హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్
ఇలా ఎందుకన్ననో అవతార్ గురించి తెలిసిన మీకందరికి తెలిసే ఉంటది కదా.
అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.కానీ
అవతార్ చూస్తే చాలా బాధేసింది.
మీడియ సృష్టించినంత గొప్ప గా ఏం లేదు.
నవతరంగం లో అవతార్ గురించి మిత్రులు అందరు చెప్పారు కదా.
మా మిత్రుల అభిప్రాయం వాస్తవం చెప్పాలంటే హాలివుడ్ టెక్నాలజి ఆ సినిమాల తో పోల్చుకుంటే ..చూస్తే అంతగొప్ప సినిమా ఏం కాదు . బిగ్ స్క్రీన్ విడియో గేం అని చెప్పవచ్చు. విమర్శించడానికి పండితులు కానవసరం లేదు కదా సో…పెద్ద తెరలమీద చూడవలసిన హాలివుడ్ సినిమాలలో ఇది ఒకటి అంతే.
నాకు , నా మిత్రులకు రెగ్యులర్, కనీసం WALL – E యాంత్రిక పాత్ర ఇచ్చిన ఫీలింగ్స్ కూడా కూడ ఇందులో మాకు కలగ లేదు.అంటే ఎమోషన్స్ ముఖ్యం కాబట్టి అవి అంతగా లేవు. ఆ అనుభూతి.హార్ట్ టచ్ లేదు . జేమ్స్ కెమెరాన్ forward-thinker కదా మనం అభిమానిచే దర్శకులలో ఇతను ఒకడు కాబట్టి ..వీస్యువల్ ఎనర్జి (visual energy) మాత్రం మస్తుగుంది. మళ్ళీ ఇందులో ఆర్మీ చూడక తప్పదు. ఏందుకంటే ఇది ఇంగ్లీష్ సినిమా కదా.
ఏది ఏమైన ఈ మానవ జన్మ లో చూడాల్సిన , అనుభవించాల్సిన వాటి లిస్ట్ లో ఈ సినిమా కూడ ఒకటి రాసుకోండి.
అంత అంత టికేట్లు పెట్టలేని కుటుంబాల వారి కి కూడ రిక్వెస్ట్ ఏమిటంటే…
వచ్చే పండగలకు కొత్త బట్టలు కొన క పోయిన ఫర్వాలేదు …కాని అప్పు చేసి అయిన కుటుంబం అందరికి ఈ సినిమా 3D చూయించండి.
ఇది మూడు చుక్కల రాంకింగ్ ఇవ్వోచ్హు.
ఫోటో రియలిస్టిక్ పధ్ధతిలో, 3D, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ మొత్తం కలిపి సాధారణ మన భాష లో చెప్పుకోవాలంటే గ్రాఫిక్స్ అద్భుతం. అధుభుతమైన లోకం చూయిస్తాడు
చూస్తే 3D లోనే చూడాలి.
నెను ఎకీభవిస్తాను. 1000000% సినిమా సామాజిక ప్రయొజనమె.
సరే… అసలు బాధేసింది ఏందుకో మాట్లాడుకుందాం.
మల్టీ ప్లెక్స్ లు అలవాటు కాకముందు ఇంత బాధ ఉండేది కాదు కాని ఇప్పుడు …ముఖ్యంగా గత ఆరు నేలలు గా తెలుగు సినిమాలకు ,కొన్ని హింది సినిమాలను పోయిన ప్రతి సారి వేలకు వేలు పెట్టి ..దుమ్ముకోట్టుకోని రావడం చేస్తున్నాం కదా .ఈ మధ్య అటు ఇటు కానీ పాత్రలో ఒక హీరో ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని ఒక సందిగ్ద పరిస్థితిని కల్పించిన ఒక సినిమాకు మేము ఖర్చు పెట్టినంత లోనే ఇప్పుడు అవతార్ ని చూసాక మేము పొందిన పొందిన అనుభూతి ,మానసిక లాభాన్ని రెండిటిని లెక్కేసుకుంటే,పోల్చుకుంటే చాలా బాధేసింది.
ఇక నుంచి మల్టిప్లెక్స్ ల్లో తెలుగు సినిమాలు చూడొద్దు అని డిసైడ్ అయిపోయాం. (ఒక తెలుగు దర్శకుడి సినిమాలు తప్పా).ఆ డబ్బులు మల్టిప్లెక్స్ ల బయట అడుక్కుతినే వారికి దానం చెస్తే ఇంకా ఎక్కువ మానసిక సంత్రుప్తి వస్తుందెమో.
ఈ సినిమా చూసాక బాధ కల్గడానికి మరో కారణం :-
ఆంధ్ర ప్రదేశ్ లో ఎంత మంది ప్రేక్షకులకు ఈ 3D సౌలభ్యం ఉంది? మారు మూల ప్రాంతాలలో ..కొన్ని జిల్లాలలో ఉన్న మిత్రులు…బంధువులు అందరు 3D లో చూడలేరే అని అయ్యో పాపం అనిపించింది.
సరే ఇంకో ఉద్దేశ్యం
రెండవది ఎప్పటి లాగే సినిమా చూసి బయటకోస్తూ మనమెందుకు ఇలాంటి సినిమాలు తియ్యలేకపోతున్నాం అని ,ప్రశ్నలు వేసుకున్నాం…
అంత డబ్బు ఎక్కడుంది?
ఏ ప్రోడ్యూసర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ? అని
సరే కనీసం ప్రస్తుతం ఖర్చుపెడుతున్న ఒక కోటి నుంచి వందకోట్ల సినిమాలు అయినా తీస్తున్నారు కదా మరి ఆ డబ్బులో అయిన సరి అయిన సీ నిమాలు తీస్తున్నారా?అంటే అదీ కదా…
నేను 1998 లో రామోజి ఫిల్మ్ సిటి ఉషాకిరణ్ మూవీస్ లో రైటర్ గా ఉద్యోగానికి జాయినయినప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఫిం సిటి లో ఉన్న అన్ని వసతులను చూసి జన్మ ధన్య మైందనుకున్నాం. . ఈ ఫిల్మ్ సిటీ లో క్షణాలలో వచ్చే అన్ని రకాల వసతులను ఉపయోగించుకోని బాలివుడ్ నుంచి లోకల్ తెలుగు సినిమా ల నిర్మాతలు దర్శకులు ఇక అధ్భుతమైన సినిమాలు తీస్తారు అనుకున్నాంకాని ప్చ్ . కనీసం సీరియల్స్ కూడ లేవు.
భారత దేశం అన్ని రంగాలలో ను ప్రపంచములో ని ఏదేశం తో అయిన పోటి ఇవ్వగలదు .మాన్ పవర్ అన్ని రంగాలలో ఇక్కడ చాలా బాగుందని.
కాని ఇక్కడ సినిమాల గురించి మాట్లాడుకుందాం.
సో ..అందరికి తెలుసు
డబ్బు కూడ ఉంది.లేదంటారా?
పక్కనోడు మన పురాణాలనుంచి కధలు, పాత్రలు తీసి మనకే అమ్ముతుంటే ..హాయిగా అన్ని వనరులు .అన్ని సదుపాయాలు ఉంచుకోని అధ్భుత సినిమాలు తియ్యగలం కాని తియ్యలేము మనమెంత పెద్ద నటులం ,నిర్మాతలం ,దర్శకులం అని చంకలు కోట్టుకుంటు ఉంటామెందుకు?హాలివుడ్ ని పోగడటం తప్ప.
సరే ఈ విషయం మీద మీ అభిప్రాయాలు వినాలని ఉంది.తరువాత నేను రాస్తా
(సరే మరి 11 సంవత్సరాలైన నువ్వెందుకు తియ్యలేక పోతున్నావ్ అని నేను పడుకున్నప్పుడు నా అవతార్ వచ్చి అడిగాడు అది కూడ మీ జవాబుల్లోనే ఉంటదనుకుంటున్నా…)
ఆ…మరిచాను
ఒక మచి విషయం ఏమిటంటే యష్ టెలివిజన్స్ వారు జనవరి ఒకటి నుంచి సోని టీవి లో సెవెన్ అనే ఒక (కంప్యూటర్ గ్రాఫిక్) టీవి సీరిస్ ని తెస్తున్నారు మన భారతీయ సినిమా గ్రాఫిక్స్ ల కన్న అవి ఎంతో ఉత్తమంగా ఉండబోతున్నాయి (అంటా).
ఏది ఏమైనా కానీ..
మళ్ళీ ఈ సంధర్భముగా అవతార్ థియేటర్ లో మాత్రం విఠలాచార్యను తల్చుకున్నందుకు చాల ఆనందము గా ఉంది ఆయన ‘అవతార్’ అయితే బాగుణ్ణు
generic propecia says:
Very interesting and amusing subject. I read with great pleasure.
K మహేశ్ కుమార్ says:
గొప్ప సినిమా కాదంటారూ…మళ్ళీ పండక్కు బట్టలుమానిమరీ చూడమంటారు. ఏమిటో! మీ అభిప్రాయం కలగాపులగంగా ఉంది. బహుశా మీ ఉద్దేశం అదే అయితే సఫలురయ్యారు.
శ్యాంప్రసాద్ రెడ్డి జేమ్స్ కెమరాన్ తీసిన ‘అబీస్’ ‘టెర్మినేటర్- జడ్జిమెంట్ డే’ చూసి ఇలాంటి సినిమాలు మనమూ తియ్యాలి అని అమ్మోరు తీశాడు. కాబట్టి ఎప్పటికీ శ్యాంప్రసాద్ రెడ్డి తెలుగు సినిమాల జేమ్స్ కెమరాన్ అవుతాడేగానీ జేమ్స్ కెమరాన్ హాలీవుడ్ శ్యాంప్రసాద్ రెడ్డికాదు.
vasu says:
నాకూ అదే అర్థం కాలేదు. బావుంది అన్నారా బాలేదు అన్నారా ?? టైటిల్ కూడా తిరగేసారు అనిపించింది.
hero says:
cha…appudeppudo terminator cinema ki edo village lo ..hollywud megastar arnold natinchina goppa chitram ani cheppevaru…..
ante daani uddesham telugu lo chiranjeevi elago, hollywud lo arnold alaaga ani…
ikkada kuda…telugu lo syam elago..h’wud lo cameron (passion) alaaga ani syed gore cheppi vundachu
K మహేశ్ కుమార్ says:
@హీరో: ఇక్కడ చర్చ ఆర్నాల్డ్ శ్వాజ్నెగ్గర్ గురించి కాదు. జేమ్స్ కెమరాన్ దర్శకత్వ ప్రతిభ గురించి. టెర్మినేటర్-2 విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే రంగాలలో కొత్త ఒరవడుల్ని సృష్టించింది. ఒక పాఠమై కూర్చుంది. దాన్ని దేనితో పొలుస్తున్నారో ఒకసారి చూసుకోండి.
NEO says:
టైటిల్ చూసి కామరూన్ చరిత్ర ఎక్సెక్ట్ చెసా.. కాని ఇన్కొ రివ్యూ అన్న మాట.. నా అభిప్రాయమ్ ప్రకారమ్ సినెమా స్క్రీన్ప్లె ఫ్లాట్ గా ఉన్ది.. గుడ్ విసువల్స్.. కాని ఎమోశనల్ గా వీక్..
Sankar gongati says:
నెత్రానందమె తప్ప మానసిక ఆనందం లెని సినిమాలు ఎన్ని కొట్లు కర్చు పెట్టి తీసినా waste కదా?
అబ్రకదబ్ర says:
హాలీవుడ్ టెక్నాలజీతో పోలిస్తే గొప్ప సినిమా కాదా!?!
3Dలో – నేపధ్యంలో సుదూరంగా ఎక్కడో ఉన్న చెట్లు, వాటి ఆకులు, రెల్లుగడ్డి సైతం అతి సహజంగా (‘స్పష్టంగా’ కాదు, ‘సహజంగా’ …. remember the DoF factor) కనిపించేలా ప్రతిసృష్టి చెయ్యగలిగే స్థాయికి ఈ సినిమా హాలీవుడ్‌ని తీసుకెళ్లింది. అటువంటివి ఈ సినిమాలో ఎన్నో. This film is indeed a technological wonder, a masterpiece that pushed Hollywood to the next level.
ఎమోషన్స్ లేవా?
హీరో, హీరోయిన్ల ప్రేమలోనూ, కుటుంబ సభ్యుల అనుబంధాల్లోనూ, ఇద్దరు మితృల స్నేహంలోనూ మాత్రమే భావోద్వేగాలు చూడటానికి దశాబ్దాలుగా అలవాటుపడిపోయినవారికి ‘అవతార్’ లో ఎమోషన్స్ ఆనకపోవటం, కానరాకపోవటం వింతకాదు. ఈ సినిమా కథ అల్లుకున్నదే ఓ కోయజాతికీ వారి చుట్టూ ఉన్న ప్రకృతికీ ఉన్న విడరాని అనుబంధం మీద. It’s all about the physical and emotional bonding between the Na-vi natives and their wonderful planet. ఈ సినిమా చూసి ఇంటికొచ్చేంత సేపూ దార్లో ఉన్న చెట్టూ చేమల్ని చూస్తుంటే అవి నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. మీకనిపించలేదా!?!
>> “పక్కనోడు మన పురాణాల నుండి …”
This is a silly accusation.
PK says:
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. The best implementation 3D to date, period. I watched in Imax 3D, but it would be interesting to see in RealD or Dolby 3D if the visuals are any better than Imax 3D.
రవి says:
“హీరో, హీరోయిన్ల ప్రేమలోనూ, కుటుంబ సభ్యుల అనుబంధాల్లోనూ, ఇద్దరు మితృల స్నేహంలోనూ మాత్రమే భావోద్వేగాలు చూడటానికి దశాబ్దాలుగా అలవాటుపడిపోయినవారికి ‘అవతార్’ లో ఎమోషన్స్ ఆనకపోవటం, కానరాకపోవటం వింతకాదు.”
అబ్రకదబ్ర గారు, కొంచెం ఆశ్చర్యంగా ఉంది, మీ వాదన. మీ వాదన నిజమే అనుకుందాం (పూర్తీగా నిజం కాదు. కుక్కతో అనుబంధం – సత్యమే శివం ఓ ఉదాహరణ) ఎవరైనా తమకు దగ్గరగా, తామకు పరిచయమున్న పరిస్థితులకో, పరిసరాలకో మాత్రమే మమేకమవుతారు. అడవిలో డైనోసారు ఏడిస్తే ఎవడూ ప్రతిస్పందించడు. ఓ అలియన్ కారెక్టర్ తో కూడా ఎమోషన్ పలికించడమే దర్శకుడి ప్రతిభ. దీనికి నాకు తట్టిన ఉదాహరణ E.T.
ఇందులో ఆ నేవీ పాత్రలు, గుర్రం తోకతో జడ ముడెయ్యటాలు, చివర్లో ఏడవటాలు మనసుకు పట్టేట్టుగా లేవు. ఎంత సేపు, 3D అడ్డం పెట్టుకుని ప్రజలను mesmerize చేయాలన్న ధ్యాస తప్ప.
రవి says:
మరో ముక్క. సినిమా కథే emotion based అని మీరంటున్నారు. అటువంటప్పుడు 3D కాకపోయినా ఈ సినిమాలో emotion ప్రేక్షకుణ్ణి haunt చేయగలగాలి (కనీసం titanic లెవెల్లో). 3D ఉండి కూడా అది లేదని ప్రజలు అభిప్రాయపడితే దాన్ని ఏ రకమైన ప్రతిభ అనుకోవాలి?
K మహేశ్ కుమార్ says:
@రవి: ఎవరా ప్రజలు? ఏమిటాఅభిప్రాయం? మీకు నచ్చలేదన్నారు. బాగుంది. మరికొందరికి ఎమోషనల్ గా లేదన్నారు. అదీ బాగుంది. కానీ నాకు నచ్చలేదో లేక నాకు తెలిసిన మరో పదిమందికి అనిపించలేదు కాబట్టి “అది ప్రతిభే కాదు” అనడం ఎంత పేలవమైన వాదనో మీకు నిజంగా అర్థంకావడం లేదా?
సినిమాటిక్ ఆర్ట్ అన్డ్ క్రాఫ్ట్ పరంగా ఈ చిత్రాన్ని విశ్లేషించి ఆనందించమనో లేక దాని గొప్పతనాన్ని అర్థంచేసుకొని ఆస్వాదించమనో నేను చెప్పటం లేదు. కానీ మీ అభిప్రాయాన్ని “జనాలకు నచ్చట్లేదు” అనే జెనరలైజేషన్ చేసేముందు కొంచెం ఆలోచించుకోమని చెబుతున్నాను. అంతే.
రవి says:
@మహేశ్ : నేను జెనరలైజ్ చేసి, ఎవరినో ప్రోగ్రామ్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తే, ఓ.కే – నా వ్యాఖ్య వాపస్.
. ఇప్పుడు నా వ్యాఖ్యకు సూటిగా జవాబు చెప్పగలరా?
ఎమోషన్ మీదనే తీసిన సినిమా, అదీ ఇంత హైప్ గా చెబుతున్న సినిమాలో ఎమోషన్ – హాన్ట్ చేయగల స్థాయిలో ఉన్నదా? మీకు మీరే ప్రశ్నించుకుని జవాబు చెప్పండి. ఉంది అంటే, కాస్త వివరించండి.
PK says:
I was referring to అబ్రకదబ్ర in my earlier comment.
Venkat Uppaluri says:
We can say Shyam is Indian James Cameron. – అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం
zulu says:
Do you observe the emotion when the sky people destroyed the Na’vi’s home tree? The emotion when the female lead first saw our hero in the jungle? Do you feel the lady pilot who bombed the Dragon flight in the end? Have u seen the emotion when the Worthington recorded his last video saying he has given up? This list will never end. To me, Its a life time movie of our era. I really enjoyed it. THe visuals of the movie – No dialogues .. Its amazing.
అబ్రకదబ్ర says:
@Zulu:
Exactly. That’s what I was talking about. ఆ చెట్టుని పడగొట్టేసినప్పుడు గుండెలు పిండేసిన అనుభూతి కలగలేదా?
@రవి:
సత్యమే శివం లాంటివి అసలే లేవని నేనన్నానా? మన సినిమాల్లో అధిక శాతం గురించి అన్న మాటది. (మనలో మాట: సత్యమే శివం ఎందరు చూశారు? చూసినోళ్లలో ఎందరికి నచ్చింది? నచ్చినోళ్లలో ఎందరికి అర్ధమయింది?)
మెస్మరైజ్ చెయ్యాలన్నదే కామరాన్ ఉద్దేశం. ఈ ఎమోషన్లూ అవీ అతనిచ్చిన కొసరు అనుభూతులు మాత్రమే. టైటానిక్‌లో సైతం కామరాన్‌కీ ఆ ఓడకీ మధ్య నడిచే ప్రేమ కధే అసలుది; జాక్‌కీ, రోజ్‌కీ మధ్య నడిచే కథ కొసరు మాత్రమే
3-D అడ్డం పెట్టుకుని మెస్మరైజ్ చెయ్యటం అన్నది ఒకటే చూశారు తప్ప, మనిషికీ ప్రకృతికీ మధ్యగల అనుబంధాన్ని కామరాన్ తనదైన శైలిలో చెప్పిన విధాన్ని మాత్రం చూడలేకపోయారు! ETలోలా మెలోడ్రామా కురిపిస్తేనే ఎమోషన్స్ పండుతాయంటారా?
