Menu

హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్

camroonహాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్
ఇలా ఎందుకన్ననో అవతార్ గురించి తెలిసిన మీకందరికి తెలిసే ఉంటది కదా.
అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.కానీ
అవతార్ చూస్తే చాలా బాధేసింది.
మీడియ సృష్టించినంత గొప్ప గా ఏం లేదు.

నవతరంగం లో అవతార్ గురించి మిత్రులు అందరు చెప్పారు కదా.

మా మిత్రుల అభిప్రాయం వాస్తవం చెప్పాలంటే హాలివుడ్ టెక్నాలజి ఆ సినిమాల తో పోల్చుకుంటే ..చూస్తే అంతగొప్ప సినిమా ఏం కాదు . బిగ్ స్క్రీన్ విడియో గేం అని చెప్పవచ్చు. విమర్శించడానికి పండితులు కానవసరం లేదు కదా సో…పెద్ద తెరలమీద చూడవలసిన హాలివుడ్ సినిమాలలో ఇది ఒకటి అంతే.

నాకు , నా మిత్రులకు రెగ్యులర్, కనీసం WALL – E యాంత్రిక పాత్ర ఇచ్చిన ఫీలింగ్స్ కూడా కూడ ఇందులో మాకు కలగ లేదు.అంటే ఎమోషన్స్ ముఖ్యం కాబట్టి అవి అంతగా లేవు. ఆ అనుభూతి.హార్ట్ టచ్ లేదు . జేమ్స్ కెమెరాన్ forward-thinker కదా మనం అభిమానిచే దర్శకులలో ఇతను ఒకడు కాబట్టి ..వీస్యువల్ ఎనర్జి (visual energy) మాత్రం మస్తుగుంది. మళ్ళీ ఇందులో ఆర్మీ చూడక తప్పదు. ఏందుకంటే ఇది ఇంగ్లీష్ సినిమా కదా.

ఏది ఏమైన ఈ మానవ జన్మ లో చూడాల్సిన , అనుభవించాల్సిన వాటి లిస్ట్ లో ఈ సినిమా కూడ ఒకటి రాసుకోండి.

అంత అంత టికేట్లు పెట్టలేని కుటుంబాల వారి కి కూడ రిక్వెస్ట్ ఏమిటంటే…

వచ్చే పండగలకు కొత్త బట్టలు కొన క పోయిన ఫర్వాలేదు …కాని అప్పు చేసి అయిన కుటుంబం అందరికి ఈ సినిమా 3D చూయించండి.

ఇది మూడు చుక్కల రాంకింగ్ ఇవ్వోచ్హు.

ఫోటో రియలిస్టిక్ పధ్ధతిలో, 3D, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ మొత్తం కలిపి సాధారణ మన భాష లో చెప్పుకోవాలంటే గ్రాఫిక్స్ అద్భుతం. అధుభుతమైన లోకం చూయిస్తాడు
చూస్తే 3D లోనే చూడాలి.

నెను ఎకీభవిస్తాను. 1000000% సినిమా సామాజిక ప్రయొజనమె.

సరే… అసలు బాధేసింది ఏందుకో మాట్లాడుకుందాం.

మల్టీ ప్లెక్స్ లు అలవాటు కాకముందు ఇంత బాధ ఉండేది కాదు కాని ఇప్పుడు …ముఖ్యంగా గత ఆరు నేలలు గా తెలుగు సినిమాలకు ,కొన్ని హింది సినిమాలను పోయిన ప్రతి సారి వేలకు వేలు పెట్టి ..దుమ్ముకోట్టుకోని రావడం చేస్తున్నాం కదా .ఈ మధ్య అటు ఇటు కానీ పాత్రలో ఒక హీరో ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని ఒక సందిగ్ద పరిస్థితిని కల్పించిన ఒక సినిమాకు మేము ఖర్చు పెట్టినంత లోనే ఇప్పుడు అవతార్ ని చూసాక మేము పొందిన పొందిన అనుభూతి ,మానసిక లాభాన్ని రెండిటిని లెక్కేసుకుంటే,పోల్చుకుంటే చాలా బాధేసింది.

ఇక నుంచి మల్టిప్లెక్స్ ల్లో తెలుగు సినిమాలు చూడొద్దు అని డిసైడ్ అయిపోయాం. (ఒక తెలుగు దర్శకుడి సినిమాలు తప్పా).ఆ డబ్బులు మల్టిప్లెక్స్ ల బయట అడుక్కుతినే వారికి దానం చెస్తే ఇంకా ఎక్కువ మానసిక సంత్రుప్తి వస్తుందెమో.

ఈ సినిమా చూసాక బాధ కల్గడానికి మరో కారణం :-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంత మంది ప్రేక్షకులకు ఈ 3D సౌలభ్యం ఉంది? మారు మూల ప్రాంతాలలో ..కొన్ని జిల్లాలలో ఉన్న మిత్రులు…బంధువులు అందరు 3D లో చూడలేరే అని అయ్యో పాపం అనిపించింది.

సరే ఇంకో ఉద్దేశ్యం

రెండవది ఎప్పటి లాగే సినిమా చూసి బయటకోస్తూ మనమెందుకు ఇలాంటి సినిమాలు తియ్యలేకపోతున్నాం అని ,ప్రశ్నలు వేసుకున్నాం…

అంత డబ్బు ఎక్కడుంది?

ఏ ప్రోడ్యూసర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ? అని

సరే కనీసం ప్రస్తుతం ఖర్చుపెడుతున్న ఒక కోటి నుంచి వందకోట్ల సినిమాలు అయినా తీస్తున్నారు కదా మరి ఆ డబ్బులో అయిన సరి అయిన సీ నిమాలు తీస్తున్నారా?అంటే అదీ కదా…

నేను 1998 లో రామోజి ఫిల్మ్ సిటి ఉషాకిరణ్ మూవీస్ లో రైటర్ గా ఉద్యోగానికి జాయినయినప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఫిం సిటి లో ఉన్న అన్ని వసతులను చూసి జన్మ ధన్య మైందనుకున్నాం. . ఈ ఫిల్మ్ సిటీ లో క్షణాలలో వచ్చే అన్ని రకాల వసతులను ఉపయోగించుకోని బాలివుడ్ నుంచి లోకల్ తెలుగు సినిమా ల నిర్మాతలు దర్శకులు ఇక అధ్భుతమైన సినిమాలు తీస్తారు అనుకున్నాంకాని ప్చ్ . కనీసం సీరియల్స్ కూడ లేవు.

భారత దేశం అన్ని రంగాలలో ను ప్రపంచములో ని ఏదేశం తో అయిన పోటి ఇవ్వగలదు .మాన్ పవర్ అన్ని రంగాలలో ఇక్కడ చాలా బాగుందని.
కాని ఇక్కడ సినిమాల గురించి మాట్లాడుకుందాం.

సో ..అందరికి తెలుసు

డబ్బు కూడ ఉంది.లేదంటారా?

పక్కనోడు మన పురాణాలనుంచి కధలు, పాత్రలు తీసి మనకే అమ్ముతుంటే ..హాయిగా అన్ని వనరులు .అన్ని సదుపాయాలు ఉంచుకోని అధ్భుత సినిమాలు తియ్యగలం కాని తియ్యలేము మనమెంత పెద్ద నటులం ,నిర్మాతలం ,దర్శకులం అని చంకలు కోట్టుకుంటు ఉంటామెందుకు?హాలివుడ్ ని పోగడటం తప్ప.
సరే ఈ విషయం మీద మీ అభిప్రాయాలు వినాలని ఉంది.తరువాత నేను రాస్తా

(సరే మరి 11 సంవత్సరాలైన నువ్వెందుకు తియ్యలేక పోతున్నావ్ అని నేను పడుకున్నప్పుడు నా అవతార్ వచ్చి అడిగాడు అది కూడ మీ జవాబుల్లోనే ఉంటదనుకుంటున్నా…)

ఆ…మరిచాను

ఒక మచి విషయం ఏమిటంటే యష్ టెలివిజన్స్ వారు జనవరి ఒకటి నుంచి సోని టీవి లో సెవెన్ అనే ఒక (కంప్యూటర్ గ్రాఫిక్) టీవి సీరిస్ ని తెస్తున్నారు మన భారతీయ సినిమా గ్రాఫిక్స్ ల కన్న అవి ఎంతో ఉత్తమంగా ఉండబోతున్నాయి (అంటా).

ఏది ఏమైనా కానీ..

మళ్ళీ ఈ సంధర్భముగా అవతార్ థియేటర్ లో మాత్రం విఠలాచార్యను తల్చుకున్నందుకు చాల ఆనందము గా ఉంది ఆయన ‘అవతార్’ అయితే బాగుణ్ణు

34 Comments
 1. generic propecia December 20, 2009 / Reply
  • vasu December 20, 2009 / Reply
  • hero December 21, 2009 / Reply
 2. NEO December 20, 2009 / Reply
 3. Sankar gongati December 20, 2009 / Reply
 4. అబ్రకదబ్ర December 21, 2009 / Reply
  • PK December 21, 2009 / Reply
  • రవి December 21, 2009 / Reply
  • రవి December 21, 2009 / Reply
   • రవి December 21, 2009 /
 5. PK December 21, 2009 / Reply
 6. Venkat Uppaluri December 21, 2009 / Reply
 7. zulu December 21, 2009 / Reply
  • అబ్రకదబ్ర December 21, 2009 / Reply
   • రవి December 21, 2009 /
 8. rayraj December 21, 2009 / Reply
 9. గోపి గాడు December 21, 2009 / Reply
 10. కిశొర్ December 21, 2009 / Reply
 11. AVATAR December 21, 2009 / Reply
 12. Chandra December 21, 2009 / Reply
  • అబ్రకదబ్ర December 22, 2009 / Reply
   • కమల్. December 22, 2009 /
 13. గీతాచార్య December 22, 2009 / Reply
 14. Madhu December 22, 2009 / Reply
 15. Madhu December 22, 2009 / Reply
 16. Sarath ' Kaalam' December 23, 2009 / Reply
  • ashok December 23, 2009 / Reply
   • Sarath ' Kaalam' December 23, 2009 /
 17. moviefan December 24, 2009 / Reply
 18. suresh December 24, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *