Menu

అరుంధతి(A) బాధితుల సంఘం ౨

Arundhati-wallpapers20

అరుంధతి(A) బాధితుల సంఘము యొక్క ప్రథమ సమావేశానికి స్వాగతం. మా సంఘంలో చేరినందుకు ధన్యవాదములు, మీకు ఈ సినీరాజం కల్పించిన దుఃఖాన్ని కాస్త ఉపశమించగలిగితే మాకదే బ్రహ్మానందము.

రాజమహేంద్రవరంలో ఒక సీడీల కొట్టు సీడీల పైకెక్కగానే, ఇంచుమించు మూఁడో తరగతి పిల్లాడు వాడి తల్లీ కనబడ్డారు.

పిల్లాడు- అమ్మా అరుంధతి తీసుకుందామమ్మా
అమ్మ- వద్దురా
నేను- అరుంధతి చూడకూడదమ్మా చిన్నపిల్లల్లు (ఆమెకు మద్దతిస్తూఁ)
వాడు- ఏఁ?
నేను- అది పెద్దల సినిమా, A సర్టిపికేటు వుంది. కాబట్టి పిల్లలు చూడకూడదని అర్థం.
ఆమె- కానీ ఇక్కడ ఏ మనరు కదా.
నేను- ఎ అంటే పిల్లలు చూడకూడదని కదండి.
ఆమె- ఇక్కడ అందరూ చూస్తారు కదా.
నేను- అంటే చట్టం ప్రకారం అడల్టు సినిమాలు పిల్లలు చూడకూడదుగా.
ఆమె- వాడు ఇప్పటికే థియేటర్లో మూఁడు సార్లు చూసాడు.
నేను- చూడ్డం చూడవచ్చండి, కానీ అలా చూడ్డం పిల్లలకు మంచిది కాదు.
ఆమె- వాళ్ళ కోసం మనం కూడా sacrifice చేసుకోలేము కదా.
నేను- పిల్లల్ని ఏ ప్రక్కింటివారికో అప్పజెప్పి వెళ్ళవచ్చు కదా.
ఆమె- వాళ్ళక్కడ ఏమైపోతున్నారో అని భయపడేకంటే పిల్లల్ని కూడా తీసుకుపోవడమే నయం కదా.

అప్పటికే నా ప్రక్కన వున్న నా మిత్రుఁడు, మోచేత్తో నా డొక్కలో గుద్దడం మొదలు పెట్టాడు. సిగనల్ అందుకున్న నేను కట్టిపెట్టాను, చిరాకేత్తిన ఆమె కొట్టువదిలి వెళ్ళింది.

ఇదే సినిమా అయితే, ఆమె sacrifice అనగానే, నేపథ్యంలో “త్యాగశీలివమ్మా నువ్వు త్యాగశీలివమ్మా”, అని పాట మొదలయ్యేది. కథలో నీతి ఏమిటంటే, మీ పిల్లల్ని మీ ప్రక్కయింటివారికో మీ అత్తమాఁవలకో మీ తల్లిదండ్రులకో అప్పజెప్పితే వారు వాళ్ళని కొఱుక్కుతినేయవచ్చు (సినిమాల్లో ఇదేప్పుడూ చూపిస్తునే వున్నాడుగా, పిల్లల్ని వారి తాతలూ నానమ్మలూ ముక్కలుగా క్రోసి తినేయడం). కాబట్టి వాణ్ణి మనకూడా అడల్టు సినిమాలకు తీసుకెళితే మన చేఁజేతులారా మనమే వాణ్ణి సీరియల్ కిల్లర్ గానో, యాసిడ్ దాడిగానిలానో తీర్చిదిద్దిన వారమవుతాము. పై పెచ్చు పిల్లల కోసం ఉద్యోగాలూ, చదువులూ sacrifice చేసుకుంటాము, ఇంకా కావాలంటే ఒక పూట భోజనం కూడా మానుకుంటాము గాని, ఇలా అడల్టు సినిమాలూ వాటిలోనీ హింసాకాండ అస్లీలతా sacrifice ఎలా చేసుకుంటాం చెప్పండి.

ఎంత ఏడ్చి ఏం లాభం గానీ, ఇవాళ్టి మన సభను ముంగించే ముందు నాలుగు మంచి మాటలు చెప్పుకుందాం.

ప్రఖ్యాత adult movie maker పూరీ జగన్నాథుఁడు తన సరికొత్త చిత్రం ఏక నిరంజనునికి కూడా A పత్రం సునాయాసంగా సాధించాడు. (ఏక్ నిరంజన్ (A) బాధితుల సంఘాన్ని విలీనం చేసుకోవడానికి మేము సుముఖతతో వున్నామని ఈ సందర్భాన మనవి చేసుకుంటున్నాము). మొన్న కార్తీకమాసాన భాగ్యనగరం వెళ్ళినప్పుడు ఏక్ నిరంజన్ యొక్క ప్రచార పత్రాల (పోష్టరు) మీద A అనే అక్షరం పెద్దపెద్దగా వేసియుండడం చూసి కాస్త సంతోషం వేసింది.

నేననుకోవడం, ప్రభుత్వం వారు మనలాంటి బాధితుల గోడు అర్థం చేసుకొని, చిన్న చిన్న ప్రచారపత్రాల మీదఁ సైతం పెద్దగా కానవచ్చేట్టు A అనే పదం అచ్చువేయాలని నిబంధనలు విధించినట్టున్నారు, ఇది చూసైనా, జనాలు కాస్త జాగరీకు*లై ప్రవర్తిస్తారని ఆశిద్దాం.

అలా ప్రభుత్వ నిబంధన ఏమీ లేదు. అది కేవలం అధిక ప్రచారం కోసమే అయితే ఆ విషయం ఇక్కడఁ జెప్పి మా సంతోషాన్ని భంగం చేయవద్దని సభ్యులకు మనవి చేసుకుంటున్నాను.

16 Comments
 1. Ratna December 17, 2009 /
  • RK December 17, 2009 /
  • karuna October 13, 2010 /
 2. Sankar gongati December 17, 2009 /
 3. vjarowdy December 18, 2009 /
   • vjarowdy December 18, 2009 /
  • sankar December 18, 2009 /
 4. navafam December 18, 2009 /
 5. గీతాచార్య December 22, 2009 /
 6. zulu December 28, 2009 /
 7. Venu January 1, 2010 /
 8. Chetana February 26, 2010 /
 9. v.prathap reddy February 7, 2011 /