ఎన్టీఆర్,చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చేత ఫైట్స్ చేయించి ఎంతో పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్ రాజు ఆకస్మిక మృతి చెందారు. చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం తెల్లవారు ఝామున మరణించారు.
ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం వేటపాలెం తరలిస్తున్నారు.అక్కడే కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్ని వందల చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన ఆయన ముంబయి నుంచి ఫైటర్స్ దిగుమతి చేసుకునే కాన్సెప్ట్ కు నాంది పలికారు. అలా వచ్చిన వారిచేత రకరకాల ఫీట్స్ చేయించి ప్రేక్షకులను అలరించారు. ఒకానొక టైమ్ లో దాదాపు అన్ని తెలుగు సినిమాలకూ ఆయనే ఫైట్స్ సమకూర్చి పూర్తి స్ధాయి బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య వయస్సు మీదపడటం, కొత్త కొత్త వారు ఫైట్ మాస్టర్స్ గా సక్సెస్ అవటంతో ఆయన ఖాళీగా ఉన్నారు. అయితే తెలగు సినిమా తెలుసున్న ప్రతీ ఒక్కరికీ ఫైట్ మాస్టర్ రాజు తెలుసు అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన మృతికి నవతరంగం ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.
రవిచంద్ర says:
తెలుగు సినిమాల్లో ఫైట్స్ లో సరికొత్త ఒరవడిని సృష్టించిన ఫైట్ మాస్టర్ రాజు గారి మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మ శాంతించుగాక.
గీతాచార్య says:
Too sad to know
sankar says:
ఆయన ఆత్మ కి శాంతి కలుగు గాక
$hankar says:
may his soul rest in peace