రవి says:
@అబ్రకదబ్ర: అధికశాతం తెలుగు సినిమాల్లో రాలేదు. హాలీవుడ్ లోనూ ఇన్నేళ్ళకి మాత్రమే ఈ సినిమా వచ్చింది కదా. (సత్యమే శివం ఎవరు చూస్తే మనకేంటి. ఆ సినిమాలో అదుందా లేదా అనే కదా టాపిక్కు? హిట్టా, ఫట్టా అనేది సెపరేటుగా మాట్లాడేసుకుందాం. కాదంటారా?
)
“3-D అడ్డం పెట్టుకుని మెస్మరైజ్ చెయ్యటం అన్నది ఒకటే చూశారు తప్ప, మనిషికీ ప్రకృతికీ మధ్యగల అనుబంధాన్ని కామరాన్ తనదైన శైలిలో చెప్పిన విధాన్ని మాత్రం చూడలేకపోయారు! ETలోలా మెలోడ్రామా కురిపిస్తేనే ఎమోషన్స్ పండుతాయంటారా?”
అయ్యా, నేనొక సాదా ప్రేక్షకుణ్ణి. నాకు గొప్ప దర్శకుడి ఆలోచనలతో, నన్ను నేను ట్యూన్ చేసుకొనే పద్ధతి ఎట్లాగో నాకు తెలీదు.
మీరు అలా వాదిస్తే, బీ. గోపాల్ సినిమాని, రాఘవేందర్రావు సినిమాని కూడా ఆ దర్శకుడి కన్నులతో చూడండి. అప్పుడు అదీ అద్భుతంగా ఉంటది అని చెప్పావలసొస్తుంది.
కడవల కొద్దీ కన్నీళ్ళు, మెలోడ్రామాలు వద్దు. ఓ చిన్న స్పర్శ, హీరోకు ఆటవిక హీరోవిను ఒక చిన్న పువ్వు ఇవ్వడం ఇట్లాంటి వాటితో కూడా ఎమోషన్ చూపించవచ్చు. అలాంటిదే इ.टी.లో గ్రహాంతరవాసి అబ్బాయి, భూలోకపు బాలుడు వేలు కొసలు తాకడం, అక్కడ ఓ దేదీప్యవంతమైన వెలుగు వెలగడం – ఆ సన్నివేశం.
అది హృదయాన్ని తాకేట్టు లేదా? అలాంటిది ఈ సినిమాలో కనీసం నా వరకు కనిపించలేదు.
rayraj says:
అదేం టైటిలండీ బాబు!? ఈ సినిమా స్థాయిలో మనమే గాదు, ఇంకా చాలా మంది ఇప్పుడప్పుడే సినిమాలు తియ్యలేరు. అనవసరంగా ఈ సినిమాతో లింకెట్టుకొని చర్చించటం దండగ.
ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే, నచ్చకపోవచ్చు. వాడు ’కష్టపడ్డాడు కాబట్టి’ – ’నేను ఇష్టపడటం’ ఏంటి చెప్పండి!?
సినిమా బావుంది అందులో డౌటు లేదు. కానీ, ఏదో ఓ “ఆహ్” నాక్కూడా రాలేదు. దానికి లక్షా తొంభై కారణాలు చెప్పుకోవచ్చు అవ్వన్నీ వేస్టు ముచ్చట్లు. నేను 3Dలో చూడలేదు. అందుకని తీరిక్గా ఖచ్చితంగా చూస్తాను. ఈసారి ఎక్స్‌పెక్టేషన్ లెవల్ సరిగ్గా ఉంటుంది లెండి.
( ఐమాక్స్ త్రీడీలో ఇదువరకు చూసిన ఒకట్రొండు సినిమాల్లో నాకు నిద్రొచ్చింది. ’ఇలా నిద్రపోతున్నానేంటి?’ అని నాకు భయమేసి, మళ్ళీ వెళ్ళకూడదనుకున్నాను. ఇప్పటికీ ఇంకా అదే భయం. బిగ్ స్క్రీన్ చూస్తే, కళ్ళు అలుస్తాయని ముందే వార్నింగ్ ఇస్తారు. అందుకే ఆ నిద్రేమో అని సరిపెట్టుకుంటున్నాననుకోండి.
గోపి గాడు says:
@అబ్రకదబ్ర నేను కూడా ఏకీభవిస్తా! నాకైతే పండోరా వెళ్ళి వుండాలనిపించింది.నేను ఇంకా 2డి లోనే చూశా.అయినా అదిరింది.
@రవి ఎవరికి తోచింది వాళ్ళు ఫీల్ అయ్యారు.నాకైతే ఇప్పటికి అర్ధం కావడం లేదు మీకు కావాల్సిందేమిటో. నాకు తెలిసి మీరు సినిమాలో సందేశాలు చెప్తే విందామని,కంటతడి పెట్టే ఎమోషన్స్ వుంటే చూద్దామని వెళ్ళుంటారు.ఆ కోణంలో ఏమైనా దొరుకుతుందేమోనని వెళ్ళి మీరు నిరాశ చెందుంటారు.(ఏమో)
అసలు సత్యమేశివం లో కుక్కతో వున్న అనుబంధం తో అవతార్ లో వున్న ఎమోషన్స్ కి వున్న లింక్ ఏమిటో నాకు అర్ధం కాలేదు. సత్యమేశివంలో దర్శకుడు కాన్సెప్ట్ అనుబంధాన్ని చూపించడం. అవతార్ లో కాన్సెప్ట్ ఎమోషన్స్ అని దర్శకుడు ఎక్కడైనా చెప్పాడా?
కిశొర్ says:
ఏది ఏమైనా మీ టైటిల్ చూస్తే జేమ్స్ కామెరూన్ గుండె ఆగి చావటం ఖాయం, కొంచం గట్టి వాడైతే మాత్రం ఇక జన్మ లో సినిమాలు తీయడు. హ హ్హ హ్హ్హ్హ .
AVATAR says:
ఈ బ్లాగర్లలో కొంతమంది కి ఈ సినిమా నచ్చిందనే మరి కొందరు ఈ సినిమాను విమర్శిస్తున్నారు తప్ప మరొకటి లేదు .
ఈ మూవీ లో నాకు ఫీల్ కలగ లేదు, ఇంకా అది కలగ లేదు, ఇది కలగలేదు అనే వాళ్లకు అసలు ఫీలింగ్స్ లేనట్టు.
లేకపోతే చాలామందికి నచ్చని సినిమా వీళ్ళకు నచ్చినట్టు, అందరికి నచ్చిన సినిమా ను వీళ్ళు నచ్చలేదనే అంటారు.
ఈ సినిమాను మిస్ కావొద్దు.
నోట్: 100 శ్యాం ప్రసాద్ రెడ్డి = 1 జేమ్స్ కామెరూన్.
Chandra says:
ఇన్తకీ ఆ దర్సకుడి నెక్ష్త్ సినిమా ఎమిటి ?
అబ్రకదబ్ర says:
గురువు గారు 28 ఏళ్లలో తీసింది ఎనిమిది సినిమాలు! టైటానిక్ తర్వాత 12 ఏళ్లకి అవతార్ వదిలాడు. నెక్స్‌ట్ పిక్చర్ ఇంకో పాతికేళ్లకి తీస్తాడేమో
కమల్. says:
అబ్రకదబ్ర గారు, జేమ్స్ కెమరాన్ గారు ” అవతార్” చిత్రం యెక్క స్క్రిప్ట్ ఇప్పుడూ కాదు ఒక 15 ఏళ్ళు క్రితమే తయారు చేసుకున్నారు, కాని అప్పటి ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా ఇంక సాంకేతికంగా ఎదగలేదని కొన్ని సంవత్సరాలు ఆగారు, ఇప్పుడు టెక్నికకల్ గా ఎదిగారు కాబట్టి మూడేళ్ళ క్రితం ఈ ప్రాజెక్ట్ మొదలెట్టారు.అదీ సంగతి.
గీతాచార్య says:
అసలు మనవాళ్ళకు కామెరాన్ సినిమాలు అవసరమా అని నాకు డౌటొచ్చింది ఈ సినిమా చూస్తుంటే. ఇక ఈ వ్యాసం చదివాక నా డౌట్ కన్ఫర్మ్ అయింది.
దిస్ ఈజ్ ఏన్ ఇన్సల్ట్ టూ ఏ ఫిల్మ్ మేకర్ ఆఫ్ కామెరాన్స్ కాలిబర్ టూ కంపేర్ హిం టూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అసలు వ్యాఖ్య వ్రాయటం కూడా దండగే.
Madhu says:
ఏమి పోలికండి! తెలుగు సినిమాల మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా చేస్తారా.
Madhu says:
Trviai from imdb.com
. James Cameron originally attempted to get this film made in 1999 as his immediate follow-up to Titanic (1997). However, at the time, the special effects he wanted for the movie ran the proposed budget up to $400 million. No studio would fund the film, and it was subsequently shelved for almost ten years.
. Seeing the character of Gollum in The Lord of the Rings: The Two Towers (2002) convinced James Cameron that CGI effects had progressed enough to make this film.
ఎందుకు కంపేర్ చేస్తారు.
సత్యమేశివం plot ‘Planes, Trains & Automobiles’ ఒకటే.
రాకేశ్వర రావు says:
ఆంగ్లంలో ఒక నుడికారం వుంది “… and I am Santa Claus” అని. దీనిని ‘నువ్వు చెప్పేది ఒట్టి సొల్లు’ అనడానికి ఉపయోగిస్తారు. ఆంగ్లంలో వున్న మాంచి నుడికారాలలో ఇది ఒకటి.
ఉదా – If Cameroon is Hollywood SomePrasad Reddy, then I am Santa Claus.
దీనినే తెలుఁగులో చెప్పాలంటే,
జేమ్స్ కెమెరాన్ హాలివుడ్ ఎవరో-ప్రసాద్-రెడ్డి అయితే, నేను హనుమంతుడిని . అనవచ్చు.
నుడికారాలు లేనిదే ఏ భాషకైనా అందం లేదంటే అతిశయోక్తి కాదు గదా!
Sarath ' Kaalam' says:
ఇంతకీ ‘సత్యమే శివం’ సినిమాలో కుక్క తోక వంకరగా వుంటుందా లేక సరిగ్గా వుంటుందా?
ashok says:
nikka boduchukuni untundi.
Sarath ' Kaalam' says:
ఇంతకీ ఆ సినిమా గురించి నేను ఎప్పుడూ వినలేదు. ఎవరయినా వివరిస్తే బాగుండును. టెల్గు సినిమానేనా అది?
moviefan says:
1. మీడియ సృష్టించినంత గొప్ప గా ఏం లేదు.//
2. అప్పు చేసి అయిన కుటుంబం అందరికి ఈ సినిమా 3D చూయించండి.//
1. పెద్ద తెరలమీద చూడవలసిన హాలివుడ్ సినిమాలలో ఇది ఒకటి అంతే.//
2. ఏది ఏమైన ఈ మానవ జన్మ లో చూడాల్సిన , అనుభవించాల్సిన వాటి లిస్ట్ లో ఈ సినిమా కూడ ఒకటి రాసుకోండి.//
1. మూడు చుక్కల రాంకింగ్ ఇవ్వోచ్హు.//
2. సినిమా చూసి బయటకోస్తూ మనమెందుకు ఇలాంటి సినిమాలు తియ్యలేకపోతున్నాం//
Article is full of contradictions..Didn’t understand what author is trying to say… I like Syamprasad reddy as a producer..but comparing syam prasad reddy to Cameron is very silly…
raj kumar ni bullitera megastar ante bagane untundi..chiranjeevi ni “venditera raj kumar” ante maatram chaalaa odd ga untundi.. idee ante..
suresh says:
దయచేసి పోస్ట్ టైటిల్ మార్చన్డి. నవ్వొస్తున్ది!