పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి

పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి
ముందుగా నవతరంగం చదివే పాఠకులకు ,మిత్రులకు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలతో

ఇక్కడ రెండు విషయాలు చెప్తాను
1.” హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ ” ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనే విషయం
అమెరికా లో అయినా అమలాపురం లో అయిన ప్రసవవేదన ఒకటే అనే దృష్టి కోణం లో రాసాను.

2.’అవతార్’ అధ్బుతంగా ఉండి కూడ ఎందుకు నచ్చలేదు. ఏందుకంటే …అందమైనవి అన్నీ ఆనందాన్ని ఇవ్వలేవు .ఆనందాన్నిచ్చేవి అన్నీ అందంగాను ఉండవు.అలాగే సంతోషాన్ని చ్చేవి అన్నీ లాభాన్నివ్వలేవు.లాభాన్నిచ్చేవి అన్నీ సంతోషాన్నివ్వలేవు కదా.

* * * *
గిన్నిస్ బుక్ లో స్థానం పొందిన ఫిల్మ్ సిటి మన దేశం లో మన రాష్ట్రం లో లొ ఉంది .అయినా మన కు హాలివుడ్ స్థాయి ఏదో ఒక అర్హత ఉన్న వారే లేరా అని అనుకున్నప్పుడు .వచ్చిన ఆలోచన ,ప్రయోగాలు చెయ్యాలంటే నిర్మాత ముఖ్యం కాబట్టి అటువంటి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అని అని పించింది కాబట్టి.
ఈ రోజు ల్లో టాలెంటు ఉన్న పెద్ద నిర్మాతలు ,దర్శకులు చెయ్యగల సత్తా ఉండి కూడ చెయ్యడం లేదు రోటీన్ సినిమాలు తీస్తున్నారు అని అందరు విమర్శిస్తున్నారు ఎందుకు? ఎందుకంటే క్రియేటివిటి ఒక్కటే ఉంటే సరిపోదు గట్స్ కావాలి.
చెత్త సినిమా అలా తియ్యాల్సింది ఇలా తియ్యల్సింది ప్రతి సినిమా ని విమర్శిస్తున్నా మేము మరి అటువంటి ఏ తప్పులు లేకుండా మంచి సినిమా అని చెప్పుకుంటు వస్తున్న ఆ సినిమా ఏదో దమ్ముతో , బాగానే హిట్ సినిమా అంటే ఇది అని విమర్శించి విమర్శించి ఉన్నాం కాబట్టి , చెప్పగలం కాబట్టి…నిజంగా బాగా తీస్తాము కాబట్టి … అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ సినిమా ఏదో మనమే ఏ నిర్మాత లేక పోయినా …మనకున్న ఏదో ఒక ఆస్థి పాస్తులు అమ్మి తియ్యమేందుకు అని మాకు మేము ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే గట్స్ ….గట్స్ కావాలి. కధ ,డబ్బు,టెక్నాలజి అవన్ని సెకండరి ..ముందు గట్స్ కావాలి.

అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.
ఈ మూడు పదాలతో అందరికి నేను పెట్టిన ” హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ . టైటిల్ అందరి సమజవుతది అని అనుకున్నా..!
ఎక్కడో హాలి వుడ్ లో జేమ్స్ కెమెరాన్ , తనకున్న టెక్నాలజి ,కోట్ల డాలర్ల డబ్బు తో గత కొన్ని సంవత్సరాలుగా తను ఏంతో తపన తో
కసి తో ,శ్రమించాను అని ఇంటర్వ్యూలలో చెప్పుకుంటున్న మానసిక పరిస్థితి ఏదైతే ఉందో , అలాంటిదే అరుంధతి తీసేటప్పటి మన శ్యాం ప్రసాద్ రేడ్డి గారిది అని అని పించింది కాబట్టి.
మల్టినేషనల్ కార్పోరేట్ కంపేనీల తో,ఇన్సురెన్స్ హాలివుడ్ ప్రోడక్షన్ హవుస్ ల తో ధైర్యంగా సినిమా ఎవరైన తియ్యగలరు.పిల్లి మనషుల కధ తో అవతార్ లాంటి దే ఏదో ఒక కధ తో సినిమా తేస్తాం అంటే .. ఏదో ఒక హాలివుడ్ కంపేని సరే అంటే ఎవరైన తీస్తారు .
కాని అన్ని పణంగా పేట్టి ,అప్పులు చేసి తను నమ్మి న ..కధ కోసం తెలుగు లో డిఫరెంట్ సినిమాలు చేయ్యడం నిజంగా మగ తనమే.

* * *
జీవితాంతం అపురూపంగా చూసుకునే… పెళ్ళి కి తీసే వీడియో దెగ్గర కూడ వంద రెండోదలు బేరం చేసి ఆర్డిచ్చే వారు కూడ విమర్శించడం చూసాక అనిపించింది .పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం గా సినిమా రంగానికి చెందిన వారి గురించి ఎప్పుడైన ఎక్కడైన వచ్చిందో లేదో తెల్వదు కాని శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గురించి రావాలి. భావి తరాలలో సినిమా రంగం లో నిర్మాత గా , దర్శకుడిగా , ఏదో ఒక రంగం లో రావాలను కునే వారికి …
ఏదో కధ రాసుకోచ్చి ,ఎంతో కొంత డబ్బు పట్టుకోచ్చి ,ఏదో ఒక లా వచ్చి …కొన్ని క్లోసప్ లు , కొన్ని మిడ్షాట్లు కొన్ని లాంగ్ షాట్లు ఆరు పాటల తో సెక్యూర్ సినిమా తీసుకోని పోదాము అనుకే వారికి.రేపటి రోజున అరుంధతి కన్న మించిన హాలివుడ్ స్థాయి సినిమాలను తీసి రెహ్మాన్ లా లాగ ఆస్కార్ లు కోట్టే సత్త ఉండోచ్చు అలాంటి వారందరికి ,ఒక ధృడ వ్యక్తిత్వం అలవడాలంటే. కొత్తనిర్ణయం తీసుకోనే గుండే ధైర్యం ఎంతవసరమో ఎలా ఉండాలో. సినిమా పట్ల ,అనుకున్న కధ పట్ల ఎంత విశ్వాసం ఉండాలి ఆ సినిమా విడుదలయ్యే వరకు ఎలాంటి మానసిక వాతావరణం కావాలి. అనేది తెలుస్తుంది. ఇలా ఎందుకన్ననో ..
ఏందుకంటే ఇప్పుడు సినిమా అంటే వ్యాపారం .( సినిమా అంటే కళ అని అనే వాళ్ళు …కోట్ల రూపాయల వరకు ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో..చెప్పండి మీ కళాత్మక సినిమానే రేపటి నుంచే తీద్దాం రండి.)మనందరికి తెలుసు …సినిమా రంగముతో అనుబంధం ఉన్నవారికైతే ఇంక చాలా బాగా తెలుసు అనుకుంటున్నా..ఒక డిఫరెంట్ సినిమా తియ్యాలి అంటే ,తెరవేనుక ఎన్నో రాజకీయాలు నడిచే భారతీయ సినిమా ఇండస్ట్రి లో ఎలెక్ట్రానిక్ మీడియా లో ఉన్న ఒక వ్యక్తి గా, శ్యాం ప్రసాద్ రెడ్డి గారిని మా జాతి మనిషిగా ఫీలవుతు చెప్తున్నాను.
అన్ని రకాల లైఫ్ సెక్యూరిటిలు చూసుకుంటూ … హాయిగా కావల్సినంత ఏసి పెట్టుకోని మాంచి సుఖవంతమైన ప్రదేశం లో ఒక లాప్ టాప్ ని వళ్ళో పేట్టుకోని ,కనీసం ..కనీసం.. ఒక చిన్న సినిమా కూడ తియ్యలేక పోతున్న మేము ( అంటే మీలాంటి గోప్పోల్లు కాదులేండి. నేను ..నాతో ఈ విషయం మీద ‘ఊ’ కొట్టిన మిత్రులు ) శ్యాం ప్రసాద్ రెడ్డి గారి ని విమర్శించే అర్హత కూడ లేదను కుంటున్నాను.(ఇంతకుముందే ఎవరో మిత్రుడు అన్నట్లు దమ్ముంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూయించి విమర్శ కాని …కామెంట్ కాని చెయ్యమన్నట్లు.)

కొంతమంది కి ఏదో ఒక టాలెంటు ఉంటుంది
కొంతమందికి నిర్మాతలుగా డబ్బుంటుంది…కాని ఏదో కావల్సింది ఉండదు. కేవలం టాలెంటు, డబ్బు ,ఉంటేనే సరిపోదు …ఇంకేం కావాలో …చేసి చూపించిన వ్యక్తి శ్యాం ప్రసాద్ రెడ్డి మా అభిప్రాయం .అమెరికా లో ఉన్న లిబర్టి ని చేసినోడు ఎంతో ఖైరతా బాద్ లో భారి వినాయక విగ్రహం చేసే కళాకారుడి ఫీల్ అంతే అనుకుంటాం మేము.
మీ అభిప్రాయాలు మీరు రాసే స్వేచ్చ కనీసం నవతరంగం లోఅయినా ఉంది కాబట్టి రాసుకోండి.

ఇక అవతార్ సినిమా గురించి :_

రెండు సంవత్సరాల క్రితం ఒక స్టార్ హోటల్ లో మా మిత్రులకు ..ఒక మిత్రుడు పార్టి ఇచ్చాడు
అతను ఆర్డరిచ్చిన మెను లో ఒక డిష్ మా ఒక మిత్రుడుకి నచ్చలేదు.
” నీ మొహానికి ఇలాంటి హోటల్ ని ఎప్పుడైన లోపలినుంచి చూసావా? ఎప్పుడైన అసలు ఒక టీ తాగావా నువ్వు ,ఇది బాగా లేదు అది బాగా లేదు అని కామెంట్ చేస్తున్నావ్ ” అని మొహం మీదే అడిగే సరికి మేమంతా షాక్ అయ్యాం .ఇప్పుడు అవతార్ సినిమా visual గా బాగుంది కాని ఏదో ఎమొషనల్ ఫీల్ లేదు అన్నప్పుడు అదే రక మైన కామెంట్లు వినిపిస్తున్నాయి.
1.ప్రస్తుత రాజకీయ , వాతావరణ పరిస్థితుల మధ్య పోలిక తో చూస్తే సినిమ ఆశయం నిజంగా బాగుంది.మా మిత్రులకు అయితే ఇది , కంటి కి టెక్నికల్ గ అధ్బుతమైన సినిమా అంతే.కొన్ని వీడియో గేములు ఆడుతున్నప్పుడు ..ఎన్నో సార్లు అనుకున్నాను ఇలాగే సినిమాలు రావచ్చు కదా అని అది ఇప్పుడు చూసాను.జేమ్స్ కెమెరాన్ ఇంతకు ముందు సీనిమాలు చాల నయం. emotional touch. short లోచెప్పాలంటే.. 3D making తప్పిస్తే.
ఐతే ..
C. G.పాత్రలు అయినా టెక్నాలజి ని ఉపయోగించుకోని భావాలు చక్కగ పలికించిన..సన్నివేశాలు చూస్తున్నప్పుడు.ఉదాహరణకు
ఈ మధ్య వచ్చి అందరికి గుర్తున్న కంప్యూటర్ జెనెరేటెడ్ యానిమేషన్ కధలు అయిన
ఫైండింగ్ నెమో కాని..లేదా WALL-E ..,EVE ని మధ్య వచ్చే ,ఇతరత్ర సన్నివేశాలని చూసినప్పుడు ,అవి కంప్యూటర్ తో సృష్టించిన బొమ్మల సినిమా అని మనసులో ఉన్నా కాని నేను పొందిన అనుభూతి అంటే…from depth of heart touch feelings మాత్రం ఈ సినిమాలో పొందలేదు. visual realistic is gud.
avatar ..,రోటీన్ మొన్న చూసిన లాంటి 2012 దే హాలివుడ్ సినిమా తప్ప.కాకపోతే పర్యావరణం మీద ఇంత భారీ స్థాయిలో సినిమా తియ్యడం మొదటి సారి. బాగుంది.కాని ఈ విషయాలు కార్పోరెట్ అమెరికన్స్ పట్టించుకుంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుండేది. పైరీసి ని తట్టుకునెందుకు 3D పద్ధతి ని ఏంచుకున్నట్టు ఏదో ఇంటర్వ్యూలు చదివాను.పైరసికి కూడ ఒక కారణం కావచ్చు ప్రయోగానికి
ఏది ఏమైన ఈ సినిమా లో ఏం మిస్సయ్యిందో ఈ పాటికి ఇతర హాలివుడ్ కంపనీలు గుర్తించి ,
అవతార్ టెక్నికల్ వర్క్ చూసి ఈ పాటికే ఇతర హాలివుడ్ కంపెనీలు ముఖ్యంగా పిక్సర్ త్వరలో నే అధ్భుతమైన సినిమా తయారిలో సిధ్ధమైఉంటదనుకుంటున్న.ఇంతకన్న అధ్భుతమైన ఎమొషన్స్ మరియు ఫీల్ ఇచ్చే సినిమాలు నిర్మించెందుకు …ఇతరకంపేనీలకు మాత్రం ఆ ప్రేరణ ఇచ్చిందన్నంది మాత్రం వాస్తవం.
* * *
ఇతరులను..లేద …మన సాహిత్యం మన దేశం నుంచి హాలివుడ్ వాళ్ళు ప్రేరణగా పాత్రలు కాని ,కధలు కాని రాసుకోని …సినిమాలు గా తీస్తే
ఆహా ఓహో అంటాం.
మనవారు ఏదైన అలా ప్రేరణగ చేసుకోని చేస్తే అది ఇక్కడ కాపి , అది అక్కడి నుంచి కాపి అని పేజీలకు పేజీలు విమర్శించుకుంటాం.
ఏది ఏమైన …
మనం బాగా చదివి తెలివైన వాళ్ళమవుదాం అనుకునే కాలం లో ఉన్నాం కదా!

* * * *
కొంతమంది పరిగెత్తేటప్పుడు పక్కనోడు ఎలా పరిగెడుతున్నాడు చూడరు ..తాము తమ శక్తి వంచ న లేకుండా పరిగెడుతున్నామ లేదా అనేది చూసుకుంటారు.కొంతమంది ప్రయత్నం చేసి మధ్యలో ఆగి పోతారు.కొంతమంది దూరంగ కూర్చోని అటు ఇటు కాని వాళ్ళు చప్పట్లు కోట్టే టట్లు చప్పట్లు కోడుతు చూస్తు ..మాట్లాడుకుంటు బతుకుతుంటారు.మనం ఎలా ఉండాలో ఎవరి కి వారు నిర్ణయించుకుంటారు

మహాత్మ గాంధి కి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదని మనం ఫీలవుతాం కాని
ఇంగ్లీష్ వాడేవడూ ఎవరూ తనకు గాంధి అవార్డ్ రాలేదు అని ఫీల్ కాడు గా

ఇప్పుడు హాలివుడ్ సినిమాల భారతీయ మార్కేటింగ్ చూస్తుంటే
ఇప్పుడు హాలివుడ్ కి భార త దేశం పండోరా నే నే కదా.

నాతో అభిప్రాయాలు పంచుకున్నా నా మిత్రులకు నవతరంగం మిత్రులకు అందరికి మరో సారి ఈద్ ముబారక్ లతో..
సర్వేజన సుఖినోభవంతూ .ఆమీన్

.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

18 Comments to “పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి”

  • శ్యామ్ ప్రసాద్ రెద్దీ టెక్నాలజిని భిభిత్స, భయానకాల కొసం ఉపయొగించారు. మూఢనమ్మకాలను ఇన్కాస్త పెన్చారు. మానవ సంబందాల భావొధ్వెగాల కధా వస్తువును కాక పిల్లల లొ తెలియని ఉధ్వెగాలను మానసిక బలహీనతలను పెంచె విధంగా ఉంటాయి. నిస్సందెహం గొప్పవాడు కాలెడు. శ్యామ్ కు చిత్ర నిర్మాణం జుదం కావచ్హు.

  • బాబోయ్ మీరు శాన గోప్పోల్లండి శాన బాగా రాశారు, నిజుంగానే పుస్కాలల్లో పెట్టేత్తరా?

    శాన అమోగం , మీరు శాన బాగా గొప్పగా ఆలోశిత్తున్నారండి. మీ గురించి కూడా పుస్కాల్లో పెట్టేదా?

  • అబ్బబ్బబ్బ
    ఏం చెప్పారు ఏం చెప్పారు ! అద్భుతం , అమోఘం.
    సినిమా అంటే వ్యాపారం మాత్రమే అని నమ్మే తమరిని నమ్మి కళ అని నిరూపించమని ఇంకెవ్వడు కోటి ఇచ్చే ధయ్ర్యం చేస్తాడు లెండి? అలా చేసే వాళ్ళు వేరే ఉన్నారు. తెలుగులో కూడా……. వనజ , కమ్లి ,గ్రహణం ,సొంతూరు… విజయమో అపజయమో కాదు ప్రయత్నం చూడండి. డబ్బు కోసం సినిమా తీసే మీ ఆరాధ్య దైవం ముందు ఇలాంటి సినిమా తీసేవాళ్ళు పిచ్చివాళ్ళు కదండీ మరి.
    సినిమా వ్యాపారం అని అంత ఖచ్చితంగా నమ్మే మీకు డబ్బు మాత్రమే కదా కొలమానం ? మరి అయితే అరుంధతేనా , ఏక్కువ డబ్బు వచ్చే ప్రతి సినిమా అద్భుతమే కదా ?
    కాదు కాదు.. కళాత్మక వ్యాపారం అంటారా. అనండి. ఈ వేశ్య చాలా పవిత్రమైనది అన్నట్లు ఉంటుంది ఆ మాట. లైసెన్స్‌‍డ్ ప్రాస్టిట్యూషన్ చేసినా అది ఎప్పటికీ సృష్టికార్యం చేసే అమ్మానాన్నల సంగమం కాలేదు. కాదు.
    డబ్బు పెట్టి సినిమా తియ్యడమే గొప్ప ( మీ మాటల్లో “మగతనం” ) అయితే , నిజమైన సినిమా కళాకారులంతా మగతనంలేనివారా ? వాళ్ళను పవిత్రమైన ఆడవాళ్ళు అని నేను అంటాను. ఆడామగాకాని వాళ్ళయినా పవిత్రమయిన ఆత్మగలవారు. సినిమా శరీరాన్నే కానీ ఆత్మ ( అసలదొకటుంటుందని తెలుసా? ) తెలియని మీలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వ్యక్తుల చరిత్రలు పాఠ్యాంశాలు చేస్తే , మదర్ థెరీసాను తీసేసి అంబానీను , గాంధీని బదులు హర్షద్ మెహతానూ , శ్రీశ్రీను గాక స్వాతి సరస కథకులనూ చదవవల్సి వచ్చేది… మీ పిల్లలు కూడా.
    పిల్లలకు ఇంత దిగజార్చే సంస్కృతి ఇవ్వాలి అని మీరు సిద్ధపడిపోతే , మీ పిల్లల పట్ల నేను జాలి చూపడం తప్ప ఇంకేమీ చేయలేను.

    • Yeah, seriously what is the deal with this మగతనం? ఇలాంటి వీర-మెచ్చుకోలు మాటలకై నవతరంగం వరకూ ఎందుకూ, ఏ బెజవాడ సెంటరుకో వెళితే సరిపోతుందిగా.

  • శానా ఓవరయ్యిందే!!!

  • సగం చదివాక వికారం కడుపునొప్పి వచ్చాయి. నవతరంగం పరువు తీసేస్తున్నారు. డెరివేటివ్ ట్రేడింగ్ గుఱించి తెలుసుకోండి, దేశంలో గట్స్ (దీనికి తెలుగుపదమే దొరకలేదా?) ఎంత మందికి వున్నాయో తెలుస్తుంది.
    सेरिऔस्ल्य थिस अर्तिक्ले दोएस नोट deserve to be in नवतारंगम.

    • ఆంగ్లంలో టైపు చేస్తుంటే దేవనగరిలిపిలో వస్తుంది. ఈమాట వారికి చెప్పి దీనిని సరిఁజేయగలరు.

  • హాలీవుడ్ తో పోల్చి చూడాలన్న మీ ఆలోచన బావుంది. అయితే ఎవడి టాలెంట్ వాడిదే. ఇక శ్యాం ప్రసాద్ రెడ్డి మీరన్నట్టు “గట్స్” ఉన్న నిర్మాతే. కాదనడం లేదు. కానీ మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను ఈ కాలంలో కూడా టెక్నాలజీ జోడించి కాష్ చేసుకోవాలనుకునే పక్క కమర్షియల్ నిర్మాత అతను అని నా అభిప్రాయం. ఇక కేమేరూన్ అవతార్ కి అరుంధతి లాంటి సినిమాకి అది అందించిన మెసేజ్ లో ఏమన్నా పోలిక ఉందా?

    ఇక పాఠ్య పుస్తకాలలో శ్యాం ప్రసాద్ రెడ్డి అనేది వినడానికే ఇబ్బందిగా ఉంది. అంత కన్నా గట్స్ ఉన్న నిర్మాతలు, దర్శకులు మనకేందరో ఉన్నారు. అత్యుత్తమ స్క్రీన్ ప్లే కు ఆస్కార్ లైబ్రరీ లో స్థానం పొందిన “మాయాబజార్” కన్నా గొప్ప సినిమాలు ఈయన తీశాడా? మరోసారి ఆలోచించండి.

    • @Shankar
      అత్యుత్తమ స్క్రీన్ ప్లేలో ఆస్కార్ లైబ్రరీలో మన మాయాబజార్ కి స్థానం దొరికిందా?! నిజమా?!

      • మాయాబజార్ సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠ్యాంశం చెయ్యడానికే అన్ని కసరత్తులు జరిగాయి. ఆస్కారు స్క్రీన్ ప్లే లిస్టులో నిజంగా చేరిందా! ఎక్కడ..ఎలా…ఈ సమాచారం మీకెక్కడిది?

  • సైఫ్ గారు చూపదల్చుకొన్న పోలిక ఆ ఇద్దరు తమ తమ పరిది లో, ఏ విధంగా కష్టపడ్డారు, తాము చెప్పదలిచింది ఎలా చెప్పారు అనే విషయం లో అయితే నాకు కోంత పోలిక కనపడింది. కాని ఇద్దరి చెప్పిన విషయాలు ఏ మాత్రం పోలిక లేక పోవడం, గ్రాఫిక్ వాడడం అనె ఒకే సామ్యం కనపడడం తో ఖచితంగా ఈ వ్యాసం విమర్శనార్హతం.

    సినిమా కళా, వినోద సాధనమా, వ్యాపరమా! మనం మాట్లాడుకొనే సినిమాలు మాత్రం కమర్శియల్ ప్రోడక్ట్ లే. వాటిని సినిమా లు అనలేము అనుకోనప్పుడు, వాటికి కనిసం ఇక్కడ చోటు ఇవ్వక పోవడం తో కొత్త నిర్వచనం మోదలుపెట్టవచు.

  • మరీ ఎక్కువ కామెంటకండి బాబులూ… ఆ కామెంట్లని డిఫెండ్ చేసుకోడానికి సైఫ్ గారు మళ్ళీ ఇంకో ఆర్టికల్ వ్రాసేస్తారు… :)

  • english lo post chestunnaduku kshaminchandi…


    meeru oka article vrasaru, adi evariki natchaledu. andulo cheppina(meeru nammini) vishayanni convince
    cheyyadaniki inkoka tikka article vrasaru. Ilane vuntundi manam nammindi edo vidhanga convince
    cheyyinchalante.

    Shyam prasad reddy, Arundhati karchu petti teesadu, movie bagundi, so antha kharchu petti
    visual treat ga teesinanduku abhinandhinchali. aa vidhanga manam kooda hollywood style lo
    karchu pettagalam ani choopinchadu. adi abhinandaneeyam.

    ayite ippudu avatar vishayamlo andaru bagundi anetappatiki mee ‘arundhati’ ego hurt ayyinattundi.
    Yendukante inta response arundhati vishayamlo vatchi vundadu. okavela response vunte, adi andhra
    varake parimitam. endukante adi global, idi local.

    mana vallu preranaga teeste abhinandicharu antunnaru, mana vallu teesukunte frame to frame copy
    teesukuntare inka ela abhinandhinchali. Just vere language movies choodakunte matram prajalanu
    inta mosam chestara. ala enni movies vunnayo. inka fun part entante channels interview lo
    ‘naaku edo alochistunte ee avidea vatchindi ani’ sadaru film director/producer comedy ga cheppadam.

    inspire ayithe denni choosi inspire ayyaro nijayitheega velladiste manchidi kada. mari adi enduku
    cheyyaru, adi kala kosama leka business kosama.

    meeku arundhati nachindi, vere vallaki avatar nachindi anthe. ayite, shyam prasad reddy james cameron
    minchipoyenta cinemalu inka cheyyaledu, adi chesinappudu mee article malli publish cheyyandi.

    munde enduku eguruthunnaru….

  • ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ బుర్ర మాత్రం తిరిగిపోయింది !

  • ఉప్పుడూ .. సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఉన్నాడు. ముందు టీచరై, ఆ తర్వాత ప్రెసిడెంటాఫ్ ఇండియా కూడా అయ్యాడు. మా పల్నాడులో బడే మస్తాన్ అనే ఫేమస్ టీచర్ ఉన్నాడు. కాలక్రమేణా లోకల్ రాజకీయాల్లోకొచ్చి సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ ఇద్దరు మహానుభావుల్నీ పోల్చాలనుకుందాం. అప్పుడు – బడే మస్తాన్ని ‘పల్నాడు రాధా క్రిష్ణన్’ అంటే ఒకలాగుంటది; అదే, రాధా క్రిష్ణన్ని పట్టుకుని ‘ఇండియన్ బడే మస్తాన్’ అంటే ఇంకోలా ఉంటది – నిజం చెప్పాలంటే ఛండాలంగా ఉంటది. ఔనా?

    ఇంతోటి లాజిక్కు సయ్యద్ ఆలీగారికి మొదటే తట్టకపోతే పోయింది. ఇంత మంది చెప్పాకపోగా అర్ధమవకపోగా, మొదటి పోస్టుకి వత్తాసుగా ఇంకోటి రాయటం అస్సలు బాలే. ఇసుమంటి శకలే నవతరంగం పరువు తీసేసేది.

  • సైఫ్ అలి గారు, మీ రచన ఎడిటింగ్ సరిగ్గా లేదు. రాసే పద్ధతి బాలేక, మీరు చెప్పదల్చుకున్నది సరిగ్గా అర్థమయి ఛావడం లేదు.

  • అన్నయ్యలు తమ్ముళ్ళు…. ఈ article చదివిన తర్వాత అసలు comment ఎలా రాయబుద్దేసింది?

  • I agree with you Ali gaaru, but only in the FIRST point. Kashtam evarikaina ekkadaina Okate. Evari Kashtamoo takkuva kaadu ani. (Same thing applies for PASSION too)

    Kaanee overall gaa mee Essay chusaaka chaala confuse ayyanu. Sorry to tell you this. I think, your way of presentation is the culprit. (Hollywood ki James Camaron elaago Tollywood ki Shyam gaaru alaaga ani cheppali anukuni, reverse order lo cheppinattu vunnaru…)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories