జేమ్స్ కెమెరాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అవతార్’ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ…”ఈ సినిమాను చూడకండి..అనుభవించండి”..అంటూ తన అనుభూతులను వివరిస్తున్నారు.ఆయన మాటల్లో… నేనెప్పుడూ దేముడ్ని నమ్మను..కానీ దర్శకుడు జేమ్స్ కెమరాన్ దేముడు కన్నా గొప్పవాడని మాత్రం అనిపించింది.ఎందుకంటే ఆయన అవతార్ లో చాలా అధ్బుతమైన, అందమైన,ఉత్సాహవంతమైన. ఉద్వేగభరిత అనుభవానికి గురిచేసే ప్రపంచాన్ని సృష్టించాడు. దేముడు కూడా ఇట్లాంటి ప్రపంచాన్నిసృష్టించటానికి. ఊహించి ఉండడు .అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా ఐమాక్స్ లో అవతార్ ..త్రిడీ చిత్రం ప్రీమియర్ షో చూసి ఈ కామెంట్ చేసారు…(సారి)రాసారు. ముప్పై ఏళ్ళ క్రిందట స్టార్ వార్స్ వచ్చాయి..మళ్లీ ఇంతకాలానికి మళ్ళీ అంతటి గొప్ప సినిమా చూసాను అని అనుభూతికి లోనవతూ తన బ్లాగ్ లో వాటిని అనువదిస్తున్నారు. అయితే కొంతమంది టైటానిక్ తో పోలుస్తూ ఈ అవతార్ లో ఎమోషన్ కోషియంట్ తక్కువుగా ఉందంటున్నారు. దానికి నేను ఒప్పుకోను…ఈ చిత్రంలో బ్రీత్ టేకింగ్ విజువల్స్ ఉన్నాయి.ఇది సాధారణ మనుష్యులుతో నిండి ఉన్న సాధారణ చిత్రం కాదు. ఈ చిత్రాన్ని కెమెరాన్ 1200 కోట్లు బడ్జెట్ తో తీసారు. అయితే మనకీ లండన్ డ్రీమ్స్,కంఫక్త్ ఇష్క్ వంటి చిత్రాలు 80,90 కోట్లతో సినిమాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వంద కోట్లు కూడా ఖర్చు పెట్టి బాలీవుడ్ సినిమాలుతీస్తున్నారు.
అయితే వాటిని 1200 సార్లు బెటర్ చేసినా అవతార్ లాంటి ప్రాడెక్టు రాదనేది నిర్విదాంశం. నిజానికి నాకైతే అవతార్ సినిమాను వంద లేదా రెండు వందల రూపాయల అతి తక్కువ ఖర్చుతో చూడటం క్రైమ్, అన్యాయం అనిపించింది. ఇక నన్ను కొంత మంది అడిగారు ..అవతార్ లో గ్రాఫిక్స్ ఇక్కడ క్రియోటర్స్ ని వారిని ప్రేరేపిస్తాయా అని ..దానికి ఒకటే సమాధానం..మనం కొంతమంది కెమెరాన్ లాంటి వారి ప్రొడక్టు పొటిన్షియల్ ని మాత్రమే రీచ్ కావటానికి ప్రయత్నిస్తాం. అయితే అవతార్ మాత్రం బెంచ్ మార్క్ క్రియేషన్. అలాగే చాలామంది అంటున్నట్లుగా టైటానిక్ గొప్ప సినిమానే కానీ..నన్ను ఇంతలా షేక్ చేయలేదు. ఏదైమైనా జేమ్స్ కెమరాన్ ..గాడ్ ఆఫ్ ది సినిమా. ఆయన్ని నేను ఆరాధిస్తున్నాను. నేను భక్తుడిలా మారి నేను అవతార్ లాంటివి చేసేలా దీవంచమంటున్నాను.
అలాగే ఆయన్ని హేట్ చేస్తున్నాను..ఎందుకంటే ప్రపంచంలో నా లాంటి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ఈ సినిమాతో ఎర్ర చీమలుగా మార్చినందుకు. అంతేగాక నేను ఆయనలోని సినిమా పట్ల ప్యాశన్ కీ,ఓపికకీ ఇష్టపడతాను. చివరగా ఆయనకు అలాంటి అద్బుతాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను..అంటూ ముగించారు. చివరగా నేను అవతార్ సినిమాను ఎలా నమ్ముతానంటే…అవతార్ కి ముందు తరం అవతార్ తర్వాత తరం అని సినిమాలను విభజించేంతగా. ఈ సినిమాను చూడకండి..అనుభవించండి..అంతే.
Sarath 'Kaalam' says:
Very Nice.
hero says:
cinema rodd baboyyyyy…..twaralo nenu kuda oka review raastanu ..wait cheyandi
chakri says:
ఎర్ర చీమలు కాదండీ….
ఇంకొక సారి వెళ్ళి చదవండి
chakri says:
ఎర్ర చీమలు కాదండీ….
ఇంకొక సారి వెళ్ళి చదవండి
ఎందుకంటె ఆర్ జీ వీ విట్ అందులొనే ఉంది మరి!
j.surya prakash says:
కరెక్టే..సారీ..
Manjula says:
nEnu ee Sukravaaram chooDabotunnanu.
sankar says:
బాబూ జేమ్స్ కెమరాన్ మా వాడిని (అదే మా రామ్ గోపాల్ వర్మ ని ) కాస్త దీవించి, పుణ్యం కట్టుకో నాయనా…మొన్ననే మమ్మల్ని అందర్ని పెద్ద అడవి కి తీసుకెల్లి క్లైమాక్స్ అనేది తీసేసి చంపుకు తిన్నాడు.ఎమన్నా అంటే మాకు సినిమా చూడటం రాదు అంటున్నాడు నాయనా…మా వాడికి మొన్న ఆ మద్య పైత్యం ముద్దిరి తిక్కగా మారి ఈ మద్ద్యే పిచ్చి కూడ వచ్చింది అంట,,, అది కూడా బాగ ముదిరింది ఇంకేదో అయ్యేలోపల కాస్త ఆ దీవెన ఏదో అడుగుతున్నాడు…అది ఇచ్చి మా భారత ప్రజలందరిని రక్షించు నాయనా రక్షించు..ప్లీస్
వీజె says:
అవతార్ సినిమా ఎక్సెలెన్సీ మిగతా మూవీ మేకర్స్‌ని ప్రభావితం చేస్తుందా ? అని ఎవరో అడిగిన ప్రశ్నకి వర్మ ఇలా సమధానం ఇచ్చారు … ” అవతార్ లాంటి మూవీ చూసాక సాటి ఫిల్మ్ మేకర్స్ ప్రభావితం అవడమేమో కాని , ఈ సినిమా ద్వార జేంస్ కామెరన్ సృష్టించిన బెంచ్‌మార్క్‌ని అందుకునే సాహసం చేయలేక మన బోటి వాల్లు ఫ్యామిలి డ్రామాలు , టీవి సీరియల్స్ నిర్మించుకుంటూ సంతృప్తి పడే అవకాశాలే ఎక్కువ … ఉదాహరణకి రన్నింగ్ రేస్‌లో తన శక్తినంతా ఉపయోగించి 20 Kmph వేగంతో పరిగెడుతూ అదే వరల్డ్ రికార్డ్ అని చంకలు గుద్దుకుంటూ లక్ష్యం వైపు పరిగెడుతున్న వ్యక్తిని , పక్కనే మరో వ్యక్తి 200 Kmph వేగంతో దాటి వెళ్తుంటే మొదటి వ్యక్తి అక్కడే ఆగిపోయి రేస్ నుండి వైదొలగడం కంటే ఉత్తమమైన పని మరొకటి ఉండదు ”
# http://rgvzoomin.com/2009/12/16/the-second-coming/ #
j.surya prakash says:
అయ్యా…ఇది స్వేచ్చానువాదం మాత్రమే..అది కూడా నాకు నచ్చిన వాక్యాలు సరదాగా ట్రాన్స్ లేట్ చేసిందే కానీ ట్రూ ట్రాన్స్ లేషన్ చేయాలనే ఉద్దేశ్యంతో కాదు..వర్మ బ్లాగ్ కు వెళ్ళని వారు..ఇది ఇక్కడ చదివి నచ్చితే అక్కడికి వెళ్ళి ఒరిజినల్ చదవుతారనే నమ్మకం ఉండే..
సూర్యప్రకాష్ జోశ్యుల
vasu says:
నేను ఇంతకూ మునుపే ఒరిజినల్ చదివాను. ఇది చదువుతుంటే తెలుగు ఛానల్ లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి తెలుగు వాయిస్ ఓవర్ , జెమిని లో హాలీవుడ్ హంగామా (తెలుగు అనువాదం) గుర్తొచ్చి భలే నవ్వొచ్చింది. థాంక్స్.
వీజె says:
@వాసు గారు … వర్మ గారు తన బ్లాగ్‍లో అవతార్ మువీ గురించి వెళ్ళబుచ్చిన అభిప్రాయంలో నన్ను ఆకట్టుకున్న ఒక చిన్న అంశాన్ని పంచుకునే ప్రయత్నంలో కాస్త సీరియస్‍గానే రాసానండి నేను నా వ్యాఖ్యని …. నవతరంగం వాళ్ళు వ్యాఖ్యలని కూడ తెలుగులో టైప్ చేసె సదుపాయం కల్పించారనే ఆవేశానికి తోడు తెలుగు భాషాభిమానం తోడవడం మూలాన చోటుచేసుకున్న అపశృతిగా నా వ్యాఖ్యని భావించి , పెద్దమనసు చేసుకొని వెకిలినవ్వులు మానవలెనని ప్రార్థన …
వీజె says:
అయ్యో , మీరు భలేవారండి జోస్యుల గారు … మీరు మీ వ్యాసములో విస్మరించారనుకొని భావించి , వర్మ గారి బ్లాగులోనుండి నాకు నచ్చిన రెండు పాయింటులని ఎదో ఉడతా భక్తిగా మీ వ్యాసానికి అదనంగా జతపరిచే ప్రయత్నమే కాని మరే దురుద్దేశ్యం లేదండి బాబు
… వర్మగారి బ్లాగ్ తెలియని వారికి ఉపయోగపడుతుందనే సదుద్దేశ్యంతోనే లింక్ ఇచ్చనే తప్ప , మీ వ్యాసం మాతృకని జనాలకి తెలియపరచాలనే నెపంతో కాదండి … అయినా మీరు అంత వివరంగా వర్మగారు చెప్పారంటూ మీ వ్యాసంలో వ్రాసినప్పుడు ఇంకా నేను క్రొత్తగా చెప్పేదేముందండి జనాలకి … నవతరంగంలో మీరు వ్రాసే సమీక్శలకి నేను వీరాభిమానినండి …. వచ్చేసారి ఎదైనా వ్యాఖ్య వ్రాసెప్పుడూ వొళ్ళు దగ్గర పెట్టుకోని రాస్తానండీ . నా వ్యాఖ్య మిమ్మల్ని నొప్పించి వుంటే మొదటి తప్పిదంగా పరిగణించి క్షమించవలిసిందిగా ప్రార్థన …
rayraj says:
కొత్త కెమారలు, కొత్త టెక్నాలజీలు తయారు చేసుకున్నారు. స్టార్ వార్స్‌ని మించాలని ఏకంగా పాండోరాపీడియా అనే ఉద్గ్రంధం రాసుకున్నారు. ఓ కొత్త గ్రహానికై, కొత్త మొక్కలు, జంతువులు, హ్యూమనాయిడ్స్, కొత్త మానవ రూపాలు, కొత్త భాషలు, కొత్త వేషాలు, కొత్త భావప్రకటనలు! ఎన్నొన్నో సృష్టించుకున్నారు. కానీ అదొక్కటే కాదు ఇందులో తెలివి….
ఈ “అనుభవం” కోసం తీయడానికి కావల్సిన 3-D టెక్నాలజీ ఉంటే సరిపొదు. చూపించే థియేటర్లు కావాలి. అందుకు గానూ, స్పై-కిడ్స్ ౩-డి లో కూడా వేలు పెట్టి. థియేటర్లకీ వచ్చే డబ్బు రుచి చూపించాడు. ఐనా థియేటర్లు ఆ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టకపోతుంటే, “పెట్టని వాడు కొట్టుకుపోతాడు – మారని వాడు పున్నామనరకాలకే, పాండరోలోకి రాలేరు” అని కూడా కాస్త మార్కెటింగ్ చేసాట్ట. ఏదో చేసి మొత్తానికి అమెరికాలో కొన్ని వేల థియేటర్లనైతే మార్చారు!
ఇంతకీ మనం ఊరికే, ఆ కళ్ళజోడు పెట్టుకు చూడాలా లేక నిజంగానే ఇండియన్ థియేటర్లు కూడా ఇందుకు రెడీగా ఉన్నాయా !? ఉంటే ఏ చోట ఉన్నాయి?
ఎక్కువమంది ఊరికే 2Dలోనే చూస్తాం కదా….
K మహేశ్ కుమార్ says:
@రేరాజు:ఇండియాలో మాత్రం చాలావరకూ థియేటర్లలో ప్రజలు 2Dలోనే చూస్తారు.
నిజానికి అవతార్ కథ మనం కొన్ని వందలసార్లు భారతీయసినిమాలలో చూసిన కథే. కానీ తేడా అల్లా ఆ “కొత్తదనం”. ఆ స్కేల్. ఆ మ్యాగ్నానిమిటీ. అవి పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలంటే హైదరాబాద్ IMAX -3D లో చూడాల్సిందే.
రవి says:
ఈ సినిమా తాలూకు ప్రభావం ప్రపంచ సినిమా మీద, ముఖ్యంగా తెలుగు సినిమా మీద -ve గా ఉంటుందేమో అని నా మనసు కీడు శంకిస్తూ ఉంది. దీనికి కారణాలు.
౧. ఈ సినిమాను మన వాళ్ళు “డబ్బు ఎక్కువ పెట్టి, గ్రాఫిక్స్ ను విపరీతంగా చూపిస్తే జనాలు మెచ్చుతారు” అని అర్థం చేసుకుంటే?
౨. పర్యావరణం మీద సినిమా అంటున్నారు. ఈ కోణం లో మన సినిమా వాళ్ళు ఆలో’చించడం’ మొదలు పెడితే, కొన్ని రోజులకిది ఒక మూస అయిపోతుంది. మూసలు ఎంత చెడుపో అందరికీ తెలిసిందే.
౩. ఈ సినిమా స్థాయి అందుకోవాలన్న ఆశతో, ఆ స్థాయిలో ఆలోచనలు చేసే సామర్థ్యం కఱువై, రెంటికీ చెడ్డ రేవడి లాగా ప్రపంచ (తెలుగు) సినిమా మిగులుద్దా?
౪. థియేటర్ యాజమాన్యాలు (ముఖ్యంగా మల్టీప్లెక్సులు) ఇలాంటి సినిమా వచ్చినప్పుడు రేట్లు పెంచడం మామూలు.పెంచిన రేట్లు మామూలుగా అక్కడే ఉంటానికి ప్రయత్నిస్తుంటాయి. లాంగ్ రేంజ్ లో ఇదొక దెబ్బ.
ఏదేమైనా ఈ సినిమా హైప్ కు తగినట్టు నిలబడుతుందా అనేది కాలమే చెప్పాలి. (నాకు రేపటికి టికెట్లు దొరికినయ్)
మిత్రుడు says:
బాగుంది గురూ మీ కామెంట్.చిత్రమం లోని సందేశాన్నిప్రస్తుత పరిస్తితులకు అద్దం పడుతుంది.
Hari Charana Prasad says:
Wanted – I need a different set of eyes. I do not want to watch S.U.M.T.cinemas with the same eyes I watched ‘AVATAR’
suresh says:
ఆవతార్ చాలా గొప్పచిత్రమ్. కాని ఆర్.జి.వి రివ్యు చెత్త. ముత్యల ముగ్గు లొ రావుగోపాలరావు పక్కన దరువేసె క్యారక్ట్ర్రర్ లా వ్దున్ది.ఆర్.జి.వి చెత్త వాగుడు.
కొత్తపాళీ says:
Hari Charan Prsad garu .. ha ha ha.
Mahesh, Magnanimity = దానగుణం. just FYI
ఆనూష says:
RGV ది చెత్త వాగుడు అంటున్నారు..
పూరి జగన్నాధ్, రాము రాసిన review ని కామెరూన్ కి మెయిల్ చేస్తే, అయన RGV కి reply ఇచ్చాడట..
thanks for your genuine opinion అని
pradeep says:
yes,you are right anusha
i agree with you …………………
pradeep says:
that is ram gopal varma personal point of review
we have no right oppose him………
we, have no right to speak ram goapl varma name also ….
he is such a great person (ideate).