బాలీవుడ్ అనార్కలి గా పేరు గాంచిన బీనారాయ్ మంబయిలోని తన స్వగృహంలో హార్ట్ స్ట్రోక్ తో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. బీనారాయ్ ఆదివారం తెల్లవారుజామున అయిదుగంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారులు ప్రేమ్‌కిషన్, కైలాష్‌నాథ్‌లు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆమె మరణసమయానికి ఆమె పెద్ద కొడుకు ప్రేమ్ కిషోర్ బెలబోర్న్ లో ఉన్నారు. ఇక ఆమె మనవడు సిద్దార్ధ మల్హోత్రా(ధర్మా ప్రొడక్షన్ లో దర్శకత్వం చేస్తున్నారు) ఈ వార్త తెలియగానే షూటింగ్ బ్రేక్ ఇచ్చి ఇంటికి చేరుకుని తన నానమ్మకు నివాళలు అర్పించారు.
1936, జూన్ 4న లక్నోలో జన్మించిన బీనారాయ్.. 1951లో ‘కాళి గాథ’ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. అనంతరం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అనార్కలీ’(1953), ‘తాజ్‌మహల్’,(1953) ‘ఘూంఘట్’ తదితర చిత్రాలు గొప్పపేరు తెచ్చిపెట్టాయి.
బీనారాయ్ కి అప్పడున్న సామాజిక పరిస్దితుల్లో నటిగా కుటుంబం తరుపునుంచి ప్రోత్సాహం లభించలేదు. కానీ బీనా ఓ న్యూస్ పేపర్ లో చూసిన టాలెంట్ కాంటెస్ట్ ప్రకటన చూసి వెళ్లి విన్ అయ్యారు. ప్రైజ్ మనీ పాతిక వేల రూపాయలు. అది కిషోర్ సాహు సినిమా కాళీ గాధ. ఇక తన భర్త ప్రేమ్ నాధ్ ని ఆమె 1950 లో కలుసుకుంది. Samson and Delialah’ సినిమా సెట్ పై వారిద్దరూ ప్రేమలో పడ్డారు. 1953లో పెళ్లి చేసుకుని సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఇద్దరూ కలిసి చాలా చిత్రాల్లో చేసారు కానీ ఏవీ సక్సెస్ కాలేదు. బీనా రాయ్ ..ప్రదీప్ కుమార్ తో బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. ఇద్దరూ కలిసి అనార్కలి, తాజ్ మహల్, గూంఘాట్ వంటి చిత్రాల్లో చేసారు. ఘూంఘట్ చిత్రంలో చూపిన నటనాప్రతిభకు 1960లో బీనారాయ్ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. అదే సంవత్సరం కూడా ఇదే కేటగిరిలో మెఘల్ -ఇ-అజామ్ తరుపున పోటి ఇచ్చింది. కానీ బీనా నే గెలిచింది.
రాజ్‌కపూర్‌కు ఆమె భర్త ప్రేమ్‌నాథ్ సన్నిహిత బంధువు. ఎల్.వి.ప్రసాద్ హిందీలో నిర్మించిన ‘దాదీమా’(1966) ఆమె నటించిన ఆఖరుచిత్రం. ఔరత్, సమందర్, షాగుఫా, వతన్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు (1951-1990) వందకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు ప్రేమ్‌నాథ్‌తో ఆమె వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.
బీనాదేవి మృతికి నవతరంగం ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.
yash says:
रेस्ट इन peace