Irving Wallace వ్రాసిన రాజకీయ నవల. ఒక black-man ని అమెరికా అధ్యక్షునిగా ఊహించి వ్రాసిన ఈ నవల అప్పట్లో పలుసంచలనాలకి కేంద్ర బిందువైంది. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పుస్తకం ప్రతులని తగుల పెట్టారు. చాలా చోట్ల నిషేధానికి గురి అయింది.
1972 లో ఈ పుస్తకం ఆధారంగా సినిమా తీశారు. ఈ సినిమా గురించి చెప్పే ముందు కాస్త Irving Wallace గురించీ, అతని నవలలు నాకు పరిచయం అయిన తీరు గురించి చెప్పాల్సి వస్తుంది.
నవలని సినిమాలుగా తీయటం క్రొత్తేమీ కాదు. అలాగే సినిమాలని నవలీకరించటం కూడా.
ఒక సినిమాని నవలీకరించినప్పటికన్నా ఒక నవలను తెరక్కెక్కించటం పెద్ద సవాలు. నవల పరిథి సినిమా కన్నా పెద్దది. నవలలో రచయిత తాను చెప్పాలనుకున్నదంతా చెప్తాడు. కానీ దాన్ని దృశ్యానువాదం చేసేటప్పుడు నవలలోని కొన్ని/చాలా భాగాలను వదిలేయ వలసి రావచ్చు. లేదా కొన్ని సన్నివేశాలను క్రొత్తగా చేర్చనూవచ్చు.
కొన్ని నవలలు సినిమాగా తీస్తే బాగుండకపోవచ్చు. సినిమా నవలని పూర్తిగా మరపించేలా ఉండకపోవచ్చు. ఏదో నటుల సామర్థ్యం వల్ల బ్రతికి బట్టకట్టేవి. (The Reader, మనకి తెలిసినవే చాలా ఉన్నాయి). అలాగే నవలని మించిన క్లాసిగ్గా నమోదయి, నవలని పొడిగించేలా inspire చేసిన సందర్భాలూ ఉన్నాయి. (పెద్ద ఉదాహరణ The Godfather). నవల అంత పెద్ద విజయం సాధించకపోయినా, అది సినిమాగ వచ్చాక అందుల్ల ఆసక్తి కలిగి మరలా పాప్యులర్ అయేవి మరోరకం. (ఉంగరాధీశుడు, అదే మన Lord of the Rings). నవలా, సినిమా రెండూ క్లాసిగ్గా నమోదయేవి. (Gone With the Wind).
ఇవిగాక నవలని చదవకుండా సినిమాని చూస్తే బాగుండి, ఆపైన నవల చదివాక అసంతృప్తిని కలిగించే సినిమాలు (నవల ఆత్మని మిస్ అయే సందర్భాలు) మరోరకం. (Starship Troopers). అలాంటిదే మరొకటి ఈ క్రింద చెప్పబోతున్నది.
The Man.
Irving Wallace వ్రాసిన నవల. 1964లో అమెరికాలో సంచలనం సృష్టించిన ఆ నవల 1972లో సినిమాగా వచ్చింది. మొదట్లో ఆ సినిమాని కేవలం టెలివిజన్ ప్రేక్షకులకోసం అనే అనుకున్నా చివరికి వచ్చిన ఔట్‍పుట్ చూశాక దాన్ని సినిమాగా థియేటర్లలో విడుదలజేస్తే బాగుంటుందని దాన్ని థియేటర్లలోకి విడుదలజేశారు. ఫలితం అదేమంత గొప్పదేమీ కాదు. అలా అని సినిమా తీసిపారేయదగ్గదేమీ కాదు.
ఈ మధ్య అమెరికా నుంచీ తిరిగొచ్చేస్తూ కనపడ్డ డీవీడీలన్నీ వేసుకొచ్చాడు మా నేస్తు. ఒక పెద్ద సూట్కేస్ నిండా అవే. వాటిల్లో Antonioni, Cameron, Scorsese, Hitchcock, మొదలైన మాస్టర్ల దగ్గర నుండీ, I spit on your grave, My bloody Valentine, లాటి X-rated థ్రిల్లర్స్ దాకా ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు తెలిసిన వాటిని లాక్కోగా, మన మాతృభాష కొరియన్ సినిమా Bakha Satang, ఒకటి రెండు ఫ్రెంచి, జర్మన్, ఇరానియన్ సినిమాలనంటగట్టి, వాటిని చూసి రాయనన్నాడు. నేను మాత్రం వ్రాస్తాను. నా మూడ్ కి సూటయ్యేవాటిని కొన్నింటిని చూశాను. లేని వాటినలా వాడికి తెలియకుండా వాడి సూట్కేస్ లోనే భద్రంగా పెట్టేశాను. చూశాకేమనుకున్నా నాకు ఇబ్బందేమీ లేదు.
ఉరే కడల్ చూపించానన్న కోపంతో నాకు బలవంతంగా Bakha Satang చూపించాడు దగ్గరుండి. సినిమా మూడ్ నచ్చకపోయినా ఆ అద్భుత దృశ్యావిష్కరణ మాత్రం నన్ను ఆకట్టుకుని కాస్త ప్రపంచ సినిమా మీద ఆసక్తి పెంచింది. Antonioni trilogy, Shadows of forgotten ancestors లాటి సినిమాలనీ బేర్ చేయగలిగే స్తోమత వచ్చింది. కాకపోతే వాటివల్ల జరిగిన మరో ఉపయోగం పెరిగిన నా సహనం. చాలా డీవీడీలు అవసాన దశలో ఉండటం వల్ల వచ్చీ రాక, కట్ కట్ అయ్యి కొన్నీ, ఎంత ఏడిపించినా ఎలాగోలా చూడగలిగాను.
Randian fiction లో అక్షరమక్షరమూ (నాలుగు నవళ్ళూ + ఒక ప్లే + The Early Ayn Rand) చదివిన నాకు సాధారణంగా వేరే ఇతరులు వ్రాసిన నవలలు నచ్చవు. Dan Frown వే ముక్కి ముక్కి నెలల తరబడి చదివాను. Fiction writing లో ఆసక్తి ఉన్న నాకు మా మామ ఇచ్చిన సలహా వీలున్నన్ని పుస్తకాలు చదవమని. అది నేనెటూ చేసే పనేగా. కాకపోతే సన్నివేశాలను చిత్రీకరించే విషయంలో నైపుణ్యం కోసం Irving Wallace వ్రాసిన The Second Lady నవల చదవమని చెప్పాడు. చాలా రోజులు వాయిదాలు వేసీ, వేసీ, ముప్పై రూపాయల్లో దొరికిందని చెన్నై ఫుట్పాత్ మీద తీసుకుని పినాకినీలో ఓ పట్టు పట్టబోయాను. అబ్బే! మన వల్ల కాలా. కాస్త చదవగానే బోరు కొట్టేసింది.
అదే విషయం మామకి చెప్తే your head fruit అని తిట్టి కాస్త కథని చెప్పి (ఆల్రెడీ నాకు కొంచం తెలుసు), Irving Wallace గొప్పతనాన్ని ఏకరువు పెట్టి వాటిలో మంచివనుకున్న నవళ్ళ పేర్లు చెప్పి వీలున్నప్పుడు చదవమన్నాడు. అందులో The Man ఒకటి. (ఇదసలు దొరకట్లేదని ఉవాచ).
మొన్నామధ్య విజయవాడ విశాలాంధ్రలో తవ్వకాలు (నా లక్ష్యం ఒక్కసారైనా వాళ్ల దగ్గర The Fountainhead కనిపించాలని. నేను ఎన్ని సార్లు వెతికినా దొరకలేదు మరి) జరుపుతుంటే తక్కువ రేట్లో ఎక్కువ పేజీలొచ్చే నవళ్ళేవన్నా ఉన్నాయా అనడిగాను. కుర్రాడు ఆ పైన చూడండని ఓ మూల చూపించాడు. అక్కడ ప్రాచీన కాలంనాటి గ్రంధాలన్నీ ఉన్నట్లున్నాయి. చెదలు పట్టి కొన్నీ, పేజీలూడుతూ మరి కొన్నీ, అలా అలా అన్నమాట. ఎక్కడ తేళ్ళూ, జెర్రులూ ఉంటాయోని అనుమనంగా చూస్తుంటే చాలా ఆసక్తికరమైన పుస్తకాలే కనిపించాయి. వాటి మీద ఉన్న interest తో రంగంలోకి దిగి కొన్ని తీసి పెట్టుకుని, ఇంకా వెతకుతుంటే దాదాపూ advanced accounts పుస్తకం సైజులో దొరికిందో పుస్తకం. బైటకి లాగి చూస్తే దాని మీదున్న పేరు The Man.
ఇంటికి తిరిగొస్తూ బస్సులో అక్కడక్కడా చదివితే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అప్పుడే గుర్తొచ్చింది వాడు తెచ్చిన డీవీడీల్లో అది కూడా ఉందని. పుస్తకం సైజు చూస్తే పెద్దగా ఉంది. సినిమా చూస్తే సరిపోతుందిలే అని సినిమా చూశాను. బాగానే ఉందనిపించింది. ఆ పైన పుస్తకం చదివాను. సినిమా తేలిపోయి పుస్తకం మహబాగా నచ్చేసింది. నవలంటే Atlas Shrugged మాత్రమే అనుకునే నాకు ఇది కూడా ఆ స్థాయిలో కాకపోయినా బాగా నచ్చింది.
నవలని సినిమాగా తీయటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. కథని చాలా మార్చేసి, కొండకచో ఎబ్బెట్టుగా ఉండేలా చేశాడు. అందులో నటించిన James Earl Jones మాటల్లోనే అయితే అందాన్నైతే పట్టుకున్నాడు కానీ ఆత్మని మాత్రం మిస్సయ్యాడు.
కథ: ఒక నల్ల జాతీయుడు అనుకోని పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడవుతాడు. అతన్ని కీలుబొమ్మగా ఉంచి ఆడించాలని చూసిన వారికి అతనినలా ఆడించలేక ఎలాగైనా పదవినుంచీ దించేయాలనే కాంక్షతో అతని పైన ఆరోపణలు చేసి impeachment trial దాకా వెళ్తారు. అతను వాటినెలా ఎదుర్కున్నాడనేది స్థూలంగా కథ.
కథనం: మామూలుగా ఒక అమెరికన్ సినిమాగా చూస్తే కథనం బాగున్నట్లే. కానీ నవల చదివిన వారికీ, అందులోని ఆత్మ పట్టినవారికీ సినిమా చూస్తే పెదవి విరుపే మిగిలేది.. But anyway it’s an entertaining movie.
Spoilers…
అధ్యక్షుడూ, స్పీకర్ జర్మనీలో బాన్ సమావేశంలో మరణిస్తే, succession ప్రకారం President pro Tempore దేశ అధ్యక్షుడవుతాడు. అంతకుమునుపే ఉపాధ్యక్షుడు కూడా మరణిస్తాడు (నవలలో). సినిమాలో మాత్రం ఉపాధ్యక్షురాలు పదవిని తిరస్కరిస్తుంది. తన పెద్ద వయసునీ, ఆరోగ్యాన్ని కారణంగా చూపి. Secretary of State, John Eaton అధ్యక్షుడవుతాడని అందరూ భావిస్తారపుఉ. మరోలా చెప్పాలంటే అతనే అధ్యక్షుడు కావాలని అందరి ఆకాంక్ష. కానీ అతనే స్వయంగా President pro Tempore గా ఉన్న Douglas Dillman ని అధ్యక్షుడుగా ప్రకటించి order of succesion ని వివరస్తాడు. ఎవరికీ అది ఆమోదయోగ్యం కాకపోయినా రాజ్యాంగం ప్రకారం విధిలేక ఒప్పుకుంటారు.
అయితే Eaton భార్య అతని నిర్ణయాన్ని గట్టిగా ఖండించి, అతన్ని రెచ్చగొడుతుంది. పాత అధ్యక్షుని పాలసీలన్నింటినీ, అలాగే అమలు పరచాలనే భావనతో ఉన్న అధికారులూ, మంత్రులూ, మొదలైన వారు డిల్మన్ని తమ చేతిలో కీలుబొమ్మలా ఉంచాలని చూస్తారు. మొదటి పత్రికా సమావేశంలో Eaton ఇచ్చిన వాటినే తన సమాధానాలుగా చెప్తూ, మాటి మాటికీ కాగితంలో చూస్తున్నా డిల్మన్ని ప్రశ్నిస్తాడో విలేఖరి. దాంతో, తన స్వంత నిర్ణయాల్ని ప్రకటించిన డిల్మన్, భవిష్యత్ లో కూడా అలానే ఉంటానని సంకేతాలిచ్చి అధ్యక్షునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తాడు.
దాంతో అహం దెబ్బ తిన్న తెల్లతోలధికారులు, మంత్రులూ, అందరూ డిల్మన్ని అధ్యక్షునిగా దింపేయాలని, రకరకాల ప్రయత్నాలని ప్రారంభించి, చివరికి ఇంపీచ్మెంట్ దాకా వెళ్తారు. డిల్మన్ కి ఇద్దరు పిల్లలు నవలలో. ఒక కొడుకు (మిలిటెంట్), కూతురు (She has Relatively fair skin to the embarrassment of Dillman అని Wallace వివరిస్తాడు). కానీ సినిమాలో ఒకరే సంతానం, కూతురు నల్లజాతి మిలిటెంట్. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక హత్యకి, అమెరికాలోని ఒక నల్లజాతి యువకునికీ మధ్య ఉన్న సంబంధం, ఆ సమయంలో డిల్మన్ నిర్ణయాలు ప్రముఖమైన ప్లాట్ ఎలిమెంట్.
చివరికి తనపైన జరిగిన కుట్రలని ఎదుర్కుని మరలా అధ్యక్షునిగా పోటీకి సిద్ధమవుతుండగా సినిమా ముగుస్తుంది.
Spoilers end.
నటీనటులు: నాకు ఒక్క James Earl Jones తప్ప మిగతావారు పెద్దగా తెలియదు. Earl Jones డిల్మన్ గా బాగున్నాడు. అతని ఆంగిక వాచకాలు పాత్రకి వన్నెతెచ్చాయి. మిగిలిన నటీ నటులు కూడా పాత్రోచితంగా నటించారు. కాని కొన్ని సన్నివేశాల్లో మాత్రం కాస్తంత అతి కనిపిస్తుంది.
సాంకేతికాలు: కెమేరా, సంగీతం ఒక టెలివిజన్ సినిమాకి తగ్గ స్థాయికన్నా కాస్తంత మెరుగే కానీ, a lot is still found wanting.
ఇంకా: సినిమా మొదటే చూస్తే ఆసక్తికరంగా ఉంటుందేమో కానీ, నవల చదివాక చూస్తే మాత్రం ఏమాత్రం రుచించదు. ఈమధ్య ఒబామా (నల్లజాతీయుడు కాదు. A mixed race person) అధ్యక్షుడవటం, ఇప్పుడా పరిస్థితులు గతమంత తీవ్రంగా లేక పోవటంతో కథతో అంతగా కనెక్ట్ కాలేము. పైగా నవలలో జనాన్ని ఇన్వాల్వ్ చేసిన సన్నివేశాలు కొన్ని సినిమాలో లేనేలేవు.
చూడవచ్చా? మరీ అంత ప్రత్యేకంగా చూడనవసరమైతే లేదు కానీ, ఆసక్తికరమైన, నల్లజాతీయుల గురించి steriotypical గా కాకుండా, నిజాయితీగా వ్రాయబడిన ఒక అద్భుతమైన నవలకి దృశ్య రూపం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటే ఒకసారి ప్రయత్నించవచ్చు. క్రిస్ప్ గా ఉండి అంత బోరు కొట్టకపోవటం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
నా రేటింగ్: Wallace నవల కావటం వల్ల మూడున్నర, నవలని సరిగా పట్టుకోలేనందువల్ల -2, Jones నటన, బోరు కొట్టించకపోవటం వల్ల 1. వెరసి రెండున్నర.
Directed by Joseph Sargent.
కె.మహేష్ కుమార్ says:
ఒక ఆసక్తికరమైన సినిమాను పరిచయం చేశారు. అభినందనలు.
నవలా సినిమాకన్నా స్వోత్కర్ష ఎక్కువయ్యిందేమో!
jatardamal says:
మొత్తానికి నవల బావుందంటారు … ఇది సినిమా సైట్ కదా !!!
ఈ సినిమా చాల కాలం క్రితం చూసినట్టు గుర్తు . ఇది ఏమాత్రం ఇంత పెద్ద వ్యాసం రాసేంత స్థాయి లేని సినిమా .
సినిమా చూడాలంటారా లేదా అనే ఒక అనుమానం కలిగించటం లో సఫలీకృతులు అయ్యారు …;-)
Arvind says:
It’s a great novel. No doubt. Have not seen the movie. Is it available now in market?
satish says:
hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.
http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html
శిద్దారెడ్డి వెంకట్ says:
తమ్ముడూ/అన్నయ్యా సతీష్…
ఆ షార్ట్ చూశాను. పాత సినిమాల్లోని క్ల్లిప్పింగ్స్ తో కూడిన ఆ షార్ట్ ఫిల్మ్ ని జనాలకు చూపించాలన్న మీ ధైర్యానికి మిమ్మల్ని మెచ్చుకోలేకుండా ఉన్నాను…షార్ట్ ఫిల్మ్ attempt చెయ్యబోయే ముందు కాస్త సినిమా గురించి తెలుసుకోండయ్యా! సినిమాలో తప్పులు గురించి వివరిద్దామనుకున్నాను కానీ ప్రతీ ఫ్రేమూ తప్పే…