లావుగా ఉండేవాళ్లు కూడా ప్రేమను సక్సెస్ చేసుకోవచ్చు..అంటూ ఎంతోమందికి ధైర్యం చెప్పిన వినాయకుడు సీక్వెల్ అనగానే చాలా మందికి చాలా ఆశలు ఉన్నాయి. అందులోనూ మొన్న ప్రేమను గెలుచుకోవటం చూసారు..ఈ సారి మీ ప్రియురాలి తండ్రిని..ఒప్పించటం ఎలా అనే ఎక్సయిట్ మెంట్ పాయింటుతో వస్తున్నా అని ఊరించారు. అయితే ఊహించుకున్నంత సీన్ లేను. కష్టపడి చేసిన సీన్స్ లో పస లేదు. టోటల్ గా సినిమాలో విషయం లేదు. దాంతో దర్శకుడుకి రెండో సినిమా గండం తప్పేటట్టు కనపడేట్టు లేదు.
కథ..ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు..కార్తీక్ (కృష్ణుడు)ని ప్రేమించిన కావ్య(శరణ్యా మోహన్)అతని గురించి ఆమె ఇంట్లో గొప్పగా బిల్డప్ ఇస్తుంది..అసలు లావు విషయం దాచి పెట్టి. అయితే ఈ విషయం రివిల్ చేసి ఒప్పించే లోపలే కార్తీక్ ఉండబట్టలేక ఆ ఊళ్లో దిగుతాడు. ఇక పల్లెలో ఉండే కావ్య తండ్రి కర్నల్ లక్ష్మీపతి(రావు రమేష్)కి అల్లుడు సెలక్షన్ విషయమై కొన్ని నిర్ధుష్ట అభిప్రాయాలు ఉంటాయి. అవి కార్తీక్ రూపాన్ని చూడగానే నీరుగారిపోతాయి. అయితే డైరక్టుగా కార్తీక్ ని రిజెక్టు చేస్తే కూతురు నొచ్చుకుంటుందని అతనితో పరోక్ష
యుద్దానికి దిగుతాడు. అలా మీట్స్ ద పేరెంట్స్ స్కీమ్ లోకి వెళ్ళిన కార్తీక్ తన మంచితనం అమాయికత్వం అనే రెగ్యులర్ ఫార్మెట్ లో ఆయన మనస్సు గెలుచుకుని ఆమె వేలు పట్టుకుంటాడు. అంతేగాక ఆ ఇంటిలో వారందరి సమస్యల్లో వేలు పెట్టి విసిగించి చివరకు తను చెప్పిందే కరక్టనిపించి ,ఆ ఇంటి వారందరి మన్ననలు ఎలా పొందుతాడనేది మిగతా కథ. ఇక ఈ కథలో ఫుల్ లెంగ్త్ పాత్రలోకి ప్రముఖ నవలా రచయిత యండమూరి ఎలా వచ్చి నవ్వించే ప్రయత్నం చేసాడన్నది తెరపై చూడాల్సిందే.
అదే వినాయకుడు..అదే ధీమ్(లావుగా ఉంటేనేం..మనస్సు మంచిదైతే చాలు)..అదే దర్శకుడు..కాకపోతే నేపధ్యం మాత్రం విలేజ్ కి మారింది. అయితే సినిమా కూడా అదే రేంజిలో హిట్టవుతుందా అంటే మాత్రం డౌటే. ఎందుకంటే వినాయకుడులో ఉన్నంత ప్రెష్ నెస్ సీక్వెల్ లో లోపించింది. అలాగే మొదటి చిత్రంలో ఉన్నంత పకడ్బంధీ స్క్రీన్ ప్లే దీనికి కొరవడటం మరో మైనస్.నిజానికి టైటిల్,పోస్టర్స్ చూసి మరో కామిక్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనుకున్నవారికి డైరక్టర్ స్క్రిప్టుపై కాన్సర్టేట్ చేయక షాక్ ఇచ్చారు.
ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు మెన్షన్ చేయాలంటే…వినాయకుడు హిట్ కి స్క్రిప్టు బలమే కలసివచ్చింది కాబట్టి . ఇక ఇందులో కార్తీక్ పాత్ర లేజీగా విలేజీలో ఉండిపోతుంది. పూర్తి పాసివ్ గా మారి ఒక్క సంఘటనా సృష్టించక బోర్ కొట్టిస్తుంది. తన ప్రియురాలి తండ్రిని ఎదుర్కోవటానికి పెద్దగా ఆలోచనలు గానీ..పోనీ డి.డి.ఎల్.జె. తరహాలో ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నించడు. లేకపోతే అహనా పెళ్ళంట స్కీమ్ నీ
అనుసరించడు.(మాయా బజార్ లోని అహనా పెళ్ళంట పాటను మాత్రం రీమిక్స్ చేసారు..బావుంది). దాంతో కథలో ఎక్కడా టెన్షన్ క్రియేట్ కాదు. ఎలాగూ హీరోయిన్ తండ్రి చివరకు ఒప్పుకుంటాడని అందరికీ తెలుసు.అయితే ఎలా ఒప్పించాడన్నది ముఖ్యం. ఆ సన్నివేశాలే మిస్సయ్యాయి.
అంతేగాక వినాయకుడు సరసన సోనియా (హీరోయిన్)నప్పినట్లుగా శరణ్యా మోహన్ సెట్ కాక తేలిపోయింది. ఓ డైలాగులో చెప్పినట్లు పెయిర్ లా గాక ఎలక,ఏనుగులా ఉన్నారు. అయితే బాగా లో బడ్జెట్ లో తీసిన చిత్రం కావటం,యాడ్స్,డ్రస్ కర్టెసీ వంటి కార్పోరేట్ మార్కెటింగ్ స్ట్రాటజీలతో రావటంతో సేఫ్ ప్రాజెక్టు కావచ్చేమో కానీ దర్శకుడుకి మాత్రం కలసివచ్చేది కాదు.
అదే వినాయకుడులో అయితే ఫస్టాఫ్ లో అసలు సోనియా…అతన్ని లావు అనే నెపంతో దూరం పెడుతుంది. సెకెండాఫ్ లో దగ్గరయ్యే సమయానికి ఆమె తొందరపాటుతో దూరం అవుతాడు. అదే అందులో వర్కవుట్ అయింది. లావు అనే సింపతీ మీద ఫన్నీ డ్రామా. అదే ఇక్కడా రిపీట్ చేయాలని చూడటం విచారకరం. దాంతో ఎక్సపెక్ట్ చేసిన నవ్వులు కరువయ్యాయి. అలాగని కొన్ని చోట్ల నవ్వలేదా…అంటే నవ్వాం..కానీ కథకు అది కలసి రాలేదు.
అలాగే హీరోయిన్ ఫ్యామిలినీ అంత్యాక్షరి పేరుతో రాత్రి పన్నెండు గంటలు వరకూ మెలకవగా ఉంచి..అప్పడు దానికి కారణం ఆమె బర్తడే అని రివిల్ చేయటం చాలా బావుంది. అలాగే తూర్పు రామాయణంను తూర్పారపట్టడం కూడా పర్శనల్ గా నచ్చింది. ఇక కార్తీక్ గురించి చెబుతూంటే హీరోయిన్ ఇంట్లో వారు తలో హీరోని(మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్స్) ని ఊహించుకోవటం బాగా పండింది.
అయితే కృష్ణుడులో అదే మార్పు లేని ఎక్సప్రెషన్ కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం. ఉన్నంతలో శరణ్యా మోహన్ బాగాచేసింది కానీ..ఆమె జోడీ నప్పలేదు. ఇక రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అతనిలో నటుడు రోజు రోజుకీ విజృంభిస్తున్నాడు. అయితే యండమూరి వీరేంద్రనాధ్ ని పెట్టుకోవటం మాత్రం రాంగ్ ఛాయిస్. ఆయన మొహంలో ఎప్పుడో కానీ ఎక్సప్రెషన్స్ పలకలేదు.
వీటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రామ్స్ కెమెరా..కోనసీమ అందాల్ని చాలా చోట్ల అధ్బుతంగా పట్టిచ్చింది. అలాగే సంగీత దర్శకుడు మణికంఠ కాద్రి కూడా మంచి ట్యూన్స్ ఇచ్చాడు.ఆడియో మంచి హిట్. ఇక వీరిని ఒక చోట ప్రోగేసి,మంచి వర్క్ రాబట్టుకున్న దర్శకుడు సాయి కిరణ్ అబినందనీయుడు..డైలాగులు కొన్ని చోట్ల పేలాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. అయితే బడ్జెట్ కంట్రోల్ మీద పెట్టిన శ్రధ్ద కథ,కథనాల మీద కూడా పెట్టి ఉంటే మరోసారి మంచి ప్రయత్నం అనిపించుకునేది
ఏదైమైనా మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేసిన ఈ చి్త్రం..ఆ వర్గానికి కూడా నచ్చుతుందా అంటే కష్టమనిపిస్తుంది. అలాగే పోస్టర్స్ లో కృష్ణుడునే ఎక్కువ ఫోకస్ చేస్తూండటంతో చాలా మంది వినాయకుడు రెండో రిలీజ్ అనుకుంటున్నారు..ఇది పబ్లిసిటీ సమస్య. ఇక అంత అర్జెంటుగా వినాయకుడు సీక్వెల్ కదా అని పరుగెత్తుకెళ్ళి చూసేంత గొప్ప సినిమా కాదు.అయితే ఓ ప్లస్ పాయింట్.. క్లీన్ గా రూపొందించారు కాబట్టి ఫ్యామిలీలు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. అలాగే అలిసిపోయినప్పుడు మాత్రం ఈ చిత్రానికి వెళ్ళకండి…ఆ స్లో నేరేషన్ కి మంచి నిద్ర వస్తుంది.
సంస్థ: మూన్‌వాటర్ పిక్చర్స్
నటీనటులు: కృష్ణుడు, శరణ్య మోహన్, యండమూరి వీరేంద్రనాథ్, రావు రమేష్, జోగినాయుడు తదితరులు
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సాయికిరణ్ అడవి
సినిమా :విలేజ్ లో వినాయకుడు
మాటలు:మహీ,సాయికిరణ్ అడవి
సంగీతం :మణికంఠ కాద్రి
కెమెరా: రామ్స్
ఎడిటింగ్ :మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాత :మహీ
రిలీజ్ డేట్ : నవంబర్ 5,2009
—జోశ్యుల సూర్య ప్రకాష్
K మహేశ్ కుమార్ says:
“క్లీన్ గా రూపొందించారు కాబట్టి ఫ్యామిలీలు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు.” ఈ మధ్యకాలంలో ఈ లైను ఎన్ని సినిమాలకు రాసుంటాము!?! బహుశా ఇది చాలనుకుంటా ఈ సినిమా పెట్టుబడిని రాబట్టుకోవడానికి. కానీ వినాయకుడు సినిమాలా ఇది ట్రెండ్ సెట్టింగ్ మాత్రం కాలేదు.ఎందుకంటే. సింపుల్గా ఈ సినిమా ఆ సెట్ చేసిన ట్రెండుని ఫాలోఅయ్యింది మాత్రమేకదా…
venu says:
i dont know why.. but this site always undermines every movie. other sites review was rather very positive and movie has a good feel… i enjoyed it personally
sasank says:
@ Venu: నవతరంగం లో అంతే. ఎమన్నా అన్నామంటే ఎవరికీ నచ్చింది వాళ్ళు రాస్తారు కావాలంటే మీరు కూడా రాయండి అంటారు. ఇంకా అంటే ఏదో సంబంధం లేకుండా చెప్తారు. ఇక్కడ అంతే అంతా నెగటివ్ నెగటివ్. మనమే లైట్ తీసుకోవాలి
@venu says:
hello venu, nanna, kanna, you are a aged man now, dont express your old opinions. dont think about other sites. this site people giving right feedback.
venu says:
it would hav been better if u revealed ur identity.. any way that doesn’t make a diff to me.. I am an US based indian student.. not an aged man.. but i love telugu movies and telugu..
You can get a doubt why i am typing in english. My telugu is not that proficient. So, i dont want to screw language. The so called youth like you will like the movies where one man kills 100 people and this site is filled with young guys like you. It was my mistake i entered here. thanx for the eye opener..
..
రమణ మూర్తి says:
వేణు గారూ:
>>… i enjoyed it personally
అదే, ఎందుకు నచ్చిందో మీరూ ఓ నాలుగు ముక్కలు రాయొచ్చుగదా !
శశాంక్ గారూ:
ఎవరికీ నచ్చింది వాళ్ళు రాస్తారు కావాలంటే మీరు కూడా రాయండి
venu says:
naaku telugu mee antha baaga vachi vunte nenu kuda raasevaadni sir..
Venkat Balusupati says:
సుర్య ప్రకాష్ గారు..
ఈ సినిమా గురించి మీ రివివ్యు చాల చాల బావుంది సార్..
ధన్య వాదాలు..
వేణూశ్రీకాంత్ says:
అసలు నాకు తెలీకడుగుతాను, ఒక సినిమా గురించి రాస్తూ ఫలానా సినిమా లాగా తీశాడు దర్శకుడు కొత్తదనం లోపించింది అని రాస్తారు. ఇందులోనేమో డిడియల్‍జె లాగా లేదు అహనాపెళ్ళంట లాగా లేదు అని రాస్తారు, అసలు ఎట్టా చచ్చేది ఈ రివ్యూలతో !!
అన్ని సినిమాలు ఒకేలా ఉండవు కద సార్.. వెకిలి హాస్యం, రక్తపాతం, ఘోరమైన విలన్లూ లేకుండా నిజాయితీగా తీసే కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలను ప్రోత్సహించండి.
G says:
సూర్య ప్రకాష్ గారి రివ్యూలన్నిట్లో నాకిది బాగా నచ్చింది. నిజమే దర్శకుడు రెండో మెట్టుమీద బోల్తా కాదు కాదు బొక్కబోర్లా పడ్డాడు. Clean and Green ok. మరి సినిమాలో పస లేక పోయినా నసన్నా లేకుండాలి కదా.
*** *** ***
G says:
వేణూశ్రీకాంత్ గారు,
“అసలు నాకు తెలీకడుగుతాను, ఒక సినిమా గురించి రాస్తూ ఫలానా సినిమా లాగా తీశాడు దర్శకుడు కొత్తదనం లోపించింది అని రాస్తారు. ఇందులోనేమో డిడియల్‍జె లాగా లేదు అహనాపెళ్ళంట లాగా లేదు అని రాస్తారు, అసలు ఎట్టా చచ్చేది ఈ రివ్యూలతో !!”
I have the same doubt brother.
Mauli says:
ఈ రివ్యూ లో నెగటివ్ గా చెప్పిన వాణ్ణి నాకు మూవీ లో పోసిటివ్ గ అనిపిస్తున్నాయి. ఫలాన సినిమాలో లాగా యాక్టింగు చెయ్యలేదు హీరో అని చెప్పారు గుడ్ .. సో పెద్ద గ ఎవ్వరని ఫూల్ ని చెయ్యలేదన్న మాట. అదే హీరో, లావు శరీరం, ప్రేమ అన్న పాయింట్స్ తో ఎంత కొత్తగా నటించాలి? ఇంకా ౨ వ సినిమానే కదా…ముందు ముందు వెరైటీ చేస్తాడు లే
అబ్రకదబ్ర says:
వినాయకుడు (దీని ముందు సినిమా) నిజంగానే అంతమందికి నచ్చిందా? నేనైతే అతి కష్టమ్మీద అరగంట చూసి ఇక నావల్లగాక ఆపేశాను. కొత్తదనం పేరుతో వచ్చిన చెత్తనల్లా ఎంకరేజ్ చెయ్యనవసరం లేదేమో. పైగా, అది క్లీన్ ఎంటర్‌టైనరా!
పులి రాజా says:
హమ్మయ్యా నాకు తోడు దొరికారు. బాధితుల్లో నేను ఒకడిని.బూతుల్ని ఇంగ్లీష్ లో తిడితే అది క్లీన్ తెలుగు లో తిడితే అది అశ్లీలం.
G says:
RighttO! Me too of the same skin.
Chetana says:
Same pinch..!!
nenu says:
ఏ చెట్టు లేనపుడు ఆముదం చెట్టే మహావృక్షం అని సామెత.
satya says:
rey chettanaa pittaparigi naayaallaraa…………
abrakababra, puliraja & thalli chetana nuvvukoodaa vinu….
evariki nachchindi vaallu raayandi ante ilane untundi naaku nachchei inkokalaki nachali ani ekkada leudu. kaani ade vishayam ante nachaledu ane vishayam chepte nachina vaalla manasulu kaasta nochchukuntaayi
ee maatram teliyani meeru raatalu……..
ika review vishayam ki vaste
aayana baagaa raasaaru kaakapote 10% personal feel kooda mix chesaru. over all its a good reiview. family to kalisi vella dagga movie annaru. sone pe suhaga ledu annaru adi artham chesukondi. vinayakudu oka break through movie, its not a story its a concept. aragantalo bayataki vellipoye vaallaki concepts artham kaavu maastaaru. PARUSHAMGAA maatlaadi unte kshaminchanid kaani oka vishayam goorchi poorti avagaahana lekundaa matlaadadam paddhati kaadu mr. abraka dabra garu.
i am really sorry if i hurt u with my words
ur like my bro bt i hav to correct my bro
hope u understand it.
satya says:
sorry 1st line frnd to chat chestunappudu di paste aypoyindi
edit cheyadaaniki chance ledu
im sorry again.
Shiva Kishore Kandukuri says:
చెట్లు చాలా ఉన్నై… కానీ… ఇది చెట్తు అని గుర్తించెవాడు లెడు… (sorry Telugu Typing కొత్తలె…)