లీడర్

Leader-Posters

Leader-Posters
హ్యాపీడేస్, ఆనంద్ సినిమాల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు ’లీడర్’ అనే కొత్త సినిమా తో మరో సారి మన ముందుకు రానున్నారు.మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తమ్మీద ఎంతో కొంత ప్రభావితం చేస్తున్న ’వారసత్వ రాజకీయాలు’ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

ప్రముఖ నిర్మాత డా.డి రామానాయుడు మనవడు అయిన రానా ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడం విశేషం. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించిన AVM ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిశెంబరు చివరివారంలో విడుదల కానున్న ఈ సినిమా లో ప్రియా ఆనంద్, సుమన్, హర్షావర్థన్, రిచా తదితరులు నటిస్తున్నారు. మికీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్స్ మరియు పాటలు మీ కోసం.

ట్రైలర్ 1

ట్రైలర్ 2

పాట 1

పాట 2

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

9 Comments to “లీడర్”

  • ట్రైలర్ తేలిపోయింది కానీ కుర్రాడు బాగున్నాడు. అంతో ఇంతో నటనుంటే హీరోగా మంచి స్థాయికొస్తాడేమో.

  • మొత్తానికి రిలక్టెంట్ హీరో లీడర్ గా ముందుకొస్తున్నాడన్నమాట! కొంత కాలంగా ఒక సాంకేతిక నిపుణుడిగా తెలుగు సినీరంగానికి సేవలందించిన ‘రానా’ హీరోగా ఏంచేస్తాడో మొదటిసినిమా చూసినగానీ నిర్ణయించలేము. ప్రస్తుతానికి గొంతు,ఉచ్చారణ మాత్రం బాగున్నాయని చెప్పొచ్చు. ఇక లుక్స్ గురించంటారా…నటన ఎలా ఉంటుందో చూస్తేదాన్ని బట్టి లుక్స్ మీద వ్యాఖ్యానించొచ్చు

  • Movie is about heriditary politics??? Does it support heriditary politics as even the hero is following the same in film industry.

  • శేఖర్ కమ్ముల తన పాతచిత్రాలకి భిన్నంగా రాజకీయాల నేపధ్యంలో సినిమా తీయడం ముందుగా అభినందనీయం. రెండవ ట్రైలర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. హీరో నాకు బాగా నచ్చాడు.. మంచి విగ్రహం.. చక్కని బాడీ లాంగ్వేజ్ .. ఉచ్చారణ కూడా బాగుంది. ఈసారి కోట శ్రీనివాసరావు, సుహాసిని, తనికెళ్ళ భరణి వంటి పెద్ద ఆర్టిస్టులు కనపడడంతో సినిమా మీద మరింత ఆసక్తి కలుగుతోంది. సినిమా హిట్ కాకపోయినా పర్వాలేదు. But I dont want Sekhar kammula to fail.

  • ee trailor chaala intresting ga undi. hero chaala baavunnadu(hollywood hero la).hero voice chaala baavundi.nenu chaala intresting wait chesthunnanu. sekhar kammula namma kaanni vammu cheyadu anukuntunnanu

  • @మహేష్ గారు… “వాడి బాబు ,వాడి తాత” ఇందాక ఆర్య-2 రివ్వు లో చాలా దారుణమైన భాష ఉపయోగించటంజరిగింది, 2వ సంవత్సరం లో నేను ఇటువంటి పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, మీరు సమర్దులు అని చెపుతున్నాను…

  • entidi….navataranam lo “LEADER” commercial ad laagaa undi…why is this article?

  • ఇపుడిప్పుడే పేరు వస్తున్న సైట్ ని, చేజేతులా చెడ దొబ్బుకోవడమంటే ఇదే…. ఎమన్నా అంటే ఎవడిష్టం వాడు రాసుకున్నాడు అంటే,. నీ ఖర్మ…నీ ఇష్టం

  • sir
    i wrote a review on leader movie at my blog

    http://antharahmaneeyam.wordpress.com/

    i ve also submitted the article here also .

    hope fully i expect it tobe pulished.

    ramakanth

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories