2009 సినీ పరిశ్రమకు దాదాపు 330 కోట్ల వరకూ నష్టాన్ని కలగ చేసిందంటూ ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే 64 మంది కొత్త దర్శకులుకు మాత్రం కెరీర్ లు ప్రారంభం కలిగించే అవకాంశం కల్గించింది. అది వారు నిలబెట్టుకున్నారా లేదా అనేది ప్రక్కన పెడితో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినీ ఫీల్డులో ప్రవేశించే చాలామంది అంతిమ లక్ష్యం మాత్రం దర్శకత్వం.
జనవరి
1) జి.ఎల్.బి.శ్రీనివాస్ (మహా నగరంలో శివ -చందు)
2) హర్షా రెడ్డి (ఇందుమతి)
3) విశ్వ ప్రసాద్ (మిస్టర్ గిరీశం)
4) పాము శ్రీను (వేట)
5) ఆకుల రాఘవ (భరత్ మహాన్ డాట్ కాం)
6) అరుణ్ కుమార్ (బ్యాంక్)
7) సాయి భాను (మంజరి)
పిబ్రవరి
9) జి.శివ ప్రసాద్ రెడ్డి (శుభం)
10)ప్రకాష్ మార్తా (జనతా)
11) కరుణ్ కుమార్ (ద్రోణ)
12) ప్రభు శాలమన్ (16 డేస్)
13) కె.రమణా రావు (మొండి మొగుళ్లు-పెంకి పెళ్లాలు)
14) ఎ.ఎమ్.చౌదరి (సునామి 7x)
మార్చి
15) నాగేద్ర కుమార్ (నా గర్ల్ ప్రెండ్ బాగా రిచ్)
16) వైకుంట లవ్య (జాజి మల్లి)
ఏప్రిల్
17) నరేంద్రనాధ్ (నేను ముఖ్య మంత్రి నైతే..)
18) ఉమేష్ కుమార్.ఎస్ ( సర్కస్ సర్కస్)
మే
19) మహదేవ్ (మిత్రుడు)
20) ఆనంద్ (దుర్గా)
21) టి.రమేష్ రాయలు (ఈ వయస్సులో..)
22) అశోక్ (ప్లాష్ న్యూస్)
23) రిషీ (మయూరి-2)
24) రమేష్ రాజా (టార్గెట్)
25) రాధాకృష్ణ (18,20 లవ్ స్టోరి)
26) కె.సూరి బాబు(తాళి కడితే 100 కోట్లు)
27) విద్యాసాగర్ (ఆగ్రహం)
28) ఎం.రామకృష్ణ (డైరీ)
29) రాజవంశీ (మలపు)
30) సుమన్ (ఉషా పరిణయం)
జూన్
31)ఎన్.యస్.మూర్తి(ఆ ఒక్కడే)
32) వి.కరుణ ప్రకాష్ (కావ్యాస్ డైరీ)
33) రాజ పిప్పళ్ళ (బోణి)
34)ఎమ్.ఎస్.శ్రీ చంద్ (నచ్చావ్ అల్లుడు)
35) ఆకాష్ (స్వీట్ హార్ట్)
36) మార్తాండ్ శంకర్ (ఎవరైనా..ఎప్పుడైనా)
37) కె.చంద్ర శేఖర్ (అంజనీ పుత్రుడు)
38) పూస మహేంద్రర్ (రూ.999/- మాత్రమే)
జూలై
39)ఆనంద్ రంగా (ఓయ్)
40) చిన్నా(ఆ ఇంట్లో)
41)సత్య (ఊహా చిత్రం)
42)వివి నారాయణ (జల్లు)
43)వీర ప్రసాద్ నీలం (అడుగు)
ఆగస్టు
44)సత్యం బెల్లంకొండ (స్నేహితుడా..)
45)విశ్వప్రసాద్ (ప్రేమించే రోజుల్లో..)
సెప్టెంబర్
46) వాసు వర్మ (జోష్)
47)శరవణ్ (గణేష్)
48) చైతన్య దంతురూరి (బాణం)
49) చక్రి తోలేటి (ఈనాడు)
50)అర్జున్ రెడ్డి (సమర్ధుడు)
అక్టోబర్
51) ఎస్.ఎస్.కుమార్ (హ్యాలీడేస్)
52) మంజూర్ (నిజంగా నువ్వే గుర్తుకొస్తున్నావు)
53) కె.ఆర్.రత్నం (నిర్ణయం)
54)ఎన్.కె.విశ్వంత (జగన్మోహిని)
55)కె.లక్ష్మణాచారి (అద్బుత వైద్యం ఆయుర్వేదం)
56)నరేన్ కొండేపాటి (జయీభవ)
57)జయ రవీంద్ర (బంపర్ ఆఫర్)
నవంబర్
58)సందీప్ గుణ్ణం (కుర్రాడు)
59)సూర్య ఇంజమూరి (ఏడు కొండలవాడ,వెంకటరమణ..అందరూ బాగుండాలి)
60)సూర్యశ్రీ (పదహారేళ్ళ వయస్సు)
డిసెంబర్
61) శ్రీనివాస్ రంగ (కథ)
62)కన్నన్ (సారాయి వీర్రాజు)
63)వేలు రాజ (మన్మధులు)
64)రాజేంద్ర దర్శన్ (వాడే కావాలి)
పైన పేర్కొన్న సినిమాలు..దర్శకులలో చాలావరకూ విన్నవి కూడా లేకపోవటం గమనించే ఉంటారు. అలాగే ఇంత మంది కొత్త దర్శకులలో ఒక్కరంటే..ఒక్కరు కూడా మినిమం గ్యారంటీ చిత్రం ఇవ్వక పోవటం విషాదం.
ఈ సంవత్సరం ఇంత భారీ నష్టానికి ఓ ప్రక్క ఆర్దికమాధ్యం,మరో ప్రక్క స్వైన్ ఫ్లూ, ప్రత్యేక-సమైక్య ఉద్యమాల ఎఫెక్టు దెబ్బ కొడితే సృజనాత్మక పరంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక వీరంతా తెలుగు సినిమాను,దాన్ని నమ్ముకున్న వారిని చావు దెబ్బ కొట్టారు.అలాగని రెగ్యులర్ దర్శకులు ఏదో ఒరగపెట్టారని కాదు..కాకపోతే వారి గురించి ‘కొత్త’గా మాట్లాడుకునేదేముంది అనేది నా ప్రశ్న.
విజయవర్ధన్ says:
అవకాశాలు రావట్లేదు అనుకునే నూతన దర్శకులకు ఇది ఆశ కలిగిస్తుంది. మీరన్నట్టు అవకాశాన్ని సద్వినియోగము చేసే ప్రయత్నం చేయాలి.
K మహేశ్ కుమార్ says:
2009 సంవత్సర సమీక్ష రాస్తూ ఈ లిస్టులోని చాలా మందిని గుర్తుతెచ్చుకున్నాను.కొత్తదర్శకులు చూపించిన కొత్తదనం ఎక్కడైనా ఉందేమో అని వెతికాను.చాలా నిరాశ కలిగింది.
కానీ, మినిమమ్ గ్యారంటీ ఎవరూ ఇవ్వలేదు అంటే మాత్రం ఒప్పుకోలేను. కథ,ఈనాడు,బాణం,బంపర్ ఆఫర్ చిత్రాలు వ్యాపారపరంగా నష్టాన్ని తీసుకురాలేదు. అలాగే మన్మధులు సినిమా అదెందుకు హిట్టయ్యింది అనేవిషయం పక్కనబెడితే హిట్టుకిందేలెక్క.
j.surya prakash says:
కరెక్టే..కమర్షియల్ గా మన్మధులు మంచి హిట్ సినిమా…
ఇక బాణం లాభాలు తేలేదు కానీ ఫరవాలేదనిపించుకునుంది..
కథ చిత్రం కమర్షియల్ గా నష్టాన్నే తెచ్చెపెట్టింది.
బంఫర్ ఆఫర్ ఓకే సినిమా
ఈనాడు..అన్ని భాషల్లో చేయటం వల్ల వర్కవుట్ అయింది.
అయితే ఉన్నంతలో బెస్ట్ అనుకున్న వారిని పరిశ్రమ నమ్మలేదు…రెండో సినిమా ఇవ్వలేదు..
అంటే..అర్ధం ఏమిటి?
satya says:
‘oohachitram’ direct chesindi ‘satya’!!.. uday bhaskar kaadu..
j.surya prakash says:
పొరపాటే..క్షమించండి
ఊహాచిత్రం దర్శకుడు సత్య నే..
సూర్య ప్రకాష్
rayraj says:
very good post. ఈ డేటాని అడుగుదాం అనుకున్నాను. దీంతో పాటు, మీరు చూడాలిసింది, చూపాల్సింది – ఈ కొత్త దర్శకుల సినిమా ప్రొడుసర్ల ఎవరు? టూకీగా వాళ్ళ అనుభవం ఎంత? వీలైతా అది కూడ ఇవ్వండి.ఒక మంచి చర్చ బయటికి వస్తుందేమో అని. ఆ చర్చ నుంచి సందేశం వెళ్ళాల్సింది కొద్దిమంది నిర్మాతలకి. అందుకే నా విన్నపం.ప్లీజ్!!
Sankar gongati says:
ఈ దర్శకులు తమ శక్తియుక్తులు నిర్మాతలను వెతికి పట్తుకొడానికె సరిపొయుంటుంది. ఇంక సినిమాలెం తీస్తారు.
అబ్రకదబ్ర says:
‘మన్మధులు’? ఆ సినిమా పేరే విన్లేదు. అది హిట్టా! ఎవరా మన్మధులు?
నూట ముప్పై దాకా తెలుగు సినిమాలు ఈ ఏడాదిలో విడుదలయ్యాని ఈనాడే ‘ఈనాడు’లో చదివా. అవి కాక మరో వంద దాకా అనువాద చిత్రాలు విడుదలయ్యాయట. అంటే వారానికి నాలుగు పైనే. వాటన్నిట్లోనూ విజవంతమైనవి పట్టుమని పది కూడా లేవు.
వచ్చిన నూట ముప్పై స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో దాదాపు సగం నూతన దర్శకులు రూపొందించినవే – అంటే ఏదో తేడాగా అనిపించటం లేదూ? మీకేమనిపిస్తుందో తెలీదుగానీ నాకు మాత్రం ఓ సినిమాకి దర్శకత్వం వహించటం ఇంత సులువా అనిపిస్తుంది. ఎవరుబడితే వాళ్లు దర్శకుల అవతారాలెత్తుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సగం మందిని తీసేస్తే మిగతా సగం మందిలో సగమున్నర మంది సైతం ‘నూతన దర్శకులు’ అనిపించుకోదగ్గోళ్లే – ఎందుకంటే వాళ్లలో అధికులు ఇంతకు ముందు ఒకట్రెండు సినిమాలకి మించి తీసుండరు కాబట్టి. ఏతావాతా, రెండు మూడేళ్లుగా పరిచయమౌతున్న నూతన దర్శకుల సత్తా మీద నాకున్న అనుమానం ఈ ఏడాది నిజమయింది. ఏదో రకంగా నిర్మాతని మేనేజ్ చేసి సినిమా తీయించగలిగే వాళ్లే కానీ, నిజంగా మూవీ మేకింగ్ మీద పూర్తి స్థాయి అవగాహన, మంచి కథనెన్నుకుని హృద్యంగా చెప్పగలిగే ప్రతిభ ఉన్నవాళ్ల సంఖ్య వీళ్లలో ఎక్కువ ఉండదని ఆ అనుమానం.
K మహేశ్ కుమార్ says:
@అబ్రకదబ్ర:మన్మధులు అనేది ఒక గొప్ప ప్రయోగాత్మక “రసిక”చిత్రం లెండి. దాని గురించి మీకు తెలియకపోతే పెద్ద విచిత్రం కాదు. కాకపోతే నవంబర్-డిసెంబర్ మాసాల్లో రిలీజైన అన్నిసినిమాలూ కుదేలైపోతే, ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా చూరగొన్న ఏకైకచిత్రం ఇది. ఇప్పటికీ ప్యాక్డ్ హౌసెస్ నడుస్తోంది.
మీరు రిలీజైన స్ట్రెయిట్ చిత్రాలూ,అనువాద చిత్రాలు మాత్రమే లెక్కించారు.వాటికన్నా లెక్కకు మించి చిత్రాలు ల్యాబ్ దాటి బయటికే వెళ్ళలేకపోయాయి. వాటికి పెట్టిన పెట్టుబడికూడా లెక్కేసుకుంటే హిందీ చిత్రరంగానికి చేరువైపోతుందేమో!
దర్శకత్వానికి మూవీమేకింగ్ మీద అవగాహన ఉండాలి అనేది మన పరిశ్రమ మాట కాదులెండి.కథచెప్పిన విధానం బాగుందికాబట్టి దర్శకత్వం ఛాన్సిచ్చాను అని ఒక హీరో,మా సంస్థలో లైట్ బాయ్ గానో సహాయదర్శకుడిగానో చాన్నాళ్ళుగా పనిచేసి నిబద్ధత చాటుకున్నాడు కాబట్టి అవకాశం ఇస్తున్నానని మరో నిర్మాత ఇలా దర్శకుల్ని తయారు చేసేస్తున్నారు. ఇక కొత్త నిర్మాతలు ఎవరైనా వస్తే “టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ” అని కొందరు రెడీగా తయారై డబ్బులు పెట్టించి సినిమాలు చుట్టేసి దర్శకులైపోతున్నారు.
FTII నుంచీ దర్శకత్వం నేర్చుకునొచ్చిన కొందరు తెలుగోళ్ళు ఇండస్ట్రీ పోకడచూసి బెంబేలెత్తి బొంబై(ముంబై) పారిపోయారు. ఇక్కడ సినిమాకు పనిచెయ్యడంకన్నా అక్కడ టెలివిజన్ కు పనిచెయ్యడం బెటరని వాళ్ళ ఉవాచ.
మీకో విషయం చెప్పనా…ఈ సంవత్సరమే రిలీజైన ఒక చిత్ర దర్శకుడు ప్రొఢక్షన్ వాళ్ళు కారు పంపకపోతే బస్సులో లోకేషన్ కొచ్చి డైరెక్ట్ చేసిపోయాడు.అది… మనోళ్ళు అవకాశం ఇచ్చిన దర్శకుడి పట్ల చూపే గౌరవం.కారేపంపనోళ్ళి డబ్బులేమిచ్చారో! నువ్వుకాకపోతే మరొకడు అని అనుకోబట్టేకదా ఈ పరిస్థితి!! దర్శకుడుకాకపోతే నిర్మాతే దర్శకుడి రూపమెత్తేవాడు. నిజంగా మనకు దర్శకులు అవసరమంటారా!!! హేమిటో…ఈ నిజాల మధ్యన నిల్చుంటే కష్టంగానే ఉంది.
sankar says:
@mahesh kumar
మన్మధులు straight మూవీనా? తొక్కేం కాదు..ఈ poster ఆరు నెలల క్రితం చెన్నై లొ చూసా…poster మీద వున్న ఆ Heroin పేరు ఏంటో తెలుసా? థూ..నీ_____!#$$#$#$ అదీ కాక మళ్ళీ సూపర్ హిట్టా ?ఎవడా కామాంద్దుడు వాగింది..కొంపదీసి మీరుగాని ఆ సినిమా దర్సకత్వం లో ఏ ఏలో,కాలో పెట్టలేదుకదా.మీకు కొంచెం రసికత్వం ఎక్కు వై కళ్ళు కామం తో మూసుకుపొయినట్టు వున్నాయి..రసికరాజ కొంచెం బయటకి వచ్చి ఆలోచించు…నీ మూలంగా Blue Films లిస్ట్ కూడా నవతరంగం లో చూడాల్సివస్తుందో ఏంటో ఖర్మ..మన తెలుగు సినిమాలే అనుకున్నాను…తెలుగు సైటులు కూడా ఇలా తయారవుతున్నాయేంటిరా బాబూ…
K మహేశ్ కుమార్ says:
@శంకర్: మీ బూతు ఫోబియాని ఇలా నామీద బూతు ప్రయోగించిమరీ చెప్పాల్సిన అవసరం నిజంగా ఉందంటారా!?! That only proves your standard not mine.
నేను కేవలం ఒక నిజాన్ని చెప్పాను. దానికి నేను ఆపాదించే “నైతికత” ఏమీ లేదు. Its just a fact thats all.
You seem to have issues with morality of it.If you really have issues with it, చాలా సంస్థలు బూతు చిత్రాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. మిరున్నది హైదరాబాద్ లోనేకదా రండి..I will give you information, please go and fight it out.
http://navatarangam.com/2008/08/telugu-sex-films/
s says:
thanks for the list…trust me i even dont know some of the name…that might be because they never released…i think so…
వీజె says:
తెలుగు సినీ పరిశ్రమలో రాజ్యమేలుతున్న ” భావదారిద్ర్యానికి ” ఇన్ని రోజులు ” కొత్త నీరు కొరత ” కారణమేమోననే అపోహలో బ్రతుకుతున్న నాకు ,వాస్తవాలు తెలియజేసి కనువిప్పు కలుగజెసారండి జోస్యుల గారు , ధన్యవాధాలు ః) …
వీజె says:
మొన్నీ మద్యే హైదరాబాద్ వచ్చినప్పుడు పలు చోట్ల ” మన్మధులు ” సినిమా పోస్టర్స్ చూసి ఎదో మళయాళం డబ్బింగ్ సినిమానేమో అనుకున్నాను … సినిమా టైటిల్‍కి క్యాప్షన్ చూసి డోక్కునేంత పని చెసా … అదేదో ” తెరవని తలుపులు ” , ” మూసిన కిటికీలు ” అంటూ ఉంది … ” థు … మీ క్రియేటివిటికి పెట్టిన పిండాన్ని కాకులు కాలెత్తి పావనం జెయ్యా … ” అంటు జంధ్యాల గారి స్టైల్‍లో తిట్టుకొని నా క్షణికావేశాన్ని అణుచుకున్నా … సదరు సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా అనే కఠోర వాస్తవానికి తోడు , కలెక్షన్‌ల పరంగా కూడ ప్యాక్డ్ హౌసెస్ తో నడుస్తుందన్న చేదునిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నా ః(
K మహేశ్ కుమార్ says:
@వీజే: నిజానికి ఇది ‘కాదల్ కథై’అనే తమిళ చిత్రం డబ్బింగ్. కానీ కొత్త నటీనటులు ఉండటం అలాగే ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడంతో కొంత రీషూట్ చేసి ఒక స్ట్రెయిట్ చిత్రంలాగా మార్కెట్ చెయ్యడం జరిగింది.
ఇలాంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారులెండి! ప్రతి టౌన్లోనూ డెడికేటెట్ థియేటర్లుకూడా ఉంటాయి మరి. కాకపోతే ఈ సినిమా ఆ బౌండరీలను కూడా దాటి మెయిన్ థియేటర్లలోకూడా తిష్టవేసిమరీ హిట్టయ్యింది. సంవత్సరాంతంలో ఎన్నో ఫ్లాపులనడుమ ఇండస్ట్రీని బ్రతికించిన చిత్రమిది.
We might loath the content of the film, but the fact remains that its a HIT. The same thing is true for other hits this year. అరుంధతి,మగధీర,కిక్, బెండుఅప్పారావు చిత్రాలు మన్మధులు చిత్రానికి ఏమాత్రం తీసిపోవు.
వీజె says:
>>>>> We might loath the content of the film, but the fact remains that its a HIT. The same thing is true for other hits this year. అరుంధతి,మగధీర,కిక్, బెండుఅప్పారావు చిత్రాలు మన్మధులు చిత్రానికి ఏమాత్రం తీసిపోవు. >>>>>
చితగ్గొట్టేసారండి మహేశ్ గారు … బాగా చెప్పారు …
హతవిధి ! ఆఖరికి ఈ ఖళాఖండ మాతృక కూడా మనది కాదా ? అరవదేశ దిగుమతి ఫలమా ?చివరికి ” మన్మధులు … తెరవని తలపులు …” సినిమా హిట్‍ని కూడ మన తెలుగు సినిమా ఖాతాలో వేసుకోలేని ధీనస్థితిలో ఉన్నామన్న మాట …
ఖర్మ కాలి ఈ సినిమా హిట్‍తో తెలుగు సినిమాకి పునాది జాతాలైన ప్రేమ , ఫ్యాక్షన్‌కి అదనంగా ఇంకో జాతం జతచేరే ప్రమాదం ఉందంటారా ?
Indian Minerva says:
“అరుంధతి,మగధీర,కిక్, బెండుఅప్పారావు చిత్రాలు మన్మధులు చిత్రానికి ఏమాత్రం తీసిపోవు”
మన్మధులు చిత్రం అరుంధతి,మగధీర,కిక్, బెండుఅప్పారావు చిత్రాలకి ఏమాత్రం తీసిపోదు. అని రాయబోయి ఇలారాయాలనుకొని అలా రాశారా లెక ఉద్దేశపూర్వకమా?
అహ నేను చూడలేదుగానీ ఇక్కడే వెలిబుచ్చబడిన అభిప్రాయాన్ననుసరించి అది ఉత్తమాభిరుచికి గల ప్రేక్షకులు ఆదరించగల సినిమాకాదు.
K మహేశ్ కుమార్ says:
@Indian Minerva: అది అక్షరాలా ఉద్దేశపూర్వకమే.
అరుంధతిలో అఘోరా పాత్ర ద్వారాచేయించే అశ్లీలానికీ, కిక్ సినిమాలో హీరోయిన్ పలికే దిగజారుడు మాటలకు, మగధీరలో విలన్ పాత్రధారి కామదాహాన్ని చిత్రించిన తీరుకూ,బెండప్పారావు చిత్రంలోని రెండర్థాల (డైరెక్టు)మాటలకూ మన్మధులు సినిమాలోని బూతుకూ నా ఉద్దేశంలో ఆట్టే తేడాలేదు.
నిజానికి మెయిన్ స్ట్రీన్ చిత్రాల్లో ఉండే ఈ ముసుగు బూతు మరింద ప్రమాదకరం. కనీసం మన్మధులు వంటి చిత్రాలకెళ్ళే ప్రేక్షకుడు ఖచ్చితంగా ఏది ఆశిస్తాడే దాన్నే పంచుతారు. కానీ ఈ సిన్మాలలో పిల్లలూ పెద్దలూ తేడాలేకుండా అందర్నీ వెధవల్ని చేస్తారు.
sankar says:
మన తెలుగు సినిమాలే అనుకున్నాను…తెలుగు సైటులు కూడా ఇలా తయారవుతున్నాయేంటిరా బాబూ…
srinivas rao says:
ఓర్నాయనొయ్. సినిమా ఇండస్ట్రీ పొటెన్షియాలిటీ ఈ రేంజ్ లో ఉందా? థ్యాంక్యూ.
రాకేశ్వర రావు says:
శీర్షిక చూసి జోశ్యుల వ్యాసం అని చెప్పేయవచ్చుఁ.
గాసిప్ వార్తల్లో శీర్షికల్లా చాలా సంచలనాత్మకంగా పెడుతున్నారు.
టి.యస్.కళాధర్ శర్మ says:
మన్మధులు నిజంగా విజయవంతమయిన చిత్రమే. ఈ విషయం రాయలసీమ లోని సినీమా
వ్యక్తిగా నేను వప్పుకుంటున్నాను.
kartheek says:
Mr.surya prakash…..meeru raasina ee blog chala bavundhi..meeku unna cine parigyanam abhinandincha thaggadhi….kaanee koni vishayalu stright ga adugathanu cheppandi….konchem istam konchem kastam ane cinema ni meeru choosara?….choosthey ..aa cinema ni ye statastics tho meeru judge cheyadam jarigindi?..asalu cinema ni judge cheyadaniki meekunna parigyanam kaanee, authenticity gaanee yenti?…sagatu prekshakudni, naaku inthakantey inkem arhatha kavali ani meeru anochchu…thappu ledhu..kaaneee…oka cinema gurinchee critisism cheyalante ..mamoolu prekshakudi kantey critic daggara chala vishyam undali….alanti konni vishayalu ippudu meeku chepthanu…konchem istam konchem kastam ane cinema 125 days hyderabad odeon theatre lo, 110 days prasadz lo pradarsincha badindhi….anthey kakunda..chasla centres lo 100 days poorthi chesukundhi…aa cinema lo ni family values, emotional hooks ki hook ayyi….rajasri ane prathistathmaka samstha(if i hv to refer, producers of maine pyar kiya and hum aap ke hai kaun) ..hindi lo dhanni remake chesthoo undhi…aa remake ki kooda ee telugu cinemaki direction chesina kishore kumar direct chesthunnadu….inkoka vishayam yentantey….india lo nation wide ga peru prathistalu pondina v.shataram awards comittee…konchem istam konchem kastam cinema ni 2009 year lo release ayina goppa cinemala tho nila bettindhi…this director and the actress tamanna were nomonated for those awards and competed with some of the best technicians of indian film industry…so…my dear surya prakash garu…cheththa cinemala gurinchee meeru yentha ghatu ga spandhincharo..alagey manchi cinemala gurinchee kooda anthey stand tho mee abhiprayanni cheppadam matramey mimmalni oka manchi cine goer ga nilabeduthundhi….adhi mee, naa, andhari bhadyatha kooda..yendhukantey….appreciation is the only feeding for a good techincian…so…lets cheer up good directors and good cinemas…then we will see more good films from them….kartheek, oka cinema pichchodu
K మహేశ్ కుమార్ says:
అయ్యా కార్తీక్ గారూ,
‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాని మీరు కళాఖండం అని తేల్చేశారు.కథ,కథనం,దర్శకత్వం పరంగా అదొక చెత్త సినిమా అని ప్రేక్షకులు ఎప్పుడో తీర్పునిచ్చేశారు.
థియేటర్లలో సినిమాల్ని ప్రేక్షకులు నడిపించడానికి, నిర్మాతలు (డిస్ట్రిబ్యూటర్లూ) నడిపించడానికీ చాలాతేడా ఉంది. కాబట్టి మీరు ఎన్ని రోజులు “ఆడింది” అనే ఆధారం చిత్రం యొక్క గొప్పతనాన్ని అంచనాకట్టడం మానండి. Industry and film business doesn’t work that way.ఆంధ్రదేశంలోని 70% థియేటర్లు సినీపరిశ్రమలోని కొందరి చేతుల్లోనే ఉన్నాయనే నిజం బహుశా మీకు తెలీదు.
ఇక అవార్డుల సంగతంటారా…అవి ఉన్న చెత్తలో ఉత్తమమైన చెత్తకు ఈ మధ్యకాలంలో పరిమితమయ్యాయవి. కాబట్టి వచ్చుంటే వచ్చుండచ్చు.
kartheek says:
mahesh kumar…honor to get ur reply….mee reply batti ardham ayyindhi yentantey…meeru telugu cinemalannintinee oke gata na kattesi mee theerpu isthuntarani ee blogs follow avuthunna varandharikee ardham ayye untundhi…theatres yedho kodhdhimandhi chethullono unnyanna vishayam naaku nijam ga theedhu..nenu aa cinema ni judge chesindhi kevalam aa cinema lo unna sensible values battey…yendhukantey nenu mamoolu prekshkudni…vacchina vandha cinemalo..ye cinema sensible cinema no..ye cinema panikimalina cinema no….statastics tho differenciate chesi cheppalenu..nachchina cinema ela aadindho matram cheppagalanu..yendhukantey meeku thelisinattu ga statastics naaku theleevu…thelisthey nenu prekshkudni avvanu…vimarsakudni avuthanu…so…telugu cinemalannee digajaripothunnayantoo gonthu chinchuku arusthoo… mana inteleectual masturbation ni janala meedha rudhdhadam kantey….lets appreciate the film makers who are trying to make some sinsible films. and lets ignore such so called film makers who fill their films with filth…and lets ignore such blogs too…..
K మహేశ్ కుమార్ says:
కార్తీక్ గారు,
మెజారిటీ తెలుగు సినిమాలు మూసదాటి వెళ్ళటం లేదుకాబట్టే “తెలుగు సినిమాల పరిస్థితి ఇది” అనే జెనరలైజేషన్ చెయ్యడం జరుగుతుంది.అది అన్ని సినిమాల్నీ పేరుపేరినా ఒకగాటన కట్టడం కాదు. తెలుగు సినిమా ప్రస్తుత పరిస్థితికి అద్దంపట్టడం మాత్రమే.
కొంచెం ఇష్టం- కొంచెం కష్టం సినిమా మీకు ఒక ప్రేక్షకుడిగా నచ్చుండొచ్చు. అది మీ హక్కు. దాన్నెవరూ కాదనడం లేదు. కానీ దాని గొప్పతనాన్ని ఇక్కడెవరూ గుర్తించడం లేదనో లేక కేవలం నెగిటివ్ గా చెప్పడానికి కంకణం కట్టుకుని విమర్శకులున్నారనో మీరు చేస్తున్నవాదన మాత్రం అర్థరహితం.
ఇక ఇష్టం- కొంచెం కష్టం ఏవిధంగానూ సెన్సిబుల్ సినిమా కాదు అని నా అభిప్రాయం.
సాయి బ్రహ్మానందం గొర్తి says:
నిన్ననే గతిలేక “ఎవరైనా – ఎపుడైనా” అనే ఒక దిక్కుమాలిన సినిమా సగం వరకూ చూసి కట్టేసాను. ఎంత దరిద్రపు సినిమా అంటే నెల్లాళ్ళ క్రింద తిన్నది కూడా బయటకు కక్కించగల శక్తుంది. అసలు అంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఎలా హిట్టవుతుందనుకున్నారో? కనీసం కథ చదివిన నటులూ, సహాయకులూ ఎవ్వరూ సదరు దర్శకులకి చెప్పలేదా?
ముందుగానే హెచ్చరిస్తున్నాను, కాబట్టి కాస్త జాగ్రత్త పడండి.
harilorvenz says:
this is really nice Information…