 2010 వరకూ పోటీలో పాల్గొనే అవకాశం వుంది.

పెషన్ ఫర్ సినిమా (passion for cinema) వారు నిర్వహించి ఒన్ మినిట్ ఫిలిం ఫెస్టివల్ – ఈ సంవత్సరం పోటీ పడుతున్న చిత్రాల వివరాలు – ఇక్కడ

మరి కొన్ని వివరాలు ఈ క్రింది లింకులలో –

9 Comments
  1. sujji December 28, 2009 /
  2. j.surya prakash December 28, 2009 /
  3. రాజశేఖర్ December 28, 2009 /
  4. Sagar December 28, 2009 /
  5. Srinivas December 29, 2009 /