Menu

Monthly Archive:: November 2009

బాబోయ్ అవార్డు సినిమాలు-నాలుగవ భాగం

ఎప్పుడో ఆగిపోయిన ఈ సీరీస్ ని [మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం] మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తేవడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీలేవు. కానీ గతంలో చర్చించిన విషయాలకంటే ఈ సారి అక్కడక్కడా కళ గురించి నేను చదివిన కొన్ని విషయాలు పాఠకులతో పంచుకుందామనే లక్ష్యంతో ఈ వ్యాసం మొదలుపెడ్తున్నాను. ముందుగా సినిమా అనేది ఒక కళ అనే విషయంలో అనుమానం లేదనుకుంటాను. అయితే ఈ కళ అధిక మొత్తంలో డబ్బులతో కూడుకున్నది కాబట్టి ఆ

భార్యా భర్తల ” అభిమాన్ ” బంధం

ప్రతి వ్యక్తికి ఒక వృత్తి, ప్రవృత్తి ఉంటాయి. అలాగే పోటీలు, అసూయలు మొదలైనవి మామూలే. కాని భార్యాభర్తల మధ్య అసూయ , అభిమానం అనేది ఎంత పెద్ద అగాధాన్ని సృష్టిస్తుందో ఒక అందమైన చిత్రం ద్వారా మన కళ్లముందు ఉంచారు హృషికేశ్ ముఖర్జీ. ఈరోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పడంలేదు. ఇద్దరు వేరు వేరు వృత్తులలో ఉండి రాణిస్తే అంత గొడవ ఉండకపోవునేమో. కాని ఒకే వృత్తిలో పనిచేస్తున్న ఇద్దరిలో ఒకరికి లభించే పేరు ప్రఖ్యాతులు

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2

1966 డిసెంబర్ 14 ఉదయం 9 గంటలకు అలవాటు ప్రకారం ‘రేఖా అండ్ మురళి’ కార్యాలయం లోకి వెళ్ళగానే అక్కడ శ్రీమతి సుశీల,శ్రీయుతుల పి.బి.శ్రీనివాస్,రఘురామయ్యలు కనిపించారు. కాళ్ళు వణకటం అప్పుడే ప్రారంభమయింది. లోపలకి వెళ్ళగానే నన్ను వాళ్ళకు పరిచయం చేసారు. తిరిగి వాళ్ళ ముందు ‘దోస్తీ’ లోని పాట పాడాను. ఒకరేమో అపర కోకిల, మరొకరు తన మధుర గాత్రంతో రసికుల గుండెలను దోచేసుకున్న గానదాసు శ్రీనివాస్,మరి రఘురామయ్యగారు ఈలపాట ద్వారా..శరపరంపరను పోలిన స్వర ప్రస్తారాల ద్వారా

విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు

“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది.  నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో  కళ్ళముందు  గింగిరాలు తిరుగుతాయి.  సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్)  …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి,  కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్  ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ  నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు.