Menu

అలనాటి సమీక్షలు-2

section_review

ఈ చిత్రం చూశాక సి.యస్.రావుకి పది కాలాల పాటు బుకింగులు రాకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రముఖ దర్సకుడుగా సి.యస్.రావు ఆయన టోటల్ కెరియర్ లో చాలా చెడ్డగా తీసిన చెత్త సినిమాగా ఈ చిత్రం నిలబడిపోతుంది. ఈ చిత్రం చూసాక ఈ చిత్ర దర్శకుడు ఎవరు అని అడిగి తెలుసుకుని మరీ విమర్శస్తున్నారు. సి.యస్.రావు ఈ చిత్రానికి దర్శకుడంటే..ఆయన అభిమానులకు తలమునక ఆశ్చర్యం ఏర్పడుతోంది. ఈ చిత్రం వల్ల యన్.టి.ఆర్ కు వచ్చిన చెడ్డ పేరు ఏమీ లేదు. సి.యస్.రావుకీ,కృష్ణం రాజుకీ బాగా చెడ్డ పేరు వచ్చింది. చిత్రం టైటిల్ చూస్తూంటే అర్దం కానంత గజిబిజీగా వుంది. మంచికి మరో పేరు అన్న టైటిల్ ను చెత్తకు మరో పేరు అని అపహాస్యం చేయటం వినవస్తోంది. విజయనగరంలో 12 రోజులు,ఏలూరు, ఒంగోలులో 14 రోజులు,తెనాలిలో 13 రోజులు,కరీంనగర్ లో 14 రోజులు ఆడి ఎత్తివేయబడింది. ఈ సంవత్సరంలో ఇంత కాస్టింగ్ సినిమా ఇంతగా దెబ్బతినటం ఇదేనేమో..ఇది మంచికి మరో పేరు అనే చిత్రానికి విజయ పత్రిక 1977 సంచికలో వచ్చిన రివ్యూ . రేటింగ్ సి3 గ్రేడ్ ఇచ్చారు.
సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ చిత్రానికి అన్ని చోట్లా బాగుందని టాక్ వుంది. చిత్రం విడుదల తేదీనాడు ఎబౌ ఏవరేజ్ అని పేరు వచ్చింది.మున్ముందు మరింత విజయవంతమయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం విజయవంతమైనందుకు విజయ ఎంతగానో సంతోషిస్తోంది. మన తెలుగు చిత్రం విజయవంమైనందుకు విజయం ఎంతగానో సంతోషిస్తోంది. మన తెలుగు చిత్ర సీమలో మంచి దర్శకులుగా పేరెన్నిక గన్న వారు కొందరున్నారు. వారిలో విశ్వనాధ్ ఒకరు. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు దెబ్బ తిన్నాయి. నిజాయితి దర్శకత్వ ప్రతిభకు,చిత్ర పరాజయానికి సంభంధం లేదు. అయితే చిత్రం పరాజయిమైతే,దర్శకుని ప్రతిష్ట కూడా దెబ్బ తినటం  జరుగుతూ వుంటుంది. ఒక మంచి దర్శకుడి వరస పరాజలొస్తే,తెలుగు సినిమా రంగానికి ఎంతో అవసరం. ఆ దృష్ట్యా సిరిసిరి మువ్వ విజయం చిత్ర సీమకే కొంత అవసరం. అవసరం వేళకు చిత్ర విజయం కావటం ఎంతో ముదావహం.
పాటలు అత్యధ్బుతంగా వున్నాయని అందరూ అంటున్నారు. రంగుల కన్నుల పండుగగా వున్నాయి. చిత్రం మొదటి ఆఫ్ చాలా చాలా బావుంది.రెండో ఆఫ్ కూడా అంత బాగుంటే మొదటి రోజునే ఈ చిత్రానికి 25 వారాల టాక్ వచ్చేది. స్త్రీలను,క్లాస్ ను ఆకర్షించనంతగా, మాచ్ ని సిరి సిరి మువ్వ ఆకట్టుకోలేదని ఒక టాక్ వుంది. ఏమైనా చక్కటి చిత్రం సిరిసిరి మువ్వ.ఈ చిత్రానికి బి వన్ గ్రేడ్ రేటింగ్ ఇవ్వబడింది.
దేముడే గెలిచాడు
మరో సారి ఈ చిత్రం ద్వారా విజయ నిర్మల మంచి దర్శకురాలని నిరూపించుకుంది. చిత్రంలో క్లైమాక్స్ ఎంతో బాగుంది. చిత్రం నడకలో చిన్న బోర్ ఫీలింగ్ ఏర్పడుతోంది. చిత్రంలో అందరికన్నా జగ్గయ్య బాగా స్కోర్ చేసుకున్నాడు. కృష్ణకు ఎటువంటి ప్లస్ మార్క్స్ లేవు. అది విజయనిర్మల సినిమా గనుక కృష్ణ వేసాడన్నట్లు ఉంది. విజయ నిర్మల నటన ఎలా వుందని  చెప్పనవసరం లేదనుకుంటున్నాం. ఆమె నటనలో ఏ చిన్న  లోపం కనిపించినా చిత్రం నిలబడేది కాదు. హాస్యం కొన్ని వర్గాలలకు బాగా నచ్చినా, అప్పర్ క్లాస్ లో కొంచెం చీప్ గా ఫీలయినట్లు కనపించింది. వెన్నిరాడై నిర్మల అందంగా కనిపించింది. టోటల్ గా చెప్పాలంటే ఈ చిత్రంలో నటుడుగా జగ్గయ్య మంచి పేరు సంపాదించగా,నటిగానే కాక  దర్శకురాలిగా విజయనిర్మల మరింత గుర్తిపు ఏర్పరచుకుంది. అది కరు సినిమా,వర్షాల వల్ కలిగే నష్టం ఈ సినిమాపై కొంత పడింది. బి.క్లాస్ సెంటరక్స్ లో సయితం ఉదాహరణకు ఒంగోలు ,పాలకొల్ల,భీమవరం మొదలగునవి 21 రోజు పైబడి ఆడింది. ఆర్దికంగా పెద్ లాభసాటి సినిమా మాత్ర కాక పోవచ్చు.
బంగారు బావ
కలవకొలను సదానంద కథా రచన చేసిన బంగారుబావ చిత్రంలో రెండు భాగాలున్నాయి. సెంటిమెంట్ కథా భాగం,క్రేమ్ కథాభాగం. మల్లి(శ్రీదేవి) జన్మ    రహస్యం తెలియటంతో పట్టు సడలి, సెంటిమెంటల్ కథాభాగం కంచికి చేరుకుంటుంది. ఆ తర్వాత క్రైమ్ తలనొప్పిని భరిస్తూ చిత్రం అయిందాకా హాల్లో కూర్చోవడం కష్టమనిపించేలా తయారైంది బంగారుబావ. ఈ చిత్రానికి సి వన్ గ్రేడ్ ఇచ్చారు.
శ్రీవారు ముచ్చట్లు
దాసరి దర్శకత్వంలో లక్ష్మీ పిలింస్ కంబైన్స్ బ్యానర్ పై ఎన్.ఆర్.అనురాధాదేవి లోగడ నిర్మించిన రావణుడే రాముడైతే చిత్రం అంత బాగా ఆడలేదు. ఆ కసితో అదే నిర్మాతలకు దాసరి అనేక భాద్యతలు నిర్వహిస్తూ (కథ,మాటలు,పాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వాలు)చిత్రీకరించి ఇచ్చినట్లుగా అనిపించే అన్ని విధాలా బాగున్న చిత్రం శ్రీవారి ముచ్చట్లు.ఈ చిత్రానికి బి వన్ గ్రేడ్ ఇచ్చారు.
పండంటి జీవితం
ఏ ఒక్క చిత్రాన్ని చూసినా ఏదో ఒక పాత చిత్రం గుర్తు కొస్తున్న ఈ రోజుల్లో పోలికల గురించి ఆలోచించటం వృధా అని ఎంతగా సరిపెట్టుకుందామనుకున్నా ఆలుమగలు చిత్రాన్ని అతిగా గుర్తు చేసే చిత్రం పండంటి జీవితం. పైగా ఈ రెండు  చిత్రాలకు దర్శకుడు తాతినేని రామారావు కూడా ఒకరే కావటం కూడా మరీ చిత్రంగా తోస్తోంది. ఈ చిత్రానికి బి వన్ గ్రేడ్ ఇచ్చారు.
అల్లరి బావ
పి. సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎక్కడా తలనొప్పి కలిగించపోయినా ఒక ముక్కలో చెప్పాలంటే ఆషామాషి చిత్రం అనిపించింది. ఈ చిత్రానికి బి త్రి గ్రేడ్ ఇచ్చారు.
మరోసారి ఇంతసాహసంగా రివ్యూలు రాసిన(పేరు తెలియదు)రైటర్ కి అబినందనలు తెలుపుతున్నాము. అలాగే తను సినీ పరిశ్రమలో ఉన్నా  ఇలా ధైర్యంగా ఎంకపేజ్ చేసిన విజయబాపినీడు  గారికి మరోసారి ఇన్ని సంవత్సరాల తర్వాత అభినందనలు నవతరంగం తెలుపుతోంది.
సేకరణ: సూర్య ప్రకాష్ జోశ్యుల

ఈ చిత్రం చూశాక సి.యస్.రావుకి పది కాలాల పాటు బుకింగులు రాకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రముఖ దర్సకుడుగా సి.యస్.రావు ఆయన టోటల్ కెరియర్ లో చాలా చెడ్డగా తీసిన చెత్త సినిమాగా ఈ చిత్రం నిలబడిపోతుంది. ఈ చిత్రం చూసాక ఈ చిత్ర దర్శకుడు ఎవరు అని అడిగి తెలుసుకుని మరీ విమర్శస్తున్నారు. సి.యస్.రావు ఈ చిత్రానికి దర్శకుడంటే..ఆయన అభిమానులకు తలమునక ఆశ్చర్యం ఏర్పడుతోంది. ఈ చిత్రం వల్ల యన్.టి.ఆర్ కు వచ్చిన చెడ్డ పేరు ఏమీ లేదు. సి.యస్.రావుకీ,కృష్ణం రాజుకీ బాగా చెడ్డ పేరు వచ్చింది. చిత్రం టైటిల్ చూస్తూంటే అర్దం కానంత గజిబిజీగా వుంది. ‘మంచికి మరో పేరు’ అన్న టైటిల్ ను చెత్తకు మరో పేరు అని అపహాస్యం చేయటం వినవస్తోంది. విజయనగరంలో 12 రోజులు,ఏలూరు, ఒంగోలులో 14 రోజులు,తెనాలిలో 13 రోజులు,కరీంనగర్ లో 14 రోజులు ఆడి ఎత్తివేయబడింది. ఈ సంవత్సరంలో ఇంత కాస్టింగ్ సినిమా ఇంతగా దెబ్బతినటం ఇదేనేమో..ఇది మంచికి మరో పేరు అనే చిత్రానికి విజయ పత్రిక 1977 సంచికలో వచ్చిన రివ్యూ . రేటింగ్ సి3 గ్రేడ్ ఇచ్చారు.

సిరి సిరి మువ్వ

సిరి సిరి మువ్వ చిత్రానికి అన్ని చోట్లా బాగుందని టాక్ వుంది. చిత్రం విడుదల తేదీనాడు ఎబౌ ఏవరేజ్ అని పేరు వచ్చింది.మున్ముందు మరింత విజయవంతమయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం విజయవంతమైనందుకు విజయ ఎంతగానో సంతోషిస్తోంది. మన తెలుగు చిత్రం విజయవంమైనందుకు విజయం ఎంతగానో సంతోషిస్తోంది. మన తెలుగు చిత్ర సీమలో మంచి దర్శకులుగా పేరెన్నిక గన్న వారు కొందరున్నారు. వారిలో విశ్వనాధ్ ఒకరు. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు దెబ్బ తిన్నాయి. నిజాయితి దర్శకత్వ ప్రతిభకు,చిత్ర పరాజయానికి సంభంధం లేదు. అయితే చిత్రం పరాజయిమైతే,దర్శకుని ప్రతిష్ట కూడా దెబ్బ తినటం  జరుగుతూ వుంటుంది. ఒక మంచి దర్శకుడి వరస పరాజలొస్తే,తెలుగు సినిమా రంగానికి ఎంతో అవసరం. ఆ దృష్ట్యా సిరిసిరి మువ్వ విజయం చిత్ర సీమకే కొంత అవసరం. అవసరం వేళకు చిత్ర విజయం కావటం ఎంతో ముదావహం.

పాటలు అత్యధ్బుతంగా వున్నాయని అందరూ అంటున్నారు. రంగుల కన్నుల పండుగగా వున్నాయి. చిత్రం మొదటి ఆఫ్ చాలా చాలా బావుంది.రెండో ఆఫ్ కూడా అంత బాగుంటే మొదటి రోజునే ఈ చిత్రానికి 25 వారాల టాక్ వచ్చేది. స్త్రీలను,క్లాస్ ను ఆకర్షించనంతగా, మాచ్ ని సిరి సిరి మువ్వ ఆకట్టుకోలేదని ఒక టాక్ వుంది. ఏమైనా చక్కటి చిత్రం సిరిసిరి మువ్వ.ఈ చిత్రానికి బి వన్ గ్రేడ్ రేటింగ్ ఇవ్వబడింది.

దేముడే గెలిచాడు

మరో సారి ఈ చిత్రం ద్వారా విజయ నిర్మల మంచి దర్శకురాలని నిరూపించుకుంది. చిత్రంలో క్లైమాక్స్ ఎంతో బాగుంది. చిత్రం నడకలో చిన్న బోర్ ఫీలింగ్ ఏర్పడుతోంది. చిత్రంలో అందరికన్నా జగ్గయ్య బాగా స్కోర్ చేసుకున్నాడు. కృష్ణకు ఎటువంటి ప్లస్ మార్క్స్ లేవు. అది విజయనిర్మల సినిమా గనుక కృష్ణ వేసాడన్నట్లు ఉంది. విజయ నిర్మల నటన ఎలా వుందని  చెప్పనవసరం లేదనుకుంటున్నాం. ఆమె నటనలో ఏ చిన్న  లోపం కనిపించినా చిత్రం నిలబడేది కాదు. హాస్యం కొన్ని వర్గాలలకు బాగా నచ్చినా, అప్పర్ క్లాస్ లో కొంచెం చీప్ గా ఫీలయినట్లు కనపించింది. వెన్నిరాడై నిర్మల అందంగా కనిపించింది. టోటల్ గా చెప్పాలంటే ఈ చిత్రంలో నటుడుగా జగ్గయ్య మంచి పేరు సంపాదించగా,నటిగానే కాక  దర్శకురాలిగా విజయనిర్మల మరింత గుర్తిపు ఏర్పరచుకుంది. అది కరు సినిమా,వర్షాల వల్ కలిగే నష్టం ఈ సినిమాపై కొంత పడింది. బి.క్లాస్ సెంటరక్స్ లో సయితం ఉదాహరణకు ఒంగోలు ,పాలకొల్ల,భీమవరం మొదలగునవి 21 రోజు పైబడి ఆడింది. ఆర్దికంగా పెద్ లాభసాటి సినిమా మాత్ర కాక పోవచ్చు.

బంగారు బావ

కలవకొలను సదానంద కథా రచన చేసిన బంగారుబావ చిత్రంలో రెండు భాగాలున్నాయి. సెంటిమెంట్ కథా భాగం,క్రేమ్ కథాభాగం. మల్లి(శ్రీదేవి) జన్మ    రహస్యం తెలియటంతో పట్టు సడలి, సెంటిమెంటల్ కథాభాగం కంచికి చేరుకుంటుంది. ఆ తర్వాత క్రైమ్ తలనొప్పిని భరిస్తూ చిత్రం అయిందాకా హాల్లో కూర్చోవడం కష్టమనిపించేలా తయారైంది బంగారుబావ. ఈ చిత్రానికి సి వన్ గ్రేడ్ ఇచ్చారు.

శ్రీవారు ముచ్చట్లు

దాసరి దర్శకత్వంలో లక్ష్మీ పిలింస్ కంబైన్స్ బ్యానర్ పై ఎన్.ఆర్.అనురాధాదేవి లోగడ నిర్మించిన రావణుడే రాముడైతే చిత్రం అంత బాగా ఆడలేదు. ఆ కసితో అదే నిర్మాతలకు దాసరి అనేక భాద్యతలు నిర్వహిస్తూ (కథ,మాటలు,పాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వాలు)చిత్రీకరించి ఇచ్చినట్లుగా అనిపించే అన్ని విధాలా బాగున్న చిత్రం శ్రీవారి ముచ్చట్లు.ఈ చిత్రానికి బి వన్ గ్రేడ్ ఇచ్చారు.

పండంటి జీవితం

ఏ ఒక్క చిత్రాన్ని చూసినా ఏదో ఒక పాత చిత్రం గుర్తు కొస్తున్న ఈ రోజుల్లో పోలికల గురించి ఆలోచించటం వృధా అని ఎంతగా సరిపెట్టుకుందామనుకున్నా ఆలుమగలు చిత్రాన్ని అతిగా గుర్తు చేసే చిత్రం పండంటి జీవితం. పైగా ఈ రెండు  చిత్రాలకు దర్శకుడు తాతినేని రామారావు కూడా ఒకరే కావటం కూడా మరీ చిత్రంగా తోస్తోంది. ఈ చిత్రానికి బి వన్ గ్రేడ్ ఇచ్చారు.

అల్లరి బావ

పి. సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎక్కడా తలనొప్పి కలిగించపోయినా ఒక ముక్కలో చెప్పాలంటే ఆషామాషి చిత్రం అనిపించింది. ఈ చిత్రానికి బి త్రి గ్రేడ్ ఇచ్చారు.

మరోసారి ఇంతసాహసంగా రివ్యూలు రాసిన(పేరు తెలియదు)రైటర్ కి అబినందనలు తెలుపుతున్నాము. అలాగే తను సినీ పరిశ్రమలో ఉన్నా  ఇలా ధైర్యంగా ఎంకపేజ్ చేసిన విజయబాపినీడు  గారికి మరోసారి ఇన్ని సంవత్సరాల తర్వాత అభినందనలు నవతరంగం తెలుపుతోంది.

సేకరణ: సూర్య ప్రకాష్ జోశ్యుల

4 Comments
  1. V. Chowdary Jampala November 3, 2009 /
    • j.suryaprakash November 3, 2009 /
  2. G November 3, 2009 /
  3. deepasikha June 3, 2010 /