Menu

పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి

పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి
ముందుగా నవతరంగం చదివే పాఠకులకు ,మిత్రులకు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలతో

ఇక్కడ రెండు విషయాలు చెప్తాను
1.” హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ ” ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనే విషయం
అమెరికా లో అయినా అమలాపురం లో అయిన ప్రసవవేదన ఒకటే అనే దృష్టి కోణం లో రాసాను.

2.’అవతార్’ అధ్బుతంగా ఉండి కూడ ఎందుకు నచ్చలేదు. ఏందుకంటే …అందమైనవి అన్నీ ఆనందాన్ని ఇవ్వలేవు .ఆనందాన్నిచ్చేవి అన్నీ అందంగాను ఉండవు.అలాగే సంతోషాన్ని చ్చేవి అన్నీ లాభాన్నివ్వలేవు.లాభాన్నిచ్చేవి అన్నీ సంతోషాన్నివ్వలేవు కదా.

* * * *
గిన్నిస్ బుక్ లో స్థానం పొందిన ఫిల్మ్ సిటి మన దేశం లో మన రాష్ట్రం లో లొ ఉంది .అయినా మన కు హాలివుడ్ స్థాయి ఏదో ఒక అర్హత ఉన్న వారే లేరా అని అనుకున్నప్పుడు .వచ్చిన ఆలోచన ,ప్రయోగాలు చెయ్యాలంటే నిర్మాత ముఖ్యం కాబట్టి అటువంటి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అని అని పించింది కాబట్టి.
ఈ రోజు ల్లో టాలెంటు ఉన్న పెద్ద నిర్మాతలు ,దర్శకులు చెయ్యగల సత్తా ఉండి కూడ చెయ్యడం లేదు రోటీన్ సినిమాలు తీస్తున్నారు అని అందరు విమర్శిస్తున్నారు ఎందుకు? ఎందుకంటే క్రియేటివిటి ఒక్కటే ఉంటే సరిపోదు గట్స్ కావాలి.
చెత్త సినిమా అలా తియ్యాల్సింది ఇలా తియ్యల్సింది ప్రతి సినిమా ని విమర్శిస్తున్నా మేము మరి అటువంటి ఏ తప్పులు లేకుండా మంచి సినిమా అని చెప్పుకుంటు వస్తున్న ఆ సినిమా ఏదో దమ్ముతో , బాగానే హిట్ సినిమా అంటే ఇది అని విమర్శించి విమర్శించి ఉన్నాం కాబట్టి , చెప్పగలం కాబట్టి…నిజంగా బాగా తీస్తాము కాబట్టి … అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ సినిమా ఏదో మనమే ఏ నిర్మాత లేక పోయినా …మనకున్న ఏదో ఒక ఆస్థి పాస్తులు అమ్మి తియ్యమేందుకు అని మాకు మేము ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే గట్స్ ….గట్స్ కావాలి. కధ ,డబ్బు,టెక్నాలజి అవన్ని సెకండరి ..ముందు గట్స్ కావాలి.

అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.
ఈ మూడు పదాలతో అందరికి నేను పెట్టిన ” హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ . టైటిల్ అందరి సమజవుతది అని అనుకున్నా..!
ఎక్కడో హాలి వుడ్ లో జేమ్స్ కెమెరాన్ , తనకున్న టెక్నాలజి ,కోట్ల డాలర్ల డబ్బు తో గత కొన్ని సంవత్సరాలుగా తను ఏంతో తపన తో
కసి తో ,శ్రమించాను అని ఇంటర్వ్యూలలో చెప్పుకుంటున్న మానసిక పరిస్థితి ఏదైతే ఉందో , అలాంటిదే అరుంధతి తీసేటప్పటి మన శ్యాం ప్రసాద్ రేడ్డి గారిది అని అని పించింది కాబట్టి.
మల్టినేషనల్ కార్పోరేట్ కంపేనీల తో,ఇన్సురెన్స్ హాలివుడ్ ప్రోడక్షన్ హవుస్ ల తో ధైర్యంగా సినిమా ఎవరైన తియ్యగలరు.పిల్లి మనషుల కధ తో అవతార్ లాంటి దే ఏదో ఒక కధ తో సినిమా తేస్తాం అంటే .. ఏదో ఒక హాలివుడ్ కంపేని సరే అంటే ఎవరైన తీస్తారు .
కాని అన్ని పణంగా పేట్టి ,అప్పులు చేసి తను నమ్మి న ..కధ కోసం తెలుగు లో డిఫరెంట్ సినిమాలు చేయ్యడం నిజంగా మగ తనమే.

* * *
జీవితాంతం అపురూపంగా చూసుకునే… పెళ్ళి కి తీసే వీడియో దెగ్గర కూడ వంద రెండోదలు బేరం చేసి ఆర్డిచ్చే వారు కూడ విమర్శించడం చూసాక అనిపించింది .పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం గా సినిమా రంగానికి చెందిన వారి గురించి ఎప్పుడైన ఎక్కడైన వచ్చిందో లేదో తెల్వదు కాని శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గురించి రావాలి. భావి తరాలలో సినిమా రంగం లో నిర్మాత గా , దర్శకుడిగా , ఏదో ఒక రంగం లో రావాలను కునే వారికి …
ఏదో కధ రాసుకోచ్చి ,ఎంతో కొంత డబ్బు పట్టుకోచ్చి ,ఏదో ఒక లా వచ్చి …కొన్ని క్లోసప్ లు , కొన్ని మిడ్షాట్లు కొన్ని లాంగ్ షాట్లు ఆరు పాటల తో సెక్యూర్ సినిమా తీసుకోని పోదాము అనుకే వారికి.రేపటి రోజున అరుంధతి కన్న మించిన హాలివుడ్ స్థాయి సినిమాలను తీసి రెహ్మాన్ లా లాగ ఆస్కార్ లు కోట్టే సత్త ఉండోచ్చు అలాంటి వారందరికి ,ఒక ధృడ వ్యక్తిత్వం అలవడాలంటే. కొత్తనిర్ణయం తీసుకోనే గుండే ధైర్యం ఎంతవసరమో ఎలా ఉండాలో. సినిమా పట్ల ,అనుకున్న కధ పట్ల ఎంత విశ్వాసం ఉండాలి ఆ సినిమా విడుదలయ్యే వరకు ఎలాంటి మానసిక వాతావరణం కావాలి. అనేది తెలుస్తుంది. ఇలా ఎందుకన్ననో ..
ఏందుకంటే ఇప్పుడు సినిమా అంటే వ్యాపారం .( సినిమా అంటే కళ అని అనే వాళ్ళు …కోట్ల రూపాయల వరకు ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో..చెప్పండి మీ కళాత్మక సినిమానే రేపటి నుంచే తీద్దాం రండి.)మనందరికి తెలుసు …సినిమా రంగముతో అనుబంధం ఉన్నవారికైతే ఇంక చాలా బాగా తెలుసు అనుకుంటున్నా..ఒక డిఫరెంట్ సినిమా తియ్యాలి అంటే ,తెరవేనుక ఎన్నో రాజకీయాలు నడిచే భారతీయ సినిమా ఇండస్ట్రి లో ఎలెక్ట్రానిక్ మీడియా లో ఉన్న ఒక వ్యక్తి గా, శ్యాం ప్రసాద్ రెడ్డి గారిని మా జాతి మనిషిగా ఫీలవుతు చెప్తున్నాను.
అన్ని రకాల లైఫ్ సెక్యూరిటిలు చూసుకుంటూ … హాయిగా కావల్సినంత ఏసి పెట్టుకోని మాంచి సుఖవంతమైన ప్రదేశం లో ఒక లాప్ టాప్ ని వళ్ళో పేట్టుకోని ,కనీసం ..కనీసం.. ఒక చిన్న సినిమా కూడ తియ్యలేక పోతున్న మేము ( అంటే మీలాంటి గోప్పోల్లు కాదులేండి. నేను ..నాతో ఈ విషయం మీద ‘ఊ’ కొట్టిన మిత్రులు ) శ్యాం ప్రసాద్ రెడ్డి గారి ని విమర్శించే అర్హత కూడ లేదను కుంటున్నాను.(ఇంతకుముందే ఎవరో మిత్రుడు అన్నట్లు దమ్ముంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూయించి విమర్శ కాని …కామెంట్ కాని చెయ్యమన్నట్లు.)

కొంతమంది కి ఏదో ఒక టాలెంటు ఉంటుంది
కొంతమందికి నిర్మాతలుగా డబ్బుంటుంది…కాని ఏదో కావల్సింది ఉండదు. కేవలం టాలెంటు, డబ్బు ,ఉంటేనే సరిపోదు …ఇంకేం కావాలో …చేసి చూపించిన వ్యక్తి శ్యాం ప్రసాద్ రెడ్డి మా అభిప్రాయం .అమెరికా లో ఉన్న లిబర్టి ని చేసినోడు ఎంతో ఖైరతా బాద్ లో భారి వినాయక విగ్రహం చేసే కళాకారుడి ఫీల్ అంతే అనుకుంటాం మేము.
మీ అభిప్రాయాలు మీరు రాసే స్వేచ్చ కనీసం నవతరంగం లోఅయినా ఉంది కాబట్టి రాసుకోండి.

ఇక అవతార్ సినిమా గురించి :_

రెండు సంవత్సరాల క్రితం ఒక స్టార్ హోటల్ లో మా మిత్రులకు ..ఒక మిత్రుడు పార్టి ఇచ్చాడు
అతను ఆర్డరిచ్చిన మెను లో ఒక డిష్ మా ఒక మిత్రుడుకి నచ్చలేదు.
” నీ మొహానికి ఇలాంటి హోటల్ ని ఎప్పుడైన లోపలినుంచి చూసావా? ఎప్పుడైన అసలు ఒక టీ తాగావా నువ్వు ,ఇది బాగా లేదు అది బాగా లేదు అని కామెంట్ చేస్తున్నావ్ ” అని మొహం మీదే అడిగే సరికి మేమంతా షాక్ అయ్యాం .ఇప్పుడు అవతార్ సినిమా visual గా బాగుంది కాని ఏదో ఎమొషనల్ ఫీల్ లేదు అన్నప్పుడు అదే రక మైన కామెంట్లు వినిపిస్తున్నాయి.
1.ప్రస్తుత రాజకీయ , వాతావరణ పరిస్థితుల మధ్య పోలిక తో చూస్తే సినిమ ఆశయం నిజంగా బాగుంది.మా మిత్రులకు అయితే ఇది , కంటి కి టెక్నికల్ గ అధ్బుతమైన సినిమా అంతే.కొన్ని వీడియో గేములు ఆడుతున్నప్పుడు ..ఎన్నో సార్లు అనుకున్నాను ఇలాగే సినిమాలు రావచ్చు కదా అని అది ఇప్పుడు చూసాను.జేమ్స్ కెమెరాన్ ఇంతకు ముందు సీనిమాలు చాల నయం. emotional touch. short లోచెప్పాలంటే.. 3D making తప్పిస్తే.
ఐతే ..
C. G.పాత్రలు అయినా టెక్నాలజి ని ఉపయోగించుకోని భావాలు చక్కగ పలికించిన..సన్నివేశాలు చూస్తున్నప్పుడు.ఉదాహరణకు
ఈ మధ్య వచ్చి అందరికి గుర్తున్న కంప్యూటర్ జెనెరేటెడ్ యానిమేషన్ కధలు అయిన
ఫైండింగ్ నెమో కాని..లేదా WALL-E ..,EVE ని మధ్య వచ్చే ,ఇతరత్ర సన్నివేశాలని చూసినప్పుడు ,అవి కంప్యూటర్ తో సృష్టించిన బొమ్మల సినిమా అని మనసులో ఉన్నా కాని నేను పొందిన అనుభూతి అంటే…from depth of heart touch feelings మాత్రం ఈ సినిమాలో పొందలేదు. visual realistic is gud.
avatar ..,రోటీన్ మొన్న చూసిన లాంటి 2012 దే హాలివుడ్ సినిమా తప్ప.కాకపోతే పర్యావరణం మీద ఇంత భారీ స్థాయిలో సినిమా తియ్యడం మొదటి సారి. బాగుంది.కాని ఈ విషయాలు కార్పోరెట్ అమెరికన్స్ పట్టించుకుంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుండేది. పైరీసి ని తట్టుకునెందుకు 3D పద్ధతి ని ఏంచుకున్నట్టు ఏదో ఇంటర్వ్యూలు చదివాను.పైరసికి కూడ ఒక కారణం కావచ్చు ప్రయోగానికి
ఏది ఏమైన ఈ సినిమా లో ఏం మిస్సయ్యిందో ఈ పాటికి ఇతర హాలివుడ్ కంపనీలు గుర్తించి ,
అవతార్ టెక్నికల్ వర్క్ చూసి ఈ పాటికే ఇతర హాలివుడ్ కంపెనీలు ముఖ్యంగా పిక్సర్ త్వరలో నే అధ్భుతమైన సినిమా తయారిలో సిధ్ధమైఉంటదనుకుంటున్న.ఇంతకన్న అధ్భుతమైన ఎమొషన్స్ మరియు ఫీల్ ఇచ్చే సినిమాలు నిర్మించెందుకు …ఇతరకంపేనీలకు మాత్రం ఆ ప్రేరణ ఇచ్చిందన్నంది మాత్రం వాస్తవం.
* * *
ఇతరులను..లేద …మన సాహిత్యం మన దేశం నుంచి హాలివుడ్ వాళ్ళు ప్రేరణగా పాత్రలు కాని ,కధలు కాని రాసుకోని …సినిమాలు గా తీస్తే
ఆహా ఓహో అంటాం.
మనవారు ఏదైన అలా ప్రేరణగ చేసుకోని చేస్తే అది ఇక్కడ కాపి , అది అక్కడి నుంచి కాపి అని పేజీలకు పేజీలు విమర్శించుకుంటాం.
ఏది ఏమైన …
మనం బాగా చదివి తెలివైన వాళ్ళమవుదాం అనుకునే కాలం లో ఉన్నాం కదా!

* * * *
కొంతమంది పరిగెత్తేటప్పుడు పక్కనోడు ఎలా పరిగెడుతున్నాడు చూడరు ..తాము తమ శక్తి వంచ న లేకుండా పరిగెడుతున్నామ లేదా అనేది చూసుకుంటారు.కొంతమంది ప్రయత్నం చేసి మధ్యలో ఆగి పోతారు.కొంతమంది దూరంగ కూర్చోని అటు ఇటు కాని వాళ్ళు చప్పట్లు కోట్టే టట్లు చప్పట్లు కోడుతు చూస్తు ..మాట్లాడుకుంటు బతుకుతుంటారు.మనం ఎలా ఉండాలో ఎవరి కి వారు నిర్ణయించుకుంటారు

మహాత్మ గాంధి కి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదని మనం ఫీలవుతాం కాని
ఇంగ్లీష్ వాడేవడూ ఎవరూ తనకు గాంధి అవార్డ్ రాలేదు అని ఫీల్ కాడు గా

ఇప్పుడు హాలివుడ్ సినిమాల భారతీయ మార్కేటింగ్ చూస్తుంటే
ఇప్పుడు హాలివుడ్ కి భార త దేశం పండోరా నే నే కదా.

నాతో అభిప్రాయాలు పంచుకున్నా నా మిత్రులకు నవతరంగం మిత్రులకు అందరికి మరో సారి ఈద్ ముబారక్ లతో..
సర్వేజన సుఖినోభవంతూ .ఆమీన్

.

18 Comments
 1. Sankar gongati December 25, 2009 /
 2. ashok December 25, 2009 /
 3. suman December 25, 2009 /
 4. shankar December 26, 2009 /
  • రాజశేఖర్ December 26, 2009 /
 5. vamshi pulluri December 26, 2009 /
 6. moviefan December 26, 2009 /
 7. madhu December 27, 2009 /
 8. సుజాత December 27, 2009 /
 9. అబ్రకదబ్ర December 28, 2009 /
 10. రవి December 28, 2009 /
 11. శేఖర్ December 29, 2009 /
 12. Ravi January 16, 2010 /