ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఈ రోజు(ఆదివారం)
ఉదయం స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు.
ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
సుమారు 500 చిత్రాల్లో నటించిన
నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు.
ఆయన తొలి చిత్రం 'మల్లెల మనసులు'.
చివరి చిత్రం మేస్త్రీ(దాసరి).
తొలుత సినిమాల్లో విలన్‌గా చేసినా అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి
గుర్తింపు తెచ్చుకున్నారు.
స్వర్గీయ టి.క్రిష్ణ ఈయనను బాగా ప్రోత్సహించేవారు.
నేటి భారతం చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
అంతేగాక చట్టంతో పోరాటం, ప్రతిఘటన, వందేమాతరం, అడవిచుక్క,
ఒసేయ్ రాములమ్మ,పెద్దరికం, ప్రతిఘటన, అరుణ కిరణం,
రేపటి పౌరులు, వందేమాతరం,
వంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టారు.
కేవలం సినీ పరిశ్రమలోనే కాక ఈ మధ్య కాలంలో ఆయన చాలా టి.వి.సీరియల్స్ లో కూడా నటించారు.
మంచి ఆర్టిస్టుగానే పరిశ్రమలో గుర్తింపు పొందటం ఒకెత్తు అయితే ఆయన వివాదరహితుడుగా,
మంచి మనిషిగా పేరు తెచ్చుకోవటం మరో గొప్పతనం.
ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరుగుతాయి.
నర్రా వెంకటేశ్వరరావుకి నవతరంగం మనసారా నివాళులు అర్పిస్తోంది.
శివరామప్రసాదు కప్పగంతు says:
అవునండి మంచి నటుడు. పాపం ఆయనకు ఇటువంటి వ్యాధి ఉన్నదని బాధపడుతున్నాడన్న విషయమే తెలియదు. ఈరోజున ఆయన పార్థివ శరీరాన్ని చూసినప్పుడు చాలా బాధకలిగింది. మనం ఒక మంచి నటుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతికలగాలి.
parimalam says:
నర్రా వెంకటేశ్వరరావు గారికి నివాళులు
రాజశేఖర్ says:
ఒక మంచి నటుడిని కోల్పోయాము. వారి ఆత్మకు శాంతి కలుగుగాక!
mahesh says:
నాకు చాల బాధగా వున్ది
harilorvenz says:
నిజంగానే ఆయన గారు మంచి నటులు. ఇలాంటివారు మళ్ళి రారు.