డాక్యుమెంటరీ సినిమా

DOC

డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా నేడు డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే డాక్యుమెంటరీ అనే పదాన్ని మొట్టమొదటిగా Robert Flaherty నిర్మించిన ’నానూక్ ఆఫ్ ది నార్త్’ అనే చలనచిత్రం గురించి వ్రాసిన ఒక సమీక్షలో వాడడం జరిగింది. ఇంతకూ డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటి? నిజజీవితంలోని విషయాలను ఉన్నదున్నట్టుగా విజువల్ గా డాక్యుమెంట్ చేయడమే డాక్యుమెంటరీ సినిమా అని చెప్పుకోవచ్చు.

బ్రిటిష్ డాక్యుమెంటరీ సినిమాకు ఆద్యుడిగా పిలవబడే John Grierson డాక్యుమెంటరీ సినిమాకు ఉండవలసిన విలువలను సూత్రీకరించాడు.

Grierson’s principles of documentary were that cinema’s potential for observing life could be exploited in a new art form; that the “original” actor and “original” scene are better guides than their fiction counterparts to interpreting the modern world; and that materials “thus taken from the raw” can be more real than the acted article. In this regard, Grierson’s views align with the Soviet propagandist Dziga Vertov’s contempt for dramatic fiction as “bourgeois excess”, though with considerably more subtlety. Grierson’s definition of documentary as “creative treatment of actuality” has gained some acceptance, though it presents philosophical questions about documentaries containing stagings and reenactments.

Flaherty నిర్మించిన నానుక్ ఆఫ్ నార్త్ సినిమా తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల్లో డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ చలనచిత్రాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ట్రావెలాగ్స్, instruction films, సమాజం లో ఉన్న సమస్యలను తెలియచేసే సినిమాలు, propaganda films ఇలా ఎన్నో రకాల డాక్యుమెంటరీ సినిమాలు చాలా సార్లు ప్రజలను వివిధ విషయాల గురించి ప్రభావితం చేయడానికి ఉపయోగపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్త ప్రజా పోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా పోషించిన పాత్ర అమోఘం.

ప్రపంచ వ్యాప్త ప్రజాపోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా పోషించిన పాత్ర గురించి తెలుగులో ఒక పూర్తి స్థాయి పరిశోధనా గ్రంధం వెలువడిన విషయం ఎంతమందికి తెలుసు? నాకైతే ఈ మధ్యనే తెలిసొచ్చింది. జయధీర్ తిరుమలరావు రచించిన “ప్రపంచ వ్యాప్త ప్రజాపోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా” అనే ఈ పుస్తకం లో ప్రజా పోరాట సినిమా, ప్రపంచ యుద్ధంలో డాక్యుమెంటరీ సినిమా పాత్ర, లాటిన్ అమెరికా లో సినిమా ఒక ఆయుధంగా ఉపయోగించిన తీరు, మనదేశంలో డాక్యుమెంటరీ సినిమా పరిస్థుతులు, సాంస్కృతిక సమరరంగంలో రాజకీయ పాఠంగా ప్రజా సినిమా లాంటి ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో వ్యాసాలుగా ప్రచురించారు.

వరంగంల్ ఫిల్మ్ సొసైటీ సౌజన్యంతో ప్రచురించబడిన ఈ పుస్తకం లోని వ్యాసాలను నవతరంగంలో త్వరలో ప్రచురింపబోతున్నామని తెలియచేస్తున్నాము. ఈ పుస్తకంలోని వ్యాసాలను ప్రచురిస్తామని అడగ్గానే అనుమతి ఇచ్చిన శ్రీ జయధీర్ తిరుమలరావు గారికి నవతరంగం తరుపున మా ధన్యవాదాలు.

“ప్రపంచ వ్యాప్త ప్రజాపోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా” త్వరలో మీ నవతరంగంలో

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుడాక్యుమెంటరీ సినిమా-1

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

6 Comments to “డాక్యుమెంటరీ సినిమా”

  • Thanks a lot Venkat….even our movie makers should start making movies on Education system changes, solutions to fixing corruption (Not the robbinhood formula, practical solutions), Traffic , infrasture ….Hope the upcoming directors will do it…..Thanks a lot again to venkat and శ్రీ జయధీర్ తిరుమలరావు gaari ki……..

  • మంచి ప్రారంభం. డాక్యుమెంటరీని, సినిమాకున్న ప్రజాపోరాట నేపధ్యాన్నీ తెలుసుకుంటేగానీ మన ఫీచర్ ఫిల్మ్స్ కు సంబంధించిన చరిత్ర అర్థంకాదు. అభినందనలు.

  • బాగుంది! కాని వెంకట్ గారు ఇంత బిజీ షెడ్యూల్స్ లో మీకు సమయమెలా దొరుకుతున్నదండీ? హాట్సాఫ్!!

  • Hi is there any I.e version requirements to post in Telugu…I am not seeing any option to write in telugu on this site….R u guys writing in telugu with some other s/w and pasting the content here?

    • @వర: http://www.baraha.com లోకెళ్ళి బరహ (యూనికోడ్) డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడైనా తెలుగుతోపాటూ అన్ని భారతీయభాషల్లోనూ రాయగలరు. ప్రయత్నించండి.

  • hi sir thanks for u r article . orkut lo navatarangam community unda lekunte comunity create cheste baguntundhi ankunta .

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories