న్నల్లమాఆఆఆ…! డబ్బులిస్తావా?

mallanna

mallanna

మల్లన్న!

ఎన్నాళ్ళో ఎదురు చూసిన ముదురు సినిమా. సూపర్‍స్టార్ కృష్ణ ఉన్నాడని, ఈ సినిమాతో అయినా మళ్ళా హిట్ కొడతాడనీ ఒక ఆశ. ఎంతైనా విక్రం ఉన్నాడు, భారీ బడ్జట్ ఇన్నాళ్ళు తీశారు, చాలా కాకపోయినా కొంతైనా బాగుంటుందేమో అని ఒక ఆశ. సినిమా విడుదలప్పుడు చెన్నైలో ఉన్నాను. తమిళ్ అయినా ఒకసారి చూద్దామని ప్రయత్నం చేసి వెళ్ళాము. హ్మ్! Wrongest of the wrong choice. ఇంత డిజప్పాయింటైన సినిమా వేరొకటి లేదు.

సినిమా ఎత్తుగడబిడే చివరిదాకా కొనసాగింది. అందులో ఉన్న ఆ చెత్తన్నర రాబిన్‍హుడ్ కాన్సెప్టే పెద్ద ఫోలీ. దానికి తోడు అతుకుల బొంత స్క్రీన్‍ప్లే, తిక్క నటన, సినిమాని మించిన సంగీతం, అన్నిటినీ మించి ఏడు సీన్లు కూడా పూర్తిగా లేని కృష్ణ పాత్ర.

ఆ కోడి మనిషి సన్నివేశాల క్రియేటివిటీ (కోడిలానే ఎందుకు రావాలో? ఏమన్నా అర(వ) కోడి మాంసం తినేప్పుడొచ్చిన అవుడియానా?) శ్రియ చేత చేయించిన ఎక్స్పోజింగు (ఎన్ని యాంగిల్స్ లో చూపాలనే దాని మీద ఆ డవిరెట్టరు పీఎచ్‍డీ చేసుంటాడు) ఒక మంచి కథని (ఇప్పుడున్న కథ దిక్కుమాలింది. సరే దీన్నైనా సరైన మార్గంలో) తయారు చేసుకునేందుకు వాడి ఉంటే కొన్ని కోట్లు మిగలుండేవి. కానీ ఆ ఒక్క పనే చెయ్యలేదు అరవ దర్శకుడు.  మిగతా హంగులన్నీ బాగా ఎక్కువయ్యాయి.

నల్ల ధనం సరే (నల్ల అంటే తమిళ్‍లో మంచి కదా…??? ;-) ) పట్టుకున్నారు బాగానే ఉంది. దాన్ని సక్రమమైన మార్గంలో ప్రజలకు చేరవేయాలి. Agreed! మధ్యలో మల్లన్న గుడేంటి? అక్కడ చెట్టుకి ఉత్తరాలు కట్టటమేమిటి? అవి చూసి కోడి రూపంలో మన జీరోగారు రావటమేమిటీ? వచ్చితిడి ఫో! ఆ డబ్బునేదో కొల్లగొట్టి అవసరంలో ఉన్నవారికివ్వటమేమిటి? నాకు మొదట్లో ఆ కోడి సన్నివేశం చూడగానే చరిత్రలో ఒక చక్కని హాస్య చిత్రాన్ని చూడబోతున్నానన్న విషయమర్థమయింది. (నాకు సినిమా బాగుంటే బాగున్నందుకు హాయిగా చూస్తాను. బాగుండని సనిమాల్లో కనీసం హాస్యమైనా వెతుక్కుంటాను. హాస్యమంటే సినిమాలో హాస్యం కాదు. ఆ సిన్నివేశాలో, పాటలో, ఏదోఖటి అలా ఎలా హైలైటవుతాయని ఆ సదరు వ్యక్తులూహించుకుంటారా అనే ఆలోచనతో పుట్టిన హాస్యమన్నమాట).

ఇలా జనానికి ఉచితంగా అడిగిన వాళ్ళకడిగినట్లుగా డబ్బు పంచితే వాళ్ళ కష్టాలు తీరిపోతాయా? అదేనా దర్శకుడు చెప్పదల్చుకున్నది? అలా ఐతే (అన్ని సినిమాలు ఒక్కలా ఉండవు అని చెప్పకండి) నాకిప్పుడు శాలరీ ఇంకా రాక ఫోన్లో బిల్లేయించుకోలేని పరిస్థితి. అడగ్గానే ఇస్తాడా? ఏ తిరువణ్ణామలై వెళ్ళి ఏదన్నా చెట్టుకి ఉత్తరం కట్టాలన్నా సమైక్యాంధ్ర, ఉత్తర దక్షిణ తమిళ్‍నాడు గొడవల వల్ల సరిగ్గ బస్సులు లేవు. అయినా శాలరీ రాందే బస్సు టిక్కెట్టు కూడా రాదు. ఇవన్నీ ఇస్తాడా? ఇలా ఐతే నాకు అసలు సమస్యే ఉండదు. ఇక రోజూ పని చెయ్యాల్సిన బాధ తప్పుతుంది కదా!

ధనవంతుణ్ణి కొట్టి పేదవాణ్ణి బ్రతికించటమనే ఊసుపోని కథలెప్పుడూ ఉంటాయి. దాన్ని ఇందులో మరీ ముందుకు తీసుకుని వెళ్ళి మనన్న నారా చంద్రబాబునాయుడు గారిలా ఉచిత నగదు పథకం పెట్టేయటం. అడిగిన వారికీ అదగని వారికీ అలా పంచేసుకుంటూ పోవటం… ఏంట్రా బాబూ, ఈ సుత్తి మరీ ఎలా ఉందంటే వేణు మాధవ్ తెరమీద కనపడగానే ఏదోక పిచ్చ బిల్డప్పిచ్చి తన్నులు తింటాడు. దాని బదులు అసలు వేణుమాధవ్ ని వచ్చింది మొదలు ఉతుకుడే పనిగా పెట్టి అదే హాస్యమంటే పోలా అని ఆమధ్యెవరో అన్నట్టు సినిమా మదలెట్టింది మొదలు డబ్బు పంచుడే చూపెట్టొచ్చుగా? ఐనా ఎంతకాలం డబ్బు పంచుతారు? ఎంతకాలం ధనవంతులని కొల్లగొడతారు? అసలెంతకాలం ఒక జీరో వచ్చి జనాన్ని ఆదుకుంటాడు? ఏదో నాతికి జనానికి పంచేందుకు డబ్బే ఉండదు. దాని బదులు మనం చిన్నప్పుడనుకుంటామే ప్రభుత్వమే డబ్బు ప్రింటుజేసి పంచిపెట్టొచ్చుగా? నల్ల ధనం వెలికితీత మీద ఎవరికీ అభ్యంతరముండదు. ఇలా ఉత్తిగా పంచటమంటే జనమంతా అడుక్కునే వారా? లేకపోతే వాళ్ళని సోమరితనానికి బానిసలని చేయాలనా?

ఈలోపాలను కప్పిపుచ్చుకునేందుకేమో శ్రియచేత వేయించిన వేషాలు? బాప్రే! సినిమా బాగోకున్నా హీరోయిన్ కోసమైనా చూడటానిక్కూడా లేకుండా మరీ వల్గర్ గా.

సర్లెండి. చెత్తని ఎంతసేపు చెత్తంటాము? వదిలేద్దాము. ఓహ్! ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. తన దగ్గరున్న నల్ల ధనాన్ని వదిలించుకునేందుకేమో మరి ఇలా డెలిబరేటుగా ఖర్చు పెట్టిమరీ ఫ్లాపు తీశాడనుకుంటా నిర్మాత. కలై పులిరాజా :-D

ఈ సందర్భంగా మన సుసీ గణేశన్ గారికో విఙ్ఞప్తి. అయ్యా! మీరు కూడా మాకు ఎక్కడ ఉత్తరం కట్టాలో చెపితే అక్కడ కడతాము. కాస్త మాకు డబ్బుని ఉచితంగా ఓ పాతికముప్పై కోట్లుంటే ఇప్పించండి. ఓపెన్ సుసీ మీదొట్టేసి మరీ చెప్తున్నాను, మీ న్నల్లమ కన్నా మంచి సినిమానే తీసి చూపిస్తాము. ఇక్కడ సినీ ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. నల్ల ధనమిచ్చినా, తెల్ల ధనమిచ్చినా సరే! :-)

(స్మైలీ వేశానని కామెడీకనుకునేరు. నిజంగానే. సీరియస్)

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

గీతాచార్య

రచయిత:

A wrong entrant at the right time, but belong everywhere ;-)

4 Comments to “న్నల్లమాఆఆఆ…! డబ్బులిస్తావా?”

  • చాలా బాగా రాసారండి

    అవకాశం ఒకరు ఇవ్వగలరు కానీ
    పరిపక్వతను ఎవ్వరూ ఇవ్వలేరు కదా!

    ఈ దర్శకుడికి సినిమా తీసే పరిపక్వత, ప్రావీణ్యతా లేదు
    అందుకే తరువాత ఇంకే అవకాశం రాలేదనుకుటా

  • శంకర్ లాగా సినిమా తియ్యాలనే పిచ్చేతప్ప మరేమీ కనిపించవు ఈ సినిమాలో…

  • “ఆ సిన్నివేశాలో, పాటలో, ఏదోఖటి అలా ఎలా హైలైటవుతాయని ఆ సదరు వ్యక్తులూహించుకుంటారా అనే ఆలోచనతో పుట్టిన హాస్యమన్నమాట”

    How true. ఈ మాట నేను పాటలు చూడాల్సొచ్చిన ప్రతిసారీ అనుకుంటాను. ఏదో ఫార్ములాని(??) ఫాలో అవడంతప్పించి ఈ పాటకు డబ్బులు బొక్కెట్టుకోవడం అవసరమా అనుకుంటుంటాను.

  • What you have said about making comedy out of the movie is true. This I have been doing for many telugu movies…

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories