Menu

Monthly Archive:: December 2009

“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు

సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి ఈ మధ్యన కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే(కొందరికి) ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బతుకు నిర్ణయించేది

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5

‘పాల మనసులు’  చిత్రంలోని ‘ఆపలేని తాపమాయె’  అన్న డా.నారాయణ రెడ్డి గారి గీతికను గాయని కుమారి ఎల్.ఆర్.ఈశ్వరితో పాడేందుకు శ్రీ సత్యం గారి దగ్గరనుంచి ఆహ్వానం వచ్చింది.  అదే ఆయన సంగీత దర్శకత్వంలో నే పాడిన తొలిపాట. ఆ పాట ఆయన ఆలపించిన పద్దతి ఆలకించి, అలాగే ఆలపించినా ఆయన తృప్తి పడలేదు. ఆయన పాడిన విధంగానే పాడినా ఆయనకు నచ్చలేదు. చివరకి ఆయన చిరాకుతో నా చేత పాడించవద్దనుకునేంత మటుకు వచ్చింది వ్యవహారం. ప్రక్కన ఎల్.ఆర్.

2009-కొత్త దర్శకులు: ఒక షాకయ్యే నిజం

2009 సినీ పరిశ్రమకు దాదాపు 330 కోట్ల వరకూ నష్టాన్ని కలగ చేసిందంటూ ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే 64 మంది కొత్త దర్శకులుకు మాత్రం కెరీర్ లు ప్రారంభం కలిగించే అవకాంశం కల్గించింది. అది వారు నిలబెట్టుకున్నారా  లేదా అనేది ప్రక్కన పెడితో  ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినీ ఫీల్డులో ప్రవేశించే చాలామంది అంతిమ లక్ష్యం మాత్రం దర్శకత్వం. జనవరి 1) జి.ఎల్.బి.శ్రీనివాస్ (మహా నగరంలో శివ -చందు) 2) హర్షా

అవతార్

కథలో కొత్త ఆలోచనలు గానీ సరికొత్తగా ప్రతిపాదించిన సూత్రాలు కానీ ఏవీ లేవు గానీ అవతార్ సినిమా రెండున్నర గంటల సేపు కళ్ళకీ మనసుకీ విందు చేసిందనే నాకనిపించింది. సృష్టిలో అన్నిటినీ కలిపి ఉంచే మూల సూత్రం ఒకటున్నదనీ, ఒక అంతస్సూత్రం ఉన్నదనీ, దాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా కనీసం దాని ఉనికిని గుర్తించి దానితో (లిటరల్‌గా)”టచ్” లో ఉంటే, మనము మన చుట్టూతా ఉన్న ఈ సృష్టితో ఒక సమతుల్యతలో ఉండవచ్చునని అనేక ప్రాచీన

2009 ఒక సమీక్ష

2009 సంవత్సరాన్ని అత్యంత దారుణమైన సంవత్సరంగా తెలుగు చిత్రపరిశ్రమ అప్రకటితంగా ప్రకటించేసుకున్నారు. ఈ విషయం ఒక ఓపన్ సీక్రెట్. ఈ సంవత్సరంలో వచ్చినన్ని ఫ్లాపులు మరే సంవత్సరంలోనూ రాలేదు. ఆలాగే ఈ సంవత్సరంలో పెట్టినంత పెట్టుబడి మరే సంవత్సరంలోనూ తెలుగు పరిశ్రమ గత 77 ఏళ్ళలో పెట్టలేదు. కలెక్షన్ల పరంగా లెక్కకు నాలుగు హిట్లు. యావరేజ్ అనే పదానికి ప్రేక్షకులు చూసినా పెట్టుబడివెనక్కురాని సినిమాగా ఒక కొత్త అర్థం వచ్చిచేరింది. ఇక ఫ్లాపులంటారా వాటిని లెక్కపెట్టాల్సిన అవసరమే