“అమరావతి”, ఎప్పటిలాగే రవిబాబు పోస్టర్ల ద్వారా ఈ సినిమాకి కావలిసినంత క్రేజ్ కల్పించాడు. రవిబాబు మీద ఉన్న నమ్మకంతో చూసిన ఈ సినిమా ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టిందో చూద్దాం.
కథ:
ఎవరో ఓ వ్యక్తి తొమ్మిది నెలల గర్భిణీలకు మత్తుమందు ఇచ్చి వాళ్ళ కడుపు కోసి పసిబిడ్డల్ని ఎత్తుకెల్లిపోతుంటాడు. ఆ పని చేయడానికి కొన్ని నిమిషాల ముందే 108 కి ఫోన్ చేసి అదే గర్భిణీ స్త్రీ ప్రమాదంలో ఉందని చెప్తుంటాడు. 108 వాహనం వచ్చే లోపే తన పని ముగించుకుని పారిపోతుంటాడు. అలా ఐదుగురు పిల్లలను ఎత్తుకుపోతాడు. కాని ఇలా ఎందుకు చేస్తున్నాడో అసలు ఎవరు చేస్తున్నారో తెలీక టాస్క్ ఫోర్స్ పోలీసులు సతమతమవుతుంటారు. ఇలాంటి కేసుల్ని డీల్ చేయడంలో దిట్ట అయిన రవిబాబుని పిలిపించి కేసుని అతనికి అప్పగిస్తారు. ఆరో పిల్లవాణ్ణి ఎత్తుకుపోయిన తరువాత అదే ఇంట్లో ఆ వ్యక్తిని పట్టుకుంటాడు రవిబాబు. కాని పిల్లవాడు కనిపించడు. ఆ వ్యక్తే తారకరత్న. తారకరత్న జైల్లో ఉండగానే ఏడో బిడ్డను, ఎనిమిదో బిడ్డను కూడా ఎవరో ఎత్తుకు పోతారు. మళ్ళీ అంతా మొదటికొస్తుంది. అంతలోనే జైల్లో తారకరత్నని కలవడానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకుంటాడు.
అసలు పిల్లల్ని ఎత్తుకుపోయింది తారకరత్నేనా? అలా అయితే అతను జైల్లో ఉండగా మిగతా పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్ళారు? ఇంతకీ అలా పసిపిల్లల్ని అదీ నిండు గర్భిణీల కడుపు కోసి మరీ ఎందుకు ఎత్తుకెల్తున్నారు? లాయర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆ చిక్కుముడి ఎలా వీడిందనేదే తరువాత కథ.
విశ్లేషణ:
రవిబాబు సినిమాలు కాస్త విభిన్నంగా, మూసకి దూరంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. సినిమా నిడివి రెండు గంటలు. ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా మొదలైన దగ్గరనుంచి పూర్తయ్యే వరకు కథనాన్ని పరుగులు పెట్టించాడు. కథాగమనానికి, ప్రేక్షకులకి మధ్య అడ్డొస్తాయనేమో పాటలు పెట్టలేదు. అది సినిమాకి ప్లస్ అయింది. తారకరత్న తన ముందు సినిమాల కంటే దీంట్లో కాస్త బాగా చేసాడు. రవిబాబు సహజంగానే పాత్రలో ఇమిడిపోయాడు. స్నేహ, భూమిక ఉన్నంతలో బాగానే చేశారు. రొమాంటిక్ సన్నివేశాలు ఇష్టపడేవారైతే రవిబాబు, స్నేహాల మధ్య వచ్చే సన్నివేశాన్ని మిస్ కావద్దు. హాస్యం కూడ సందర్భోచితంగా ఉంది. ఎక్కడా బలవంతంగా హాస్యనటుల్ని పెట్టి సినిమాని చెడగొట్టలేదు. మరీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే సినిమా కాస్త కృత్రిమంగా అనిపించొచ్చు కాని థ్రిల్లర్ కాబట్టి ఆ మాత్రం క్షమించేయొచ్చు. ముఖ్యంగా STF అంటే ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. చిత్రీకరణ కూడా సహజత్వానికి దగ్గరగా సాగింది. టైటిల్స్ వేసేటప్పుడు నేపథ్యంలో శిశు భ్రూణాలని చూపించడం బావుంది.
ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా సినిమా థీమ్ కు తగ్గట్టుగా ఉంది. స్క్రీన్ ప్లే కూడా జాగ్రత్తగా రాసుకున్నట్టు తెలుస్తుంది, నా కైతే ఎక్కడా లోపాలు కనపడలేదు. పైగా మొదట్లో మనం సాధారణం అనుకున్న సన్నివేశాలు కొన్ని చివర్లో ఎంత ముఖ్యమో తెలియడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. థియేటర్లో నేను నాలుగు సార్లు ఉలిక్కి పడ్డాను, ఇది చాలు నా టికెట్ డబ్బులు నాకు వసూలు కావడానికి. మిగిలినదంతా బోనస్ కింద లెక్క. అనట్టు చెప్పడం మర్చా రవిబాబు పేరు తెర మీద వచ్చినప్పుడు, రవిబాబు తెరపై మొదటిసారి కనిపించినప్పుడు, థియేటర్ ఈలలతో, అరుపులతో దద్ధరిల్లింది.
అసలు తారకరత్న ఎవరు? అమరావతి ఎవరు? స్నేహాకి రవిబాబుకి సంబంధం ఏంటీ? తారకరత్నకి స్నేహాకి సంబంధం ఏంటి? లాయర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు? చెప్పేద్దామనే ఉంది కాని రవిబాబు ఫీలవుతాడేమో, ఈ సారికి థియేటర్లో చూసేయండి!
కథ, దర్శకత్వం : రవిబాబు
కథనం : సత్యానంద్
సంగీతం : శేఖర్ చంద్ర
srikanth says:
unfortunately will have to wait for an upload
K మహేశ్ కుమార్ says:
నాకైతే ఈ సినిమా బోరుకొట్టింది.
sankar says:
chetta cinimaaa..yevadu baabu bagundani rasindi
shravan says:
Malli enkosari chudura
shravan says:
chala bagundundi
zulu says:
Even I watched this movie last week. The screen play and the artists performance is super. I am watching Ravi babu’s films for quite some time now, and I enjoyed the movie. “Technically” speaking its a good movie. Paisa vasool for me.
sreenu says:
Story line was good…But some scences are so dry and boring
sreenu says:
Story line was good…..But screenplay was So boring in some scenes
శ్రీనివాస్ says:
Story line was good but screenplay was so boring